రెండు బైక్‌లు ఢీ : ఒకరికి గాయాలు
నిజాంపేట(మెదక్): రెండు బైక్‌లు ఢీకొని ఒకరికి గాయాలైన ఘటన మండల పరిధిలోని కల్వకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డిపేట్ గ్రామానికి చెందిన చింతకింది భాను స్వగ్రామం నుంచి పులిమామిడికి బైక్‌పై పని నిమిత్తం వెళ్తున్నాడు. కల్వకుంట్ల గ్రామ శివారులోకి రాగానే నార్లాపూర్ గ్రామానికి చెందిన బెజమైన వెంకటేశ్ బైక్‌పై అజాగ్రత్తగా వచ్చి భాను బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భానుకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడి చిన్నాన్న రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


