
ప్రమాద స్థలంలో తుఫాన్ వాహనం
బైక్‌ను తప్పించబోయి..
● స్తంభాన్ని ఢీకొట్టిన తుఫాన్ వాహనం ● పలువురికి గాయాలు
అల్లాదుర్గం(మెదక్): బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం చిల్వెర గ్రామ శివారులో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చిల్వెర నుంచి అల్లాదుర్గం వైపు బైక్‌పై వెళ్తున్నాడు. చిల్వెర శివారులోకి రాగానే పోలీసులు ఎదురుగా వస్తుండడంతో ఫైన్ వేస్తారనే భయంతో బైక్‌ను సడన్‌గా ఆపాడు. అతడి వెనుక నుంచే అల్లాదుర్గం వస్తున్న తుఫాన్ వాహనం బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌లో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బచ్‌పల్లి గ్రామానికి చెందిన రాములుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment