
సభలో ముఖ్యమంత్రికి తిలకం దిద్దుతున్న మహిళ
గజ్వేల్/గజ్వేల్‌రూరల్: గజ్వేల్ పట్టణం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ తన చిట్టచివరి ఎన్నికల ప్రచార సభను సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్వహించడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పట్టణంలోని ఐఓసీ వెనుకభాగంలోని మైదానంలో సభా వేదిక ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.53 గంటలకు కేసీఆర్ వేదికపైకి చేరుకున్నారు. ఆ సమయంలో జనం ఒక్కసారిగా కేరింతలు కొడుతూ... నినాదాలతో హోరెత్తించారు. మహిళా ప్రజాప్రతినిధులు సీఎంకు తిలకం దిద్ది స్వాగతం పలకగా... మైనార్టీ నేతలు దట్టీ కట్టారు. సభకు అధ్యక్షత వహించిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ముందుగా ప్రసంగించారు. ఈ సందర్భంలో నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యల చిట్టాను సీఎం ముందు ఉంచారు. ఆ తర్వాత మాజీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి, మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ తన ప్రసంగాన్ని 3:09గంటలకు ప్రారంభించి అరగంటకుపైగా కొనసాగించారు.
ఆకట్టుకున్న ఏపూరి,
మధుప్రియల ఆటాపాట
కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద’ బహిరంగ సభలో ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న, మధుప్రియ తమ ఆటపాటలతో సభికులను ఆకట్టుకున్నారు. అప్పుడెట్లుండె తెలంగాణ... ఇప్పుడెట్లుందంటూ కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు

గులాబీ శ్రేణుల జోష్..
Comments
Please login to add a commentAdd a comment