హుస్నాబాద్: విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బస్ డిపో వెనుక మారుతి కాలనీకి చెందిన సయ్యద్ సంశీర్‌కు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సయ్యద్ సాధీక్ అన్వర్ (6) ఇంటిపైన ఇనుప టేపుతో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు ఇంటి వెనుకాల పైనుంచి వెళ్తున్న కరెంట్ వైర్లకు టేపు తాకి విద్యుదాఘాతానికి గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంటి పక్కనే తుమ్మ చెట్లు కొడుతుండగా, ఒక్కసారిగా ఇంటి పైనుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే వెళ్లి చూడగా సాధీక్ శరీరం మొత్తం కాలిపోయి మృతి చెందాడు. క్షణాల్లో కుమారుడు విద్యుత్ షాక్‌కు బలికావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనను తెలుసుకున్న సీఐ కిరణ్, ఎస్సై మహేశ్, కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటిపైన ఆడుకుంటుండగా ఘటన
Comments
Please login to add a commentAdd a comment