బెజ్జంకి(సిద్దిపేట): కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన శశిధర్ హైద్రాబాద్‌లో నివసిస్తాడు. ముత్తన్నపేటలోని తన వ్యవసాయ భూమిలో గొర్రెల షెడ్డు వేసి కాపరులను పెట్టి సుమారు 170 గొర్రెల పెంపకం చేపట్టాడు. కాపరి రోజులానే శనివారం రాత్రి గొర్రెలను షెడ్డులో ఉంచి ఇంటికెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చేసరికి గొర్లు మృతి చెంది ఉన్నాయి. కుక్కలు దాడి చేయడంతో 28 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు శశిధర్ తెలిపారు. సుమారు రూ.2 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment