
భక్తులకు అనుగ్రహభాషణం చేస్తున్న మాధవానంద సరస్వతీ స్వామి
మిరుదొడ్డి(దుబ్బాక): భక్తి భావనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని మాధవానంద సరస్వతీ స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. మిరుదొడ్డి, లక్ష్మీనగర్, ఆరెపల్లి గ్రామాల శివారులో వెలసిన సదానందాశ్రమ 40వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాదుకా పూజలు, పుష్షార్చన, బిల్వపత్ర పూజ, సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ భక్తి భావన అలవర్చుకుంటేనే పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతాయన్నారు. అందరూ భక్తి భావనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. నిత్యం దైవారాధనలు చేసి పుణ్యఫలాలను దక్కించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైదిక నిర్వాహకులు విఠాల రాజపున్నయ్య శర్మ, చంద్ర శేఖర శర్మ, రమేష్ శర్మ, ఆశ్రమ శిష్యబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వార్షికోత్సంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment