ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు జహీరాబాద్ పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పర్వదినం కోసం చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పట్టణంలోని అతిపెద్దదైన మెథడిస్టు చర్చిని దీపాలతో అలంకరించారు. క్రైస్తవులంతా ముందస్తు వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిల వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీలలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులంతా ఇళ్ల ఎదుట స్టార్ దీపాలను ఏర్పాటు చేశారు. కొత్త బట్టలు, తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్‌లో సందడి నెలకొంది.
– జహీరాబాద్ టౌన్
Comments
Please login to add a commentAdd a comment