హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలదే పై చేయిగా నిలిచింది. ఈసారి పురుషుల కంటే వారే అధికంగా ఓటు వేశారు. అయితే ప్రతీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో ఆ పార్టీ గెలుపునకు నాంది పలుకుతుంది. ఈసారి ఇక్కడి ఓటర్లు ఎవరి వైపు నిలిచారో అనేది తెలియాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2014, 2018 కంటే 2023లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 68.76 శాతం, 2018లో 79.72 శాతం, 2023 ఎన్నికల్లో 80.31 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ప్రతి ఎన్నికల్లో మహిళలదే పై చేయిగా నిలుస్తోంది. మొత్తం ఓటర్లు 18118 కాగా, పోలైన ఓట్లు 14,556, ఇందులో పురుషులు 7232, సీ్త్రలు 7317 మంది ఓటు వేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18 బూత్‌లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 13వ బూత్‌లో 1227 ఓట్లు ఉన్నాయి. మొత్తం పోలైన ఓట్లు 1007, ఇందులో పురుషులు 491, సీ్త్రలు 516 మంది ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు. అత్యల్పం 21వ బూత్‌లో 655 ఓట్లు కాగా, 525 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 244 మంది, సీ్త్రలు 281 మంది ఓటును సద్వినియోగం చేసుకున్నారు.