
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ.. విద్యార్థి దశ నుంచే మంచి క్రమ శిక్షణ అలవర్చుకుంటేనే నిజ జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్క ృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి భాస్కర్, ఎంఈఓ అంజాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ వడ్ల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ ఉమారాణి, నాయకులు బాలాగౌడ్, నర్సింహులు, ఎర్త్ ఫౌండేషన్, ప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.