
ఈద్గాలను సందర్శించిన ఎస్పీ
సంగారెడ్డి జోన్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి హాస్టల్ ఈద్గాను సోమవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈద్గా వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీతో పాటు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, రూరల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు.
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు (ఏప్రిల్ 1 నుంచి 30 వరకు) జిల్లావ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అనుమతి లేకుండా చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.