Sangareddy District News
-
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ట్రైనీ కలెక్టర్ మనోజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్స్ కమిటీ (డీసీసీ) డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో డిసెంబర్ 2024 – 25 ఆర్థిక ఏడాదికి సంబంధించి వివిధ బ్యాంకుల ద్వారా అందజేసిన వ్యవసాయ, వ్యవసాయేతర రుణాల వివరాలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్లు, గ్రౌండింగ్ అయిన యూనిట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అందజేసిన రుణాలు, లక్ష్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల కుటుంబాల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ మంజూరు చేసిన స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందజేసి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం దేబోజిత్ బారువా, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సూర్య ప్రకాశ్, యూబీఐ రీజినల్ మేనేజర్ వికాస్ కుమార్, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, నాబార్డ్ ఎల్డీఎం గోపాల్‌రెడ్డి, సీఈవో జానకిరెడ్డి, పీడీఆర్డీవో జ్యోతి, పీడీ మెప్మా గీత సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ట్రైనీ కలెక్టర్ మనోజ్ -
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
● అలియా బేగం కుటుంబసభ్యులను పరామర్శించిన ఎస్పీ ● విద్వేషాలను రెచ్చగొట్టొద్దు మునిపల్లి(అందోల్)/సంగారెడ్డి జోన్: మునిపల్లి మండలం అంతారం గ్రామంలో ఓ ఖాళీ స్థలంలో మూత్రం పోసిందని సదరు స్థల యజమానులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన టెన్త్ విద్యార్థి అలియా బేగం కుటుంబసభ్యులను జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపించామని తెలిపారు. అలియా బేగంపై వారికి ఎలాంటి కక్షలేదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే భావించాలన్నారు. విద్యార్థి మృతిపై సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టొద్దని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజీయే రాజమార్గం రాజీ పడటమే రాజమార్గమని, మార్చి 8న జరగనున్న జాతీయ లోక్–అదాలత్‌ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రూపేశ్ పేర్కొన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. -
హత్య కేసులో భార్య, అల్లుడు రిమాండ్
పాపన్నపేట(మెదక్): ఆశయ్యను హత్య చేసిన కేసులో నిందితులైన అతడి భార్య శివ్వమ్మ, అల్లుడు రమేశ్‌ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి,పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆశయ్య శనివారం పొలం వద్ద జారి పడగా కాలు విరిగింది. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరించలేక, ఆపరేషన్ చేసినా నడిచి పొలం పనులు చేయలేడనే అనుమానంతో భార్య, అల్లుడు కలిసి ఆదివారం రాత్రి ఆశయ్యను ఉరేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కేసులో భాగంగా ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. -
ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
సంగారెడ్డి టౌన్ : ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫసల్వాది గ్రామ సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని యువకులు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారి భయంతో కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పాపను బయటకు తీసుకొచ్చారు. కాగా, యువకులిద్దరినీ పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు తప్పించుకున్నారు. పట్టుబడిన యువకుడికి స్థానికులు అక్కడే దేహశుద్ధి చేశారు. పాపను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సూచిక కమాన్‌ను ఢీకొట్టిన డీసీఎం
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డుపై ఏర్పాటు చేసిన సూచిక కమాన్‌ను డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం మండలంలోని రామాయపల్లి శివారులో అదుపుతప్పి సూచిక కమాన్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఒంగోలుకు చెందిన ప్రశాంత్ గణేశ్, మిత్రురాలు ప్రత్యూషతో కలిసి స్నేహితుడి వివాహం కోసం కామారెడ్డి వెళ్తున్నారు. అడ్రస్ కోసం రోడ్డు పక్కన కారు నిలిపి మ్యాప్ చూస్తున్నారు. డీసీఎం ఢీకొట్టగా కమాన్ ఒరిగి వీరి కారుపై పడిపోయింది. ప్రత్యూషకు, డీసీఎం డ్రైవర్ మహ్మద్ అలీంకు గాయాలయ్యాయి. కారు యజమాని గణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు.కారుపై పడిపోవడంతో ఇద్దరికి గాయాలు -
జాతరలో ప్లాస్టిక్ కనిపించొద్దు
మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పాపన్నపేట(మెదక్): అధికారులు సమన్వయంతో పనిచేసి ఏడుపాయల జాతరను జయప్రదం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. గురువారం ఏడుపాయల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే జాతరకు సుమారు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని చెప్పారు. ఏ షాపులో ప్లాస్టిక్ కనిపించొద్దని ఆదేశించారు. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లు ఉంటే వాటిని తమకు అప్పగిస్తే బదులుగా పేపర్ కవర్లు ఇస్తామని సూచించారు. జాతర పరిసరాల్లో మరిన్ని శౌచాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి నడవలేని వ్యక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. లడ్డూ, పులిహోర కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 24 వరకు ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఎల్పీఓ సురేష్ బాబు, ఈఓ చంద్రశేఖర్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
● సిద్దిపేట పట్టణంలో ఘటన ● పరిశీలించిన ఏసీపీ మధు, సీఐ ఉపేందర్ సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వ్యక్తి హత్యకు గురైన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణం డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న బోదాసు శ్రీను (29)కు సంధ్యతో 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం భార్య సంధ్య పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటుండగా శ్రీను సిద్దిపేటలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో ఉంటున్నాడు. పట్టణంలోని నర్సాపూర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఇంటిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనుపై దాడి చేసి హత్య చేశారు. గురువారం తెల్లవారుజామున ఇంటి యజమాని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట ఏసీపీ మధు, సీఐ ఉపేందర్ మృతదేహాన్ని పరిశీలించి, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వేలి ముద్రలు సేకరించారు. మృతుడికి నేర చరిత్ర ఉందని, అతడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీను తలపై రక్తపు గాయాలు ఉండడంతోపాటు ఘటనా స్థలంలో కర్రను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి నర్సాపూర్ : అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నర్సాపూర్‌కి వచ్చి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు లింగమూర్తి అనే వ్యక్తిని బీఆర్ఎస్ నాయకులు హత్య చేయించారని, స్వయాన మృతుడి కూతురు బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేసినట్లు గుర్తు చేశారు. అధికారం అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నించే వ్యక్తులను చంపడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నీళ్లు నిధులు, నియామకాలపై ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగిందని అవన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోరారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, తదితరులు ఉన్నారు. -
గుర్తు తెలియని ఇద్దరు మహిళలు మృతి
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. గురువారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ప్రభుత్వాస్పత్రిలోని అత్యవసర ద్వారం వద్ద గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడ్డి ఉంది. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో గల పలు దుకాణాల్లో భిక్షాటన చేసే మహిళగా పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు 50 నుంచి 52 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు. సెక్యూరిటీ గార్డు కల్పగూరి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు తెలిస్తే 87126 56718 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. అలాగే మరో గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని, ఆమె వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. సెక్యూరిటీ ఇన్చార్జి జాన్.డీ శాన్టిస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి వద్ద గుర్తింపు -
మంటగలుస్తున్న మానవత్వం
ఆందోళన కలిగిస్తున్న హత్యలు ● ఆస్తి, వివాహేతర సంబంధాలతో కుటుంబ సభ్యులపైనే దాడులుసిద్దిపేటకమాన్: మానవత్వం మంటగలుస్తోంది. బంధాలు.. బంధుత్వాలను మరిచి క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఆధునిక జీవన శైలి, ఆస్తి, భూ తగాదాలు, వివాహేతర సంబంధాలే హత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యులను.. కట్టుకున్న భార్యను.. భర్తను, చివరకు సొంత అన్నదమ్ములను సైతం మట్టుబెడుతున్నారు. చిన్న చిన్న తగాదాలు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో నా అనుకున్న వాళ్లనే హత్య చేయడం ఆందోళన కలిగిస్తోంది. బీమా డబ్బులు వస్తాయని, భూములు, ఆస్తులు దక్కించుకోవాలని, తదితర కారణాలతో మద్యం మత్తులో, క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో రెండు హాత్యలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో పలు రకాల కారణాలతో 2024లో (గతేడాది) 25 హత్య కేసులు, 2023లో 13 హత్య కేసులు నమోదైనట్లు పోలీసు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. భూతగాదాలు, వివాహేతర సంబంధాలే కారణం మారుతున్న జీవనశైలి, ఆస్తి, భూతగాదాలు, వివాహేతర సంబంధాలు, మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు అధికంగా పెరగడం వల్ల కుటుంబ సభ్యులను, సొంత అన్నదమ్ములను సైతం హత్య చేయడానికి వెనుకాడడం లేదు. మానవత్వాన్ని, రక్త బంధాన్ని మరిచి హత్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాల వల్ల.. అడ్డు తొలంగించుకోవాలనే ఉద్దేశ్యంతో కట్టుకున్న వారినే మట్టుబెడుతున్నారు. ఇన్సురెన్స్ (బీమా) డబ్బులు వస్తాయనే దురుద్దేశంతో మనిషి విలువైన ప్రాణాలను సైతం తీస్తున్నారు.సిద్దిపేట గుండ్ల చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న బోదాసు శ్రీను గురువారం గుర్తుతెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ శ్రీను హత్యకు దారితీసినట్లు సమాచారం. ఆవేశమే శ్రీనుని బలితీసుకుంది. ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాశ..ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్యకు ఇద్దరు తమ్ముళ్లు, అక్క ఉన్నారు. వీరు తల్లిని సరిగా చూడడం లేదని అక్క యాదవ్వ తనతో ఉంచుకుని బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో తల్లి పేరుపై ఉన్న 3.03 ఎకరాల భూమిని సోదరులకు తెలియకుండా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయంలో అన్నదమ్ములు, అక్క మధ్య గొడవలు జరగాయి. కనకయ్య తరుచూ గొడవ పెట్టుకుంటుండటంతో అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న యాదవ్వ, ఆమె కుమారుడు కృష్ణమూర్తి కలిసి కనకయ్యను హత్య చేశారు. ఆత్మహత్యలా చిత్రీకరించేలా ప్రయత్నం చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడటంతో నిందితులను ఈ నెల 9న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధంతో.. మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ యువకుడు ఆమె భర్తపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. సిద్దిపేట పట్టణంలో భార్య, పిల్లలతో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల యువకుడు శ్రవణ్ సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రియుడు శ్రవణ్‌తో కలిసి భర్తను చంపడానికి భార్య పతకం వేసింది. అందులో భాగంగా గత నెలలో రెండు సార్లు భర్తను చంపడానికి యత్నించారు. ఘటనపై బాధితుడు సిద్దిపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈనెల 18న నిందితుడు శ్రవణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆవేశం..జిల్లాలో హత్య కేసులు సంవత్సరం.. సంఖ్య 2023 13 2024 25 2025లో ఇప్పటి వరకు 02 మనుషులపై ప్రేమ ఏదీ? డబ్బుపై ఉన్న ప్రేమ మనిషిపై లేకపోవడం వల్లనే హత్యలు జరుగుతున్నాయి. మనిషి తన అవసరాలకు మించి హుందాతనం, హంగు, ఆర్భాటం గొప్పతనానికి పోయి అనవసర ఖర్చులతో ఆర్థిక వలయంలో చిక్కుకుంటున్నారు. కారణం ఏదైనా సరే విలువైన మనిషి ప్రాణం తీయడం సరికాదు. మనిషి తనను తాను మోసం చేసుకుంటూ తనుకు ఏం కావాలో తెలియక ఉన్మాద స్థితికి వెళ్లి దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విలువైన ప్రాణాలను తీయకూడదు. – డాక్టర్ శాంతి, సైకియాట్రిక్ విభాగ ం హెచ్ఓడీ, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
338మంది కార్మికులపై వేటు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సదాశివపేట శివారులోని ఓ ప్రైవేటు టైర్ల పరిశ్రమ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమను క్రమబద్ధీకరించాలంటూ ఆందోళనకు దిగిన 338మందికి పైగా కార్మికులపై వేటు వేసింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం యాజమాన్యం శిక్షణ పేరుతో నిరుద్యోగ యువతను ఉద్యోగాల్లోకి తీసుకుంది. అప్పట్నుంచి వీరిని పర్మినెంట్ చేయకుండా ట్రైనీగానే పనిచేయించుకుంటూ నెలకు రూ.14వేలు మాత్రమే చెల్లిస్తోంది. ఇన్నాళ్లు తక్కువ వేతనమిచ్చినా సర్దుకుపోయామని, తమను పర్మినెంట్ చేయాలంటూ ఆందోళనకు దిగడంతో సదరు పరిశ్రమ ఒక్కసారిగా వీరందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో ఆ కార్మిక కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖ డీఆర్డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ) అప్పట్లో నిర్వహించిన జాబ్‌మేళాలో ఈ ఉద్యోగాలు పొందారు. నిబంధనల ప్రకారం ఒకటి రెండేళ్లకు మించి ట్రైనీగా కొనసాగించరాదు. నాలుగేళ్లుగా అరకొర వేతనాలతో ట్రైనీగా కొనసాగిస్తూ తమను శ్రమ దోపిడీకి గురి చేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 22న మరోసారి చర్చలు! ఉద్యోగాలు పోయిన సుమారు 338 మంది కార్మికులు వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికశాఖ అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేశారు. ఆ శాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు యాజమాన్యంతో చర్చలు జరపగా, కంపెనీ ప్రతినిధులు ఇంకా ఎటూ తేల్చడం లేదు. ఈ నెల 22న మరోసారి చర్చించాలని నిర్ణయించారు. సదాశివపేటలోని ఓ ప్రైవేటు టైర్ల పరిశ్రమ సంచలన నిర్ణయం ఆందోళనకు దిగిన కార్మికులను తొలగించిన యాజమాన్యం చర్చలు జరుపుతున్నాం: డిప్యూటీ కమిషనర్ మరోసారిచర్చలు జరుపుతాంసుమారు 338 మందికిపైగా ట్రైనీలను ఉద్యోగాల్లోంచి తొలగించడంతో సంబంధిత కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 22న మరోసారి చర్చలు జరుపుతాం. ట్రైనీగా ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపై నిర్ణీత నిబంధనలేవీ లేవు. చర్చలు ఫలించకపోతే లేబర్ కోర్టుకు రిఫర్ చేస్తాం. –శ్రీనివాస్‌రెడ్డి, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ -
గురక తగ్గడం కోసం సర్జరీ
● మరుసటి రోజే వ్యక్తి మృతి ● వైద్యం వికటించి చనిపోయాడంటూకుటుంబీకుల ఆందోళన ● సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన సంగారెడ్డి: వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన వెల్డురి శ్రీనివాస్(47) నిద్రలో గురక బాగా వస్తోందని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాడు. వైద్యులు పరీక్షించి ముక్కులో బోన్ పెరిగిందని ఆపరేషన్ చేస్తే గురక తగ్గుతుందని చెప్పారు. దీనికి శ్రీనివాస్ ఒప్పుకోవడంతో బుధవారం సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం రాత్రి శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా చనిపోతాడని డాక్టర్లను నిలదీశారు. గురువారం ఉదయం మృతుడి బంధువులు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుజేశారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రమేశ్ కుమార్ తెలిపారు. -
కమ్మనైనది.. అమ్మ భాష
● మాతృభాషను మించినమరొక భాష లేదు ● కాపాడుకుంటేనే మనుగడ ● అభివృద్ధికి కృషి చేస్తున్నకవులు, రచయితలుప్రశాంత్నగర్(సిద్దిపేట): మాతృభాషను మించి మరొక భాష లేదని చాలా మంది కవులు చెబుతుంటారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎన్నో పెరిగాయి. చాలా మంది విదేశాలకు వెళ్లడానికి తపనపడుతున్నారు. అందుకు ఇంగ్లిషు నేర్పుకోవడం తప్పనిసరి అవుతుంది. దీంతో విద్యార్థులు తెలుగు భాషపై పట్టు కోల్పోతున్నారు. తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కవులు, కళాకారులు చెబుతున్నారు. మనం సమాజంలో ఎదిగేందుకు తల్లి ఎంత కృషి చేస్తుందో, అదే విధంగా మాతృభాష కూడా మన ఆహా భావాలు సరైన రీతిలో వ్యక్తపర్చటానికి తల్లిలా దోహదపడుతుంది. మాతృభాష తెలుగును జిల్లాలోని తెలుగు భాషా పండితులు, అదేవిధంగా కవులు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మన భాష, యాసను కాపాడటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసించాలని, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయాలని తహతహలాడుతు, మన మాతృభాష రాకున్న ఫర్వాలేదు కాని ఇంగ్లిష్ రావాలనే తపనలో ఉన్నారు. దీంతో నేడు విద్యనభ్యసిస్తున్న అనేక మంది విద్యార్థులకు అటు ఇంగ్లిష్, ఇటు తెలుగు సక్రమంగా రాయడం, చదవడం రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ మాతృభాషను విస్మరించడమే తప్పు. తెలుగు భాషాభివృద్ధికి కృషి జిల్లాలోని అనేక మంది తెలుగు భాష పండితులు తాము వృత్తిరీత్య పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధిస్తూనే తీరిక సమయంలో కవితలు, రచనలు రాస్తూ పుస్తకాల రూపంలో వెలువరించటం ద్వారా జిల్లాలో సాహితీ అభిమానులు తమ పిల్లలకు మాతృభాషపై పట్టు సాధించేలా దృష్టి సారిస్తున్నారు. సాయంత్రం సమయాల్లో ఉపాధ్యాయులు, కవులందరూ కలిసి కవి సమ్మేళనాలు, అష్టవధానాలు, తదితర ప్రక్రియలతో తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటునందించే విధంగా కార్యాచరణ అమలుపరుస్తున్నారు. జిల్లాలోని అనేక మంది ఉపాధ్యాయులు తెలుగు భాషలో బోధన చేస్తూ గుర్తింపు పొందారు. ఇందులో ముఖ్యంగా నాడు నందిని సిధారెడ్డి నుంచి మొదలుకొని నేటి వరకు అనేక మంది పాత, కొత్త తరం కవులు, రచయితలు జిల్లాలో తెలుగుభాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మాతృభాషను విస్మరించొద్దు మనలో ఉన్న భావాలను స్వేచ్ఛగా అందించేది మన మాతృభాష. అలాంటి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరు ప్రఖ్యాతి గాంచిన తెలుగు అజరామరం. బాలలైన వృద్ధులైన నేడు సిద్దిపేట సాహితీ లోకంలో విహరిస్తూ మాతృభాష కృషికి బాటలు వేస్తున్నారు. ఇద ఆహ్వానించదగిన విషయం. మాతృభాష అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు తెలుగు నేర్పడంలో మనం చొరవ తీసుకోవాలి. ఇతర భాషలను గౌరవిస్తూనే, మన మాతృభాషను విస్మరించొద్దు. ఇప్పటికి జిల్లాలో మాతృభాష అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ఉండ్రాళ్ల రాజేశం, బాలసాహితీవేత్త, సిద్దిపేట మానవ సంబంధాలను ముడి వేస్తుంది మాతృభాష చక్కని మాధుర్యానికి, పలుకుబడులకు, నుడికారాలకు పుట్టినిల్లు. మాతృభాష మమకారం మానవ సంబంధాలను ముడివేస్తుంది. నేడు అనేక మంది తమ కుటుంబాల్లో ఇతర భాషల్లో మాట్లాడుతున్నారు. దీంతో చిన్నారులకు ఇటు తెలుగు, ఇతర భాషలు పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నారు. కేవలం మాతృభాష దినోత్సవం నాడే కాకుండా ప్రతి రోజూ మన మాతృభాష అభివృద్ధికి ముందుకు సాగాలి. మన మాతృభాషను కాపాడుకోవటం అందరి బాధ్యత. ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ మన భాషను విస్మరించద్దు. –భామండ్ల రాజు, తెలుగు అధ్యాపకులు, సిద్దిపేటనేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
సంగారెడ్డి జోన్: కొన్నేళ్లుగా పల్లాడియం కార్బన్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను జిల్లా పోలీసులు అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన వివరాలను జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పరిధిలోని మసీద్పురం గ్రామానికి చెందిన అల్లం సాంబశివుడు హైదరాబాద్‌లోని సూరారంలో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో పుణెలోనూ, సంగారెడ్డిజిల్లాలోనూ పలు ఫార్మా కంపెనీల్లో పనిచేయడం వల్ల అతడికి బహిరంగ మార్కెట్లో భారీగా ధర పలికే పల్లాడియం కార్బన్ గురించి అవగాహన ఉంది. పల్లాడియం కార్బన్‌ను అమ్ముకుని భారీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో చోరీ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకు పుణె ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన ప్రసాద్‌తో పాటు ఆదిత్య అంకుష్ మన్నె, ముక్కంటి రెడ్డి, మట్టాకుటుంబరావు, గుమ్మడి శ్రీనివాస్‌రావుతో కలసి ఓ ముఠాను తయారు చేశాడు. అందరూ కలసి ఫార్మా కంపెనీల్లో నిల్వ ఉంచే పల్లాడియం కార్బన్‌ను దొంగిలించేవారు. హెచ్ ఆర్ మేనేజర్ ఫిర్యాదుతో.. ఈ నెల 8న సదాశివపేట పరిధిలోని యావాపూర్ గ్రామ శివారులోని అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్–3 కంపెనీలో పల్లాడియం కార్బన్ దొంగతనం జరిగింది. దీనిపై ఆ సంస్థ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ మజ్జి సూరప్పల నాయుడు సదాశివపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగి న పోలీసులు సాంకేతిక సమాచారం, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి బుధవారం మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నిందితుల్ని పట్టుకున్నారు. వారి నుంచి 96 కిలోల పల్లాడియం కార్బన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాంబశివుడు ముఠా గతంలో జిల్లాలోని బొంతపల్లి, బీదర్ ఫార్మా కంపెనీలలో కూడా మొత్తంగా 120 కేజీల పల్లాడియం కార్బన్‌ను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.4.50కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులను గురువారం జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు త్వరితగతిన ఛేదించిన సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్, సీసీఎస్, ఇన్స్పెక్టర్ శివకుమార్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్, పి.రామునాయుడు ఇన్స్పెక్టర్, ఎస్ఐ శ్రీకాంత్, కొండాపూర్ ఎస్సై హరిశంకర్ గౌడ్ సిబ్బందిని అభినందించారు. వివిధ ఫార్మా కంపెనీల నుంచిపల్లాడియం కార్బన్ చోరీ వివరాలు వెల్లడించిన పోలీసులు -
డిజిటల్ ఇంజనీరింగ్‌కు ప్రోత్సాహం
నర్సాపూర్ : ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ డిజిటల్ ఇంజనీరింగ్‌కు ప్రోత్సాహాన్ని అందిస్తుందని రెనాల్ట్ గ్రూప్ (ఆసియా) హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ సిమోనా అడెలీనా అన్నారు. గురువారం బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీలో జాతీయ స్థాయి ఈ బాహ సే ఇండియా–2025 పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సిమోనా అడెలీనా హాజరై మాట్లాడారు. డిజిటల్ ఇంజనీరింగ్‌కు తమ సంస్థ అందజేస్తున్న ప్రోత్సాహాన్ని ఆమె వివరిస్తూ ఇంటర్న్‌షిప్, ఉపాధి అవకాశాలు అందజేసే ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సొసైటీ ఆఫ్ ఆటోమోటీవ్ ఇంజనీర్స్ ఇండియా (ఎస్‌ఏఈ) చైర్మన్ బాల్‌రాజ్ సుబ్రమణ్యం, బాహ సే ఇండియా సలహాదారుడు డాక్టర్ కేసీ వోరా, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ రవి చంద్రన్ రాజగోపాల్, ఆటోకార్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఎడిటర్ మయాంక్ డింగ్రా, బీపీసీఎల్ హైదరాబాద్ టెరిటరీ మేనేజర్ శ్రావణ్ కుమార్, ఈ బాహ సే ఇండియా జాయింట్ కన్వీనర్ మనోనిత్ సింగ్, తదితరులు పాల్గొని తమ సంస్థలకు ఈ బాహతో ఉన్న సంబంధాలను వివరించారు. విద్యార్థులనుద్దేశించి సొసైటీ చైర్మన్ విష్ణురాజు పంపిన వీడియో మేసేజ్‌ను వినిపించారు. ఐదు రోజులపాటు కార్యక్రమం జరుగుతుందని, 15 రాష్ట్రాల నుంచి 80 జట్లు పాల్గొన్నాయని కాలేజీ డైరెక్టర్ లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, ఆయా బ్రాంచ్‌ల హెచ్ఓడీలు, ఇతర ప్రతినిధులు బాపిరాజు, సురేశ్, కాంతారావు, రాయుడు, దశరథరామయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెనాల్ట్ గ్రూప్ హెచ్ఆర్వైస్ ప్రెసిడెంట్ సిమోనా అడెలీనా బాహ సే ఇండియా–2025 పోటీలు -
డంప్‌యార్డ్‌పై అర్ధనగ్న ప్రదర్శన
గుమ్మడిదలలో 15వ రోజుకు చేరుకున్న ఆందోళనలుజిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఒక్కోరోజు ఒక్కో వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం అర్ధనగ్నంగా జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు మహిళలు వందల సంఖ్యలో పాల్గొని ప్రధాన కూడళ్ల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు విరమించే వరకు ఆందోళన కార్యక్రమాలు విరమించేది లేదని స్పష్టం చేశారు. -
ఇళ్ల స్థలాల కోసం నిరసన
జహీరాబాద్ టౌన్: మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలతోపాటు రూ.5లక్షలు ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ...మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులంతా నిరుపేదలని, వారికి సొంత ఇళ్లులేవన్నారు. అందుకని ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన వారికి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదన్నారు. ఎన్నికల డ్యూటీ డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయం అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు యశోదమ్మ, మా ణిక్, శ్రీనివాస్, పాండు పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
జిన్నారం (పటాన్చెరు): చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగలక్ష్మి కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన వల్లపు రాంబాబు కుమారుడు నరేశ్(26), వల్లపోలు రాజు కుమారుడు శంకర్ (22) ఇద్దరూ స్నేహితులు కాగా కూలీ పని చేస్తుంటారు. మంగళవారం సాయంత్రం జిన్నారం మండలం వావిలాలలో కల్లు తాగేందుకు స్క్యూటీ పై వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో ఈత కొట్టేందుకు వావిలాల పీర్ష చెరువులోకి దిగారు. చెరువు ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. అక్కడే గేదెలు మేపే ఓ వ్యక్తి గమనించి చెరువులో దిగి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వెంటనే పోలీసులకు విషయం చెప్పాడు. బుధవారం జగంపేట వావిలాల గ్రామాలకు చెందిన ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లు తాగేందుకు వచ్చి ఈతకు వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి జిన్నారం మండలంలోని వావిలాల పీర్ష చెరువు వద్ద ఘటన -
తలసరి ఆదాయంలో మేడ్చల్‌ను వెనక్కినెట్టి...
వ్యక్తి తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్‌కం)లో విషయంలో సంగారెడ్డి జిల్లా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాను వెనక్కినెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోటీ పడుతోంది. రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచింది. జిల్లాలో ఒక వ్యక్తి తలసరి ఆదాయం ఏడాదికి రూ.3.21 లక్షలుగా తేల్చింది. మొదటిస్థానంలో రంగారెడ్డి జిల్లా రూ.9.54లక్షలు కాగా, హైదరాబాద్ జిల్లా 4.97 లక్షలు. జిల్లా తలసరి ఆదాయం రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.11లక్షల కోట్లు కాగా, జిల్లాలో తల సరి ఆదాయం అంతకంటే ఎక్కువగానే ఉంది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒక దేశం..ఒక రాష్ట్రం అభివృద్ధిని సూచించేది తలసరి ఆదాయం (జీడీపీ). ఒక ఆర్థిక ఏడాదిలో ఆ దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవలు..ఇలా అన్ని రంగాల్లో జరిగిన వస్తూత్పత్తి విలువను జీడీపీ(గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్)గా లెక్కిస్తారు. జీడీడీపీ(గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్)లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే...సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో జిల్లాలో జరిగిన వస్తూత్పత్తి విలువ ఏకంగా రూ.60,298 కోట్లుగా ప్రభుత్వం లెక్కతేల్చింది. రాష్ట్ర జీడీపీ రూ.13.11 లక్షల కోట్లుకాగా, జిల్లా జీడీడీపీ రూ.60,298 కోట్లు ఉంది. ఇది మొత్తం జీడీపీలో సుమారు ఐదు శాతంగా తేల్చింది. తెలంగాణ రాష్ట్ర గణాంకశాఖ నివేదిక–2024ను ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఈ నివేదికలో జీడీడీపీ అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించింది. పారిశ్రామిక ఉత్పత్తి... సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. జిల్లాలో ఓడీఎఫ్, బీడీఎల్ రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఎంఆర్ఎఫ్, మహేంద్ర అండ్ మహేంద్ర వంటి ఆటోమొబైల్ భారీ పరిశ్రమలు కూడా జిల్లాలోనే ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న జిల్లా కూడా సంగారెడ్డినే. బల్క్‌డ్రగ్, కెమికల్ పరిశ్రమలు కూడా వందల్లో ఉంటాయి. వీటిలో ఏటా రూ.వేల కోట్ల విలువ చేసే వస్తూత్పత్తి జరుగుతుంది. జిల్లాలో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ఉత్పత్తి విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఇలా ఎగుమతుల విలువ రూ.వేల కోట్లు ఉంటుంది. దీంతో జీడీడీపీలో సంగారెడ్డి జిల్లా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పోటీ పడుతోంది. వ్యవసాయ ఉత్పత్తి సైతం... కేవలం పారిశ్రామికంగానే కాకుండా సంగారెడ్డి జిల్లా ఇటు వ్యవసాయరంగంలోనూ ముందువరుసలో ఉంటుంది. ప్రధానంగా పత్తి, చెరుకు వంటి వాణిజ్య పంటలతోపాటు, పసుపు, అల్లం వంటి సుగంధద్రవ్యాల పంటలు కూడా అధికంగా పండుతున్నాయి. వరి సాగు కూడా జిల్లాలో ఉంటుంది. ఇలా ఈ పంటల దిగుబడులు కూడా అధికంగా ఉండటంతో జీడీడీపీ విషయంలో సంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలతో పోటీ పడుతోంది. తలసరి ఆదాయంలో జిల్లా రాష్ట్ర సగటు కంటే అధికం జిల్లా స్థూల వార్షిక ఉత్పత్తి రూ.60,298 కోట్లు హైదరాబాద్ జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోనే తొలిస్థానం పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధే కారణం తెలంగాణ గణాంక శాఖ–2024 నివేదికలో వెల్లడి -
వోక్స్వ్యాగన్ వర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్య
మునిపల్లి(అందోల్): కంకోల్ వోక్స్ వ్యాగన్ యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనర్ విభాగంలో అధ్యాపకుడు ప్రొఫెసర్ సుమంత్ కుమార్(36) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుమంత్ కుమార్ 18 నెలలుగా మునిపల్లిలోనే ఉంటూ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనతో పాటు మరో వ్యక్తి కలసి ఒకే గదిలో ఉంటున్నారు. ప్రతీరోజు ఉదయం 9 గంటలకు వర్సిటీలో తరగతులకు హాజరుకావాల్సిన సుమంత్ మధ్యాహ్నం 12 గంటలైనా డిపార్ట్మెంట్కు రాకపోవడంతో సిబ్బంది ఆయన రూమ్ వద్దకు వెళ్లి తలుపులు తెరిచి చూడగా అప్పటికే ఆయన ఫ్యాన్‌కు వేలాడుతూ నిర్జీవంగా కన్పించారు. దీంతో వర్సిటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని కిందికి దించి పంచనామా నిమిత్తం సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌లో ఉంటున్న సుమంత్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. కాగా, సుమంత్‌తో పాటు ఉండే మరో వ్యక్తి ఆదివారం ఊరికి వెళ్లగా అప్పట్నుంచి ఆయన ఒక్కరే గదిలో ఉంటున్నారు. కాగా, బుధవారం ఉదయం వర్సిటీలో సమీపంలోని ఓ దేవాలయానికి వెళ్లి వచ్చినట్లు వర్సిటీ సిబ్బంది చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 18 నెలలుగా ఇక్కడ విధులు మృతుడు జార్ఖండ్ వాసి -
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మహిళా డిగ్రీ కళాశాల ‘విపణి’ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతివంద శాతం పన్ను వసూలు చేయాలిఅధికారుల సమీక్షలో కలెక్టర్‌సంగారెడ్డి ఎడ్యుకేషన్: మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకాంక్షించారు. విద్యార్థి దశ నుంచి మార్కెటింగ్ అవకాశాలపై శిక్షణ ఇవ్వడం ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన శిక్షణలను అందించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారన్నారు. మహిళా డిగ్రీ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపణిని కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను కలెక్టర్ రుచి చూశారు. హ్యాండీక్రాప్ట్ స్టాళ్లను పరిశీలించారు. సంగారెడ్డి జోన్: జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో 100శాతం పన్నులు వసూలు లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లకు ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు సహకరించాలన్నారు. పన్ను చెల్లిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని, జిల్లాలోని పరిశ్రమలలో కూడా పనులు వసూలు చేయాలని సూచించారు. జిల్లాలో పన్నుల బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వేసవికాలంలో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలలో అదనపు అంతస్తుల కళాశాల భవనాల, పరిశ్రమల నిర్మాణం కోసం దరఖాస్తులను పరిశీలించి వెంటనే పన్నులు వసూలు చేసి అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కుల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మిషన్ భగీరథ కనెక్షన్లు తాగునీటి పైపులు లైన్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ప్రజా వైద్యారోగ్య అధికారి ప్రతాప్, జిల్లా ఉన్నతాధికారులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక్‌కు కలెక్టర్ అభినందన
జేఈఈ మెయిన్స్‌లో 99.17 పర్సంటైల్ సాధించిన కార్తీక్ సంగారెడ్డి: ఇటీవల జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.17 పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచిన సంగారెడ్డి పట్టణానికి చెందిన విద్యార్థి పి.కార్తీక్‌ను బుధవారం కలెక్టర్ వల్లూరు క్రాంతి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...విద్యార్థులు జీవితంలో లక్ష్యం పెట్టుకుని ఇష్టంతో చదివితే మంచి విజయాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇష్ట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికిరణ్‌రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ డీఎల్పీవో అనిత హత్నూర(సంగారెడ్డి): గ్రామాలలో తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శులకు డీఎల్పీవో అనిత సూచించారు. హత్నూర మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శులతో డీఎల్పీవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ...గ్రామాలలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలున్నా వెంటనే మరమ్మతులు చేయించాలని, ప్రతీరోజు పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. గుండ్లమాచునూరు గ్రామంలోని నర్సరీని ఆమె పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులను సైతం పరిశీలించి కార్యదర్శికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీఈవో యూసుఫ్, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కేతకీ హుండీ ఆదాయం రూ.28లక్షలు ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం 76 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. గర్భగుడిలోని పార్వతీపరమేశ్వరులకు అభిషేకం, మహామంగళహారతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు ఆదాయాన్ని లెక్కించారు. ఈ మేరకు రూ.28,07,500ల ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ ఈవో శివరుద్రప్ప, ఆలయాధికారులు, అర్చకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజానుకూల బడ్జెట్‌గా మార్పులు చేయాలి సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్‌ను ప్రజానుకూల బడ్జెట్‌గా మార్పు చేయాలని సీపీఎం జిల్లా నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్ద బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ...కేంద్ర బడ్జెట్ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించే బడ్జెట్ అని విమర్శించారు. ప్రధాని మోదీ రైతు బడ్జెట్ అంటూనే రైతు రుణమాఫీకి తగిన బడ్జెట్ కేటాయించలేదన్నారు. విద్యుత్ సంస్కరణలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీసం వేతనంగా రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలు, మాణిక్యం,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంపై సీఎం హామీ
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మార్చి మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సీఎంని హైదరాబాద్‌లో కలిసి కరీంనగర్ వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని, పెన్షన్ బెనిఫిట్స్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన సీఎం సీనియార్టీ ప్రకారం చెల్లింపు జరిగేలా చూస్తామని, ఏప్రిల్‌లో డీఏలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగుల అన్ని సమస్యలపై మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా సమీక్ష చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు వివరించినట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో త్వరలో ఉద్యోగుల సమావేశం ఉంటుందని, టీఎన్జీవో ప్రతినిధులు రావాలని సూచించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగులతో మార్చిలో ప్రత్యేక సమావేశం టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ -
మార్చిలో మహిళా సంఘాలకు ఎన్నికలు!
సంగారెడ్డి జోన్: మార్చిలో మహిళా సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. మహిళా స్వయం సంఘాల బలోపేతానికి సంఘాల సభ్యులతో పాటు అధ్యక్షుల పాత్ర కీలకం. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు కొత్త అధ్యక్షులను త్వరలో ఎన్నుకోనున్నారు. ఎన్నికల నిర్వహించేందుకు ఇప్పటికే మండల స్థాయిలోని ఏపీఎంతో పాటు సీసీలకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహిళా సంఘాల సభ్యులకు ఎన్నిక నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. మూడు పద్ధతులలో ఎన్నిక మహిళా స్వయం సహాయక సంఘాల ఎన్నిక ప్రక్రియ మూడు పద్ధ్దతులలో ఎన్నుకోనున్నారు. నిబంధనల మేరకు రిజర్వేషన్ ప్రకారం ఏకగీవ్రం, చేతులు పైకి ఎత్తి, చీటీలు రాసి ప్రక్రియలో ఏదైనా ఒక ప్రక్రియలో ఎన్నుకుంటారు. ప్రతీ గ్రామంలో ఉన్న సంఘాల ద్వారా ఎన్నికై న అధ్యక్షులు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలును ఎన్నుకుంటారు. ఎన్నికై న గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అందరూ కలిసి మండల సమాఖ్య అధ్యక్షురాలుని, మండల సమాఖ్య అధ్యక్షురాలు కలిసి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిని ఎన్నుకుంటారు. మే నుంచి సంఘాలకు కొత్త అధ్యక్షులు కొనసాగనున్నారు. సభ్యుల సంఖ్య కుదింపు గతంలో కంటే అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామైక్య సంఘం అధ్యక్షురాలి పదవీ కాలం ఐదేళ్లకు, మండల, జిల్లా సమాఖ్యలను మూడేళ్ల పాటు నిర్ణయించారు. అదే విధంగా గతంలో కంటే ప్రస్తుతం కమిటీలో సభ్యుల సంఖ్యను తగ్గించారు. మండల, జిల్లా సమాఖ్య సంఘానికి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారితో కమిటీని ఎన్నుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంఘాల బలోపేతం దిశగా.. గ్రామాలలోని స్వయం సహాయక సంఘాల బలోపేతంతో పాటు సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అధ్యక్షులు కీలక పాత్ర పోషించనున్నారు. తమ పరిధిలో ఉన్న సభ్యులకు రుణాలు అందించటం, వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించటంతో పాటు తిరిగి రుణాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేయటం తదితర విషయాలలో కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలోని సంఘాల వివరాలు జిల్లాలోని మహిళాసంఘాలు 18,756 ఆయా సంఘాలలో ఉన్న సభ్యులు 1,90,381 జిల్లాలో ఉన్న గ్రామైక్య సంఘాలు 695 ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ మే నుంచి సంఘాలకు కొత్త అధ్యక్షులు అధ్యక్షుల పదవీ కాలం పొడిగింపు గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి మహిళా స్వయం సహాయక సంఘాలలో కొత్త అధ్యక్షులను నిబంధనల మేరకు ఎన్నుకుంటారు. నిర్దేశిత గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇప్పటికే మండల అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కల్పించాం. –జ్యోతి, డీఆర్డీఓ -
జిజ్ఞాస ప్రాజెక్ట్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నర్సాపూర్ రూరల్: విజ్ఞాస ప్రాజెక్టు పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్ బుధవారం తెలిపారు. ఇటీవల కళాశాల విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ కళాశాల నుంచి జంతు శాస్త్రం, చరిత్ర, ఆంగ్ల సబ్జెక్టులు ఆకట్టుకున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు ఐదుగురు చొప్పున విద్యార్థులు పాల్గొన్నారు. జంతు శాస్త్రానికి సంబంధించి నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ నందు సీతాకోక చిలుకల వైవిద్యం, నర్సాపూర్ ప్రాంతీయ గిరిజన మహిళల సాంస్కతిక మార్పుపై చరిత్ర, ఆంగ్లంకు సంబంధించి ఆంగ్ల భాష నేర్చుకోవడంలో విద్యార్థులు ఆందోళన గురించి అధ్యయనం వంటి ప్రాజెక్టులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టుల ప్రదర్శనకు, సలహాలు సూచనలు ఇచ్చిన అధ్యాపకులను, విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు తోటి అధ్యాపకులు అభినందించారు. -
స్రవంతి.. ప్రాజెక్టుతో సత్తా చాటి
జోగిపేట(అందోల్): ప్రతి రోజూ కళ్ల ముందే అంగవైకల్యంతో ఉన్న స్వీపర్ తరగతి గదిని శుభ్రం చేస్తూ పడుతున్న ఇబ్బందులు చూసి ఆ విద్యార్థినిని తన ఆలోచనకు పదును పెట్టింది. ఈ ఇబ్బందిని ఎలాగైన దూరం చేయాలని సులభంగా గదిని శుభ్రం చేసే విధంగా ఓ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. రెండు, మూడు మాసాలు కష్టపడి ‘డెస్క్ లిఫ్టర్’ అనే ప్రాజెక్ట్‌ను తయారు చేయడమే కాకుండా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్సాన్పల్లి గ్రామానికి చెందిన అతిపేద కుటుంబానికి చెందిన ఆశం యాదయ్య, కవితల మూడవ కూతురు స్రవంతి. జోగిపేటలోని ఎస్ఆర్ఎమ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పాఠశాలలో పని చేస్తున్న సైన్స్ టీచర్ సిద్దేశ్వర్ సహకారంతో 2023లో ‘డెస్క్ లిఫ్టర్’ అనే ప్రాజెక్టుకు తయారు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ప్రాజెక్టు ప్రదర్శించారు. అక్కడ అందరినీ ఆకట్టుకొని హైద్రాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర ప్రదర్శనకు ఎంపికై ంది. 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఢిల్లీలో జరిగిన 11వ నేషనల్ సైన్స్ ఇన్స్పైర్ అవార్డు ప్రదర్శనలో ప్రాజెక్టుకు ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 2025 జూన్‌లో జపాన్‌లో నిర్వహించే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపిక చేశారు. జపాన్ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో 60 ప్రాజెక్టులు, రాష్ట్ర స్థాయిలో నాలుగు ప్రాజెక్టులు ఎంపిక కాగా వాటిలో కన్సాన్పల్లి విద్యార్థిని రూపొందించిన ‘డెస్క్ లిఫ్టర్’ ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం. అతి తక్కువ ఖర్చుతో, తేలికై న వస్తువులతో ఎక్కడికై నా అవలీలగా తీసుకువెళ్లే విధంగా ‘డెస్క్ లిఫ్టర్’ ప్రాజెక్టును రూపొందించారు. పాఠశాలలు, ఆఫీసులు, ఇతర కార్యాలయాల్లో గదులు శుభ్రం చేయడానికి దీన్ని వాడొచ్చు. అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికై న ‘డెస్క్ లిఫ్టర్’ తక్కువ ఖర్చు, తేలికై న వస్తువులతో రూపకల్పన చేసిన విద్యార్థిని సులువుగా గదులు శుభ్రం చేసేందుకు ఉపయోగంసంతోషంగా ఉంది డెస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు తయారు చేసే సమయంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తే చాలనిపించేది. కానీ భారత ప్రభుత్వం ద్వారా జపాన్‌లో జరిగే ప్రదర్శనకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. జూన్‌లో జపాన్ వెళ్లేందుకుగాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. పాస్ పోర్టును కూడా సిద్ధం చేసుకున్నాను. ఈ అనుభూతిని జీవితంలో మరచిపోను. – శ్రవంతి, విద్యార్థి, కన్సాన్పల్లి జాతీయ స్థాయిలో గుర్తింపు డెస్క్ లిఫ్టర్ అనే పరికరాన్ని ఎక్కడికై నా తీసుకెళ్లొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా స్కూళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో టేబుళ్లని లేపి చక్కగా శుభ్రం చేయొచ్చు. 2025 జూన్ మాసంలో జపాన్ రాష్ట్రంలోని సకూరలో జరిగే ప్రదర్శనకు భారతదేశ ప్రభుత్వం ఎంపిక చేసింది. గతేడాది కన్సాన్పల్లి పాఠశాల నుంచి ‘పింక్ లూ ’ ప్రాజెక్టు తరఫున భూమిక జపాన్ ప్రదర్శనకు వెళ్లింది. – సిద్దేశ్వర్, గైడ్ టీచర్, కన్సాన్పల్లి -
అధికారుల నిర్లక్ష్యమే రైతులను ముంచేను
గాంధీనగర్‌లో తెగులు సోకిన వరి పంటహుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు సాగు చేసిన పంటలను అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించడం లేదు. దీంతో పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. అలాగే విత్తన ఎంపిక, ఎరువుల వాడకం, తెగుళ్ల నివారణ సమయంలో ఎలాంటి మందులు వాడాలనేది తెలియడం లేదు.హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్, బెజ్జంకి మండలాల్లో 68,272 ఎకరాల్లో పంటలు సాగు చేయగ అందులో వరి 53,280, మొక్కజొన్న 12,782, పొద్దుతిరుగుడు 1660, వేరుశనగ 150, ఇతర పంటలు 400 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. యాసంగి సీజన్‌కు ముందు గ్రామాల్లో అవగాహన కల్పించలేక రైతులు వారికి నచ్చిన పంటలను సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతం సాగు నీరు కష్టాలను తప్పించుకొనేందుకు కూడా రైతులు వరి తగ్గించి మొక్కజొన్న పంటను పెంచారు. ప్రైవేటు సీడ్ విత్తన కంపెనీలు గ్రామాలకు రావడంతో వారి దగ్గర విత్తనం తీసుకొని పంట సాగు చేస్తున్నారు. పంటల దిగుబడులు విత్తన కంపెనీలు గ్యారంటీ ఇవ్వకపోవడం, కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చేతుకు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కువ దిగుబడులు వస్తాయనే ఆశ రైతులను విత్తన కంపెనీల వైపు చూస్తున్నారు. గాంధీనగర్, తోటపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులు విత్తనం మొలువకపోవడంతో విత్తనం చెడగొట్టి లోకల్ విత్తనం వేసుకొన్నారు. దీంతో రైతలకు పెట్టుబడుల భారం పెరిగింది, సమయం వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేధిస్తున్న ఆన్లైన్ సమస్య.. వ్యవసాయ అధికారులు క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు వెల్లి రైతులకు విత్తన ఎంపిక, ఎరువుల వాడకం, తెగుల్ల నివారణ పై అవగహన కల్పిస్తే మంచి దిగుబడులు తీస్తారు. క్షేత్ర స్థాయికి వెళ్లిన అధికారులకు రైతులు ఏ పంటలు వేశారనే విషయాలు కూడా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేయడం సులభమవుతుంది. పంటల క్షేత్రాలకు వెళ్లని అధికారులు ఆన్లైన్లో రైతుల వివరాలు లేక పంటలు విక్రయించడానికి మార్కెట్‌కు వెళ్తే ఆన్లైన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాలకు వచ్చి పంటలను ఆన్లైన్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.క్షేత్ర స్థాయిలో పంటలు పరిశీలించని వ్యవసాయ అధికారులు సాగుపై రైతులకు కొరవడిన అవగాహన సబ్సిడీ విత్తనాలపై అందని సమాచారం బయట మార్కెట్లో కొనుగోలు తెగుళ్ల సమయంలో ఏం మందులు వాడాలో తెలియని పరిస్థితి ఆన్లైన్లో నమోదుకాని పంట వివరాలు సీసీఐలో అమ్ముకోలేక దళారులకు విక్రయంప్రభుత్వ సబ్సిడీ విత్తన వెనక్కి.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నేషనల్ సీడ్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల రైతుల కోసం 18 క్వింటాళ్ల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం సరఫరా చేసింది. 10 కిలోల విత్తనం ఖరీదు రూ.275 ఉంటే రూ.100 సబ్సిడీ పోను రైతులు రూ.175 చెల్లించాలి. రైతులకు అధికారులు అదును దాటిన తర్వాత సమాచారం ఇవ్వడంతో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో ఒక రైతు కూడా విత్తనం తీసుకోలేదు. కోహెడ, బెజ్జంకి మండలాల్లో 8 క్వింటాళ్ల విత్తనాలను రైతులు తీసుకొని సాగు చేశారు. ప్రభుత్వం విత్తనం సరఫరా చేస్తుందని రైతులకు అధికారులు చెప్పకపోవడంతో రైతులు ప్రైవేటు కంపెనీల విత్తనాలను కొనుగోలు చేసి పంటలు సాగు చేశారు.రెండు ఎకరాలను చెడగొట్టిన హైబ్రిడ్ సీడ్ మక్క అంటే ఉత్తర కార్తెల దుక్కిపోతం చేసి విత్తనం పెట్టిన. విత్తనాలు సరిగాలేక మక్క మొలువలేదు. రెండు ఎకరాల మక్క చేను దున్ని మళ్లీ దుకాణానికి వెళ్లి లోకల్ మక్క తెచ్చి పెట్టిన. రూ.15 వేలు ట్రాక్టర్ దున్నకానికి అయ్యింది. మక్కలు పెట్టి పెట్టుబడి ఖర్చు నష్టపోయిన. మా భూమి దగ్గరనే ఏడీఏ ఆఫీసు ఉంటదని, అయినా ప్రభుత్వం సబ్సిడీ విత్తనం వచ్చిందని చెప్పలేదు. – పోలు మహేందర్, రైతు గాంధీనగర్ పంటల వద్దకు వెళ్లాలని ఆదేశించాం డివిజన్ పరిధిలోని వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఏఈఓలను పంటల క్షేత్రాలకు వెళ్లాలని ఆదేశించాం. పంటల తెగుళ్ల నివారణ గురించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పాం. ఆన్లైన్ నమోదు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ నాసిరకం ఉందని రైతులు వద్దంటే తిరిగి పంపించాం. కోహెడ, బెజ్జంకి రైతులు మొక్కజొన్న సాగు చేసుకున్నారు. – శ్రీనివాస్, ఏడీఏ, హుస్నాబాద్ -
శుభకార్యానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి
కొండాపూర్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మారేపల్లి గ్రామానికి చెందిన గంజాయి ప్రకాశ్ (28) బంధువుల శుభకార్యం నిమిత్తం మూడు రోజుల కిందట మండల పరిధిలోని మల్కాపూర్‌కు వచ్చాడు. బుధవారం ఉదయం కార్యక్రమం కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు బైక్‌పై బంధువైన జేమ్స్‌తో కలిసి సంగారెడ్డికి వచ్చాడు. తిరిగివెళ్తున్న క్రమంలో మల్కాపూర్ గ్రామ శివారు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు గంజాయి ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని న్యాల్కల్(జహీరాబాద్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని హుస్సెళ్లి చెక్ పోస్టు వద్ద చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శంశల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రభు(31) మంగళవారం రాత్రి హుస్సెళ్లి చౌరస్తా నుంచి కాలి నడకన ఇంటికొస్తున్నాడు. చెక్ పోస్టు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పున్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.బైకును ఢీకొట్టిన డిప్పర్: యువకుడు దుర్మరణం -
ఇద్దరు అదృశ్యం
కాలకృత్యాలకు వెళ్లి వ్యక్తి.. సంగారెడ్డి క్రైమ్: కాలకృత్యాల కోసం బస్సు దిగిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామానికి చెందిన వడ్డీ పెంటయ్య, భార్య రాములమ్మతో 18న హైదరాబాద్‌లోని ఎల్లమ్మ బండ వద్ద ఉండే కుమారుడిని చూడడానికి బయలుదేరారు. మతిస్థిమితం సరిగా లేని పెంటయ్య సంగారెడ్డి కొత్త బస్టాండ్‌లో భార్యతో చెప్పి కాలకృత్యాల కోసం దిగాడు. బస్సు బయలుదేరే సమయానికి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో వెంటనే రాములమ్మ కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. మహేశ్ వచ్చి తండ్రి కోసం ఆరా తీసిన ఫలితం దక్కలేదు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి.. పటాన్చెరు టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన పెద్ద లక్ష్మయ్య మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. 14న పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచి చూడగా లక్ష్మయ్య కనిపించలేదు. తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. చిన్నాన్న కనబడడం లేదని కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి
వర్గల్(గజ్వేల్): ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వర్గల్ మండలం జబ్బాపూర్‌లో జెండావిష్కరణ చేస్తుండగా విద్యుత్ తీగలు ఇనుప జెండా పైపునకు తగిలి ఏడుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జబ్బాపూర్ గ్రామ కూడలిలో యువకులు, గ్రామస్తులు ఇనుప పైపుతో కూడిన కాషాయజెండాను ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 11.30 ప్రాంతంలో జెండాను పైపు చివరన బిగించారు. లింగ ప్రశాంత్(22), దేశెట్టి కరుణాకర్(22), పల్లపు బన్నీ, కొంతం వేణు, కొంతం కనకరాజు, లింగ గణేష్, లింగ మహేశ్ జెండా పైపును పట్టుకొని పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు పైనున్న కరెంట్ తీగలకు తగిలింది. దీంతో పైపును పట్టుకున్న వారందరూ విద్యుత్ షాక్‌కు గురై పడిపోయారు. షాక్ తీవ్రతకు లింగ ప్రశాంత్ మృతి చెందగా, దేశెట్టి కరుణాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను గ్రామస్తులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్ప త్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కరుణాకర్‌ను మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో జబ్బాపూర్ గ్రామం శోకసంద్రమైంది. చేతి కందిన కొడుకు విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడటంతో ప్రశాంత్ తల్లి కనకమ్మ రోదనలు మిన్నంటాయి. ఒంటరిని చేసి పోయావా అంటూ ఆమె విలపిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. డిగ్రీ చదువులో మిన్నగా, ఎన్సీసీలో గ్రూప్ లీడర్‌గా ప్రశాంత్ రాణించాడు. మిన్నంటిన రోదనల మధ్య అతడి అంత్యక్రియలు ముగిశాయి. జెండావిష్కరణ చేస్తుండగా ఏడుగురికి విద్యుత్ షాక్ ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు వర్గల్ మండలం జబ్బాపూర్‌లో విషాదం -
దళితుల భూముల జోలికి రావొద్దు
శివ్వంపేట(నర్సాపూర్): దళితులు భూములు ఆక్రమించాలని చూస్తున్నారంటూ దళితులు మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి నిర్వహిస్తున్న సర్వేను అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన మండలంలోని చిన్న గొట్టిముక్కులలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సర్వే నంబర్ 296లో 80 ఎకరాల్లో 60 దళిత కుటుంబాలకు గతంలో ఇందిరమ్మ ఇచ్చిన సాగు భూములు ఉన్నాయి. వీటి పక్కనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి పట్టా భూములను కొనుగోలు చేసి సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు ఏడీ సర్వేయర్ శ్రీనివాస్, అధికారులు సర్వేకు వచ్చారు. విషయం తెలియడంతో దళితులు చంద్రయ్య, లింగం, రాములు, అశోక్, సైదులు, నర్సింలు, భిక్షపతి, కూమార్ తదితరులు తాము ఎంతో కాలంగా సాగు చేస్తున్న భూముల్లో సర్వే చేయొద్దని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యేను నిలదీశారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని గొడవకు దిగారు. దళితుల భూముల్లో ఉపాధి హామీ ద్వారా మట్టి రోడ్డు వేశారని దారిని సైతం కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం మాజీ ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని ఈవిషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని దళితులు చెప్పారు. తాను కొనుగోలు చేసిన భూమిని మాత్రమే సర్వే చేయిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చచెప్పారు. సర్వేను అడ్డుకున్న దళితులు మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డిని నిలదీత చిన్నగొట్టిముక్కులలో ఘటన -
సిద్దిపేట రూపురేఖలు మారిపోయాయి
● 50 ఏళ్ల తర్వాత మళ్లీ పురిటిగడ్డకు ● సంతోషంగా ఉంది: సీనియర్ సిటిజన్లు సిద్దిపేటజోన్: యాభై ఏళ్ల కిందట ఉన్న సిద్దిపేటకు ప్రస్తుతం చూస్తున్న దానికి చాలా వ్యత్యా సం ఉందని, అభివృద్ధి చెంది రూపు రేఖలే మారిపోయాయని సిద్దిపేట సీనియర్ సిటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ మిత్రులుగా చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట పట్టణంలో బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేసుకొని విదేశాల్లో ఏళ్ల కొద్ది జీవించిన తర్వాత సిద్దిపేట రావడం జరిగిందన్నారు. సిద్దిపేట పట్టణం అభివృద్ధి చెందడంతో రోల్ మోడల్‌గా ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధతో సిద్దిపేట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం రంగనాయక, మల్లన్న సాగర్, కోమటిచెర్వు సందర్శించారు. సమావేశంలో సికిందర్, హమీద్, నజిమ్, కలిమ్తో పలువురు పాల్గొన్నారు. పరిశ్రమలో అగ్ని ప్రమాదం ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని రంగాయపల్లి శివారులో గల ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ బట్టిలోంచి వచ్చే వేస్టేజ్‌ను ఒక పక్కన వేయగా వేడికి అక్కడ మంటలు చెలరేగి పక్కన్న ఉన్న స్టోర్ రూమ్ దగ్ధమైంది. ఇది గమనించిన యాజమాన్యం, స్థానికులు ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి మంటలార్పారు. కార్మికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి పరిశ్రమ వద్దకు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వీరి వెంట తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్‌గౌడ్ ఉన్నారు. పరిశ్రమలో జరిగే ప్రమాదాల వల్ల గ్రామానికి ముప్పు పొంచి ఉందని రంగాయపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లలో కారం కొట్టి ● మహిళ మెడలోంచి బంగారం చోరీ పటాన్చెరు టౌన్: కిరాణా షాపు నిర్వాహకురాలు కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోంచి బంగారం లాక్కెళ్లిన ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తులసీవనం కాలనీలో రమ్య అనే మహిళ కిరాణా షాపు నడుపుతుంది. మూడు రోజుల నుంచి ఓ వ్యక్తి కిరాణా షాపునకు తెల్లవారుజామున వచ్చి సామగ్రి తీసుకెళ్తున్నాడు. బుధవారం ఉదయం బైక్‌పై మాస్క్ ధరించి కిరాణా షాపునకి వచ్చాడు. ఉల్లిపాయలు కావాలని అడుగడంతో రమ్య తీస్తుండగా ఆమె కళ్లల్లో కారం కొట్టి మెడలో నుంచి పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో విరిగిన అరతులం బంగారంను లాక్కొని పారిపోయాడు. ఈ ఘటనపై షాపు నిర్వాహకురాలు రమ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదు
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో నాలుగేళ్లుగా పని చేస్తున్న కార్మికులను ఆకస్మాత్తుగా తొలగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కేవల్‌కిషన్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ఎంఆర్ఎఫ్ యాజమాన్యం కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తక్షణమే కార్మికులను డ్యూటీలోకి తీసుకొని కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, సాయిలు సీఐటీయూ జిల్లా నాయకులు రాజయ్య, ప్రవీణ్ కుమార్, మహిపాల్‌తో పాటు పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు ., -
కేసీఆర్‌ను కలిసిన జెడ్పీ మాజీ చైర్మన్
సంగారెడ్డి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య కలిశారు. కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె సంజీవయ్య ఉన్నారు. జీవితాలు నాశనం చేసుకోవద్దు భరోసా కేంద్రం ఇన్చార్జి మహేశ్వరి జోగిపేట(అందోల్): విద్యార్థుల జీవితాలను మలుపుతిప్పేది ఇంటర్మీడియేట్ అని.. ఈ రెండు సంవత్సరాలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచి భవిష్యత్‌ను పొందవచ్చని సంగారెడ్డి పోలీసుశాఖ భరోసా కేంద్రం ఇన్చార్జి మహేశ్వరి అన్నారు. మంగళవారం జోగిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులకు సెల్ఫోన్ల వినియోగం వల్ల కలిగే లాభాలు, నష్టాలను వివరించారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నేరాలు ప్రతిరోజు పత్రికలు, టీవీల్లో చూస్తున్నారని, అందుకు విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్లైన్ గేమింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు సంగారెడ్డి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా తమిళనాడు తరహాలో చట్టబద్ధత కల్పించాలని ఓబీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో తీర్మానం ద్వారానే చట్టబద్ధత కలుగుతుందని , విద్యా, ఉద్యోగ రాజకీయాల్లో ఆర్టికల్ 9 ప్రకారం చట్టబద్ధత కల్పించాలన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి తీరని అన్యాయం చేసిందని, ఈ ప్రభుత్వమైనా బీసీలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, యువత జిల్లా అధ్యక్షులు జి.రమేష్ కుమార్, జిల్లా యువత నాయకులు నిఖిల్, కార్తీక్, కురువ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య తదితరులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శిపై వేటు కంది (సంగారెడ్డి): కంది మండల పరిధిలోని తుంకిల్ల తండా పంచాయతీ కార్యదర్శి రేఖను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సదాశివపేట మండలం వెల్లూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఆమె పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు అందాయి. విచారణలో నిజమని తేలడంతో కలెక్టర్ వేటు వేశారు. -
కార్పొరేట్ల లాభాలకే పెద్దపీట
రాజకీయ విశ్లేషకుడు పాపారావుసంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి కార్మికుల సంక్షేమానికి కోతలు విధించిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పాపారావు అన్నారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కేబుల్ కిషన్ భవన్లో ‘కేంద్ర బడ్జెట్– కార్మిక వర్గంపై ప్రభావం‘అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం క్షేమంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సంపద సృష్టించే కార్మిక వర్గానికి ఆదాయంలో వాటా దక్కడం లేదని వాపోయారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడం ద్వారానే సంపద పెరుగుతుందనే భ్రమలో పాలకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కోట్ల రూపాయల రాయితీలు, రుణాల మాఫీ చేస్తూ వచ్చినప్పటికీ ఉత్పత్తి 75శాతానికి మించి జరగలేదని వివరించారు. అందుకే 14 రకాల ఉత్పత్తి సంబంధిత ఇన్సెంటివ్‌లను రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు రూ.12లక్షల ఆదాయపన్ను రాయితీ ఇచ్చినంత మాత్రాన వారి ఆదాయాలు పెరగవని చెప్పారు. పన్ను రాయితీ వెనుక కూడా కార్పొరేట్ శక్తుల లాభాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో పేదలకు జరిగిన అన్యాయంపై సెమినార్లు, సదస్సులు నిర్వహించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు మల్లేశం, సాయిలు, రామచంద్రం, జయరాజు, నరసింహులు పాల్గొన్నారు. -
చెత్తను తగలబెడుతున్నారు
● వాయుకాలుష్యంతో సతమతమవుతున్నాం ● కొల్లూరువాసుల ఆగ్రహం రామచంద్రాపురం(పటాన్చెరు): రోడ్లపై చెత్తను తగలబెడితే చర్యలు తప్పవని హెచ్చరించే అధికారులు.. డంపింగ్ యార్డులో చెత్తను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారకులవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో చెత్త డంపింగ్ యార్డు కోసం గత ప్రభుత్వం ఐదెకరాల భూమిను కేటాయించింది. దానితో పాటు కోటి రూపాయల అంచనాతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిర్మించారు. కానీ అది ఇంత వరకు ప్రారంభోత్సవానికి నోచుకోవడంలేదు. దానితో పాటు రూ.25లక్షలతో కాంపోస్ట్ షెడ్, రూ.25లక్షలతో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్‌ను నిర్మించారు. ఇన్ని సదుపాయలున్న తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తడి చెత్త, పొడి చెత్తతో ఎరువులను తయారు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. స్థానిక అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. డంపింగ్ యార్డు పరిసరాల ప్రాంతంలో నివసించే వారు నిత్యం వాయుకాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు. -
తాగునీటికి ముందస్తు చర్యలు
● సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం ● కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి ప్రాంతాలలో వేసవి ప్రారంభమయ్యే దశలోనే తాగునీటి కొరత ఎదురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా మోటార్లు, పైప్లైన్లు, హ్యాండ్‌పంపుల మరమ్మతులు చేపట్టడం, గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి అవసరాలను తీర్చేందుకు సింగూరు ప్రాజెక్టు జలాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ మాధూరి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా అధికారులు సాయిబాబా, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
17 ఏళ్ల కల సాకారమైన వేళ..
ఎట్టకేలకు డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్ ● అభ్యర్థుల్లో వెల్లివెరిసిన ఆనందం ● జిల్లాలో 67 మందికి ప్రయోజనం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సుదీర్ఘ నిరీక్షణ.. ఎగతెగని పోరాటం.. 17 ఏళ్లకు ఉద్యోగం వరించింది. 2008లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు. కానీ తమకంటే తక్కువ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడంతో కోర్టు మెట్లు ఎక్కారు. నేడు న్యాయస్థానం ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు పొందారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపడుతుంది. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ ఆధారంగా అర్హత సాధించిన వారిలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులను 70 శాతం బీఎడ్, డీఎడ్ అభ్యర్థులతో భర్తీ చేయగా, మిగిలిన 30 శాతం డీఎడ్ అభ్యర్థులతో భర్తీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కౌన్సెలింగ్‌కు హాజరై ఉద్యోగాలు పొందని బీఎడ్ అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను రిజర్వ్ చేయడాన్ని సవాల్ చేశారు. అప్పటి నుంచి పోరాడుతుండగా నేటికి తెరపడింది. వారికి నియామక పత్రాలను అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాలో 67 మంది న్యాయస్థానం ఆదేశాలతో జిల్లాలో ఎస్జీటీ కేటగిరిలో డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చారు. ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన కౌన్సిలింగ్‌కు హాజరైన వారందరికీ ఆయా మండలాల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను భర్తీ చేశారు. వీరికి నెలకు రూ.31,040 వేతనంతో నియమించగా ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరారు. -
ఇదీ గ్రామ చరిత్ర
బాబుల్‌గాం గ్రామం ముందుగా నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండేది. ఈ గ్రామం ప్రజలు అప్పటి మండల కేంద్రం జుక్కల్‌కు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కౌలాస్‌నాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో పుట్టిల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే సుమారు 40 కి.మీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఈ గ్రామానికి అధికారులు రావాలన్నా.. గ్రామస్తులు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా అనేక ఇబ్బందులు తప్పేవి కావు. పుట్టిల్లో ప్రయాణించే సమయంలో పలుమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ గ్రామంలో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం నిర్వహణ సరిగా ఉండేది కాదు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే సమయంలో ఈ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోకి మార్చింది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ను కూడా కొత్త మండలం చేసింది. ఈ పెద్దకొడప్గల్ తమకు దగ్గర అవుతుందని బాబుల్‌గాం గ్రామస్తులు డిమాండ్ చేయడంతో ఈ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా నుంచి తొలగించి, పెద్ద కొడప్గల్ మండలం (కామారెడ్డి)లో చేర్చారు. రెవెన్యూ పరంగా రికార్డులను కూడా ఆ జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించారు. కానీ పంచాయతీరాజ్ గెజిట్ ప్రకారం ఇంకా సంగారెడ్డి జిల్లా పరిధిలోనే కొనసాగుతుండటం గమనార్హం. -
అమీన్పూర్లో స్కిల్ యూనివర్సిటీ
విధులకు గైర్హాజరైతే వేటు వేయండిపటాన్చెరు: అమీన్పూర్లో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన మంగళవారం అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 993లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం 15 ఎకరాలు, అలాగే నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం మరో 25 ఎకరాలు స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది. స్కిల్ యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వం భూములను పరిశీలించినట్లు హరిచందన తెలిపారు. త్వరలో ఇవి అమల్లోకి రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ హరీష్ చంద్రప్రసాద్, కమిషనర్ జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మహేష్‌దత్ సంగారెడ్డి జోన్: ఎన్నికల విధులకు హాజరు కాని ఉద్యోగులను సస్పెండ్ చేయాలని నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ బి.మహేశ్‌దత్ ఏక్కా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఏఆర్ఓ అధికారులతో ఎన్నికల విధులపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు తారా డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, అంబేద్కర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్‌ను కలెక్టర్ క్రాంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణను సవాల్‌గా తీసుకొని పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఓటర్లు, అభ్యర్థులు ఉన్నత విద్యావంతులు ఉంటారని తెలిపారు. అభ్యర్థులు నిబంధనలపై అవగాహన కలిగి ఉంటారని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవరావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.నవోదయ పాఠశాల కూడా.. స్థలాన్ని పరిశీలించిన ఆర్అండ్బీ కార్యదర్శి హరిచందన -
వివాహేతర సంబంధంతో హత్యాయత్నం
● మహిళ భర్తపై దాడికి పాల్పడ్డ యువకుడు ● అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు సిద్దిపేటకమాన్: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు ఆమె భర్తపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. ఐల శ్రీధర్, భార్య ఇద్దరు పిల్లలతో కలిసి గుండ్ల చెరువులో నివాసం ఉంటున్నాడు. శ్రీధర్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మెరుగు శ్రావణ్ (21) సదరు మహిళతో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనికి గాను అడ్డు తొలగించుకోవాలని శ్రవణ్‌తో కలిసి భర్త శ్రీధర్‌ను చంపడానికి పథకం వేసింది భార్య. గత నెల 11న రాత్రి పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న శ్రీధర్‌ను శ్రావణ్ లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ బైక్‌పై వెళ్తున్న క్రమంలో నర్సాపూర్ చౌరస్తా సమీపంలో యువకుడి ఇద్దరు స్నేహితులు వీరి వెనుకాలే వచ్చారు. ముగ్గురూ కలిసి శ్రీధర్‌ను కిడ్నాప్ చేసి కాళ్లు, చేతులు కట్టేసి దాడి చేశారు. మళ్లీ రెండోసారి గత నెల 20న శ్రీధర్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 12న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రధాన నిందితుడు మెరుగు శ్రావణ్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
బాబుల్‌గాం.. అటా ఇటా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి– కామారెడ్డి జిల్లాల సరిహద్దు గ్రామం బాబుల్‌గాం సమస్య ఇంకా పూర్తి స్థాయిలో తీరలేదు. కర్నాటక సరిహద్దుల్లోని కంగ్టి మండలం పరిధిలో ఉన్న ఈ మారుమూల గ్రామంలో ఇప్పటికీ రెండు జిల్లాల అధికార యంత్రాంగం పాలన కొనసాగుతుండటం గమనార్హం. ఈ గ్రామంలోని భూములు, ఇతర రెవెన్యూశాఖ పరంగా పాలనంతా కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం పరిధిలోకి మారింది. కానీ పంచాయతీరాజ్ పాలన విషయానికి వస్తే మాత్రం ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ జిల్లాకు మారలేదు. పంచాయతీ గెజిట్‌లో కూడా ఇంకా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభను కూడా ఈ బాబుల్గాంలో సంగారెడ్డి అధికార యంత్రాంగమే నిర్వహించింది. కాగా, రాష్ట్ర ప్రణాళిక శాఖ సోమవారం తెలంగాణ అట్లాస్ (తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్) –2024ను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిని కామారెడ్డితో పాటు, సంగారెడ్డి జిల్లాలో కూడా ఉందని ఈ అట్లాస్‌లో పేర్కొంది. ఈ గ్రామంలో ఎన్నికలు ఎవరు జరపాలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఓటరు జాబితా, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏ జిల్లా అధికారులు జరపాలనే దానిపై ఇటీవల తర్జన భర్జన జరిగింది. పంచాయతీరాజ్ గెజిట్ ప్రకారం ఈ గ్రామం సంగారెడ్డి జిల్లాలో ఉండగా, ఈ ఎన్నికల ఏర్పాట్లు మాత్రం కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం చేసింది. టీ–పోల్ వెబ్సైట్లో కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలోంచి తొలగించి కామారెడ్డి జిల్లా పరిధిలోనే మార్చారు. అసెంబ్లీ ఆమోదంతోనే.. ఈ గ్రామం పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలోకి వెళ్లాలంటే పంచాయతీరాజ్ గెజిట్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అసెంబ్లీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామం రెండు జిల్లాల పరిధిలో ఉన్నట్లు రికార్డులు చూపుతోంది. అలాగే జుక్క ల్ (కామారెడ్డి జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గం పరిధి సంగారెడ్డి జిల్లాలో కూడా ఉన్నట్లు చూపుతోంది. రెవెన్యూ పరంగా కామారెడ్డి జిల్లా.. పంచాయతీరాజ్ గెజిట్‌లో సంగారెడ్డిలోనే.. రెండు జిల్లాల మధ్య నలుగుతున్న గ్రామం -
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నర్సాపూర్: పోలింగ్ కేంద్రం వద్ద నిబంధనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎస్ఐ లింగంకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను, ఓటరు జాబితాను పరిశీలించారు. ఎస్ఐ, మండల ఆర్ఐ ఫైజల్ పోలింగ్ స్టేషన్ల వివరాలను ఎస్పీకి వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో పలు రికార్డులు పరిశీలించి కేసులను త్వరగా ఛేదించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని ఎస్ఐకి సూచించారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేట ఉన్నత పాఠశాలలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట సీఐ రంగక్రిష్ణ, ఎస్ఐ మధుకర్‌రెడ్డి ఉన్నారు.ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి -
మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య
తంప్లూర్‌లో వ్యక్తి టేక్మాల్(మెదక్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్మకు పా ల్పడిన ఘటన టేక్మాల్ మండలంలోని తంప్లూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ దయానంద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాకలి అశోక్ (38), వెంకట్రావు పేటకు చెందిన వెంకటలక్ష్మీకి 20 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కుటుంబ విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. 16న దంపతులిద్దరూ తంప్లూర్ గ్రామానికి వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఇంటి వద్ద గొడవ జరగడంతో వెంకటలక్ష్మీ హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అశోక్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి చాకలి పోచయ్య మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నార్సింగ్‌లో యువకుడు పాపన్నపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని నార్సింగిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. మధ్యప్రదేశ్ కు చెందిన సంజీవ్ కుమార్ (25) ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి వచ్చి కామారెడ్డికి చెందిన శ్రీలత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కొంత కాలంగా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని చెప్పినా వినకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత ఘటనా స్థలికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
కొత్త రకం శనగతో అధిక దిగుబడులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): రైతులు ఎన్బీ ఈజీ 47 కొత్త రకం శనగను సాగు చేసుకోవాలని, దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పల్లవి, కో ఆర్డినేటర్ విజయ్ తెలిపారు. మండల కేంద్రమైన జగదేవ్‌పూర్, అలిరాజ్‌పేట గ్రామంలో రైతుల పొలాల్లో వ్యవసాయ శాఖ సహకారంతో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రకం శనగను సాగు చేస్తే నిటారుగా పెరగడమే కాకుండా కాయ పైకి వస్తుందని, మెషిన్ హార్ వెస్టింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. అనంతరం ఎనుగుల శ్రీనివాస్‌రెడ్డి రైతు పొలంలో వేసిన ధనియాల సాగును పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈఓ కవిత, రైతులు పాల్గొన్నారు.ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పల్లవి -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
టేక్మాల్(మెదక్): చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొడ్మట్‌పల్లిలో సోమ వారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ దయానంద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చీలపల్లి లక్ష్మయ్య(59) రజక వృత్తితోపాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా చేపలు పట్టేందుకు వాగుల్లోకి, కుంటల్లోకి వెళ్లేవాడు. 14న ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, వ్యవసాయ పొలాల వద్ద వెతుకుతుండగా 17న రాత్రి గుండువాగు గడ్డపై లక్ష్మయ్య బట్టలు, సెల్‌ఫోన్, చెప్పులు కనిపించాయి. వాగులోకి పరిశీలించి చూడగా లక్ష్మయ్య మృతదేహం కనిపించింది. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య చీలపల్లి పోచమ్మ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ యువకుడు పుల్కల్(అందోల్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పుల్కల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీస్‌ల కథనం మేరకు.. పుల్కల్ గ్రామానికి చెందిన బోయిని నవీన్ (25) సోమవారం రాత్రి కడుపునొప్పి భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్య వివాహాలను నివారిద్దాం
జహీరాబాద్: బాల్య వివాహాలను నివారించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలితకుమారి అన్నారు. మంగళవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బాల్యవివాహాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, వీఓ లీడర్లపై ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండని బాలిక, 21 సంవత్సరాలు నిండని యువకుడికి వివాహం చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. అత్యవసరమైన సమయంలో మహిళలు హెల్ప్‌లైన్ నం.181, చైల్డ్ హెల్ప్‌లైన్ నెం.1098, పోలీసు హెల్ప్‌లైన్ నెం.100కు కాల్ చేసి వారి సహాయం తీసుకోవచ్చని సూచించారు. బాల్య వివాహాలు, అక్రమ రవాణా, దత్తత మిషన్ వాత్సల్య పథకాల గురించి వివరించారు. -
పెరిగిన బియ్యం కోటా
సిద్దిపేటరూరల్: కొత్త రేషన్‌కార్డుల మంజూరు జిల్లాలో పంపిణీ చేసే బియ్యం కోటా ఈనెల నుంచి పెరిగింది. పదేళ్ల కాలంలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారుల కల నెరవేరింది. జిల్లాలో మొదటి విడతగా 888 కుటుంబాల వారు అర్హత సాధించినట్లు వివరాలను వెల్లడించారు. వారందరికీ ఫిబ్రవరి నుంచే రేషన్ బియ్యం అందజేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రేషన్ పంపిణీ చేసే బియ్యం అదనంగా 12 మెట్రిక్ టన్నులకు పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు గ్రామసభలు, ప్రజాపాలన కేంద్రాల్లో స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో నూతన రేషన్‌కార్డులు, చేర్పులు, తొలగింపు వంటి వాటికి సంబంధించి 74 వేల 272 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం సర్వే పూర్తి చేయడంతో పాటుగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. మరి కొంతమంది మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.కొత్త కార్డు వచ్చింది ప్రభుత్వ చేపట్టిన ఇంటింటి సర్వే సమయంలో నూతన రేషన్‌కార్డు కోసం దరఖాస్తు అందించాను. గత నెలలో నా పేరు మీద నూతన రేషన్‌కార్డు వచ్చింది. చాలా రోజులుగా రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికై నా రావడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పోందెందుకు అవకాశం ఉంది. – పుల్లగూర్ల తేజ, రాఘవాపూర్ అర్హులందరికీ అందిస్తాం జిల్లాలో ఇటీవల 888 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు 1,900 మంది పేర్లను రేషన్ కార్డుల్లో కొత్తగా చేర్చాం. వీరికి బియ్యం అందించడం జరుగుతుంది. కొత్త కార్డులు రావడం, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు జరగడంతో జిల్లాలో ఈ నెల రేషన్ బియ్యం కోటా 12 మెట్రిక్ టన్నులకు పెరిగింది. తమ వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుంది. – తనూజ, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి888 నూతన కార్డులుజిల్లాలో కొత్తగా 888 కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఈ మేరకు చాలా మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే కార్డు ఉండి అందులో పిల్లల పేర్లు లేకుండా చాలా మంది ఉన్నారు. ఇందులో కొత్తగా 1,900 మందిని వారి పాత కార్డుల్లో చేర్చారు. వీరందరికీ ఈనెల నుంచి బియ్యాన్ని అందించాల్సి ఉండగా అదనంగా 12 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ఉన్న దరఖాస్తుల్లోనూ అర్హులను గుర్తిస్తే ఈ కోటా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.లబ్ధిదారుల్లో సంతోషంఎన్నో ఏళ్లుగా నిలిచిన రేషన్ కార్డుల ప్రక్రియ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ముందుకు కదలడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో జిల్లాలో కార్డులేని వారు దశాబ్ద కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాక, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రుణాలు పొందలేక ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు కొత్తగా 888 మందికి కొత్త కార్డులు రావడంతో తమకు కూడా ప్రభుత్వ పథకాలు వస్తాయనే నమ్మకం అర్హులైన దరఖాస్తుదారుల్లో ఏర్పడింది. 888 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పాత కార్డుల్లో చేర్పులతో పెరిగిన లబ్ధిదారులు ప్రతీనెల 12 మెట్రిక్ టన్నుల బియ్యం అదనం నేటికీ కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారుల్లో సంతోషంజిల్లాలో రేషన్ వివరాలు : రేషన్ దుకాణాలు 684రేషన్ కార్డులు 2,92,131 అంత్యోదయ కార్డులు 18341 మొత్తం లబ్ధిదారులు 8,95,467 అన్నపూర్ణ కార్డులు 82నెలవారీగా పంపిణీ చేయాల్సిన బియ్యం 5,720 మెట్రిక్ టన్నులు -
తూప్రాన్‌లో కార్డెన్ సెర్చ్
సరైన పత్రాలు లేని 92 బైకులు, 5 ఆటోలు సీజ్ తూప్రాన్: అనుమానిత వ్యక్తులు కనిపించినా, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమ దృష్టికి తేవాలని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తూప్రాన్ మున్సిపాల్టీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో 7 బృందాలతో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 92 బైకులు, 5 ఆటోలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలకు సంబంధించిన పత్రాలను చూపి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. రేషన్ బియ్యం పట్టివేతరామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు శివారులో రేషన్ బియ్యం పట్టుకున్నట్లు కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మో కిల నుంచి రింగ్‌రోడ్డు మీదుగా కర్నూలు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రింగ్‌రోడ్డుపై రేషన్ బియ్యం తరలిస్తున్న లారీను పట్టుకొని 34 టన్నులు స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దాబాలో తనిఖీలు సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): మండలంలోని నందికంది శివారులోని రాజస్థానీ దాబాలో మంగళవారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన లక్ష్మణ్ రామ్ సదాశివపేట పట్టణంలో నివాసం ఉంటూ సొంత గ్రామం నుంచి పాపి స్ట్రా పౌడర్ కొని దాబా చుట్టుపక్కల వినియోగదారులకు అధిక ధరలకు అమ్ముతున్నాడు. నమ్మదిన సమాచారం మేరకు తనిఖీ చేసి 518 గ్రాముల పౌడర్, ఫోన్‌ను స్వాధీనం చేసుకొని యజమాని లక్ష్మణ్ అదుపులోకి తీసుకున్నామని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, సీఐ వీణా రెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్, సిబ్బంది అలీం, సతీష్ మోహన్, గోపాల్, ప్రహ్లద్, తదితరులు పాల్గొన్నారు. యూనివర్శిటీకి భాగ్యరెడ్డి వర్మ పేరు పెట్టాలి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మల్లేశం జోగిపేట(అందోల్): జోగిని వ్యవస్థను పూర్తిగా రూపుమాపడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ఎ.మల్లేశం అన్నారు. మంగళవారం జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ 86వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ జీవితకాలమంతా అంటరానితనం, అసమానతలు, బాలికలకు విద్యా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మేతరి కరుణాకర్, మండల అధ్యక్షుడు బహుజన ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజు, మున్సిపల్ అధ్యక్షుడు గోపాల్, లక్ష్మణ్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
సంగారెడ్డి జోన్: గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెంచి వందశాతం పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్ను చెల్లింపు అవసరాన్ని తెలియజేయాలన్నారు. గ్రామాల్లో ఇంటి యజమానులు, ఇంటి పన్ను చెల్లించేందుకు ముందుకు రావాలని కోరారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తిగా పారదర్శకంగా జరగాలని అర్హులైన వారికి మాత్రమే రేషన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం అధికార యంత్రాగణానికి అందుబాటులో ఉండాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, పాఠశాలలను, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీపీఓ సాయిబాబా, ట్రైనీ కలెక్టర్ మనోజ్, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి -
బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం
కల్హేర్(నారాయణఖేడ్): కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిర్గాపూర్ మండలం అంతర్గామ్కు చెందిన మహిళ మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అంతర్గామ్కు చెందిన సంగయ్య, శకుంతల(55) దంపతులు బైక్‌పై మంగళవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్దకోడప్గల్ గ్రామంలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. చిన్నకోడప్‌గల్ వద్ద సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవేపై వెనుక నుంచి బొలేరో వాహనం వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్‌లో స్థానికులు పిట్లం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో శకుంతల మృతి చెందింది. సంగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కామారెడ్డి జిల్లాలో సిర్గాపూర్ మండలానికి చెందిన మహిళ మృతి -
పోషకాల లోపం.. ఎదుగుదలపై ప్రభావం
ఆరబెడుతూ నీటి తడులు అందించాలివ్యవసాయ అధికారులుదుబ్బాకటౌన్: సాగు భూమిలో పోషకాల లోపంతోనే వరి నాటు వేసిన తర్వాత ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేశ్ తెలిపారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని రాంసాగార్ గ్రామంలో వరి పొలాలను, రైతుల పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేసే వరి పంటలో చౌడు భూమిలో వరి ఎర్రబారి వేసిన కర్ర వేసినట్లు ఉండి పొలం అంతా బుడబుడగా ఉండి వరి వేర్లు నల్లగా మారి భూమి లోపలి పోషకాలు తీసుకోకపోవడంతో జింక్, ఇతర పోషకాల లోపాలు కనిపిస్తున్నాయన్నారు. నివారణకు 19.19.19 ఒక కేజీ ఎకరానికి + జింక్ సల్ఫేట్ 400–500 గ్రాములు ఎకరానికి రెండు సార్లు పిచికారీ చేసి, పొలం బాగా నెర్రలు వచ్చే లాగా ఆరబెట్టాలన్నారు. ప్రస్తుతం యాసంగి కాలంలో జింక్ లోపాలు ఎక్కువ కనిపించే అవకాశం ఉందని, జింక్ నివారణ కోసం జింక్ సల్ఫేట్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, స్వర్ణలత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.వరి పంటను పరిశీలించిన వ్యవసాయాధికారులు దుబ్బాక: ఎవరికీ రాకూడ ని కష్టం.. ఎర్రబడి చచ్చిపోతున్న వరి చేలు పేరిట సాక్షిలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. మంగళవారం వ్యవసాయాధికారులు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి వరి పంటలను పరిశీలించారు. దుబ్బాక మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఏఈఓ మనోజ్ఞ పట్టణంలోని కేసుగారి స్వామి, గుండెల్లి శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు రైతుల పంటలను పరిశీలించారు. నాట్లేసి 45 రోజులు గడుస్తున్నా వరిపంటలు ఎదుగుదల లేకుండా కుళ్లిపోయి, ఎర్రబడి చచ్చిపోతుండడాన్ని గమనించారు. మొగిపురుగు, వాతావరణ పరిస్థితులు, భూములు తడి ఆరకుండా ఉండడంతోపాటు జింక్ తదితర సమస్యలతో పంటలకు నష్టం జరుగుతుందని గమనించారు. మొగి పురుగు ఎక్కువగా ఆశించిన పంటలకు కార్టాప్ 4 జీ గుళికలు లేదా క్లోరంత్రానిలిప్రోలే లేదా బరోజ్ వంటి మందులు వేసుకోవాలన్నారు. వరి పంటలను ఆరబెడుతూ నీటి తడులు అందించాలి. పలు సస్యరక్షణ చర్యలను రైతులకు సూచించారు. -
ఇక సివిల్ పనులు
బోరంచ పంప్‌హౌస్ నిర్మాణంలో ముందడుగు ● హరీశ్ పాదయాత్ర నేపథ్యంలో కీలక నిర్ణయం ● ప్రతిపాదిత స్థలం వద్ద ఐదెకరాలు లీజుకు తీసుకున్న కాంట్రాక్టు కంపెనీ ● సిమెంట్ పనుల ప్రారంభానికి సమాయత్తం బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రగతిలో కీలక ముందడుగు పడుతోంది. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి సివిల్ పనులను ప్రారంభించేందుకు కాంట్రాక్టు కంపెనీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు పంప్‌హౌస్ సమీపంలోని ఐదు ఎకరాల ప్రైవేటు భూమిని లీజుకు తీసుకుంది. సివిల్ పనులకు సంబంధించిన మెటీరియల్‌ను డంప్ చేయనుందని నీటి పారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అందోల్, నారాయణఖేడ్‌తో పాటు, మెదక్జిల్లాలోని కొన్ని మండలాల పరిధిలో 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడమే లక్ష్యంగా ఈ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల్లో భాగంగా మనూరు మండలం బోరంచ వద్ద మొదటి పంప్‌హౌస్‌ను నిర్మించి.. సింగూరు జలాశయం నుంచి బ్యాక్ వాటర్‌ను 8 టీఎంసీల ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇందుకోసం ఈ బోరంచ వద్ద ఈ పంప్‌హౌస్ నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పంప్‌హౌస్ కోసం ఎర్త్ వర్క్ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఈ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసంలో జిల్లా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశమై ఈ సాగునీటి పథకాల సాధన కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఎత్తిపోతల పథకాల ఆయకట్టు ఉన్న నియోజకవర్గాల్లో పాదయాత్ర కూడా చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ ఈ పంప్‌హౌస్‌కు సంబంధించిన సివిల్ పనులను ప్రారంభిస్తోంది. త్వరలోనే కాంట్రాక్టు కంపెనీ ఈ పనులకు సంబంధించిన మెటీరియల్‌ను మోహరించనుందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు పంప్‌హౌస్‌లు ఈ ఎత్తిపోతల పథకం కోసం రెండు పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. మనూరు మండలం బోరంచ వద్ద మొదటి పంప్‌హౌస్ కాగా, రెండో పంప్‌హౌస్ రాంతీర్థ్ (కంగ్టి మండలం) వద్ద నిర్మించనున్నారు. బోరంచ వద్ద మొత్తం 12 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎనిమిది పంపుల ద్వారా సాగునీటిని రాణాపూర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావెటీ కెనాల్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని పారించేలా దీన్ని డిజైన్ చేశారు. రెండు పంపుల ద్వారా దూదుగొండ (మెదక్ జిల్లా రేగోడ్ సమీపంలో)కు నీటిని లిఫ్ట్ చేస్తారు. మరో రెండు పంపులు ద్వారా లింగంపల్లి (వట్పల్లి మండలం) వరకు ఎత్తిపోయనున్నారు. అక్కడి నుంచి గ్రావెటీ కెనాల్ ద్వారా నీటిని ఆయకట్టుకు తరలిస్తారు. సుమారు రూ.15 కోట్ల మేరకు పనులు బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణ అంచనా వ్యయం రూ.1,774 కోట్లు కాగా, ఇందులో కాంట్రాక్టర్ చేసే పనుల విలువ రూ.1,478 కోట్లు. ఇప్పటి వరకు రూ.15 కోట్ల మేర పనులకు నీటిపారుదలశాఖ ఎంబీ రికార్డు చేయగా, మరో ఐదు కోట్ల మేరకు పనులు జరిగాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. సివిల్ పనులు ప్రారంభిస్తాంబోరంచ పంప్‌హౌస్‌కు సంబంధించి సివిల్ పనులను అతికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తాం. ఈ సివిల్ పనుల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కాంట్రాక్టు కంపెనీ చేపట్టింది. పంప్‌హౌస్ వద్ద క్యాంపు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు కంపెనీ చర్యలు చేపట్టింది. –జలందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
సంగమేశ్వర, బసవేశ్వరకు అధిక నిధులు కేటాయించాలి
నారాయణఖేడ్: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. కుడి, ఎడమ కాల్వలను ఏర్పాటుచేసి అధిక శాతం రైతుల భూములకు సాగునీరు అందించాలని కోరారు. సోమవారం నియోజకవర్గంలోని మంజీరా తీరం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి సాగునీటిని అందిస్తే పంటలు బాగా పండి వ్యవసాయ అభివృద్ధికి అవకాశం ఉందని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాణిక్, నాయకులు సాయిలు, రమేష్, అశోక్, నర్సింహులు, ప్రవీణ్, అరుణ్, దత్తు, బాబురావు, ఎల్లయ్య పాల్గొన్నారు.కాంగ్రెస్ ఓబీసీ విభాగ సమావేశంలో ఎమ్మెల్యే నారాయణఖేడ్: హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షులు కెప్టెన్ అజయ్‌సింగ్ యాదవ్‌ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. అసైన్డ్ భూముల పరిశీలన జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామ పరిధిలో గల అసైన్డ్ భూములను ట్రైనీ కలెక్టర్ మనోజ్ సోమవారం పరిశీలించారు. గతంలో పర్వతాపూర్ పరిధిలో గల ప్రభుత్వ భూములను నిరుపేదల జీవనోపాధి కోసం ఇచ్చారు. విలువైన అసైన్డ్ భూముల గురించి ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ హసీనా బేగం ద్వారా తెలుసుకుని, రైతులతో ఆయన మాట్లాడారు. గ్రామ పరిధిలో ప్రభుత్వ, పట్టా భూముల విస్తీర్ణం గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. అటవీ భూముల స్థితిగతుల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ హసీనా బేగం, ఆర్ఐ సాయికిరణ్‌లు ఉన్నారు. హరీశ్ ప్రకటనతో కదిలిన అధికారులు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జోగిపేట(అందోల్): బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పాదయాత్ర ప్రకటనతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఈ మేరకు సంగమేశ్వర, బసవేశ్వర పథకాలు పనులు ప్రారంభిస్తామని ఇరిగేషన్ అధికారులు హరీశ్‌రావుకు ఫోన్లు చేసి చెబుతున్నారని చెప్పారు. జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చింది కేసీఆరేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాలయ్య, రామాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పి.నారాయణ, అందోలు, పుల్కల్ మండల పార్టీల అధ్యక్షులు లక్ష్మికాంతరెడ్డి, విజయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు సార శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
విందుకు వెళ్లి వస్తుండగా..
● బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి ● కోహీర్ మండలం సేడెగుట్ట తండా వద్ద ఘటన జహీరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన కోహీర్ మండలం సిద్దాపూర్ తండా సమీపంలో తాండూరు రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కోహీర్ పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం అర్జున్‌నాయక్ తండాకు చెందిన రాథోడ్ శంకర్(25), జాటోతు పవన్(26) రాత్రి సేడెగుట్ట తండాలో జరిగిన జాతర విందులో పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని సిద్ధాపూర్ తండాకు చెందిన బంధువుల ఇంటికి వెళుతున్న క్రమంలో తాండూరు నుంచి జహీరాబాద్ వెళుతున్న నైట్‌హాల్ట్ ఆర్టీసీ బస్సు గొటిగార్‌పల్లి ఫారెస్టు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాథోడ్ శంకర్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన పవన్‌ను వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. మృతులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు యువకుల మరణంతో అర్జున్‌నాయక్ తండాలో విషాదం అలుముకుంది. కోహీర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
బీమా డబ్బుల కోసం బావ హత్య
● బామ్మర్ది సహా మరొకరు అరెస్టు ● అమీన్పూర్లో ఘటన పటాన్చెరు టౌన్: బీమా డబ్బుల కోసం సొంత బావను హత్య చేశాడు. సీఐ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి సొమ్ల తండాకు చెందిన భానోత్ గోపాల్ బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి అమీన్‌పూర్‌కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 14న రాత్రి గోపాల్ చెత్త పారివేసి వస్తానని ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా 15న సాయంత్రం అమీన్పూర్ శ్మశానవాటిక వెనుక మృతదేహమై కనిపించాడు. మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా.. గోపాల్ బామ్మర్ది నరేశ్ నాయక్, నరేశ్ మేనమామ దేవిసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని అంగీకరించారని సీఐ తెలిపారు. ఏడాది కిందట గోపాల్ నాయక్ పేరు మీద నరేశ్, దేవిసింగ్ బ్యాంకు రుణంతో జేసీబీ తీసుకున్నారు. గోపాల్ నాయక్‌పై రిస్క్ ఇన్సూరెన్స్‌తోపాటు రూ.29 లక్షలు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ చేయించారు. జేసీబీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో అప్పులు చేసిన నరేశ్.. బావ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించాడు. 14న పథకం ప్రకారం మద్యం సేవిద్దామని గోపాల్ నాయక్‌ను అమీన్పూర్ శ్మశానవాటిక వద్దకు నరేశ్ పిలిచాడు. అక్కడే నరేశ్ మేనమామ దేవిసింగ్ సాయంతో బావను చున్నీతో ఉరి వేసి హత్య చేశాడు. అనారోగ్యంతో సాధారణంగా మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసేందుకు చూశారు. ఫోన్ చేసి పిలవడంతో ఇద్దరిని అనుమానించిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టి టేక్మాల్ మండలం షాబాద్ తండాకి చెందిన నరేశ్ నాయక్, వెంకట్రావు తండాకి చెందిన దేవి సింగ్ సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
20న ఉచిత మెగా వైద్య శిబిరం
జహీరాబాద్: ఈనెల 20వ తేదీన జహీరాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సామాజిక సేవకులు ఇమ్రాన్ మొహియొద్దీన్, వైద్యులు ఎండీ నవాజ్‌అలీ, క్యాన్సర్ సర్జన్ రాజేందర్ బైశెట్టి తెలిపారు. నీలం ఆస్పత్రి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెప్పారు. ప్రముఖ వైద్యులతో మెగా ఉచిత వైద్య శిబిరంలో క్యాన్సర్, గుండె, గైనిక్, పీడియాట్రిక్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఓరల్ స్క్రీనింగ్, బ్రెస్ట్ స్క్రీనింగ్, థైరాయిడ్ స్క్రీనింగ్ తదితర ఖరీదైన పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
ఇష్టంతో కష్టపడి చదవండి
ప్రజావాణిలో రెవెన్యూ సమస్యలే అధికం రామచంద్రాపురం(పటాన్చెరు): విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం సాయంత్రం బీహెచ్ఈఎల్ (భెల్) టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఉన్న రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్, అందులోని కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, వంటగదిని పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని, అదే విధంగా తరగతి గదులల్లో విద్యార్థులు కూర్చునేందుకు టేబుల్, బల్లలు సరిపడా లేవని ఉపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన ఆమె.. భెల్ యాజమాన్యంకు సీఎస్ఆర్ నిధుల కింద సమస్యలను పరిష్కారించాలని కోరుతూ లేఖ రాయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. అనంతరం పరీక్షలకు సిద్ధమవుతున్న పదవతరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సమయం దగ్గర పడుతుందని దానిని దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదివి ప్రతి విద్యార్థి 10కి10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ఏ ఉద్యోగం చేయాలో ఇప్పుడే నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. జీవితంలో పదోతరగతి టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు. పదవతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓ పీపీ రాథోడ్, తహసీల్దార్ సంగ్రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాములు, ఆర్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా వస్తున్నాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వారితో కలెక్టర్ వల్లూరు క్రాంతి అర్జీలు స్వీకరించారు. మొత్తం 43 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని పరిశీలించి, తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన సమస్యలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, పరిష్కారం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కాగా కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజా రాణి, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోండి విద్యార్థులకు కలెక్టర్ క్రాంతి ఉద్బోధ భెల్ జిల్లా పరిషత్ పాఠశాల సందర్శన మేడం.. మాకు సార్లు కావాలి‘‘మేడం.. హిందీ, పీఈటీ సార్లు లేరు. మాకు ఉపాధ్యాయులు కావాలి..’’అని రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ (ఆర్బీఎస్) విద్యార్ధులు కలెక్టర్ క్రాంతిని వేడుకున్నారు. సోమవారం సాయంత్రం భెల్ టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో క్రీడా ప్రాంగణంలో ఆడుకుంటున్న రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులను పిలిచి మాట్లాడారు. ఎలా చదువుకుంటున్నారు.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. తమకు హిందీ, పీఈటీ సార్లు లేరని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జెడ్పీ పాఠశాలలో ఉన్న పీఈటీ ఉపాధ్యాయుడు ఈ విద్యార్థులను కూడా ఆడిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కారించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను కలెక్టర్ ఆదేశించారు. దాంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్ -
ప్రతి పనికి పైసా.. ఏ కైసా?
● ట్రాన్స్‌కోలో లంచం షరా మామూలే.. ● ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులుపటాన్చెరు: విద్యుత్‌శాఖలో ప్రతీ పనికి లంచం షరా మామూలుగా మారింది. ఎంతో కొంత ముట్ట చెప్పంది ఏ పనీ ముందుకు సాగడం లేదు. ఇవ్వకపోతే వినియోగదారులను ముప్పు తిప్పలు పెడుతూ.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. దళారులను విద్యుత్ సంస్థల ఇంజనీరింగ్ అధికారులు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపార్టుమెంట్లు, కొత్త వెంచర్లకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరుకు రూ.లక్షల్లో లంచం డిమాండ్ చేస్తున్నారని సమాచారం. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన గ్రామాల్లో ఆక్యుపెన్సీ, ఎన్ఓసీల పేరిట విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అడిగినంత చెల్లిస్తే పంచాయతీ అనుమతితో కూడిన భవనాలకు అప్పటికప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా స్పందించని అధికారులు, దళారులు ద్వారా వెళితే మాత్రం పనులు పూర్తిచేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో లైన్మెన్ దర్శనం కూడా సామాన్యులకు కష్టంగా మారింది. విద్యుత్ సంస్థల్లో అయా పోస్టింగ్‌ల కోసం పెద్దఎత్తున పైరవీలు చేసి ఇక్కడకు బదిలీపై వస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వారికి పోస్టింగ్‌లు ఇచ్చిన రాష్ట్రస్థాయి అధికారులు వాటాలు తీసుకుంటున్నారని బహిరంగ చర్చ జరుగుతుంది. అధికారులపై ఫిర్యాదులు అందినప్పుడు విచారణ చేయాల్సిన విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవీ రేట్లు.. కొత్త మీటరు కోసం రూ. ఆరు నుంచి రూ. పది వేలు, ప్యానల్ బోర్ల కోసం రూ.45 వేలు, అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.1.5 నుంచి రూ. 2లక్షలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వెంచర్లలో విద్యుత్ కనెక్షన్లు, వైర్లు వేసేందుకు అనుమతి, ఇతర పనుల కోసం రూ. కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. పటాన్చెరులో ఓ భారీ వెంచర్లో విద్యుత్ కనెక్షన్ కోసం కేవలం లంచం సొమ్మునే రూ. ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నా దృష్టికి రాలేదు నా దృష్టికై తే ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎవరైనా ఇబ్బంది పడితే తనకు ఫిర్యాదు చేయవచ్చు. ఎలాంటి అవినీతికి తావు లేని వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారానే కస్టమర్లు తమకు కావాల్సిన సేవలను పొందవచ్చు. ఆఫీసుకు రానవసరం లేదు. దళారులను ఆశ్రయించాల్సిన పనే లేదు. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. వినియోగదారులకుకు ఎలాంటి ఇబ్బంది లేని సేవలు అందించేందుకు కృషి చేస్తా. – సంజీవ్, ఏడీఈ, టీజీఎస్పీడీసీఎల్ -
541 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: అక్రమంగా పక్క రాష్ట్రాలకు రెండు లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని రాష్ట్ర సరిహద్దులో గల రవాణా చెక్ పోస్టు వద్ద సోమవారం సివిల్ సప్లయ్ శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకకు లారీలో 266 క్వింటాళ్లు, హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు లారీలో 275 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నాం. ఈ సందర్భంగా ఆయా లారీల యజమానులు మన్సూర్, జాకీర్, లారీ డ్రైవర్లు ఎం.డీ పాష, భీమయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని మెదక్–నర్సాపూర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నారం గ్రామానికి చెందిన బసవన్నగారి రాజేందర్ (25) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. రెండురోజుల కిందట గ్రామానికి వచ్చిన రాజేందర్ ఆదివారం ఉదయం మెదక్ పట్టణంలో పని నిమిత్తం వెళ్లి తిరిగొస్తున్నాడు. మండల కేంద్రానికి సమీపంలోని లోతు వాగు మలుపు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు రాజేందర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ యువకుడు తూప్రాన్: పురుగు మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం మల్కాపూర్‌కు చెందిన మామిండ్ల కనకరాజు(30) తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కనకరాజుకు అప్పులు కావడంతో తీర్చలేక మనస్తాపం చెంది 9న ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అయిపోయాక 15న ఇంటికి తీసుకొచ్చారు. 16న సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన జేసీబీ
ఐదుగురికి స్వల్ప గాయాలు సిద్దిపేటఅర్బన్: ఆర్టీసీ బస్సును జేసీబీ ఢీకొట్టిన ఘటన సిద్దిపేటలోని రంగధాంపల్లి వద్ద సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సిద్దిపేట నుంచి హన్మకొండకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న జేసీబీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఐదుగురు ప్రయాణిలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జేసీబీ డ్రైవర్ రవిశంకర్ కుమార్ అజాగ్రత్తగా నడిపి బస్సును ఢీకొట్టాడని డ్రైవర్ ప్రభాకర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దాడి కేసులో ఇద్దరు రిమాండ్
తీవ్ర గాయాలై ఆస్పత్రిలో మృతి చెందిన మహిళమునిపల్లి(అందోల్): మహిళపై దాడి చేసి ఆమె మృతికి కారుకులైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన దూదేకుల మోమ్మద్ ఇస్మాయిల్ అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి, విజయరెడ్డికి చెందిన ఇంటి ఎదుట ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఇద్దరూ కలిసి ఇస్మాయిల్‌పై దాడి చేశారు. తండ్రి అరుపులకు అలియ బేగం వచ్చి ఆపుతుండగా ఆమె పై కూడా దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16న బేగం మృతి చెందింది. మహిళపై దాడి చేసి మృతికి కారణమైన వీరారెడ్డి, విజయరెడ్డిని సోమవారం మండలంలోని బుదేరాలో కొండాపూర్ సీఐ వెంకటేశం, ఎస్ఐ రాజేశ్ నాయక్ పట్టుకొని రిమాండ్ తరలించినట్లు తెలిపారు. -
తాగడానికి డబ్బులు ఇవ్వలేదని..
తూప్రాన్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కోపోద్రికుడైన భర్త భార్యను కొట్టి చంపాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రంగాకృష్ణ కథనం మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు ఆదివాసి అశోక్, భార్య శివకాలి బతుకుదెరువు కోసం మూడు నెలల కిందట మెదక్ జిల్లా తూప్రాన్‌కు వచ్చి పోతరాజుపల్లిలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన అశోక్ నిత్యం డబ్బుల కోసం భార్యని వేధించేవాడు. ఆదివారం రాత్రి డబ్బుల కోసం భార్యతో గొడవకు దిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపోద్రికుడై కట్టెతో విచక్షణారహితంగా భార్యను కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. ఉదయం చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శివానందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి అశోక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని తెలిపారు. భార్యను కొట్టి చంపిన భర్త తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
సిద్దిపేటరూరల్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల యాజమాన్యం సోమవారం తెలిపారు. పాఠశాలలో 9వ తరగతికి చెందిన శ్రీలాస్య, వైష్ణవి జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. నిందితుడిని పట్టించిన కాల్‌డేటా ● ప్రాణం తీసిన వివాహేతర సంబంధం ● పెట్రోల్ పోసి నిప్పంటించి మహిళ హత్య మెదక్ మున్సిపాలిటీ: అదృశ్యమైన వివాహిత దారుణహత్యకు గురికాగా.. కాల్‌డేటా హంతకుడిని పట్టించింది. వివాహేతర సంబంధంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ పట్టణ సీఐ నాగరాజు కథనం మేరకు.. మెదక్ పట్టణంలోని ఫతేనగర్‌లో నివసించే మంగలి రేణుక(45) స్థానికంగా ఓ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. 6న సదరు మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్ 8న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహిళ సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్ గ్రామానికి చెందిన బత్తుల యేసు ఆఖరి కాల్ ఉంది. దాని ఆధారంగా అతడిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. రేణుకతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న బత్తులయేసు 6న ఎస్.కొండాపూర్ అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమైపె పెట్రోల్‌పోసి నిప్పంటించి హతమార్చాడు. నేరం ఒప్పుకోవడంతో ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 15 మేకలు సజీవ దహనం ● మరో పదింటికి గాయాలు ● నాదులాపూర్‌లో పాకకు నిప్పు వట్పల్లి(అందోల్): మేకల పాకకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 15 మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన అందోలు మండల పరిధిలోని నాదులాపూర్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కలాలి రమేశ్ తనకున్న 25 మేకలను ఎప్పటిలాగే ఆదివారం ఇంటి వెనుకాల ఉన్న పాకలో కట్టేశాడు. అర్థరాత్రి పూట మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల వారు గమనించి రమేశ్‌కు తెలిపారు. ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలార్పే ప్రయత్నం చేసినా 15 మేకలు చనిపోగా, మరో 10 మేకలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేకల పోషణే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. వెటర్నరీ అధికారులు మృతి చెందిన మూగజీవాలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని తెలియజేశారు. బాధితులు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
శుభకార్యానికి వచ్చి.. కారు ప్రమాదంలో బాలుడు మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి సరదాగా వాగు పరిసరాలను, వ్యవసాయ పొలాలను తిలకిద్దామని వెళ్లిన బాలుడు కారు బోల్తా పడటంతో మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నలుగురిలోని 17 ఏళ్ల మైనర్ బాలుడు అతివేగంగా కారు నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో సోమవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన లేగల నరేందర్, సుజాత దంపతులు వారి పిల్లలు జయ రక్షిత్ (14), జశ్వంత్‌తో కలిసి అల్వాలలోని తమ బంధువులైన బొమ్మ జ్యోతి గృహ ప్రవేశం కార్యక్రమానికి వచ్చారు. అలాగే కరీంనగర్ పట్టణానికి చెందిన ఏదుల రవిశంకర్, స్వప్న దంపతులు వారి పిల్లలు యశ్వంత్, అమ్ములుతో హాజరయ్యారు. సోమవారం సరదాగా అల్వాల శివారులోని కోదండరాముడి ఆలయం, కూడవెల్లి వాగు పరిసరాలు, వ్యవసాయ పొలాలను తిలకించడానికి జయ రక్షిత్, జశ్వంత్, యశ్వంత్, అమ్ములు కలిసి కారులో బయలు దేరారు. ఇందులోని 17 ఏళ్ల మైనర్ బాలుడు జశ్వంత్ కారు నడుపుతున్నాడు. ఎరుకలి వాడ సమీపంలోకి రాగానే మలుపు వద్ద కారు అతివేగంగా వస్తూ అదుపుతప్పి బోల్తా పడింది. రెండు పల్టీలు కొట్టడంతో కారులోని జయ రక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో 108 ద్వారా సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జశ్వంత్, యశ్వంత్‌ల పరిస్థితి విషమంగా మారడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుడు మల్లం రవి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు అతివేగంగా వచ్చి బోల్తాపడ్డ కారు వాహనాన్ని నడిపిన 17 ఏళ్ల బాలుడు మిరుదొడ్డి మండలం అల్వాలలో ఘటన -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
మెదక్ మున్సిపాలిటీ: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన మెదక్ పట్టణంలోని కుమ్మరిగల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, స్థానికుల కథనం మేరకు .. మెదక్ పట్టణం కుమ్మరి గడ్డకి చెందిన కుమ్మరి సంతోష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. సంతోష్ మెడికల్ ల్యాబ్ ఏర్పాటు కోసం సమకూర్చుకున్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, ఫ్యాషన్ ప్రో బైక్, ఫ్రిడ్జ్, టీవీ, తదితర సామగ్రి కాలి బూడిదయ్యాయి. సంతోష్, అతడి భార్యకు సంబంధించి విద్యార్హత సర్టిఫికెట్లు అన్నీ కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారు. అయితే అప్పటికే ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సంతోష్ విజ్ఞప్తి చేశాడు. బైక్, ఇంట్లోని సామగ్రి, సర్టిఫికెట్లు కాలి బూడిద రూ.20 లక్షల ఆస్తినష్టం -
సీసీఐలో వెయ్యి క్వింటాళ్ల దళారుల పత్తి
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్‌లోని నాలుగు కాటన్ మిల్లులో నాలుగు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయగా అధికారులు వెయ్యి క్వింటాళ్లు దళారుల పత్తిని గుర్తించారు. ఇక్కడ బోగస్ రైతుల పేరున దళారులు నాసిరకం పత్తి విక్రయిస్తున్నారని సాక్షిలో పక్షం రోజుల కింద ‘సీసీఐలో సిత్రాలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు మరుసటి రోజే కాటన్ మిల్లులను తనిఖీ చేయడంతో దళారుల దందా మూడు రోజులు ఆగి మరుసటి రోజు నుంచి కొనసాగింది. సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి రాధ, మార్కెటింగ్ అధికారి నాగరాజు, ఏడీఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారు ఇప్పటికే గుర్తించిన మీర్జాపూర్ గ్రామంలోని 12 మంది బోగస్ రైతులను కలిశారు. మాందాపూర్‌లో నలుగురు, హుస్నాబాద్ కస్టర్ పరిధిలో ఇద్దరు మొత్తం 18 మంది బోగస్ రైతులు ఉన్నట్లు తేల్చారు. 18 మంది పేరున వ్యాపారులు 1,000 క్వింటాళ్లు విక్రయించి దళారులు రూ.15 లక్షల లాభాలను పొందారు. ఈ దందాకు సహకరించిన అధికారులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, రాజకీయ నాయకులకు దళారులు రూ.5 లక్షల వరకు కమీషన్ల కింద పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పంట వేయని రైతుల పేరున ధ్రువీకరణలు హుస్నాబాద్ కాటన్ మిల్లు వ్యాపారులు మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, జనగామ జిల్లాల నుంచి నాసిరకం పత్తిని క్వింటాల్‌కు రూ.6 వేల చొప్పున కొనుగోలు హుస్నాబాద్ సీసీఐ కేంద్రాలకు తరలించారు. బోగస్ రైతుల పేరున ధ్రువీకరణ పత్రాలు తయారు చేసే వరకు పత్తి వాహనాలను మిల్లులో పక్కన పార్కింగ్ చేసి పెట్టారు. హుస్నాబాద్, మహ్మదాపూర్, మీర్జాపూర్ వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని ఏఈఓలకు తెలువకుండానే 18 మంది రైతులకు బోగస్ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. మా సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఏఈఓ లు ఏడీఏకు ఫిర్యాదు చేశారు. దీనిపై మార్కెట్ కార్యాలయంలో విచారణ జరిపిన అధికారులకు ఏఈఓల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ రైతుల పేరున ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు గుర్తించారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు దగ్గర ఉండాల్సిన రసీదు బుక్ నుంచే ధ్రువీకరణ పత్రాలు వెళ్లినట్లు డీఏఓ రాధిక వెల్లడించారు. మార్కెటింగ్ అధికారులతో కలిసి విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రూ.15 లక్షలు వ్యాపారులకు లాభం కమీషన్ల పేరుతో రూ.5 లక్షలు పంపకం 18 మంది బోగస్ రైతులను గుర్తించిన అధికారులు -
కష్టం
కుళ్లిపోయి.. చచ్చిపోతున్న వరిఎ‘వరి’కీ రాకూడని● నాట్లేసి 45 రోజులు గడుస్తున్నా ఎదుగుదల లేని పంట ● జిల్లాలో పెద్ద ఎత్తున సాగు ● ఏ మందులు వాడినా దక్కని ఫలితం ● దున్ని.. మళ్లీ నాట్లేస్తున్న రైతులు ● పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులుమొగిపురుగు, వాతావరణ పరిస్థితులే కారణమంటున్న శాస్త్రవేత్తలు, అధికారులునాట్లేసి 45 రోజులు గడుస్తున్నా ఎదుగుదల లేని పంటదుబ్బాక: యాసంగిలో వరి పంట వేసిన రైతులకు మొదట్లోనే కష్టాలు మొదలవుతున్నాయి. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని.. అప్పులు తె చ్చి.. పుట్టెడు పెట్టుబడులు పెట్టి వరి పంట సాగు చేస్తే చేతికొస్తుందన్న గ్యారంటీ లేక జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. వానా కాలంలో మొగి పురుగు రోగం, భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులు రాక రైతులకు పెట్టుబడులు మీద పడ్డాయి. ఈ యాసంగిలోనైనా పంట బాగా పండుతాయన్న గంపెడాశతో పెద్ద ఎత్తున వరి పంటలు సాగు చేశారు. తీరా వరినాట్లు వేసి నెలరోజులు గడుస్తున్నా పంట పచ్చబడటం లేదు. మరోసారి నాట్లు మొక్క ఎదగకుండా ఎర్రబడి కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేసినప్పటి నుంచి రకరకాల మందులు చేసినా.. వివిధ రకాల క్రిమి సంహారక మందులు చల్లినా పంట కోలుకోవడం లేదు. ఎదుగుదల లేకుండా కుళ్లిపోతూ మొక్కలు చచ్చిపోయి పొలాల్లో పెద్ద గ్యాబులు (ఖాళీ స్థలాలు) ఏర్పడుతున్నాయి. వ్యవసాయాధికారులు..డాట్ సెంటర్ సైంటిస్టులు సైతం జిల్లాలో ఎర్రబడి ఎదుగుదల లేని వరి పంటలను పరిశీలిస్తున్నారు. చాలా మంది రైతులు వేసిన వరినాట్లు కుళ్లిపోయి చనిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేసిన నాటును దున్నేసి మళ్లీ నాట్లు వేశారు. 3 లక్షలకు పై చిలుకు ఎకరాల్లో సాగు.. జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయాధికారుల అంచనా ఉండగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు పూర్తి అయ్యింది. ఇంకా వరి నాట్లు వేస్తూనే ఉన్నారు. ఇష్ట మొచ్చిన మందులు పంట ఎదుగుదల లేకుండా ఎర్రగా మారి కుళ్లిపోతుండటంతో రైతులు రకరకాల మందులను , గులకలను తెచ్చి ఇష్టం మొచ్చినట్లుగా చల్లుతున్నారు. ఫర్టిలైజర్ దుకణాల్లో వారు ఏ మందులు ఇస్తే అవి తెచ్చి స్ప్రే చేస్తున్నారు. పుట్టెడు అప్పులు తెచ్చి ఎన్ని మందులు చల్లినా ఫలితం లేకపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులే కారణం వరి పంటలు కుళ్లిపోతూ ఎదుగుదల లేకపోవడానికి మొగి పురుగు ఉధృతి, వాతావరణ పరిస్థితులే కారణమంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో పలు వరి పంటలను డాట్ సెంటర్ శారస్త్రవేత్తలతోపాటు వ్యవసాయాధికారులు పరిశీలించారు..ఈ సందర్భంగా వారు పలు సూచనలు రైతులకు ఇచ్చారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులు పొలాల్లో ఎక్కువ నీరు నిల్వ ఉంచకుండా అరబెడుతూ నీరు పెట్టాలి ఇష్టం వచ్చిన మందులు చల్లవద్దు ఎండ తీవ్రత పెరిగితే యధావిధిగా పంటలు కోలుకుంటాయి. మొగిపురుగు నివారణకు 4జీ గుళికలు వేసుకోవాలి. ఫర్టిలైజర్ల డీలర్లకు కూడా ఏ మందులు పడితే అవి ఇవ్వొద్దని తాము సూచించిన మందులే రైతులకు ఇవ్వాలని చెబుతున్నాం రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే మందులు వేసుకోవాలి. లేకుంటే పంటకు ఫలితం ఇవ్వక పోవడమే కాకుండా ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. -
ఇద్దరు అదృశ్యం
పరిశ్రమలో పని చేస్తున్న యువకుడు మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమలో పని చేస్తున్న యువకుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు చెందిన తానాజీ పాలిమార్ స్టీల్ పరిశ్రమలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. 9న బయటకు వెళ్లిన ఇంటికి రాలేదు. తానౌజీ అన్న గోపాల్‌కు ఇంటి యజమానులు సమాచారం అందించగా చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మతి స్థిమితం లేని వృద్ధురాలు సిద్దిపేటకమాన్: మతి స్థిమితం సరిగా లేని వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై సిద్దిపే ట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. సిద్దిపేట ఆదర్శనగర్‌కు చెందిన శీలం లక్ష్మీ (90) స్థానికంగా కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. లక్ష్మీ తరచూ కాలనీలో తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుకునేది. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. లక్ష్మీ మనవరాలు జ్యోతి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
తునికి ఆలయం వేలం పాట వాయిదా
కౌడిపల్లి(నర్సాపూర్): పాత బకాయిలు వసూలు చేసే వరకు వేలం పాటను ఆపాలని తునికి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వేలం పాట వాయిదా పడింది. ఈ ఘటన మండలంలోని తునికి నల్ల పోచమ్మదేవి ఆలయం వద్ద సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తునికి నల్లపోచమ్మ దేవి ఆలయం జాతర వచ్చే నెలలో జరుగనుంది. అధికారులు కొబ్బరికాయలు, దుకాణాలు, టెంట్ సామగ్రి అద్దెతోపాటు వాహనాల పార్కింగ్‌కు వేలంపాటను ఆలయ ఇన్చార్జి ఈఓ రంగారావు, పరిశీలకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. దీంతో మాజీ కో ఆప్షన్ సభ్యుడు రహీం, మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు చెల్ల మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఉపసర్పంచ్లు మాణిక్య రెడ్డి, శేఖర్, గ్రామస్తులు వేలం పాటను అడ్డుకున్నారు. గతేడాది వేలం పాట ద్వారా ఆలయానికి రూ.44 లక్షలు ఆదాయం రాగా, ఇందులో రూ.4.90 లక్షలు బకాయి ఉన్నట్లు తెలిపారు. అలాగే నాలుగేళ్లకు సంబంధించి రూ.30 లక్షల వరకు పలువురు బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి కేసులు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్పందించిన ఇన్చార్జి ఈఓ రంగారావు బకాయిదారులకు నోటీసులు ఇస్తామని, స్పందించకపోతే పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తామని వేలం పాటను వాయిదా వేశారు. 24న తిరిగి వేలం పాటను నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. పాత బకాయిలు వసూలు చేయాలని గ్రామస్తుల డిమాండ్ నోటీసులు ఇస్తామన్న ఈఓ -
పూర్తిస్థాయిలో రైతు భరోసా
ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ నారాయణఖేడ్: రైతు భరోసాను పూర్తిస్థాయిలో రైతులందరికీ అందించాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమచేశామని ప్రభుత్వం చెబుతున్నా 60 శాతం మందికి కూడా అందలేదన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...నాగల్గిద్ద మండలంలో 13 వేల ఎకరాలకుగాను 8 వేల ఎకరాలకు మాత్రమే నగదు జమ చేశారన్నారు. శేరిదామరిగిద్దలో గిరిజనులకు సంబంధించి 525 ఎకరాలున్నా ఒక ఎకరానికి కూడా డబ్బులు అందలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసేవాడినని, కానీ, ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నా రైతులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులను జమచేయాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నేడు రక్తదాన శిబిరం మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఖేడ్ బీఆర్ఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బీఆర్ఎస్, అనుబంధ సంఘాల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. -
డంపింగ్‌యార్డ్‌పై నిరసనల వెల్లువ
బైక్ ర్యాలీతో నిరసనజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు 12వ రోజుకు చేరుకున్నాయి. మండలంలోని గ్రామ గ్రామాల్లో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన ర్యాలీలు, రిలే నిరాహార దీక్షల కార్యక్రమాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై మద్దతు తెలిపారు. డంపింగ్‌యార్డ్ ఏర్పాటు చేయాలని చూస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా గుమ్మడిదల నుంచి అన్నారం వరకు ఆందోళనకారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు రైతులు మహిళలు యువకులు, పాల్గొన్నారు. మద్దతిచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
ఇంటర్ విద్యార్థులకు మరోసారి అవకాశం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇటీవలే ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరైన జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు విద్యాశాఖ మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి గోవిందరాం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు సంగారెడ్డిలోని బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. గైర్హాజరైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
జహీరాబాద్ టౌన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిపించాలని కోరుతూ మాజీ ఎంపీ. బీబీపాటిల్ ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పట్టభద్రులను కలిశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని, అందువల్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ జగన్నాథ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గొల్ల భాస్కర్, సుధీర్ బండారీ, మల్లికార్జున్ పాటిల్, శోభారాణి తదితరులు ఉన్నారు. మల్లన్న జాతరకు రండి చేగుంట(తూప్రాన్): మండలంలోని ఇబ్రహీంపూర్ మల్లన్న జాతరకు రావాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హైదరాబాద్‌లో ఆదివారం నాయకులు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 23న భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి సప్తమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. -
పోలీసులకు దొంగల అప్పగింత
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని పెద్ద గొట్టిముక్కుల శివారులోని భవ్యస్ ఫార్మా కంపెనీలో స్క్రాప్‌ను దొంగిలిస్తున్న వారిని కంపెనీ యజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు కంపెనీలోకి చొరబడి స్క్రాప్, ఐరన్ రాడ్లు, కేబుల్ వైర్లను దొంగిలించి గోడపై నుంచి బయటకు వేస్తుండగా కంపెనీ యజమాని సీసీ కెమెరాలో గమనించాడు. వెంటనే సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. అనంతరం కంపెనీ వద్దకు చేరుకొని సిబ్బందితో కలిసి దొంగలను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. రెండు బైకులను సైతం అప్పగించారు. కొద్ది రోజులుగా కంపెనీ నడవడం లేదు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన ముగ్గురు.. అందులో ఒకరు బీహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీరు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వద్ద స్టార్టర్లు కేబుల్ వైర్లు దొంగిలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యజమాని ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రూ.1.72 లక్షల ఆస్తి పన్ను వసూలు
జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. పారిశ్రామికవాడలోని జెనెక్స్ లేబొ రేటరీ పారిశ్రామికవేత్తలు రూ.1.72లక్షలను చెక్కు రూపంలో మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ...జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఆస్తి పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నోటీసులు అందించి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ నెల ఆరంభానికి ముందే ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్వో నర్సింలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు రఘురాం రెడ్డి, అలీ, సునీత, తదితరులు పాల్గొన్నారు. పొగాకు ఆరోగ్యానికి హానికరం: విష్ణువర్ధన్‌రెడ్డి నారాయణఖేడ్: పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి హానికరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్వైజర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఖేడ్‌లోని రాజీవ్‌చౌక్, బసవేశ్వర చౌక్, బస్టాండ్ ప్రాంతాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులైన బీడీ, చుట్ట, సిగరెట్, జరదా, తంబాకు, పాన్‌మసాలా లాంటివి వినియోగించకూడదని సూచించారు. వాటి వాడకం వల్ల హైపర్‌టెన్షన్, నోటి క్యాన్సర్, శ్వాసకోస, గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం సెక్షన్ 4 ప్రకారం నేరం అని అందుకు రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఐఎంఏ నూతన కార్యవర్గం ఎన్నిక సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. సంగారెడ్డిలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షుడిగా కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, ఉష, సంయుక్త కార్యదర్శిలుగా సురేశ్ కుమార్, జ్యోతి, హరినాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్య వర్గం సభ్యులు మాట్లాడుతూ... సంగారెడ్డి కొత్త కార్యవర్గం సభ్యత్వం పెంపుదల చేస్తామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు, నైతిక వైద్య ప్రవర్తన ప్రోత్సాహం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి సీనియర్ వైద్యులు శ్రీహరి, విజయనిర్మల, శ్రీధర్,వెంకట్, స్వామిదాస్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య జహీరాబాద్: ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. జహీరాబాద్‌లోని అతిథి బ్యాంకెట్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సీపీఎస్‌రద్దు–పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకుగాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీనిచ్చారు. సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, రాష్ట్ర కార్యదర్శి బస్వరాజ్, నర్సింహారెడ్డిలతోపాటు ఆయా మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనుల్లో వేగం
● నెల రోజుల్లో పూర్తి ● రూ.90కోట్లతో నిర్మాణం ● ముమ్మరంగా సాగుతున్న బీటీ పనులుజహీరాబాద్: పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఎట్టకేలకు వేగం పుంజుకుంది. బ్రిడ్జిపై బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కానుందని రోడ్డు భవనాల (ఆర్అండ్బీ) శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, అందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.40 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.23కోట్ల మేర నిధులు విడుదలైనట్లు అధికారులు వివరించారు. బ్రిడ్జి పైభాగంలో ప్లాస్టరింగ్తోపాటు వైరింగ్, విద్యుత్ స్తంభాల బిగింపు వంటి ఎలక్ట్రిక్ ఫిక్సేషన్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం అంచనాలతో ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బ్రిడ్జి నిర్మాణం కోసం 17వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఉపయోగించారు. మట్టికి సంబంధించి మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి వద్ద నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగా, డివైడర్ పనులు కొనసాగుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనులు పర్యవేక్షిస్తున్నట్లు ఏఈఈ సంధ్య తెలిపారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తి అవుతాయని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయన్నుట్లు తెలిపారు. ఆరేళ్లకు మోక్షం రైల్వే ఓవర్‌బ్రిడ్జి చేపట్టిన ఆరేళ్లకు నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. పట్టణ ప్రజలతోపాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు ఆగాల్సి వస్తోంది. కష్టాలను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రూ.90కోట్లు మంజూరు చేయగా అదే ఏడాది ఆగస్టు 30న ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. శాశ్వతంగా తీరనున్న కష్టాలు రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యి వినియోగంలోకి వస్తే వాహన చోదకుల కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. జహీరాబాద్–పర్లీ తదితర ప్రాంతాలకు అనునిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో తరచూ రైల్వేగేటు మూసి ఉంచడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. బ్రిడ్జి పనులు పూర్తిచేసి వినియోగంలోకి వస్తే ప్రజలు, ప్రయాణికుల కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. -
బ్యాంకుకు వెళ్తున్నట్లు చెప్పి..
మహిళ అదృశ్యం వర్గల్(గజ్వేల్): బ్యాంకులో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన మహిళ ఆచూకీ తెలియకుండాపోయింది. వర్గల్ మండలం అనంతగిరిపల్లి లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆదివారం మిస్సింగ్ కేసు నమోదైంది. గౌరారం ఏఎస్ఐ పోచాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. ఆమె కూలీ పని చేస్తున్నారు. శనివారం ఉదయం బ్యాంకులో డబ్బుల కోసం వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. ఆ తరువాత ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు సాయికుమా ర్ తల్లి నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. దీంతో ఆందోళనకు గురై తల్లి జాడ కోసం అంతటా వెతికినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆదివారం గౌరారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. వ్యక్తి అదృశ్యంశివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన ఆదివారం మండలంలోని తాళ్లపల్లిగడ్డ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధనావత్ రాంచందర్ ఈనెల 11న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, అతని భార్య విజయ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
గజ్వేల్‌రూరల్: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని గజ్వేల్–పిడిచెడ్ మార్గంలో ఆదివారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్గూరుకు చెందిన వెంకటేష్‌తో పాటు అతని బంధువులైన గొట్టిముక్కలకు చెందిన వెంకటేశ్ (40), నాని, సాయిగౌడ్‌లు గజ్వేల్ నుంచి కారులో కొల్గూరు వైపు వస్తున్నారు. బయ్యారం చౌరస్తా మీదుగా మేథినీపూర్ వచ్చేందుకు బయలుదేరగా గజ్వేల్–పిడిచెడ్ మార్గంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గొట్టిముక్కులకు చెందిన వెంకటేష్ తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు. ప్రమాద విషయం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రామాయంపేటలో మరొకరు.. రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కాస నవీన్ (28) శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా.. వెనుకనుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ బాల్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.