తొగుట(దుబ్బాక): సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట మదిర సయ్యద్ నగర్ మైనారిటీ నాయకులు ఆదివారం హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి సోనియమ్మ రుణం తీర్చుకుందామని కోరారు. దుబ్బాకలో మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని తెలిపారు. తనను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపిస్తే సిద్దిపేట, గజ్వేల్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో స్వామి, నరేందర్‌రెడ్డి, నర్సింలుగౌడ్, రవీందర్, నిరంజన్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment