
మొక్కజొన్న సాగుపై ఆరా
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని హరిదాసుపూర్‌లో సోమవారం సౌదీ అరేబియా రైతులు పర్యటించారు. గ్రామంలోని రైతులను కలిసి జొన్న పంట సాగు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరాల్లో జొన్న సాగుచేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్ జొన్న పంటకు డిమాండ్ ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు. జొన్న సాగు చేయడానికి ఒక ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి వస్తుందని, ఒక ఎకరాలో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు వివరించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. నీటి సాంద్రత తక్కువ ఉన్న ప్రాంతంలో ఎలాంటి పంటలను సాగు చేయాలనే పరిశోధనతో క్షేత్ర స్థాయిలో సాగు వివరాలను తెలుసుకునేందుకు సౌదీ అరేబియా రైతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, ఏడీఏ వెంకట లక్ష్మీ, మండల వ్యవసాయాధికారి గణేశ్, ప్రతిభ, ఏఈఓ రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.
హరిదాసుపూర్‌లో సౌదీ అరేబియా రైతులు