లత(ఫైల్)
చేగుంట(తూప్రాన్): డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి ప్రసవం అనంతరం వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. గ్రామానికి చెందిన కావేటి లత(25)కు ప్రసవ నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు శనివారం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆమె పాపకు జన్మనివ్వగా రక్త స్రావం ఎక్కువ కావడంతో లత ప్రాణాపాయస్థితికి చేరుకొంది. దీంతో బంధువులు మెరుగైన వైద్యంకోసం సికింద్రాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే లత మృతి చెందింది.
ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం కుమారుడు జన్మించగా శనివారం పాప పుట్టింది. ఆమె మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారని బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా గ్రామానికి చెందిన మహిళ ప్రసవం కోసం వెళ్లి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి లత మృతికి కారణమైన తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment