
పన్ను వసూళ్లలో ఖేడ్ టాప్
నారాయణఖేడ్: ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ మున్సిపాలిటీగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ నిలిచింది. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ కమిషనర్ జగ్జీవన్‌కు మున్సిపల్ డైరెక్టర్ సీడీఎంఏ శ్రీదేవి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి నారాయణఖేడ్ మున్సిపాలిటీ ద్వారా 2023–2024, 2024–2025 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యానికి మించి పన్నులను వసూలు చేసినందుకు ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపిక చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.2.62 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, 2023 –2024 సంవత్సరంలో 85% వసూళ్లను చేపట్టగా, 2024 –2025 ఆర్థిక ఏడాదిలో 86.55% రూ.2.32 కోట్లు వసూలు చేశారు.