
కాలుష్యం
కమ్మేస్తున్న
కాలుష్యం నుంచి కాపాడండి
పరిశ్రమల నుంచి నిరంతరం వెలువడుతున్న వాయు కాలుష్యంతో జీవన పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆందోళన పడుతున్నాం. పిల్లలు మహిళలు ఘాటైన వాసనలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. మా ప్రాణాలను రక్షించండి.
– ఇమ్రాన్,
బొల్లారం కాంగ్రెస్ నాయకులు
పీసీబీ అధికారుల చర్యలు శూన్యం
సా్థనికంగా వెలువడుతున్న విష వాయువులు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేరు. సమస్య తీవ్రతరంగా మారుతున్న నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– మద్దూరి పెంటేశ్,
బీఆర్‌ఎస్ నాయకులు
జిన్నారం (పటాన్‌చెరు): వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకరంగా మారుతోంది. బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమలు విచ్చలవిడిగా విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే జల కాలుష్యం పెద్ద ఎత్తున ఉండగా దానికి తోడు వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకునే అవకాశాలను సైతం విష వాయువులను విడుదల చేస్తూ హరించేస్తున్నారు. సామాన్య ప్రజల జీవన విధానం పైనే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం రసాయన పరిశ్రమలు విగాధం కలిగిస్తున్నాయి.
రసాయన విష వాయువులు గాలిలోకి..
పారిశ్రామిక వాడకు చెందిన పలు పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరిశ్రమల పొగ గొట్టాల ద్వారా పెద్ద ఎత్తున రసాయన విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వాయువులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను కలుషితం చేస్తూ సామాన్య ప్రజలను ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేసిన పీసీబీ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఫిర్యాదులను పెడచెవిన పెట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు
విషవాయువులు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు వృద్దుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక విషవాయువులు కళ్లలో మంటలు పుట్టిస్తూ, ముక్కుపుట్టలు అదిరేలా చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమలను గుర్తించి విషవాయువులను నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పారిశ్రామిక వాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరంగా బొల్లారంపారిశ్రామిక వాడ విచ్చలవిడిగా వాతావరణంలోకివిష వాయువులు ఘాటైన వాసనలతో జనాల్లోఅనారోగ్య సమస్యలు పట్టించుకోని పీసీబీ యంత్రాంగం

కాలుష్యం

కాలుష్యం