‘టీశాట్‌–నిపుణ’ లైవ్‌ టెలీకాన్ఫరెన్స్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘టీశాట్‌–నిపుణ’ లైవ్‌ టెలీకాన్ఫరెన్స్‌కు ఎంపిక

Published Tue, Jan 30 2024 5:58 AM | Last Updated on Tue, Jan 30 2024 9:52 AM

-

ములుగు(గజ్వేల్‌): స్కూల్‌ లీడర్‌షిప్‌ అకాడమీ– రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో (టీశాట్‌–నిపుణ) చానల్‌ ద్వారా నిర్వహిస్తున్న లైవ్‌ టెలీకాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ములుగు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.క్రాంతి కుమారి ఎంపికయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు కేంద్రీకృతంగా, వినూత్న పద్ధతిలో బోధిస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో క్రాంతి కుమారి ఒకరు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాధికారి ఉదయ భాస్కర్‌రెడ్డి, సెక్టోరియల్‌ అధికారులు అభినందించారు.

పొలంలోనే రైతు మృతి

గజ్వేల్‌రూరల్‌: పొలం వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోమటిబండలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉబ్బని అశోక్‌(35)కు భార్య పోచమ్మతోపాటు ఇద్దరు కొడుకులున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న అశోక్‌ తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. సోమవారం తన పొలంలో వరి నాట్లు వేసేందుకు పొలం గట్లను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు బురద పొలంలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదస్థలానికి చేరుకొని విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పేకాట స్థావరంపై

పోలీసుల దాడి

రూ.55 వేలు, బైక్‌లు స్వాధీనం

నలుగురు అరెస్ట్‌, పరారీలో ముగ్గురు

సిద్దిపేటఅర్బన్‌: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్‌ చేసిన ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం వెల్కటూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సీఐ రమేశ్‌ సిబ్బందితో కలిసి వెల్కటూరు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారయ్యా రు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.55,179, మూడు బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించగా వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో వెల్కటూరు గ్రామానికి చెందిన ఆలేటి కృష్ణ, రాచమల్ల కనకయ్య, దుద్దెడ గ్రామానికి చెందిన నర్ర దేశిరెడ్డి, పొన్నాలకు చెందిన లెంకల రవి ఉన్నారు. సిర్సినగండ్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు, కొండపాక గ్రామానికి చెందిన యాదగిరి యాదవ్‌, మంతూరి మహేశ్‌ పరారీలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ తెలిపారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి సూరి కృష్ణ

జహీరాబాద్‌ టౌన్‌: చదువుతోపాటు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ సూరి కృష్ణ అన్నారు. పట్టణంలోని బీసీ వసతి గృహంలో లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చట్టా లు తోడ్పడుతాయన్నారు. పోక్సో చట్టం, బా లకార్మిక చట్టం, సమాచార చట్టం, జ్యువైనల్‌ జస్టీస్‌ యాక్ట్‌ తదితర చట్టాలపై వివరించారు. బాల కార్మికులు, బాల వివాహా బాధితులను గుర్తిస్తే తహసీల్దార్‌, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సదస్సులో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సంతోష్‌కుమార్‌ సాగర్‌, న్యాయవాదులు బ్రహ్మనందరెడ్డి, మహేశ్‌, శేఖర్‌, జగన్‌, మహేందర్‌, లీగల్‌ సర్వీసెస్‌ సిబ్బంది, వార్డెన్‌ వంశీకృష్ణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
 మాట్లాడుతున్న జడ్జి కృష్ణ 1
1/2

మాట్లాడుతున్న జడ్జి కృష్ణ

క్రాంతి కుమారి 2
2/2

క్రాంతి కుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement