సంగారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువు తూములో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన వద్ద మల్లేశం (46) పని నిమిత్తం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి వచ్చాడు. పని ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా సుల్తాన్‌పూర్ గ్రామ శివారులోని పెద్దచెరువు మైసమ్మ దేవాలయం వద్ద తూము కల్వర్టుపై నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తూములో ప్రమాదవశాత్తు పడి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ పాటిల్ క్రాంతికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య గోవిందమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు.
నిద్రపోయి ప్రమాదవశాత్తు పడిపోవడంతో..
Comments
Please login to add a commentAdd a comment