
జనతా కాంగ్రెస్ బీఫామ్ అందుకున్న అబ్దుల్
పరిశ్రమలకు స్వర్గధామం.. పరిశ్రమలకు స్వర్గధామంగా పటాన్‌చెరు నియోజకవర్గమని బీఆర్‌ఎస్ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి అన్నారు. వివరాలు 11లో u
షెట్కార్.. బీఫామ్
అందుకున్న కుమార్తె
నారాయణఖేడ్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సురేశ్ షెట్కార్ బీఫామ్‌ను ఆయన కుమార్తె గిరిజా షెట్కార్ అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే అందజేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి రోహిత్ చౌదరి, పీసీసీ సభ్యుడు కర్నె శ్రీనివాస్, నాయకులు అభిషేక్, శివరావు షెట్కార్, మన్సూర్ అలీఖాన్, సూరజ్ తివారీ పాల్గొన్నారు.
జనతా కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రహీంకు బీఫామ్
నారాయణఖేడ్: జనతా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మోహతాబ్‌రాయ్.. ఖేడ్ టికెట్‌ను అబ్దుల్ రహీంకు ఖరారు చేశారు. ఆయన నాగల్‌గిద్ద మండలం ఏస్గి గ్రామానికి చెందిన వ్యక్తి. కాగా మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీఫామ్‌ను రాయ్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్, రాష్ట్ర, స్థానిక నాయకులు పండరి, తయ్యబ్, అరుణ, దుల్బానాయక్, మన్సూర్ పాషా పాల్గొన్నారు.

బీఫామ్ అందుకుంటున్న గిరిజా షెట్కార్
Comments
Please login to add a commentAdd a comment