పునః ప్రతిష్ఠ చేపట్టడం శుభ సూచకం | - | Sakshi
Sakshi News home page

పునః ప్రతిష్ఠ చేపట్టడం శుభ సూచకం

Apr 3 2025 7:53 PM | Updated on Apr 3 2025 7:53 PM

పునః

పునః ప్రతిష్ఠ చేపట్టడం శుభ సూచకం


మాధవానంద సరస్వతీ స్వామిజీ

భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది

ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు 105 ఎకరాల భూమి కావాలే అని అడి గారు. మూడు చోట్ల కలిసి మొత్తం 124 ఎకరాలను భూ సేకరణకు గుర్తించాం. ఇందులో 14 ఎకరాల వరకు ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి పొందిన భూములు ఉన్నవి మిగితా పట్టా భూములను కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. పరిహారం ప్రభుత్వ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.

– రాంమూర్తి, ఆర్డీవో, హుస్నాబాద్‌

దుబ్బాక: నరుడు నారాయణుడై ధర్మరక్షణ చేస్తే ఈ మానవజన్మకు సార్ధకత లభిస్తుందని మాధవానంద సరస్వతీ స్వామిజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన వరద పోచమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి విగ్రహానికి మాధవానంద సరస్వతీ స్వామిజీ యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. ఆలయాలు నిర్మించి విగ్రహాలు ప్రతిష్టిస్తే సరిపోదని నిరంతరం ధూప, దీప నైవేద్యాలతో వెలుగొందేలా చూసినప్పుడే భగవంతుడు మనను చల్లగా చూస్తాడన్నారు. ఎన్నో వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయం శిథిలం కాగా భక్తులు ముందుకొచ్చి నూతనంగా ఆలయంతోపాటు అమ్మవారిని పునః ప్రతిష్ఠ చేసుకోవడం శుభ సూచకమన్నారు. అంతకు ముందు ఆలయంలో వేదపండితులు వేలేటి జయరామశర్మ, రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో అవాహిత దేవతా పూజ, హోమములు, ఆదివాసములు, ఆదివాస హోమం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పునః ప్రతిష్ఠ చేపట్టడం శుభ సూచకం1
1/1

పునః ప్రతిష్ఠ చేపట్టడం శుభ సూచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement