దుబ్బాకటౌన్: దుబ్బాక గడ్డ.. బీఆర్‌ఎస్ అడ్డా అని, ఎవరెన్ని నాటకాలాడినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మూర్తి కరుణాకర్‌రెడ్డి ఎంపీ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రఘునందన్‌రావు ఎన్ని డ్రామాలు ఆడారో ప్రజలకు తెలుసునన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనన్నా అమలు చేసిన దాఖలాలు లేవని, నయాపైస తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది లేదన్నారు. కేవలం వెయ్యి ఓట్లతో గెలిచిన రఘునందన్‌రావును ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చిత్తుగా ఓడిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.