
నర్సాపూర్: నర్సాపూర్ బీజేపీ టికెట్ కోసం పలువురు నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది నాయకులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లిగోపి, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, పార్టీ నాయకుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ఓబీసీ నాయకుడు రమేష్‌గౌడ్, పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్, పార్టీ నియోజకవర్గ మాజీ కన్వీనర్ మల్లేష్‌గౌడ్, ఆయా మండల శాఖల పార్టీ అధ్యక్షులు నాగప్రభుగౌడ్, నర్సింలు, యాదగిరి ఉన్నారు.
అయితే ముఖ్య నాయకుల సూచనల మేరకు మండల శాఖల అధ్యక్షులు నాగప్రభుగౌడ్, నర్సింలు, యాదగిరి రేస్ నుంచి తప్పుకున్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి విజయం కోసం కృషి చేస్తామని ఒప్పుకున్నట్టు సమాచారం. మిగిలిన వారిలో మల్లేష్‌గౌడ్, పెద్దరమేష్‌గౌడ్, చిన్న రమేష్‌గౌడ్ పేర్లను పార్టీ రాష్ట్ర కమిటీ తొలగించి, మురళీయాదవ్, గోపి, రఘువీరారెడ్డిల పేర్లను కేందర పార్టీకి పంపినట్లు తెలిసింది.
ఎవరికి వారు ప్రయత్నాలు
రాష్ట్ర కమిటీ స్క్రూటినీ అనంతరం గోపి, మురళీయాదవ్, రఘువీరారెడ్డి ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కొందరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి పైరవీలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తాము పార్టీకి చేసిన సేవలను, గతంలో తాము నిర్వహించిన పదవుల గురించి వివరిస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment