
ముస్లింలకు రంజాన్ పవిత్రమైన పండుగ
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ముస్లిం సోదరుల గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
ముస్లింల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర(సంగారెడ్డి): ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూర మండలం దౌల్తాబాద్ ఈద్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మైనార్టీ అభివృద్ధి కోసం తాను ఎప్పుడు సహకరిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవులరాజురెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ దౌల్తాబాద్‌లో ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హత్నూర మండలంలో రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన హత్నూర, దౌల్తాబాద్, కాసాల, చింతలచెరువు,బోరపట్ల, సిరిపురంతోపాటు పలు గ్రామాలలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిందూ ముస్లింలు తేడా లేకుండా స్నేహపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బసవేశ్వరుడు చూపిన
మార్గంలో నడవాలి
నారాయణఖేడ్: బసవేశ్వరుడు చూపిన మార్గంలోని నడుచుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. నాగల్‌గిద్ద మండలం మావినెళ్లి గ్రామంలో జరుగుతున్న చెన్న బసవేశ్వర జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...మానవా ళికి బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో బాల్కి పీఠాధిపతి బసవలింగ పట్టదేవర, జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షట్కార్, టీపీసీసీ సభ్యుడు శంకరయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు సాగర్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతర ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించి గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు.
‘యువ వికాసం’ను
సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...జిల్లాలో అత్యధిక సంఖ్యలో నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న వారికి 100% రాయితీ, రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారికి 90%రాయితీ, రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 80% రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 70% రాయితీ లభిస్తుందని ఈ విషయంపై దరఖాస్తుదారులకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

ముస్లింలకు రంజాన్ పవిత్రమైన పండుగ

ముస్లింలకు రంజాన్ పవిత్రమైన పండుగ