నర్సాపూర్ రూరల్: కులం పేరుతో వస్తే ఓట్లు వేయొద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నాగులపల్లి, మూసాపేట గ్రామాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి న్యాయం చేసే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్పంచులు సేనాధిపతి, లావణ్య రవి, జీవన్ రెడ్డి, శ్రీధర్ గుప్తా, శేఖర్, జితేందర్ రెడ్డి, బిక్షపతి, రఘువీర్, బలరాం రెడ్డి, అన్నము రవి, మేఘమాల పాల్గొన్నారు. అదేవిధంగా చిన్నచింతకుంట, పెద్దచింతకుంట గ్రామాల్లో ఆదివారం రాత్రి సునీతాలక్ష్మారెడ్డి ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింగ్ రావు, సర్పంచ్ లు సురేష్ గౌడ్, శివకుమార్, మురళి గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment