సంగారెడ్డి టౌన్: ఆదాయ పన్ను, టీడీఎస్ నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ విభాగం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ కార్యాలయ ఇన్‌కం టాక్స్ అధికారి మానస్ రంజన్ మెహర మాట్లాడుతూ.. నిర్ణీత సమయంలోగా కరెక్ట్ టీడీఎస్ రిటర్న్ సమర్పించాలని సూచించారు. దాఖలు చేయడంలో ఏవేని సమస్యలు ఉంటే www.tdscpc.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని లాగిన్ అయి క్లారిఫికేషన్ పొందాలని సూచించారు. ఆదాయపు పన్ను, టీడీఎస్ నిబంధనలు, ఫైలింగ్ ఏ విధంగా చేయాలి తదితర అంశాలపై వివరించారు. ఈసందర్భంగా పలువురు డీడీఓల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి కవిత, జిల్లాలోని అన్ని శాఖల డీడీఓలు, హైదరాబాద్ ఇన్‌కం టాక్స్ కార్యాలయ అధికారి పావల్, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment