
తెలంగాణపై గెజిట్ విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు చట్టరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ వెబ్సైట్లో వివరాలను పొందుపరచారు. మొత్తం 70 పేజీలతో చట్టం రూపొందించారు. మార్చి 1, 2014న గెజిట్ విడుదల చేసినట్టు పేర్కొంది.
తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సమావేశాలు ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనికి ఆమోద ముద్ర వేశారు. ఇక అపాయింటెడ్ డేట్ విడుదల మాత్రమే మిగిలుంది. మూడునెలల తర్వాత అపాయింటెడ్ డేట్ ప్రకటించవచ్చని సమాచారం. ఆ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం అధికారంగా ఏర్పాటవుతుంది.