
పటాన్‌చెరు టౌన్: ఇన్‌స్ట్రాగామ్‌లో ఐఫోన్ కొనేందుకు వెళ్లి సైబర్ వలలో చిక్కుఉని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.6లక్షల 2 వేలు పోగొట్టుకున్న సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్‌పూర్ పరిధి బీరంగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి సెప్టెంబర్ 25వ తేదీన ఇన్‌స్ట్రాగామ్‌లో ఐఫోన్ రూ.13 వేలకు వస్తుందని వచ్చిన మెసేజ్ ను చూసి అపరిచిత వ్యక్తిని సంప్రదించాడు. దీంతో ఆ వ్యక్తి ఓ లింకు పంపగా... అందులో తన వివరాలు నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా చేసి తన ఖాతాలో ఉన్న రూ.ఆరు లక్షల రెండు వేలు పోగొట్టుకున్నాడు. అనంతరం మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి మంగళవారం అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లోన్ ఇస్తామంటూ ఫోన్‌కాల్..
లోన్ ఇస్తామంటూ వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన ఓ గృహిణి రూ.రెండు లక్షల 71 వేలు పోగొట్టుకున్న సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీన్‌పూర్‌కు చెందిన ఓ గృహిణికి నవంబర్ 6వ తేదీన రూ.లక్ష లోన్ ఇస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో బాధితురాలు అపరిచిత వ్యక్తి పంపిన లింకులో తన వివరాలు నమోదు చేసింది. కొద్దిసేపటికి ఆమె ఖాతాలో ఉన్న రూ.రెండు లక్షల 71 వేలు మాయమయ్యాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించి బాధితురాలు ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, మంగళవారం అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment