
పిల్లలను బడిలో చేర్పించాలి
హుస్నాబాద్‌రూరల్/ మద్దూరు(హుస్నాబాద్): పిల్లలను మన ఊరు బడిలోనే చేర్పించి నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులతో కలిసి పని చేయించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పొట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మద్దూరు మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామస్తుల సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని, పిల్లల సంఖ్యను కూడ పెంచడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనీల, హెచ్‌ఎంలు స్వరూప, వాసుదేవారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మద్దూరు కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌శర్మ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుంటిపల్లి కనకమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, ఉపాధ్యాయులు సరళ, అనురాధ, శిరీష, వెంకట్‌రాజు, బాల్ రాజు, రవితేజ పాల్గొన్నారు.
– డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి