
అల్లుకున్న ‘నిర్లక్ష్యం
సంగారెడ్డిలో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. కరెంట్ స్తంభాలకు మొక్కలు తీగలా అల్లుకున్నాయి. ఇలాగే వదిలేస్తే మొక్కలు తినడానికి వచ్చిన పశువులు విద్యుత్ తగిలి చనిపోయే అవకాశం ఉంది. మనుషులు సైతం అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాల బారిన పడుతారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర పిచ్చి మొక్కలు తొలగించి, స్తంభాలకు ఉన్న అల్లికలు, తీగలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

అల్లుకున్న ‘నిర్లక్ష్యం