
సంక్రాంతి సందళ్లు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి జోరుగా కనిపిస్తోంది. ఆదివారం భోగిని ఘనంగా జరుపుకున్న ప్రజలు నేడు సంక్రాంతి, రేపు కనుమను కూడా ఇదే స్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పట్టణాలతోపాటు మండలాల్లోని గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది. ఏ ఇంటి ముందు చూసిన రంగుల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. యువతులు తీరొక్క ముగ్గులను తీర్చిదిద్ది గొబ్బెమ్మలతో అలంకరించారు. అలాగే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగురవేస్తూ సంబుర పడితున్నారు. మహిళలు ఇళ్లలో పిండి వంటలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
పట్టణాల్లోని వ్యాపారులు పండుగకు అవసరమైన సరుకులు విక్రయిస్తుండడంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతూ
కనిపిస్తున్నాయి. రంగులు, చెరుకుగడలు, పండ్లు, పూలు, గుమ్మడి కాయలు, అనుపకాయల, శనక్కాయలు,
కాయగూరల వ్యాపారాలతో ఆయా పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. పంటలు పొలం నుంచి ఇళ్లకు చేరే సమయం కావడంతో ఈ సంక్రాంతి పర్వదినాన్ని రైతులు, రైతు కూలీలు సంతోషంగా జరుపుకుంటారు. ఉపాధి కోసం, ఉద్యోగ, వ్యాపార రీత్యా పొరుగు ప్రాంతాలకు వెళ్లిన వారు.. అలాగే అవసరాల కోసం పల్లెలను వీడి పట్టణాలకు నివాసాలు మార్చిన వారు సైతం సంక్రాంతికి వచ్చేశారు.

సిద్దిపేట పట్టణంలో బోగి మంటలు ఆడుతున్న మహిళలు

పటాన్‌చెరుటౌన్ : పతంగి ఎగురవేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి,

సిద్దిపేట పట్టణంలో పతంగుల దుకాణం వద్ద సందడి

సిద్దిపేట పట్టణంలో రంగుల విక్రయాలు

జహీరాబాద్ : ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు

మెదక్‌లో గంగిరెద్దులతో బసవన్న

చేగుంట హనుమాన్ వీధిలో బోగి మంటలు వేస్తున్న యువతీయువకులు


Comments
Please login to add a commentAdd a comment