
ఏకగ్రీవ తీర్మానం చేస్తున్న గ్రామస్తులు
చిన్నకోడూరు(సిద్దిపేట): కేసీఆర్ పాలనలో ప్రజలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ అన్నారు. గురువారం మండల పరిధిలోని బ్రహీంనగర్‌లో తురక కాశ కులస్తులు, రామన్నపల్లి గ్రామస్తులు మంత్రి హరీశ్‌రావుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సిద్దిపేటను రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మంత్రి హరీశ్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు పాపయ్య, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం, సర్పంచ్‌లు సుభాష్, ఉమేష్ చంద్ర, ఎంపీటీసీలు శ్రీనివాస్ పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ
Comments
Please login to add a commentAdd a comment