
లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన టేబుల్స్
జిల్లాలో ముందుగా నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాల ఫలి తాలు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వచ్చే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి 18 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ఉంటుంది. సంగారెడ్డి ఓట్లను 17 రౌండ్లలో లెక్కిస్తారు. ఓట్లు అధికంగా పోలైన పటాన్‌చెరు నియోజకవర్గం ఫలితం కాస్త ఆలస్యమవుతుంది. ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 23 రౌండ్లలో జరుగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపుఉంటుంది.
అంతటా ఉత్కంఠ..
జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పార్టీల నేతలు తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఫలితాలు కూడా నువ్వా నేనా అన్నట్లు ఉంటాయి. దీంతో చివరి రౌండ్ వరకు అభ్యర్థుల ఆధిక్యంపై ఉత్కంఠ కొనసాగే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
అరగంటలో రౌండ్..
ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్‌హాల్‌లోకి అనుమతి ఇస్తారు. ఇందుకోసం వారికి ముందస్తుగా పాసులు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
పోస్టల్ బ్యాలెట్స్ 8,400
జిల్లాలో మొత్తం 8,400 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నారాయణఖేడ్‌లో 1,65 2, అందోల్‌లో 1,445, జహీరాబాద్‌లో 1,501, సంగారెడ్డిలో 2,737, పటాన్‌చెరులో 1,065 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి.
ఏర్పాట్లు పూర్తి..
పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో నియోజకవర్గం కౌంటింగ్ హాల్‌లో 18 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్క సంగారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్ వద్ద ముగ్గురు ఓట్లు లెక్కిస్తారు. అసిస్టెంట్ కౌంటింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కౌంటింగ్ హాలులో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను అభ్యర్థుల ఏజెంట్లు వీక్షించేలా, వారి సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ అధికారులు సిబ్బంది ఉదయం ఐదు గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటారు.
నియోజకవర్గం పోలింగ్ కౌంటింగ్ మొత్తం కేంద్రాలు టేబుల్స్ రౌండ్లు
నారాయణఖేడ్ 296 18 17
అందోల్ 313 18 18
జహీరాబాద్ 314 18 18
సంగారెడ్డి 281 16 18
పటాన్‌చెరు 405 18 23

రుద్రారంలోని గీతం యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment