
టోల్ రేట్లు పెంపు
సంగారెడ్డి: మరోసారి టోల్‌గేట్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎచ్‌ఏఐ) వర్గాలు వెల్లడించాయి. అకోలా–నాందేడ్ హైవేపై చౌటకూర్ మండలం తడ్డాన్‌పల్లి టోల్ ప్లాజా వద్ద కొత్త రేట్లతో కూడిన బోర్డులను అక్కడి యాజమాన్యం ప్రదర్శించింది. లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ కారు, జీపు, వ్యాన్ తదితర వాహనాలకు రూ.5 చొప్పున పెంచగా...నెలవారీ పాస్ రూ.150కు పెరిగింది. వాణిజ్య వాహనాలకు రూ.5 చొప్పున, నెలవారీ పాస్‌కు రూ.240 పెంచారు. మూడు చక్రాల వాణిజ్య వాహనాలకు రూ.15 చొప్పున వీటికి మంత్లీ పాస్ రూ.550 చొప్పున పెరిగాయి. భారీ వాహనాలైన బస్సు, ట్రక్కులకు రూ.15 చొప్పున, మంత్లీ పాస్ రూ.505 చొప్పున పెరిగాయి. ఇక ఓవర్ సైజ్ వెహికల్‌కు రూ.25, మంత్లీ పాస్ రూ.965కు పెరిగింది. ఈ పెరిగిన రేట్లన్నీ ఈనెల 1 నుంచి అమలులోకి రానున్నాయి.
గుమ్మడిదల టోల్‌ప్లాజాలోనూ...
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మండల కేంద్ర సమీపంలోని టోల్‌గేట్‌లో ఈనెల 1 నుంచి కొత్త టోల్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. కారు జీపు లైట్ వెయిట్ మోటార్ వెహికల్ పై రూ.5 రూపాయలు పెరిగాయని, బస్సులు, భారీ వాహ నాలపై రూ.10 రూపాయల చొప్పున చార్జీలు పెంచినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరిగిన చార్జీలు సోమ వారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. చార్జీల పెంపుపై వాహనదారులు టోల్‌ప్లాజా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి అమలు