
శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కాడెట్లు
గజ్వేల్‌రూరల్: ట్రైనింగ్‌లో పాల్గొన్న ఎన్‌సీసీ కాడెట్లకు క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాష్ట్ర ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వీఎం రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో 12రోజులుగా కొనసాగుతున్న ఎస్‌ఎన్‌ఐసీ(స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్) ఆదివారం అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల 17 డైరెక్టరేట్‌ల పరిధిలోని ఎన్‌సీసీ, ఎన్‌ఐసీ కాడెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో కాడెట్లు సంగారెడ్డి సమీపంలోని ఆయుధ కర్మాగారం, హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, శిల్పారామం, ట్యాంక్‌బండ్, రామోజీ ఫిల్మ్‌సిటీ, గోల్కొండ కోట వంటి ప్రాంతాలను సందర్శించి వాటి వివరాలను తెలుసుకున్నట్లు చెప్పారు. అనంతరం గ్రూప్ సాంగ్, డ్యాన్స్‌లలో గెలుపొందిన విజేతలు శిక్షణ ముగింపు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు క్యాంపు కమాండెంట్ కల్నల్ సునీల్ అబ్రహం తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శన చేస్తున్న కాడెట్లు