Sangareddy District News
-
నిద్రిస్తున్న యువకుడి పైనుంచి..
మర్కూక్(గజ్వేల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ యువకుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మర్కూక్ మండలంలోని కర్కపట్ల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ దామోదర్ వివరాల ప్రకారం... కర్కపట్ల గ్రామానికి చెందిన కరుణాకర్ (24) అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ తన టిప్పర్ల ద్వారా ప్రతి రోజు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో గ్రామంలో నుంచి మట్టిని హైదరాబాద్‌కు తలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 12గంటల తర్వాత మూడు టిప్పర్లు, 2 జేసీబీల సహాయంతో కర్కపట్ల గ్రామానికి చెందిన గ్యార మల్లేశం ప్రభుత్వ భూమి నుంచి మట్టిని తరలిస్తున్నాడు. తన వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్న కరుణాకర్ నిద్రరావడంతో కొద్దిసేపు పడుకుంటానని చెప్పి వెళ్లి పక్కన నిద్రిస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతో అజాగ్రత్తగా అతడి ఛాతీపై నుంచి టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కరుణాకర్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేన్నారు. రేణికుంట రోడ్డు ప్రమాదంలో... బెజ్జంకి(సిద్దిపేట): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట వద్ద గల రాజీవ్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బెజ్జంకి క్రాసింగ్‌కు చెందిన బి.నక్షత్రమ్మ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో బెజ్జంకిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్షత్రమ్మ భర్త ఆనందరెడ్డికి తీవ్ర గాయాలు కాగా, హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కొలిపాక మంజుల, బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఐలేని నవీన్‌రెడ్డిలకు కాలు ఫ్యాక్చరైంది. వీరు కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
హుస్నాబాద్: పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన వెంకటస్వామి తన ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం ఊరికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువతి అదృశ్యం నర్సాపూర్ రూరల్: యువతి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంచర్ల నారాయణ కూతురు కంచర్ల కృష్ణవేణి (19)ఈనెల 23న తల్లి చంద్రకళతో కలిసి నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వచ్చారు. తల్లి ఆస్పత్రి లోపల బంధువులను పరామర్శిస్తుండగా కృష్ణవేణి బయటకు వచ్చి కనపడకుండా పోయింది. చుట్టుపక్కల తల్లి, బంధువులు వెతికినా కనిపించలేదు. గురువారం తండ్రి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వరికోత.. కన్నీటి వెత
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు దుబ్బాకకు చెందిన కేసుగారి స్వామి. తనకున్న 12 ఎకరాల్లో ఈ యాసంగిలో వరి వేశాడు. తీరా వరి కోద్దామంటే వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు చేలలో నీరు నిలిచిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చైన్ హార్వెస్టర్‌తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 12 ఎకరాలు కోసేందుకు కామన్ హార్వెస్టర్‌తో 14 గంటలు పట్టేది. ఇప్పుడు చైన్ మిషన్‌తో కోస్తే 18 గంటలకు పైగా సమయం పట్టింది. వరి కోసి వడ్లను రోడ్డుపైకి తెచ్చి ట్రాక్టర్లో పోయాల్సి రావడంతో అదనంగా 5 గంటలకు పైగా సమయం ఎక్కువైంది. పైగా కామన్ హార్వెస్టర్‌కు గంటకు రూ.2 వేలు ధర ఉంటే చైన్ మిషన్‌కు రూ.3 వేలకు పైగా ఉంది. దీంతో రూ.26 వేలలో పూర్తి కావాల్సిన కోతకు రూ.50 వేలకు పైగా అంటే అదనంగా రూ.24 వేలు అదనపు భారం పడింది. ప్రతిసారి వడ్లు 20 ట్రాక్టర్లకు పైగా అంటే 350 క్వింటాళ్ల వరకు అయ్యేవి. ఇప్పుడు తక్కువయ్యాయి. ఇది ఒక్క రైతు స్వామిదే కాదు చాలామంది రైతులది ఇదే పరిస్థితి. చైన్‌మిషన్‌తో కోయించా.. వరుసగా వానలు పడటంతో కోత కొచ్చిన వరిపంట కోసేందుకు చాలా ఇబ్బందులు పడ్డా. వానలతో భూమి ఆరలేదు. మళ్లీ వాన వానలు వస్తుండటంతో ఎక్కువ డబ్బులు పోయినా ఉన్న పంటను దక్కించుకోవాలనే చైన్‌మిషన్‌తో కోయించా. నేనే కాదు రైతులందరూ చైన్మిషన్, ఫోర్వీల్తోనే కోయించుకుంటున్నారు. – గన్నె వెంకట్రాజిరెడ్డి, రైతు అకాల వర్షాలతో ఇబ్బందులు తీరా పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాలు రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నాయి. వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షాలతో కోసిన వడ్లు ఆరబోసేందుకు , వరి కోతలు కోసేందుకు కూడా అదనంగా ఖర్చులు అవుతున్నాయి. – రాధిక,జిల్లా వ్యవసాయ అధికారివరి కోసేందుకు నరకయాతన దుబ్బాక: అసలే యాసంగిలో భూగర్భజలాలు అడుగంటి బోర్లు వట్టిపోయి చాలా పంటలు ఎండిపోయాయి. ఇక పంట చేతికొస్తదనుకున్న దశలోనే జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్లతో వడ్లు చాలా వరకు వడ్లు రాలిపోవడంతో రైతులకు కనీస పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి దాపురించింది. పోగా మిగిలిన గింజలను కోద్దామంటే వారం పదిరోజులుగా వరుసగా పడుతున్న వానలకు పొలాలు ఆరక దిగబడుతుండటంతో కోతలకు ఇబ్బంది అవుతోంది. దీంతో వరి కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధర పెట్టి చైన్ మిషన్లతోనే కోతలు కోయించాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలోని ఒక్క దుబ్బాకనే కాకుండా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో వరి కోతలు కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో 45 శాతానికి పైగా వరికోతలు జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరిపంట వేయగా ఇప్పటి వరకు 45 శాతం వరకు అంటే సుమారుగా 1.45 లక్షలకు పైగా ఎకరాల్లో కోతలు కోయడం పూర్తయింది. ఇంకా 55 శాతం వరకు కోతలు కోయాల్సి ఉంది. కోసిన కోతల్లో 20 శాతం వరకు చైన్మిషన్లు, ఫోర్వీల్తోనే కోశారు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులపై అదనపు భారం పొలాలు దిగబడుతుండటంతో చైన్‌మిషన్‌తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్వెస్టర్‌కు గంటకు రూ.2వేలు ఉండగా చైన్ మిషన్ గంటకు రూ.3వేల నుంచి 3500 వరకు ధర చెల్లించాల్సి వస్తోంది. పొలాలు దిగబడుతుండటంతో వడ్లు పోసేందుకు ట్రాక్టర్లు రాలేని పరిస్థితి ఉంది. సాధారణంగా ఎకరం వరికోతకు టైర్ హార్వెస్టర్‌తో గంట 10 నిమిషాల నుంచి 1.20 పడుతుండగా చైన్ మిషన్‌తో ఎకరం వరికోసి వడ్లు బయట పోయాల్సి వస్తుండటంతో 2 గంటలకు పైగా సమయం పడుతోంది. అంతేకాకుండా చైన్మిషన్కు రేటు కూడా ఎక్కువ ఉండటంతో ఎకరానికి రైతుకు అదనంగా 5 నుంచి 6 వేల వరకు భారం పడుతోంది. రైతులు చైన్మిషన్తోనే కోయిస్తుండటంతో అవి దొరకక ప్రతిరోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులను కోలుకోకుండాచేస్తున్న అకాల వర్షాలు భూమిలో తేమతో దిగబడుతున్నహార్వెస్టర్లు చైన్‌మిషన్లతో వరి కోతలు ఎకరానికి రూ.5 వేలకు పైగాఅదనపు భారం జిల్లాలో ఇప్పటి వరకు 45 శాతం కోతలు -
ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేటకమాన్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణం రాంనగర్‌కు చెందిన మండల నరేశ్(32) కొన్నేళ్లుగా అస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకునే అతడికి ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మనస్తాపానికి గురై పట్టణ శివారు ఎర్ర చెరువు కట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు అతడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై లింగం కథనం ప్రకారం... నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి గూడ గిరిజన తండాకు చెందిన నేనావత్ జాంగిర్ నాయక్ (35) తనకు ఉన్న 20 గుంటల భూమితో పాటు ఇతరుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మతిస్థిమితం లేని వివాహిత.. కొండపాక(గజ్వేల్): మతిస్థిమితం లేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్ సీఐ.విద్యాసాగర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సిర్సనగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మి (56)కి కొన్ని నెలలుగా మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతుకుతున్న క్రమంలో ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా భూమి హద్దు కోసం పాతిన ఎత్తైన గనేట్ రాయికి ఉరేసుకొని చనిపోయింది. మృతురాలికి భర్త, కొడుకు, కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పులబాధతో యువకుడు.. తొగుట(దుబ్బాక): అప్పుల బాధతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఎల్లారెడ్డిసేటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మన్నె భాస్కర్ (29) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు ఏళ్ల క్రితం భార్య మహేశ్వరి మృతి చెందింది. తీవ్ర మనోవేదనకు గురై పనికి వెళ్లకుండా ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటిపై ప్రైవేట్ ఫైనాన్స్‌లో రూ 3.25లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకురావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత.. జిన్నారం (పటాన్చెరు): అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం... మెదక్ జిల్లా రామయంపేటకు చెందిన రేష్మాబేగంను (30) కానుకుంట గ్రామానికి చెందిన ఎండి అహ్మద్ 2019లో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త అహ్మద్, అత్త భాను, బావ సలీం, చిన్న మామ పాషాలు కలిసి అదనపు కట్నం తీసుకురావాలని రేష్మ భేగంను మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో ఈనెల 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోమారు గొడవపడటంతో 22వ తేదీన పెద్దల సమక్షంలో మాట్లాడి ఒప్పించారు. దీంతో అత్తారింటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరు కొడుకుల మణికట్టుపై గాయపరిచి రేష్మా బేగం బెడ్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోఉన్న ఇద్దరి పిల్లలను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అత్తింటి వేధింపులతోనే మృతి చెందిందని సోదరుడు సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్య -
కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌కు సరుకుల లారీలను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయం నుంచి పంపించనున్నట్లు కేదారినాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఐదేళ్లుగా కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులను అందిస్తూ, యాత్రికులకు ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మే 2 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడికి వచ్చే భక్తులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, రాత్రి భోజనం అందించనున్నామని చెప్పారు. శుక్రవారం శరభేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, శివకళ్యాణం నిర్వహించి, లారీలను కేదార్‌నాథ్‌కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాంకాల నవీన్‌కుమార్, మధుసూదన్, రత్నాకర్, శరభయ్య, కాశీనాథ్, గంజి రాములు, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. నేడు వెళ్లనున్న సరుకుల లారీలు కేదారినాథ్ అన్నదానసేవా సమితి సభ్యులు వెల్లడి -
తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు
మనోహరాబాద్(తూప్రాన్): తప్పుడు వార్తలు రాసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన హనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం ప్రకారం... మండలంలోని కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అక్రమంగా అనుమతులు ఇచ్చిందని, రెచ్చగొట్టేలా, ఓ యూట్యూబ్ చానల్లో పార్ట్ 1, పార్ట్ 2 పేరిట ఓబులేసు లింగంగౌడ్ అనే వ్యక్తి టెలికాస్ట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపులో పడి వ్యక్తి మృతిములుగు(గజ్వేల్): ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం తున్కిబొల్లారంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బద్దం బలవంతరెడ్డి(34)వ్యవసాయం చేస్తున్నాడు. గురువారం ఉదయం వ్యవసాయ పొలం వద్దగల నీటి సంపులో బోరు మోటరు నడవక పోవడంతో సంపులోకి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. ఇది గమనించిన తమ్ముడు కోటిరెడ్డి విషయాన్ని తన తండ్రి బుచ్చిరెడ్డికి తెలుపగా వారిరువురు కలిసి బలవంతరెడ్డిని నీటి సంపులోనుంచి పైకి తీసి చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య అనూష ఇద్దరు పిల్లలున్నారు. పిట్టగోడ కూలి గర్భిణి మృతి ● వర్షం వస్తుందని దాబా దగ్గర ఆగిన భార్యాభర్తలు.. ● టీ తాగుతుండగా గోడ కూలి ప్రమాదం మునిపల్లి(అందోల్): పిట్టగోడ కూలడంతో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని పొల్కంపల్లికి చెందిన మన్నె విజయ్, ఆయన భార్య శ్రావణి (గర్భిణి) సదాశివపేట ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. బుదేరా గ్రామానికి సమీపంలోకి రాగానే ఈదురు గాలులు, వర్షం రావడంతో భార్యాభర్తలు ఓ దాబా దగ్గర ఆగి టీ తాగుతున్నారు. అదే సమయంలో దాబా రేకుల షేడ్డు ముందు భాగంతో పాటు పిట్టగోడ కూలి శ్రావణిపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలొదిలింది. కేసు దర్యాప్తులో ఉంది. మద్యం తాగి కిందపడి వ్యక్తి మృతిపటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం... నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లికి చెందిన ఊషయ్య(45) తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామం ఇంద్రపురి కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. ఈనెల 13న మద్యం తాగి కింద పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. పక్కనే ఉన్న మేస్త్రి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అనంతరం అతనికి తల నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ చేసి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో 23న ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎఫ్ఆర్ఓ అర్చన, సిబ్బంది గురువారం సీజ్ చేశారు. జలాల్పూర్, జాకంపల్లి తండాల్లోని అడవిలోని వాగుల నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సీజ్‌చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. -
జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్ చోరీ..
● అంతర్జిల్లా దొంగను పట్టుకున్నత్రీటౌన్ పోలీసులు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ మధుసిద్దిపేటఅర్బన్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను గురువారం సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట ఏసీపీ మధు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఇస్సానగర్‌కు చెందిన చెవుల మల్లేశం (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు చేస్తున్నాడు. తన సమీప గ్రామాల్లో దొంగతనం చేస్తే పోలీసులకు దొరికిపోతాననే భయంతో దూర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ ముందు రోజు రెక్కీ నిర్వహించి అనంతరం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొండపాక మండలం మర్పడగ మధరి దోమలోనిపల్లి గ్రామంలో దోమల మల్లయ్య వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాక్టర్ ట్రాలీని అపహరించాడు. అంతకుముందు ఫిబ్రవరి 12న రాంపల్లి గ్రామ శివారులోని బొమ్మ నర్సయ్య పొలం వద్ద నిలిపి ఉంచిన జాన్‌డీర్ ట్రాక్టర్‌ను ట్రాలీతో సహా దొంగిలించి తన స్వగ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ట్రాక్టర్‌ను గుర్తు పట్టకుండా నంబర్ ప్లేట్‌కు రంగులు వేసినట్టు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో సెలంపు గ్రామ శివారులో ట్రాక్టర్ ఇంజిన్‌తో సహా ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి జాన్ డీర్ ట్రాక్టర్ ఇంజిన్, రెండు ట్రాలీలు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నేరస్తుడు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, సిబ్బంది తిరుపతిరెడ్డి, బాబు, శ్రీనివాస్‌లను ఏసీపీ అభినందించారు. -
కారు ఢీకొట్టిన ప్రమాదంలో బైకిస్టు దుర్మరణం
వర్గల్(గజ్వేల్): బైకును వెనక నుంచి కారు ఢీకొట్టడంతో బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌రహదారిపై జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం... మర్కూక్ మండలం ఎర్రవల్లికి చెందిన సంద గణేశ్(40)కు భార్య పద్మ, 14 యేళ్లలోపు మనోజ్, మానస అనే ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల చదువుల కోసం గజ్వేల్‌లో ఉంటూ టిప్పర్, జేసీబీ పనులు చూసుకుంటున్నాడు. గురువారం సాయంత్రం బైక్‌పై గజ్వేల్ నుంచి గౌరారం వైపు వస్తున్నాడు. సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద వెనక నుంచి కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకుకేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే
సాక్షి, సిద్దిపేట: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పీఎం మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పాశవికచర్య అని, సెక్యులర్ మేధావులు సైతం తీవ్రంగా ఖండించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఈ ఘటనపై స్టాలిన్, కమల్ హాసన్, ప్రకాశ్‌రాజ్, సెక్యులర్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ రకమైన అల్లర్లు సృష్టించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాల వల్ల పాతబస్తీలో అభివృద్ధి జరగలేదని, మెట్రో రాలేదని విమర్శించారు. ఒవైసీ పేద ముస్లింల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. డెవలప్మెంట్కి ముస్లింలను దూరంగా ఉంచేది ఏంఐఎం పార్టీ అని విమర్శించారు. మదర్సాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి తెలంగాణలో ఉన్న మదర్సాల్లో ఎవరు ఉంటున్నారు? ఏ రాష్ట్రం వారు ఉంటున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఎంటీ? విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇస్లామిక్ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ మేధావులు సైతం ఉగ్రదాడిని ఖండించాలి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు -
విధులు ఒక చోట... వేతనం మరోచోట
ఝరాసంగం(జహీరాబాద్): మండల పరిధిలో అధికారుల డివ్యూటేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. విధులు ఒకచోట.. వేతనం మరోచోట తీసుకుంటున్నారు. తమకు అనువుగా ఉన్న చోట డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. పలు శాఖల్లో డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఇతర అధికారులపై పని భారం పడటమే కాకుండా.. కొన్ని శాఖల్లో సేవలు నిలిచిపోయాయి. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ,తో పాటు ఎంపీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్తోపాటు నలుగురు అటెండర్లు (ఆఫీస్ సబార్డినేట్లు) ఉండాలి. ఇక్కడ పేరుకు మాత్రం అన్ని పోస్టులు భర్తీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన సూపరింటెండెంట్ రాములు పుల్కల్ మండలంలో, టైపిస్ట్ వెంకటయ్య కొండాపూర్ మండలంలో, అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) పద్మావతి న్యాల్కల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో డిప్యూటేషన్‌పై వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి డిప్యూటేషన్‌పై సూపరింటెండెంట్‌గా వచ్చిన శంకర్ తిరిగి చౌటకూర్ ఎంపీడీఓ(ఎఫ్ఏసీ)గా వెళ్లారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి సమయ పాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ సేవలు అందించాలనే లక్ష్యంగా ప్రత్యేకంగా మెడికల్ అధికారి డా.గోపీని నియమించి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాటు చేశారు. కానీ, అధికారి మాత్రం మేడ్చల్ జిల్లా షామిర్‌పేటకు డిప్యూటేషన్‌పై వెళ్లాడు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇక్కడ విధులు నిర్వహించే జేఈ అధికారి అశోక్‌కుమార్ కోహీర్కు, అక్కడి నుంచి జేఈ ప్రతాప్‌రెడ్డి ఝరాసంగంకు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పని చేసే అధికారిపై సమయపాలన పాటించకపోవటంతోపాటు నచ్చిన విధంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏపీయం బాలకృష్ణ జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి అక్కడి నుంచి ఝరాసంగంకు ఏపీఎంగా వి.టిక్యా డిప్యూటేషన్‌పై వచ్చారు. గతంలో వీఆర్ఏగా విధులు నిర్వహించిన బీరప్ప జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది కోహీర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఝరాసంగం తహసీల్దార్ కారా్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. లైబ్రేరియన్ శ్రీనివాస్ సంగారెడ్డి గ్రంథాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో వారంలో కేవలం ఒక రోజు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. దీంతో పౌరసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఝరాసంగంలో డిప్యూటేషన్ల దుమారం -
ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిరామచంద్రాపురం(పటాన్చెరు)/పటాన్చెరు: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. భారతీనగర్, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో గురువారం పలు కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీలకతీతంగా చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతోపాటు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని వివరించారు. దైవభక్తి పెంపొందించుకోవాలి ప్రతీ ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల శ్రీ సాయిబాబా దేవాలయం వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్లు వి.సింధురెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పుష్ప, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో ఆ కమిటీలు పునరుద్ధరణ
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● నిర్ణీత గడువులోగా పరిష్కారం ● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● నాగల్గిద్ద, మనూరు మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నారాయణఖేడ్: భూ భారతి చట్టంతో అసైన్మెంట్ కమిటీలు పునరుద్ధరణ చేశారని, తద్వారా పేదలకు భూమి పట్టాలు, ఇళ్ల పట్టాలు జారీ చేసే అధికారం కలిగిందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణితో ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మనూరు, నాగల్గిద్ద మండల కేంద్రాల్లో సంజీవరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరై కలెక్టర్ మాట్లాడారు. నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టం దోహదపడుతుందన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో ఏవైనా లోటుపాట్లు, తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు నూతన ఆర్ఓఆర్ 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. ఎవరికై నా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా... భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టాపాస్ బుక్కులలో సమగ్ర వివరాలతో, హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాప్) పొందుపరుస్తారని కలెక్టర్ తెలిపారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూధార్ నంబర్ కేటాయిస్తారని చెప్పారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను కోర్టు స్టే విధించడం వల్ల ధరణిలో పరిష్కరించేందుకు అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. నల్లపోచమ్మను సందర్శించుకున్న కలెక్టర్ మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌కు నల్లపోచమ్మ తల్లి చిత్ర పటాన్ని ఎమ్మెల్యే బహూకరించారు. రైతులు అవగాహన ఏర్పరచుకోవాలి: కలెక్టర్ కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగాా రైతులు అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురితో కలిసి కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఎఓ శివప్రసాద్, ఆర్డీవో అశోక చక్రవర్తి, ఏడిఏ నూతన్‌కుమార్, తహసీల్దార్ నజీంఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మనీశ్ పాటీల్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణం పెనుభారం!
● భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం ● స్టీల్, ఇసుక, సిమెంట్ ధరలు ౖపైపెకి ● పెరిగిన కూలీ రేట్లు ● బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు జహీరాబాద్ టౌన్: ఇల్లు కట్టి చూడు..పెళ్లి చూసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. రెండింటికీ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నాడైనా నేడైనా. రోజు రోజుకు భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని తాకడంతో బడ్జెట్ అంచనాలు తారుమారవుతున్నా యి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబడటం లేదు. సిమెంట్, స్టీల్, ఇసుక, పీవీసీ, విద్యుత్, ప్లంబింగ్ మెటీరియల్, కలర్, కూలీ రేట్లు ప్రతీ వస్తువు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిలో ఇల్లు కట్టుకోవాలంటే సామాన్య ప్రజ లు బెంబేలెత్తున్నారు. నిర్మాణం పనులు ప్రారంభించిన వారు పెరిగిన ధరలతో సగంలోనే పనులు ఆపేస్తున్నారు. కొత్తగా ఇంటి పనులు మొదలు పెట్టాలనుకునేవారు సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు. పెరిగిపోతున్న రేట్లు... భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మేసీ్త్ర, కూలీల రేట్లు సైతం ఎక్కువయ్యాయి. సొంతగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే గతేడాది చదరపు అడుగు రూ.1,700–1,800 వరకు అయ్యేది. అదే గుత్తేదారు అయితే రూ.1,700–1,900 వరకు చేసేవారు. గుత్తేదారుకు ఇస్తే రూ.2,000–2,200 దాకా తీసుకుంటున్నారు. మార్కెట్లో ఇసుక టన్నుకు రూ.2,500 నుంచి రూ.2,800 వరకు పలుకుతుంది. స్టీల్ టన్ను రూ.54 వేల నుంచి ఉంది. సిమెంట్ ధరలు బస్తాకి కంపెనీ బట్టి రూ.360 వరకు పలుకుతోంది. మేసీ్త్ర,కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇసుక మరింత ప్రియం ఇళ్ల నిర్మాణంలో ఇసుకకు ప్రాధాన్యం ఉంది. ఇసుకలో రెండు రకాలు. కట్టడానికి ఉపయోగించేది. ప్లాస్టింగ్‌కు వాడేది. సన్నరకం ఇసుక టన్నుకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నారు. ఇసుక కొరత వల్ల ఓవర్ లోడ్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. పునాదులు, స్లాబ్‌కు ఉపయోగించే కంకరు ధర కూడా పెరిగింది. 300 ఫీట్‌కు రూ.900 వరకు విక్రయిస్తున్నారు. గతంతో పొలిస్తే కార్మికులు, కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కలర్, కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, కలప తదితర వస్తువుల ధరలు కూడా 25 నుంచి 30% వరకు పెరిగాయి. ఫ్లోరింగ్, టైల్స్ ధరలు కూడా 30% పెరిగాయి. ఇలా నిర్మాణానికి ఉపయోగించే ప్రతీ వస్తువు ధర పెరిగిందని, సొంతంగా ఇళ్లు కట్టుకునే ప్రజలతో పాటు బిల్డర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరల కారణంగా నిర్మాణాలు కాస్త మందగించాయంటున్నారు.ధరలు పెరగడంతో నష్టపోతున్నాం నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. ఇసుక, సిమెంట్, స్టీల్, డస్ట్,కంకర, ఇతర మెటీరియల్ రేట్లు పెరగడం వల్ల గతేడాది ఒప్పందం చేసుకున్న పనులకు నష్టం వస్తోంది. లేబర్ ఛార్జీలు కూడా చాలా పెంచారు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో నిర్మాణం రంగంపై దెబ్బపడింది. –ఎస్ఎన్, భూషణం, ఇంజనీర్, జహీరాబాద్ -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
రాయికోడ్(అందోల్): మండలంలోని యూసుఫ్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన వేడుక గురువారం వైభవంగా జరిగింది. బీచ్కుందకు చెందిన శివాచార్య సోమలింగ స్వామి ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, నంది, గణపతి, సుబ్రమణ్య స్వామి, శిఖరప్రతిష్ఠలు వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ధనసిరి ఆశ్రమాధిపతి, బండయప్ప స్వామి, నిర్వాహకులు భాస్కర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సంగారెడ్డి, నాయకులు నవనీత తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ప్రాధాన్యతనివ్వాలిజహీరాబాద్ టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొనింటి నర్సింలు కోరారు. ఈ మేరకు గురువారం ఆర్డీఓ రాంరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇళ్లులేని వారికి స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేయాలన్నారు. శ్రమశక్తి సంఘాలు ఏర్పాటుచేసి జాబ్‌కార్డు ఇచ్చి 150 రోజుల పని కల్పించాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద 5% యూనిట్స్ కేటాయించాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో రాజ్‌కుమార్, నాయకులు మచ్చెందర్, బిస్మిల్లా,శోభమ్మ, వాజీద్‌లు ఉన్నారు. శాంతిభద్రతలపై రాజీపడేది లేదు: ఎస్పీ పటాన్చెరు టౌన్: శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్పీ సందర్శించి పెండింగ్ కేసులు విషయంలో పలు సూచనలు చేశారు. అనంతరం పటాన్చెరు మైనార్టీ నాయకులు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. జిన్నారంలో ఓ వర్గానికి చెందిన విద్యార్థులపై అకారణంగా జరిగిన దాడిపై సంపూర్ణ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడుతూ కోతులు విగ్రహంను ధ్వంసం చేశాయని దర్యాప్తులో గుర్తించి ఆధారాలతో సహా చూపి అందరిలో ఉన్న అపోహలను తొలగించారని తెలిపారు. నేడు న్యాల్కల్లో భూ భారతి సదస్సున్యాల్కల్(జహీరాబాద్): మండల కేంద్రమైన న్యాల్కల్లో భూభారతి–2025 చట్టంపై శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు ఉండనుందని తహసీల్దార్ భూపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆర్డీఓ రాంరెడ్డి, న్యాల్కల్, హద్నూర్ పీఏసీఎస్ చైర్మన్లు సిద్దిలింగయ్యస్వామి, జగనాథ్‌రెడ్డి, ఎంపీడీఓ రాజశేఖర్‌తోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు హజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి రైతులందరూ హాజరు కావాలని తహసీల్దార్ కోరారు. డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం పటాన్చెరు టౌన్: డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు. మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు పెద్దకంజర్లలో అడ్మిషన్ తీసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు గురుకుల నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్ కల్పించనున్నట్లు చెప్పారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, విద్య, యూనిఫాం, ఉచిత ఎగ్జామినేషన్ ఫీజు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94948 24692, 80080 70959 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. -
పహల్గాం దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ
సదాశివపేట(సంగారెడ్డి)/జోగిపేట (అందోల్): జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ సదాశివపేట, జోగిపేటలో పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కాగాడాలు, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఉగ్ర దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక జోగిపేటలో ధార్మిక సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ నుంచి హనుమాన్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. -
ఆటలాడుకుందాం రండి
● మే 1 నుంచి వేసవి శిబిరం ప్రారంభం ● ఈనెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ సంగారెడ్డి జోన్: పాఠశాలలకు సెలవులు ప్రకటించటంతో విద్యార్థులకు క్రీడలపై శిక్షణ అందించేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది. ప్రతీ ఏడాది మాదిరిగానే పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటు చేసి, శిక్షణ అందించనున్నారు. ఇప్పటికే శిక్షణ అందించే కేంద్రాలను గుర్తించారు. అదేవిధంగా శిక్షణ అందించే కోచ్‌లను సైతం నియామకం చేసింది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో రాణించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెలరోజులపాటు కార్యక్ర మాలు వేసవి శిక్షణ కార్యక్రమాలు మే 1న ప్రారంభమై మే 31 వరకు కొనసాగనున్నాయి. నెల రోజులపాటు యువతకు ఆసక్తి ఉన్న క్రీడలలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. శిక్షణ పూర్తి అయిన తర్వాత యువతకు శాఖ తరఫున సర్టిఫికెట్లు అందిస్తారు. 14 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలకే... క్రీడా శిబిరాలలో14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలకు మాత్రమే శిక్షణ అందిచనున్నారు. ఆసక్తి గల బాల, బాలికలు ఈ నెల 31 వరకు జిల్లా క్రీడల అధికారి ఫోన్ నం:7981798957 కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పలు క్రీడలపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లో బాక్సింగ్, కిక్ బాక్సింగ్, అథ్లెట్స్, కబడ్డీ, చెస్, ఫుట్‌బాల్ పట్ణణ ప్రాంతాలలో హ్యాండ్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, వుషు క్రీడలలో శిక్షణ కల్పించనున్నారు. గ్రామీణప్రాంతాల్లో 10..పట్టణ ప్రాంతాల్లో 12 జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో 10, పట్టణ ప్రాంతాలలో 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాల నిర్వహణకు రూ.50వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. క్రీడా సామగ్రి కొనుగోలుతోపాటు శిక్షణ అందించే కోచ్‌లకు పారితోషికంగా రూ.4వేలు అందించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను 14 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 22 కేంద్రాలను ఏర్పాటు చేశాం. మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. –ఖాసీం బేగ్, జిల్లా యువజన, క్రీడల అధికారి, సంగారెడ్డి -
చెక్‌బౌన్స్ కేసులపై లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: బ్యాంకులో చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టు కార్యాలయంలో గురువారం బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బ్యాంకు కేసులు రాజీమార్గంతో పరిష్కరించుకోవచ్చని, కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
శుభకార్యంలో ఈదురు గాలుల బీభత్సం
● ఎగిరిపోయిన షామినాయా, టెంట్లు, ఇనుప రేకులు ● తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న బంధువులు నారాయణఖేడ్: ఈదురు గాలుల బీభత్సం ఓ వివాహ శుభకార్యంలో కొద్దిసేపు బంధుమిత్రులను ఆందోళనకు గురిచేసింది. మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో ఓ మాలిపటేల్ కుమారుడి వివాహం గ్రామంలో నిర్వహించారు. ఇంటి ఆవరణలో టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. వివాహం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో అక్కడ వేసిన టెంట్లు, షామియానా, సమీపంలోని షెడ్డుపై రేకులు గాలిలోకి ఎగిరిపోయాయి. టెంట్లు కూలిపోవడంతో బంధువులు, మిత్రులు వాటి కిందనుంచి బయటకు పరుగులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి సైతం టెంటు కింద చిక్కుకుపోగా ఇతరుల సహాయంతో బయటపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. షెడ్డు రేకులు దూరంగా పడటంతో తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థంలో సీఎం రేవంత్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో బుధవారం జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి–గుణచైతన్యరెడ్డి నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డికి చేరుకున్న రేవంత్‌రెడ్డి ముందుగా రాంనగర్లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిశ్చితార్థ కార్యక్రమానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డితోపాటు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, సీనియర్ నాయకులు వి.హన్మంతరావు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ క్రాంతి, ఎస్పీ పరితోశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం హోదాలో తొలిసారి రాక.. రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో తొలిసారి సంగారెడ్డికి వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి వచ్చారు. -
సాగు చట్టాలపై అవగాహన ఉండాలి
వ్యవసాయ అధికారి శివప్రసాద్జహీరాబాద్ టౌన్: వ్యవసాయ చట్టాలపై డీలర్లకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. మండలంలోని రంజోల్ రైతు వేదికలో బుధవారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందు చట్టాలపై డీలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులే లక్ష్యంగా వ్యవసాయ చట్టాలు తయారు చేసినట్లు చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాల ని వివరించారు. దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. విత్తనాలు కొంటే ఎరువులు ఇస్తామని ఎవరైనా డీలర్లు రైతులకు షరతులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రోజు వ్యవసాయ అధికారులు దుకాణాలను తనిఖీలు నిర్వహిస్తారని, వారికి సహకరించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో విత్తనాల కొరతలేదని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ అధికారులు లావణ్య,అభినాష్ వర్మ, హసునుద్దీన్, వినోద్‌కుమార్,రంజోల్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రదీప్‌కుమార్ నియోజకవర్గంలోని డీలర్లు పాల్గొన్నారు. -
భూ భారతిపై రైతులకు అవగాహన
మునిపల్లి(అందోల్)/కంది (సంగారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి పథకంను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ హరినందన్‌రావు, తహసీల్దార్ గంగాభవానీ, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భూ భారతి పథకంపై అవగాహన సదస్సు కలెక్టర్ పాల్గొన్నారు. అంతకుముందు కంది మండలంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధిస్తారని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శబడి పథకం ద్వారా పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతులు చేపడుతుందని చెప్పారు. విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, డ్రెస్సుల ను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కందిలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి తహసీల్దార్ ఆశాజ్యోతితోపాటు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ రేవతి, ఆర్ఐ సుభాష్, శృతి, కార్యాలయ సిబ్బంది శశాంక్, చందు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
పాఠ్య పుస్తకాలు సిద్ధం!
● జిల్లాలో 9,86,120 పుస్తకాలు అవసరం ● ఇప్పటికి చేరినవి 2,22,820 ● పాఠశాలలు ప్రారంభం రోజునాటికి అందించేలా చర్యలు కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం 2025–26కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. జూన్ 12న పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్య లు చేపడుతోంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పనులు చేపడుతోంది. ఇందులోభాగంగానే విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందిస్తోంది. గతేడాది పాఠ్యపుస్తకాలు ముద్రణ ఆలస్యంగా జరగడంతో విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించలేకపోయారు. గత విద్యా సంవత్సరం అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈసారైనా పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు అవసరమైన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిలో పుస్తకాల ముద్రణ చేపట్టారు. క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జిల్లా, మండలం, పాఠశాల పేరుతో ఆన్లైన్లో సమాచారం వచ్చేస్తుంది. జిల్లాలో 1,17,238 మంది విద్యార్థులు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1,17,238 మంది విద్యార్థులు చదువుతున్నారని గుర్తించారు. 9,86,120 పుస్తకాలు అవసరం ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే 2,22,820 పుస్తకాలు జిల్లాకు చేరాయి. వచ్చిన పుస్తకాలు డీఈఓ సమావేశ మందిరం, పాత ఎస్ఎస్ఏ కార్యాలయాల సమీపంలో గోదాంలలో భద్రపరిచారు. తెలుగు–ఆంగ్లం పద్ధతిలో పుస్తకాలు ముద్రించారు. మేలో పూర్తిస్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పుస్తకాలు వచ్చాక మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. -
రజతోత్సవ సభను విజయంతం చేయాలి
పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి సదాశివపేట(సంగారెడ్డి): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పీఏసిఎస్ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సదాశివపేటలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి ఏర్పడి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, సోషల్ మీడియాలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. కేసీఆర్ బహిరంగ సభ ద్వారా దేశరాజకీయల్లో చర్చ జరుగుతుందన్నారు. ప్రజల మనిషి కేసీఆర్ సభ కోసం ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చీటింగ్ కేసులో అఘోరీ రిమాండ్ ● లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరణ ● తిరిగి కోర్టుకు పంపిన అధికారులు సంగారెడ్డి టౌన్: ఓ చీటింగ్ కేసులో అఘోరీని బుధవారం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్‌లో ఉంచాలో అనే టెన్షన్ మొదలైంది. అయితే లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరించడంతో తిరిగి చేవెళ్ల కోర్టుకు పంపించినట్టు జైలు పర్యవేక్షకులు సంతోష్ రాయ్ తెలిపారు. బొంతపల్లిలో ఇరు వర్గాల ఘర్షణజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల కేంద్రంలో విగ్రహ ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న ఓ వర్గానికి చెందినవారు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి వారిని శాంతింపచేశారు. మరో వర్గం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా చేయడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి ఆయిల్ చోరీ దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టారు. దానిలోని కాయిల్స్, ఆయిల్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు వాటి విలు రూ. 50 వేల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు మల్లమ్మ ఫిర్యాదు మేరకు బేగంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భర్త ఆచూకీ తెలపండిహవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన శశికళ తన భర్త కనిపించడం లేదని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఆమె తన భర్త మహేశ్‌తో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో చాకలి గోపాల్, బండి శోభలు కలిసి శశికళ అత్తమ్మ(64)ను మార్చి 25న బంగారు ఆభరణాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందుబాబులకు జరిమానా సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి పాత బస్టాండ్‌వద్ద, జాతీయ రహదారి, బైపాస్‌లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరికి రూ.2వేలు, మిగతా నలుగురికి రూ.1,500 చొప్పున జరిమానా విధించారు. -
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
● 2024–25లో రూ.26 లక్షలు పడిపోయిన రాబడి ● డాక్యుమెంట్ల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం ● రియల్ఎస్టేట్ రంగం సంక్షోభమే కారణమంటున్న అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ఎస్ఆర్ఓ కార్యాలయాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా తగ్గింది. అలాగే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా కొంతమేరకు పడిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో రూ.25.74 లక్షలు తగ్గింది. 2023–24లో మొత్తం 1.29 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,135.19 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–24లో 1.13 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 1,109.45 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో కీలకమైంది. రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆస్తి విలువలో సుమారు 7.5% మొత్తాన్ని ఈ రిజిస్ట్రేషన్ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తుండగా... ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం పడిపోవడం గమనార్హం. రియల్ రంగం కుదేలే కారణం! రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టింది. ఇందుకు ఈ రంగం సంక్షోభమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వెంచర్లలో నివాస స్థలాల క్రయవిక్రయాలు చాలా మట్టుకు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న వెంచర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ఉన్న వెంచర్లలోనే నివాస స్థలాలను కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయారు. దీంతో చాలా వెంచర్లలో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. అలాగే ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ అవసరాల కోసం విక్రయిద్దామంటే కూడా కొనుగోలుదారులు లేకుండా పోయారు. సెకండ్ సేల్ కూడా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. దీనికితోడు రియల్ వ్యాపారులు నివాస స్థలాల రేట్లను విపరీతంగా పెంచడంతో సామాన్యులు ప్లాట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అపార్టుమెంట్లు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు కూడా పడిపోయాయి. ఇలా రియల్ రంగం సంక్షోభం ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయంపై స్పష్టంగా కనిపిస్తోంది. అనధికారిక లే అవుట్ రిజిస్ట్రేషన్లపై నిషేధంతో.. అనధికారిక లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్లను చేయకూడదని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ను ఆదేశించిన విషయం విదితమే. ఇది కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణమని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు. -
పోలీసు దిగ్బంధంలో జిన్నారం
● ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు ● పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ పంకజ్ జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల కేంద్రాన్ని పోలీసులు ఎక్కడికక్కడ దిగ్బంధం చేశారు. గ్రామంలోని తాంబేలు గుట్టపై విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లను చేపట్టారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశాల మేరకు 163 సెక్షన్ విధించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతాబలగాలతో పహారా చేపట్టారు. జిన్నారం గ్రామానికి వచ్చే నలుమూలల వద్ద పోలీసు బలగాలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. -
వాన నీటిని ఒడిసిపట్టేందుకు..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్‌షెడ్ పథకం మంజూరైంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తారు. జిల్లాకు మంజూరైన పిచెర్యాగడి వాటర్‌షెడ్ ప్రాజెక్టు కింద 8 గ్రామాలను ఎంపిక చేశారు. అత్యంత తక్కువగా భూగర్భ జలాలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించిన ప్రాంతాలను వాటర్‌షెడ్ పథకం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచి కరువును పారద్రోలనున్నారు. ఈ ప్రాజెక్టు కింద జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాగడి, బడంపేట, పర్శపల్లి, సజ్జాపూర్, కొత్తూర్(కె), ఖానాపూర్, మాచిరెడ్డిపల్లి, రాజనెల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా వాటర్‌షెడ్ పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరు కావాల్సిన ప్రాజెక్టుకు ఆలస్యంగా 2024లో మంజూరైంది. ఆరు నెలల పాటు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పథకం కింద 4,733 హెక్టార్ల భూమిలో వాటర్‌షెడ్ పనులను చేపట్టేందుకు గుర్తించారు. ప్రాజెక్టు మంజూరైనందున ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో మూడు శాతం మేర పనులు చేశారు. పర్శపల్లిలో 6, సజ్జాపూర్‌లో 3 శాతం మట్టి పర్క్యులేషన్ ట్యాంకుల పనులు కొనసాగుతున్నాయి. వాటర్‌షెడ్ పనుల కోసం 49 శాతం నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో గుట్టలపై మట్టి కట్టలు వేసి వర్షపునీరు ఎక్కడికక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపడతారు. మిగిలిన నీరు కూడా ఇంకిపోయేందుకు కందకాలను, మట్టి సర్కులేషన్ ట్యాంకులను నిర్మిస్తారు. వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాలు పెంచేందుకు వీలుగా వాటర్‌షెడ్ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు అవసరమైన పరికరాలకు నిధులు.. సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించి, ఉత్పాదకత పెంచేందుకు వీలుగా రైతులకు అవసరమైన పరికరాలను అందించేందుకు వీలుగా 15 శాతం నిధులను కేటాయిస్తారు. మరో 15 శాతం నిధులతో పేద, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు గ్రామాల్లో ఉన్న సంఘాల ద్వారా అమలు చేస్తారు. ముఖ్యంగా స్వయం ఉపాధి, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి వ్యవసాయేతర ఉపాధిని ఈ పథకం కింద కల్పిస్తారు.జిల్లాకు కొత్త వాటర్‌షెడ్ పథకం పిచెర్యాగడి ప్రాజెక్టు కింద 8 గ్రామాల ఎంపిక భూగర్భ జలాలు తక్కువగా ఉన్న గ్రామాలకు చోటు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు 4,733 హెక్టార్లలో పనులు మూడు శాతం మాత్రమే జరిగిన పనులు -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలు భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన అవుసుల శ్రీకాంత్ (26) నార్సింగి గ్రామంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఆరేళ్ల క్రితం బాచుపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 21న భార్య, అతని తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎవరిని ఏమనలేక , బయటకు వెళ్లిన శ్రీకాంత్ పెట్రోల్ తీసుకొని వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని మెదక్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై .. సంగారెడ్డి క్రైమ్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పట్టణ సీఐ రమేశ్ కథనం ప్రకారం... పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన మార్కంటి దేవదాసు (50), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం మహరాష్ట్ర నుంచి పట్టణానికి వచ్చి, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య లక్మీభాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం భార్య లక్మీభాయి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. మధ్నాహ్యం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా దేవదాసు తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై సరిగా పని చేయడం లేదని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గడి ్డ మందు తాగి.. సిద్దిపేటకమాన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గ్రీన్ కాలనీకి చెందిన నర్సింహారెడ్డి టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. అతడు వ్యాపార నిర్వహణ కోసం అవసరాల నిమిత్తం చిట్ ఫండ్లలో, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక, మానసికంగా ఇబ్బంది పడుతూ టింబర్ డిపోలో మంగళవారం గడ్డి మందు తాగాడు. గమనించిన అతడి కుమారుడు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెట్రోలు పోసుకొని ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు లారీని ఢీకొట్టిన మహిళా ఆర్ఎంపీ.. చేగుంట(తూప్రాన్): ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా ఆర్ఎంపీ మృతి చెందింది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీ సబ్ స్టేషన్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారానికి చెందిన కమ్మరి మంజుల(45) ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. మంజుల కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఉంటున్న కూతురు శృతిలయను చూసేందుకు స్కూటీపై వెళ్లింది. బుధవారం తిరుగు ప్రయాణంలో స్కూటీపై వస్తుండగా రెడ్డిపల్లికాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో.. హవేళిఘణాపూర్(మెదక్): ఆగి వున్న లారీని ఆటో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని శాలిపేట గేటు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హవేళిఘణాపూర్ మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన ఆటోలో మెదక్ నుంచి 12 మంది ప్రయాణికులు బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిఽధిలోని శాలిపేట గేటు శివారులోకి రాగానే నిలిచి ఉన్న ఇనుప రాడ్ల లోడ్‌తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాలిపేట గ్రామానికి చెందిన లక్ష్మి(54) అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ రాములుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా గుండారానికి చెందిన పెంటి, శ్రీకాంత్‌లకు మెదక్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఉన్న మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భర్త యాదగిరి, ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు.. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని జప్తిశివనూర్ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి యువకుడు డివైడర్‌ను ఢీకొట్టి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా అక్బర్పేట –భూపంల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన వల్లెపు సంతోష్(28) తన పెద్దమ్మ కుమారుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి బైక్‌పై గండిమైసమ్మ నుంచి కామారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో జప్తిశివనూర్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైఢర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా సంతోష్ మృతి చెందాడు. రాజు కాలు విరగడంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
షెడ్డుకు మరమ్మతులు చేపట్టండి
కంది(సంగారెడ్డి): డంప్‌యార్డు షెడ్డుకు మరమ్మతులు నిర్వహించి చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని డీపీఓ సాయిబాబా పంచాయితీ అధికారులకు సూచించారు. మండల పరిధిలోని బుధవారం కవలంపేటలోని డంప్‌యార్డు శిథిలావస్థలో ఉండటాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో శిథిలావస్థకు చేరిందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం వేసవికాలం ఉన్నందున నీటి కొరత లేకుండా చూడాలన్నారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించి నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎల్పీఓ అనిత, ఎంపీఓ మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.డీపీఓ సాయిబాబా -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
నారాయణఖేడ్: ఉతికిన బట్టలు ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి థనం ప్రకారం.. ఖేడ్ మండలం హుక్రానా(జి) గ్రామానికి చెందిన రావుల స్వప్న (30) బుధవారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఉతికి ఆవరణలో దుస్తులు ఆరబెట్టడానికి కట్టిన పాత టీవీ కేబుల్ తీగపై దుస్తులను ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కిందపడిపోయింది. కుటుంబీకులు ఆమెను ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త రావుల హన్మారెడ్డి, ఈమధ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న కుమారుడు సాయిచరణ్ రెడ్డి, 8వ తరగతి పూర్తిచేసుకున్న కూతురు భార్గవి ఉన్నారు. దుస్తులు ఆరవేయడానికి కట్టిన కేబుల్ తీగకు వైర్లు తేలిన విద్యుత్తు తీగ తగిలి విద్యుదాఘాతతానికి గురైనట్లు భావిస్తున్నారు. స్వప్న మృతితో గ్రామంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. -
మంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం
పిచెర్యాగడికి వాటర్‌షెడ్ ప్రాజెక్టు పథకం మంజూరైనా ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు లేకపోవడంతో మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. చేసిన పనులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. శనివారం పిచెర్యాగడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్‌షెడ్ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.1.56కోట్ల చెక్కును ఉపాధి కోసం అందజేశారు. మంత్రి కార్యక్రమంతో నిధులు విడుదలై వాటర్‌షెడ్ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రైతులు, లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. -
కూతుర్ల మృతికి కారకురాలైన తల్లిపై కేసు నమోదు
తూప్రాన్: కూతుర్ల మృతికి కారకురాలైన తల్లిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందం మంగళవారం తెలిపారు. పట్టణ సమీపంలోని హల్దీవాగులో మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత తన ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్వీని(5)ని హల్దీవాగులో తోసి తాను కూడా ఆత్మహత్యాయత్నంకు యత్నించి ప్రాణాలతో బయట పడిన విషయం తెలిసిందే. ఇద్దరు చిన్నారుల మృతికి తల్లి కారణమని ఎస్ఐ తెలిపారు. నిందితురాలి మరిది పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కరాటే పోటీల్లో ప్రతిభమెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్లో రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెదక్ జిల్లా స్థాయి కరాటే బిల్ట్ ఎగ్జామ్‌లో విద్యార్థులు ప్రతిభ కనర్చినట్లు కరాటే మాస్టర్ దినాకర్ తెలిపారు. సుమారు 100 మంది విద్యార్థులు వివిధ మండలాల నుంచి పాల్గొని ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులకు రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా వ్యస్థాపక అధ్యక్షుడు మాస్టర్ నగేశ్ బెల్టులు ప్రధానం చేశారు. నితన్య సిరి, ఐశ్వర్య, అక్షర, విశిష్ట రాజ్, సూరజ్, అబ్దుల్లా, అఖిల్, రిషి, స్వరూప్ సింగ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ.. విద్యార్థి దశ నుంచే మంచి క్రమ శిక్షణ అలవర్చుకుంటేనే నిజ జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్క ృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి భాస్కర్, ఎంఈఓ అంజాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ వడ్ల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ ఉమారాణి, నాయకులు బాలాగౌడ్, నర్సింహులు, ఎర్త్ ఫౌండేషన్, ప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అల్లుకున్న ‘నిర్లక్ష్యం
సంగారెడ్డిలో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. కరెంట్ స్తంభాలకు మొక్కలు తీగలా అల్లుకున్నాయి. ఇలాగే వదిలేస్తే మొక్కలు తినడానికి వచ్చిన పశువులు విద్యుత్ తగిలి చనిపోయే అవకాశం ఉంది. మనుషులు సైతం అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాల బారిన పడుతారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పిచ్చి మొక్కలు తొలగించి, స్తంభాలకు ఉన్న అల్లికలు, తీగలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
పిల్లలను బడిలో చేర్పించాలి
హుస్నాబాద్‌రూరల్/ మద్దూరు(హుస్నాబాద్): పిల్లలను మన ఊరు బడిలోనే చేర్పించి నాణ్యమైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులతో కలిసి పని చేయించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పొట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మద్దూరు మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామస్తుల సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని, పిల్లల సంఖ్యను కూడ పెంచడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనీల, హెచ్ఎంలు స్వరూప, వాసుదేవారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మద్దూరు కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌శర్మ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుంటిపల్లి కనకమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, ఉపాధ్యాయులు సరళ, అనురాధ, శిరీష, వెంకట్రాజు, బాల్ రాజు, రవితేజ పాల్గొన్నారు.– డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి -
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
దుబ్బాకరూరల్: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని చీకోడ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజ్ కథనం మేరకు.. తౌడ ఏగొండ, భూదవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాబు(25) గ్రామ శివారులో ఉన్న చెరువులోకి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ చెరువులోకి చాలా దూరం వెళ్లి నీటిలో మునిగి పోయాడు. గమనించిన స్నేహితులు చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఏగొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చేతికొచ్చిన కొడుకు చెరువులో మునిగి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మద్యం మత్తులో వెళ్లి.. కొమురవెల్లి(సిద్దిపేట): మద్యం మత్తులో ఈత కొట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్ఐ రాజు కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి కనకయ్య(50) కుటుబంతో కలిసి హైదరాబాద్‌లో పాత ఇసుప సామగ్రి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పెద్ద కుమారుడుకి కొడుకు పుట్టడంతో బారసాల నిర్వహించేందుకు గ్రామానికి వచ్చారు. ఆదివారం బారసాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మంగళవారం కుటుంబంతో కలిసి మద్యం సేవించారు. మధ్యాహ్న సమయంలో స్నానం చేసేందుకు గ్రామ శివారులో గల పెద్ద బావి వద్దకు వెళ్లాడు. నీటికిలోకి దూకిన కనకయ్య ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుమారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దుబ్బాకలో యువకుడు, కొమురవెల్లిలో వ్యక్తి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం -
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హుస్నాబాద్‌రూరల్: జిల్లెలగడ్డ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన సాయి ప్రకాశ్ (29) చేయూత స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. చిన్నమ్మ ఓ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధంను గుర్తించిన సాయి ప్రకాశ్ కానిస్టేబుల్‌పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఆరు నెలల తర్వాత విధుల్లో చేరిన కానిస్టేబుల్ ప్రియురాలితో కలిసి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న సాయి ప్రకాశ్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానిస్టేబుల్ ఓ సుఫారీ గ్యాంగ్‌ను మాట్లాడి సాయిని హత్య చేసే పనిని అప్పగించాడు. 15న వెంకటాపూర్ నుంచి సాయి ప్రకాశ్ కారులో బంధువులను హన్మకొండ హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో ప్రకాశ్ కారును రెండు ఆటోల్లో సుఫారీ గ్యాంగ్ వెంబడించింది. ములుగు రోడ్డులో కిడ్నాప్ చేసి కారులో హసనుపర్తి వద్దనే హత్య చేశారు. సాయి కారులోనే హన్మకొండ జిల్లా సరిహద్దు దాటి హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో రాత్రి ఒక వ్యవసాయ బావిలో మృతదేహం పడేసి వెళ్లిపోయారు. 17న సాయంత్రం రైతు తన బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి హుస్నాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జిల్లెలగడ్డలోని ఇటుక బట్టీల దగ్గర సీసీ కెమెరాలో ఫుటేజీను పరిశీలించారు. రాత్రి కారు వచ్చి వెళ్లిన దృశ్యాల ఆధారంతో పోలీసులు కేసును ఛేదించారు. కిడ్నాపు చేసి హత్య చేసిన సుఫారీ గ్యాంగ్‌ను హన్మకొండ పోలీసులు అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ పోలీసులు పేర్కొన్నారు. యువకుడి దారుణ హత్య మృతుడు ములుగు జిల్లా వాసి వరంగల్‌లో కిడ్నాప్ చేసి జిల్లెలగడ్డలో బావిలో పడేసిన వైనం గుర్తు తెలియని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు -
బిడ్డ చదువు కోసం ఆరాటం
విజయ ఒక్కగానొక్క కూతురు సాత్విక.. ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. కట్టుకున్న భర్త దూరం అయ్యాక.. బిడ్డ భవిష్యత్ కోసం ఆమె పడుతున్న తపన వర్ణనాతీతం. ఎన్ని కష్టాలు వచ్చినా సాత్విక చదువుకు ఆటంకం రాకుండా ఉన్నదాంట్లో సర్దుకుపోతుంది. భర్త బతికి ఉన్నప్పుడు రెండో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదివించింది. భర్త దూరం అయ్యాక ప్రైవేటు విద్య ఆర్థికంగా ఇబ్బంది కావడంతో రెండేళ్లు ఆకారం ప్రభుత్వ పాఠశాలలో చేర్చింది. తిరిగి సిద్దిపేటకు బతుకు దెరువు కోసం వచ్చి పిండి గిర్ని నడుపుతూ బతుకును వెళ్లదీస్తుంది. మొదట్లో చదివిన స్కూల్లో సాత్వికను చేర్పించి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారం, చేయూతతో కూతురు చదువుకు ఆటంకం లేకుండా చదువు సాఫీగా సాగుతుంది.. -
పిడుగుపాటుకు గేదెలు మృతి
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన రైతు కోర్పతి కృష్ణ రెండు గేదెలు మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. దీంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు వాపోయాడు. వ్యవసాయానికి పాడి సంపద ఉపాధిగా ఉండేదని పిడుగుపాటుతో వాటిని కోల్పోవడం వల్ల విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ధర్మారంలో మరో గేదె మిరుదొడ్డి(దుబ్బాక): పిడుగు పాటుకు పాడి గేదె మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ధర్మారంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గూళ్ల బాగులు రోజు మాదిరిగానే పాడి గేదెను వ్యవసాయ పొలం వద్ద కట్టి వేశాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడటంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. పాడి గేదె మృతితో సుమారు రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
మహానందిలో మల్లుపల్లి వాసి ఆత్మహత్య
మిరుదొడ్డి(దుబ్బాక): మిత్రులతో కలిసి సరదాగా విహార యాత్రకని వెళ్లిన యువకుడు అక్కడ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల చిన్న బోయ రాజు (36) కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పని చేస్తూ భార్య సుమలతతోపాటు, ఆరేళ్లలోపు కుమారుడు, కూతురిని పోషించుకుంటున్నాడు. 17న ఉమ్మడి మండల పరిధిలోని 14 మంది కేబుల్ ఆపరేటర్లందరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా మహానందిలో మంగళవారం సాయంత్రం దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం టెంపుల్‌కు సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్‌కు రాజు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.విహారయాత్రకు వెళ్లి ఉరేసుకున్న యువకుడు -
విజయ తీరం వైపు..
కష్టాల కడలిలో...కూతురు చదువు కోసం ఓ తల్లి ఆరాటంఏడడుగులు తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన పతిని విధి దూరం చేసింది. ఇంటి పెద్ద లేకపోవడంతో బాధ్యతలు భుజాన పడ్డాయి. పండుగొస్తే రెండు పూటలా భోజనం.. సాధారణ రోజుల్లో ఒక్క పూట తిండి గగనం.. మరోవైపు ఎదుగుతున్న ఆడపిల్లను చదివించడం ఒక పోరాటం.. ఆర్థిక పరిస్థితి బాగాలేక, అటు కన్నవారు, ఇటు కట్టుకున్న వారు ఆర్థికంగా లేక జానెడు పొట్ట కోసం బతుకు పోరాటం చేస్తున్న విజయ కష్టాల కడలిలో తీరం వైపు కదులుతుంది.. మనసున్న మహారాజులు చేయూత ఇస్తే నా కూతురు చదువుకు సాయం చేసిన వారు అవుతారని కోరారు. – సిద్దిపేటజోన్ పెద్దపల్లి జిల్లాకు చెందిన విజయకు సిద్దిపేట జిల్లా ఆకారానికి చెందిన నాగరాజుతో 2011లో వివాహం జరిగింది. ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండటంతో నాగరాజు 10 ఏళ్ల క్రితం సిద్దిపేట పట్టణానికి బతుకు దెరువు కోసం వలసొచ్చాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీలో చిరు ఉద్యోగం సంపాదించి భార్య బిడ్డను పోషిస్తున్నాడు. సజావుగా సాగుతున్న వీరి జీవితం పై విధి పగ పట్టింది. 2020లో కరోనా వ్యాప్తి ప్రబలుతున్న సమయంలో బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. అక్కడి నుంచి విజయ కష్టాలు మొదలయ్యాయి కట్టుకున్న భర్త దూరం కావడంతో సిద్దిపేటలో జీవనం కష్టతరంగా మారడంతో మెట్టినిల్లు ఆకారం గ్రామానికి తిరిగి వెళ్లింది. రెండేళ్ల తర్వాత మళ్లీ సిద్దిపేటకు బతుకు దెరువు కోసం వచ్చింది. చదువు అంతంతే ఉండటంతో విజయకు ఉపాధి అవకాశాలు లభించలేదు. పట్టణంలోని పలు చోట్ల కిరాయి ఇంట్లో ఉంటూ కూతురిని చదివిస్తూ బతుకు పోరాటం చేస్తుంది. మోటివేషన్లో కంటతడి ఇటీవల వేలాది మంది విద్యార్థులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు.. పిల్లల బాధ్యత గురించి మోటివేషన్ ప్రక్రియ నిర్వహించారు. వారి మోటివేషన్ విన్న సాత్విక తల్లీ విజయ తన కోసం పడుతున్న తపన గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టింది. ఇదే సభలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఒక్కసారిగా కంటతడి పెట్టిన వైనం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బాగా చదువుకోవాలి అమ్మ నా చదువు కోసం పడుతున్న కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. అమ్మ కష్టాలు శాశ్వతంగా తీరాలి అంటే నేను బాగా చదువుకోవాలి. పెద్ద అయ్యాక ప్రొఫెసర్ అవుతా.. కానీ ఇప్పుడు చదివేందుకు మా అమ్మ వద్ద డబ్బులు లేవు అంటూ అమాయకంగా తమ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పింది సాత్విక.పిండి గిర్ని పడుతున్న విజయ ఒంటరిగా బతుకు పోరాటం ఒడిదుడుకుల జీవితం.. తీరని దుఃఖం ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు సిద్దిపేట జిల్లా ఆకారానికి చెందిన విజయ కన్నీటి గాథ పిండి గిర్ని జీవనాధారంగా.. స్థానికంగా ఎన్టీఆర్ నగర్ కాలనీలో రెండు గదుల కిరాయి ఇంట్లో ఉంటున్న విజయ జీవనాధారం పిండి గిర్ని మాత్రమే.. చిన్నపాటి రేకుల షెడ్లో గిర్ని పెట్టుకొని బతుకు దెరువు సాగిస్తోంది. సమీపంలో ఉన్న వారు తెచ్చిన వాటిని పిండిగా మార్చి వారిచ్చే కొద్దిపాటి డబ్బులతో బతుకు బండిని నడిపిస్తుంది. నెలవారీ ఖర్చు అధికంగా ఉండడం.. పిండి గిర్ని ద్వారా వచ్చే ఆదాయం అంతంతే కావడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక నిత్యం జీవితంతో పోరాటం చేస్తోంది.కూతురు కోసమే.. భర్త దూరం అయ్యాడు... పుట్టినిల్లు. మెట్టినల్లు వారు ఆర్థికంగా లేరు. ఒక్కగానొక్క కూతురు చదువు కోసం కష్టపడాలి. తప్పదు. గిర్ని మీద వచ్చేది అంతంత మాత్రమే. రెక్కాడితే కానీ ఇల్లు, పిల్ల చదువు నడిచే పరిస్థితి. సాత్విక చాలా చురుకుగా ఉంటుంది చదువులో రాణిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. – బోయ విజయ -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొల్చారం(నర్సాపూర్):ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులో రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందితో ఆరా తీశారు. వై ద్యం కోసం వచ్చిన రోగులను పలకరించి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో రోగులకు అసౌకర్యం కలిగించొద్దని సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి అంశాన్ పల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ సెంటర్‌ను సందర్శించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, నర్సాపూర్ డివిజన్ వైద్యాధికారి సజన, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్, ఎంపీహెచ్‌ఓ మదన్ మోహన్, సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ కొల్చారం పీహెచ్సీ తనిఖీ -
కాలుష్యం
కమ్మేస్తున్న కాలుష్యం నుంచి కాపాడండి పరిశ్రమల నుంచి నిరంతరం వెలువడుతున్న వాయు కాలుష్యంతో జీవన పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆందోళన పడుతున్నాం. పిల్లలు మహిళలు ఘాటైన వాసనలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. మా ప్రాణాలను రక్షించండి. – ఇమ్రాన్, బొల్లారం కాంగ్రెస్ నాయకులు పీసీబీ అధికారుల చర్యలు శూన్యం సా్థనికంగా వెలువడుతున్న విష వాయువులు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేరు. సమస్య తీవ్రతరంగా మారుతున్న నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మద్దూరి పెంటేశ్, బీఆర్ఎస్ నాయకులుజిన్నారం (పటాన్చెరు): వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకరంగా మారుతోంది. బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమలు విచ్చలవిడిగా విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే జల కాలుష్యం పెద్ద ఎత్తున ఉండగా దానికి తోడు వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకునే అవకాశాలను సైతం విష వాయువులను విడుదల చేస్తూ హరించేస్తున్నారు. సామాన్య ప్రజల జీవన విధానం పైనే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం రసాయన పరిశ్రమలు విగాధం కలిగిస్తున్నాయి. రసాయన విష వాయువులు గాలిలోకి.. పారిశ్రామిక వాడకు చెందిన పలు పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరిశ్రమల పొగ గొట్టాల ద్వారా పెద్ద ఎత్తున రసాయన విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వాయువులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను కలుషితం చేస్తూ సామాన్య ప్రజలను ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేసిన పీసీబీ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఫిర్యాదులను పెడచెవిన పెట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు విషవాయువులు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు వృద్దుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక విషవాయువులు కళ్లలో మంటలు పుట్టిస్తూ, ముక్కుపుట్టలు అదిరేలా చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమలను గుర్తించి విషవాయువులను నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పారిశ్రామిక వాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా బొల్లారంపారిశ్రామిక వాడ విచ్చలవిడిగా వాతావరణంలోకివిష వాయువులు ఘాటైన వాసనలతో జనాల్లోఅనారోగ్య సమస్యలు పట్టించుకోని పీసీబీ యంత్రాంగం -
సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి
కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రం కొల్చారంలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యను ప్రజలు, యువత సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం గ్రామంలో వివాదాస్పదంగా మారిన అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలంను వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ను, శివాజీ మహారాజ్‌ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొదట పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేయాలనడం సబబు కాదన్నారు. ముందస్తుగానే గ్రామస్తులు ఈ విషయమై చర్చించుకోవాల్సి ఉండేదన్నారు. విగ్రహం ఎదుట మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఇబ్బంది కలిగించడమేనని పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్ ఈ విషయంలో గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ గౌస్,దళిత సంఘాల నాయకులు ఉన్నారు. ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య కొల్చారంలో విగ్రహ ఏర్పాట్ల స్థల పరిశీలన -
రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి
హవేళిఘణాపూర్(మెదక్): చరిత్రలో నిలిచిపోయే విధంగా హవేళిఘణాపూర్ విద్యార్థులు పుస్తక రచన చేయడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు రచించిన ‘అమృత గుళికలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సృజనాత్మకత కలిగిన విద్యార్థులు భవిష్యత్‌లో ఏ రంగంలో ఉన్న సమాజ సేవ చేస్తారన్నారు. పుస్తకాలు చదవాల్సిన సమయంలో విజ్ఞానం పొంది పుస్తక రచనలు చేయడం సంతోషమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ స్వాతి, ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్యామల, రవీందర్, మహేశ్వరచారీ, అశోక్, ఎల్లమ్మ, రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డీఈఓ రాధాకిషన్ -
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్‌రికార్డులో సిద్దిపేట చిన్నోడు
మద్దూరు(హుస్నాబాద్): ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో సిద్దిపేట జిల్లా దూల్మి ట్ట మండలం హనుమ తండాకు చెందిన అంతర్జాతీయ పర్వతారోహకుడు జాటోత్ విహాన్‌రామ్‌కు చోటు దక్కింది. ఈ విషయం తండ్రి తిరుపతినాయక్ తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఈ మేరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును జాటోత్ విహాన్‌రామ్ అందుకున్నట్లు తిరుపతి తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, హిమాచల్ ప్రదేశ్‌లోని పాతాల్ పర్వతాన్ని అధిరోహించినందుకు గాను అందించినట్లు తెలిపారు. తన కుమారుడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన కోచ్ లెంకల మహిపాల్‌కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విహాన్ మంచిర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వారెవ్వా .. వైష్ణవి ● అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్‌లో దామరకుంట విద్యార్థిని మర్కూక్(గజ్వేల్): అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్ వారు నిర్వహించిన పోటీల్లో మర్కూక్ మండలం దామరకుంట విద్యార్థిని లింగ వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. దామరకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి ఆదివారం పంజాబ్‌లో నిర్వహించిన పోటీల్లో వైష్ణవి పాల్గొని భౌతిక రసాయన శాస్త్రంలో అత్యంత వేగంగా నిమిషం 59 సెంకడ్లలో ఆవర్తన పట్టిక క్రమ రూపం ఏర్పాటు చేసి బుక్ ఆఫ్ అవార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. సోమవారం ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ సీఈఓ పంకజ్ వేగ్ చేతుల మీదుగా ట్రోఫీ, బహుమతిని అందుకుందని మండల విధ్యాధికారి వెంకట్ రాములు తెలిపారు. వెంకట్రాములు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి పెద్దశంకరంపేట(మెదక్): సనాతన ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత అని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతిస్వామి, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు డాక్టర్ సీఎస్. రంగరాజన్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయ ఉత్సవాల్లో వారు పాల్గొని భక్తులకు ప్రవచనాలందించారు. ఆలయ నిర్మాణంలో ప్రతీ ఇంటి నుంచి కులమతాలకు అతీతంగా భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. గుర్తు తెలియని మహిళ మృతి జహీరాబాద్: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ (45) మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని వికారాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వివరించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సెల్ 84669 38351ను సంప్రదించాలని సూచించారు. కులం పేరుతో దూషణ ● ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు మద్దూరు(హుస్నాబాద్) : కులం పేరుతో దూషించి వ్యక్తిపై దాడి చేసిన వారిపై సోమవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ఖాతా గ్రామానికి చెందిన సోలిపురం బాబు శనివారం మిత్రులు సురేశ్, రాజుతో కలిసి ధూల్మిట్టలో వ్యవసాయ పనులకు కూలీ పనికి వెళ్లారు. తిరిగి వస్తూ బాబు, సురేశ్ వైన్స్ వద్ద గల పర్మిట్ రూంలో మద్యం తాగుతుండగా మహిపాల్‌రెడ్డి కులం పేరుతో బాబును దూషించాడు. కర్రతో దాడి చేయగా తలకు గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో కత్తితోపొడుచుకున్న వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన మండల పరిధి బోజ్య తండాలో చోటు చేసుకుంది. తండా వాసుల కథనం మేరకు.. తండాకు చెందిన గగూలోత్ విఠల్ మద్యం మత్తులో సోమవారం తండాలో జరిగిన తమ్ముడి కూతురు పెళ్లిలో హల్చల్ చేశాడు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులతో గొడవ పడి కత్తితో పొడుచుకున్నాడు. పేగులు బయటకు వచ్చి రక్తస్రావం అవుతున్నప్పటికీ గొడవ చేస్తూనే ఉన్నాడు. తండా వాసులు కత్తిని లాగేసుకొని చికిత్స నిమిత్తం పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
గొయ్యిని పరిశీలించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకొని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి గొయ్యిని పరిశీలించారు. ఆలయం ఆవరణలో అపారమైన నిధి ఉందని చైర్మన్ హన్మాండ్లు చెప్పేవారని కొందరు ఎమ్మెల్యేకు వివరించారు. కొత్త ఆలయ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఘటన జరగడం, పరిస్థితులను బట్టి గుప్తనిధుల కోసమే తవ్వినట్లు ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. త్వరగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. తవ్వకాల విషయంలో కేసు నమోదు చేసి సమగ్రవిచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు.విశ్వనాథస్వామి ఆలయఆవరణలో భారీ గొయ్యి ● చైర్మన్‌పై భక్తుల ఆగ్రహం ● ఎమ్మెల్యే, పోలీసుల పరిశీలన ● పోలీసుల అదుపులో చైర్మన్నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని విశిష్ట చరిత్రగల ప్రాచీన కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఆవరణలో గొయ్యి తవ్వకం కలకలం సృష్టించింది. గుప్త నిధుల కోసమేనని భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీ విశ్వనాథస్వామి ఆలయ ముఖద్వారం ఎదుట ఉన్న మండపానికి ఆనుకొని దాదాపు ఐదు అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యిని తవ్వారు. దానిపై పాత గేటు గ్రిల్ వేసి, గొయ్యి కనిపించకుండా ఉండేందుకు గడ్డి, చెట్ల పొదలతో కప్పి ఉన్న విషయాన్ని సోమవారం ఆలయానికి వచ్చిన భక్తులు గుర్తించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మాండ్లును పిలిపించగా పూజకు వాడిన పూలను వేసేందుకు ఆదివారం తానే అడ్డా కూలీలతో తవ్వించినట్లు తెలపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయంలో అధికారుల అనుమతి లేకుండా, కమిటీలోని ఇతర బాధ్యులకు తెలపకుండా ఎలా తవ్వించారని భక్తులు ప్రశ్నించారు. పూలను వేసేందుకై తే అంత పెద్ద గొయ్యి, అదీ మండపానికి ఆనుకొని దాని పునాదులు కూలే అవకాశం ఉండేలా తవ్వించడం.. పైగా కనపడకుండా పైన గ్రిల్పెట్టి పొదలతో కప్పిఉంచడంలో ఆంతర్యం ఏంటని భక్తులు నిలదీశారు. ఇద్దరు కూలీలతో తవ్వించినట్లు చెబుతుండగా నలుగురితోపాటు ఓ బాబా సైతం ఉన్నట్లు అక్కడున్న వారు చెప్పడంతో గుప్త నిధుల కోసమే తవ్వించారని భక్తులు ఆరోపించారు. విషయం తెలుసుకొని ఎస్సై–2 మెగులయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. విచారణ నిమిత్తం చైర్మన్ హన్మాండ్లును స్టేషన్‌కు తరలించారు. -
మొక్కజొన్న సాగుపై ఆరా
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని హరిదాసుపూర్లో సోమవారం సౌదీ అరేబియా రైతులు పర్యటించారు. గ్రామంలోని రైతులను కలిసి జొన్న పంట సాగు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరాల్లో జొన్న సాగుచేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్ జొన్న పంటకు డిమాండ్ ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు. జొన్న సాగు చేయడానికి ఒక ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి వస్తుందని, ఒక ఎకరాలో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు వివరించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. నీటి సాంద్రత తక్కువ ఉన్న ప్రాంతంలో ఎలాంటి పంటలను సాగు చేయాలనే పరిశోధనతో క్షేత్ర స్థాయిలో సాగు వివరాలను తెలుసుకునేందుకు సౌదీ అరేబియా రైతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, ఏడీఏ వెంకట లక్ష్మీ, మండల వ్యవసాయాధికారి గణేశ్, ప్రతిభ, ఏఈఓ రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.హరిదాసుపూర్లో సౌదీ అరేబియా రైతులు -
ఇంజన్లో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరువు మండలం ఇస్నాపూర్‌లో నివాసముంటున్న వీ. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. వెంకట్రావు సోమవారం భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు మొత్తం అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొనిల దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై అపోహలు నమ్మొద్దు
ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి ఎడ్యుకేషన్: వక్ఫ్ సవరణ చట్టంపై పేద ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12,892 ఎకరాలు వక్ఫ్ భూములుగా నమోదు చేయడం వల్ల వేల మంది రైతులు హక్కులు కోల్పోయారని వాపోయారు. కొండాపూర్ మండలం సైదాపూర్‌లో 197 ఎకరాలు వక్ఫ్ జాబితాలో చేరడం వల్ల సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో పెద్ద ఎత్తున భూములు వక్ఫ్ జాబితాలో చేరాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాతబస్తీ వక్ఫ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వివరాలు ఇవ్వాలనీ, ముతావలీలు ఎవరి పేర్లపై లీజులకు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘పట్టణాల్లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురవుతున్నా, అసలు లబ్ధిదారులైన పేద ముస్లింలకు ఉపయోగం లేకుండా పోతోందని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు. రైతులు, ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేశ్వర్ రావు దేశ్ పాండేతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం
జిన్నారం (పటాన్చెరు): మద్యం సేవించి భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బొల్లా రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జీఎంఆర్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దండుగుల కురుమయ్య (39) కుటుంబం బతుకు దెరువు కోసం వచ్చి ఖాజీపల్లి జీఎంఆర్ కాలనీలో స్థిరపడ్డారు. ఆదివారం కురుమయ్య మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్య ఎల్లమ్మతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. క్షణికావేశంలో గ్రామ శివారులోని అడవి మైసమ్మ గుడి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో వ్యక్తి.. రామాయంపేట(మెదక్): పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం మండలంలోని అక్కన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హవేళీఘనపూర్ మండలం ముద్దుల్వాయి గ్రామానికి చెందిన తంత్రి సిద్ధరాములు (55) ఓ కోళ్ల ఫారమ్‌లో పని చేస్తున్నాడు. అప్పుల బాధతో ఫారమ్లోనే రసాయనిక మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి పాపన్నపేట(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రావుగారి ఆంజనేయులు (38) హైదరాబాద్‌లో మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా ఇబ్బందుల పాలవుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో 19న జరిగిన విందుకు హాజరయ్యాడు. క్రిమి సంహారక మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి వెళ్లాడు. చికిత్స నిమిత్తం మెదక్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో.. వెల్దుర్తి(తూప్రాన్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన మండలంలోని మానెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చౌదరిపేట రాగిరి(50) పొలం వద్ద ఇటీవల బోరు వేయగా ఫెయిల్ అయ్యింది. వ్యవసాయానికి కొంత అప్పు చేశాడు. పంట సైతం ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. అప్పులు ఎలా తీర్చాలోనని మదనపడుతూ 17న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
విద్యుదాఘాతంతో పంట దగ్ధం
కంగ్టి(నారాయణఖేడ్): విద్యుదాఘాతంతో మొక్కజొన్న కంకులు బుగ్గిపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సయ్యద్ అనే రైతు పట్టా భూమిలో ఒక ఎకరం మొక్కజొన్న పంట కాలిపోయింది. విద్యుత్ తీగలతో మంటలు చెలరేగి ఉంటాయని రైతు అనుమానం వ్యక్తం చేశారు. మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.80 వేల విలువ చేసే పంట కాలిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు. పిడుగుపాటుకుఇల్లు ధ్వంసం ములుగు(గజ్వేల్): పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసమై మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు మండలం బస్వాపూర్‌లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కురుమ వసంత రామాంజనేయులు దంపతులు నివాసముంటున్న ఇంటిపై ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడటంతో రేకులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో వసంతకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. -
పింఛన్ ఇక సులభతరం
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వివిధ కేటగిరిలలో పింఛన్ పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ముఖ గుర్తింపు హాజరు పెన్షన్ మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీంతో పింఛన్లు పారదర్శకంగా పంపిణీతో పాటు వృద్ధులకు ఇబ్బందులు తొలగనున్నాయి. జిల్లాలో 1,55,837 పింఛన్‌దారులు జిల్లాలో వివిధ కేటగిరిలలో 1,55,837 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. దివ్యాంగులు, వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడి, కల్లుగీత కార్మికులు, డయాలసిస్‌తో పాటు తదితరులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వితంతువులు, వృద్ధులు ఉన్నారు. దివ్యాంగులకు రూ.4016, ఇతరులకు రూ.2016లను అందిస్తున్నారు. ప్రతి నెలా రూ.36,15,19,230లు పింఛన్ డబ్బులు తీసుకుంటున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చెల్లింపులు ప్రస్తుతం చేయూత ద్వారా అందించే పింఛన్ డబ్బులు బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే డ్రా చేసుకునే సమయంలో వృద్ధులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు రాకపోవటంతో సకాలంలో డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. వేలిముద్రలు రాని వారికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి డబ్బులు డ్రా చేసి అందిస్తున్నారు. అధికారులు అందుబాటులో లేని సమయంలో పింఛన్ డబ్బుల కొరకు తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ గుర్తింపు హాజరు అమలుకు కసరత్తు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అన్ని రంగాల్లో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు సులభతరంగా పెన్షన్ అందించేందుకు ఫేస్ రికగ్నిషన్ ద్వారా పంపిణీ చేసేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో కసరత్తు చేస్తుంది. ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్ దారుడి ముఖాన్ని నిర్ధారణ చేసి పంపిణీ చేయనుంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ విధానం అమలులోకి రానుంది.ముఖ గుర్తింపు హాజరు అమలుకు కసరత్తు వృద్ధులకు తొలగనున్న ఇబ్బందులు త్వరలో అమలు కానున్న విధానంఅక్రమాలకు తావు లేకుండా.. నూతన విధానం అమలుతో వృద్ధులకు వేలిముద్రల సమస్యతో పాటు అక్రమాలకు తావు లేకుండా పంపిణీ చేయనుంది. బ్యాంకులలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయటం ద్వారా వివిధ మార్గాల ద్వారా తీసుకుంటున్నారు. పింఛన్‌దారుడు మృతి చెందిన సమయంలో సమాచారం అందించకపోవటంతో నెలల తరబడి ఖాతాల్లో జమ అయ్యి వారి కుటుంబ సభ్యులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.జిల్లాలో పింఛన్ల వివరాలు దివ్యాంగులు 14,465 వృద్ధులు 59,083 వితంతువులు 70,673 చేనేత కార్మికులు 683 కల్లుగీత కార్మికులు 813 ఒంటరి మహిళలు 7,475 బీడి కార్మికులు 112 ఇతరులు 2,533 -
అగ్నిమాపక సేవా వారోత్సవాలు
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ యూనిట్లో సోమవారం సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో జాతీయ అగ్నిమాపక సేవా వారోత్సవల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీఎం విజయ సాగర్, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మంజీత్ కుమార్, ఎస్డీజీజిఎం అరవింద్ కుమార్, ఇన్స్పెక్టర్ బి.ఎస్.భండారి పాల్గొన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. -
రేపు జిల్లాకు సీఎం రాక
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు తూర్పు జయారెడ్డి (కూచమ్మ), గుణచైతన్యరెడ్డిల నిశ్చితార్థం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని జగ్గారెడ్డి నివాసం వద్ద జరగనుంది. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అదేరోజు ఆయన ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి హజరు కానున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఈ నిశ్చితార్థనికి హజరు కానున్నారు. అయితే రేవంత్‌రెడ్డి పర్యటన మంగళవారం అధికారికంగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలించిన ఎస్పీ సీఎంతో పాటు, పలువురు మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎస్పీ పరితోష్పంకజ్ సోమవారం జగ్గారెడ్డి నివాస ప్రాంతాన్ని పరిశీలించారు. డీఎస్పీ సత్తయ్యగౌడ్, ఇతర పోలీసు అధికారులు కలిసి ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.జగ్గారెడ్డి కూతురు నిశ్చితార్థానికి హజరుకానున్న రేవంత్ -
భూ సమస్యలకు పరిష్కారం
జహీరాబాద్/రాయికోడ్(అందోల్): భూ సమస్యలకు భూభారతితో సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. సోమవారం జహీరాబాద్, మొగుడంపల్లి, అలాగే.. రాయికోడ్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు. భూ సమస్యలు కలిగి ఉన్న రైతులు పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తామన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉందన్నారు. భూ భారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భారతిలో కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం ఈ చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రతి భూ కమతానికి భూదాన్ నంబరు కేటాయించనున్నట్లు తెలిపారు. భూ సరిహద్దు గొడవలు, ఫిర్యాదులు భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించుకునే అవకాశం కలిగిందన్నారు. నూతన చట్టం ద్వారా ఇకపై ఫౌతి నెల రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ రాంరెడ్డి, ఏడీఏ భిక్షపతి, ఏఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు.పారదర్శకంగా భూభారతి నిర్ధిష్ట గడువులోగా మ్యుటేషన్ అవగాహన సదస్సులో కలెక్టర్ క్రాంతి అర్హులనే ఎంపిక చేయాలి రాయికోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. నిరుపేదలు, వితంతువులు, భూమిలేని వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాయికోడ్‌లో జరిగిన సదస్సులో గ్రంథాలయాల సంస్థల చైర్మన్ అంజయ్య, మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్, ఏఎంసీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సిద్దప్ప పాటిల్, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ షరీఫ్ తదితరలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సభకు తరలిరండి
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి పిలుపు మునిపల్లి(అందోల్): ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే రజోత్సవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆవిష్కరించారు. సోమవారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ సభకు పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి ఒకరు చొప్పున రావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, నాయకులు చీలపల్లి రాంచంధర్రావు, బుదేరా మల్లేశం, పిల్లోడి ప్రభు, బుదేరా విజయభాస్కర్ పాల్గొన్నారు. -
ఏఐతో కలుపుతీసే రోబో
ఆవిష్కరించిన గీతం విద్యార్థులుపటాన్చెరు: ఆధునిక వ్యవసాయాన్ని మరింత విప్లవాత్మకంగా మార్చడానికి విద్యార్థులు తమ మేధకు పదునుపెడుతున్నారు. గీతంలో చదువుతున్న బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థిని సి.అమూల్య నేతృత్వంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో కలుపుతీసే రోబోకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా సోమవారం అమూల్య రోబో గురించి వివరించారు. ఆధునిక సాంకేతికత సహాయంతో అది కలుపు మొక్కలను గుర్తించి తొలగిస్తుందని చెప్పారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా అమూల్య, ఆమె బృందాన్ని అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, టెక్నాలజీ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి ప్రశంసించారు. -
ప్రజాభిమానం మరవలేను
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి: ప్రజల అభిమానం ఎన్నటికీ మర్చిపోలేనని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే తన జన్మదిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వేతన ఒప్పందం మాతోనే సాధ్యం సీఐటీయూ అధ్యక్షుడు చుక్క రాములు జహీరాబాద్ టౌన్: మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మహీంద్ర కార్మిక సంఘం అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. పట్టణ సమీపంలో గల మహీంద్ర అండ్ మహీంద్ర పరిశ్రమలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహీంద్రలో త్వరలో కార్మిక సంఘం ఎన్నికలు రాబోతున్నాయని, సీఐటీయూను గెలిపించాలని కోరారు. వేతన ఒప్పందం, ఉద్యోగ భద్రత, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బలపరచాలని కోరారు. ఈ నెల 20న దేశవ్యాప్త స్వారత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, జహీరాబాద్ క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్, యూనియన్ నాయ కులు నరేష్ ఉమామహేశ్వరరావు, కిరణ్, బాలరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సన్మానం మునిపల్లి(అందోల్): అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని పై తరగతులకు వెళ్తున్న చిన్నారులకు టీచర్లు మంజుల, శకుంతల సన్మానించారు. సోమవారం మండలంలోని పెద్దగోపులారంలో ఆంగన్వాడీ కేంద్రంలో వార్షికోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్రావు, ఉపాధ్యాయ బృందం, సూపర్ వైజర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. బడిబాట కరపత్రం ఆవిష్కరణకల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ నాగరం శ్రీనివాస్ సోమవారం బడిబాట కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మారుతి, టీచర్లు శ్రీకాంత్, భాస్కర్, సీఆర్పీ శివకుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు తుకారాం, రాంకిషన్, సాయిలు, మాశ్నప్ప ఉన్నారు. బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు మునిపల్లి(అందోల్): బేతాళ స్వామికి మాజీ ఎంపీపీ రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని మేళసంగ్యం, మగ్దుంపల్లి, కంకోల్ శివారులో బేతాళ స్వామి జాతర మహోత్సవంం ఘనంగా నిర్వహించారు. మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ రాంరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులకు మగ్దుంపల్లి కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి సన్మానించారు. -
సోలార్ కుంటలు
వన్యప్రాణుల దాహార్తికి సౌరశక్తితో నీటి సరఫరా ● చెక్ డ్యామ్‌లు, కుంటల్లో నీరు అడుగంటడంతో ప్రత్యామ్నాయ చర్యలు ● నీరు లేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్న జంతువులు ● శనిగరం, మీర్జాపూర్, గురువన్నపేట ఫారెస్టులో ఏర్పాటుకు ప్రతిపాదనలు ● హుస్నాబాద్ ఫారెస్టు పరిధిలో7 మండలాలు 4వేల హెక్టార్లు నీరు తాగుతున్న దుప్పిలు నీటి సరఫరాకు ట్యాంకర్లు ఇవ్వాలి వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో అడవిలో నీటి లభ్యత తగ్గిపోతోంది. మేము నిర్మించే సాసర్ పిట్లకు నీటి సరఫరా కోసం సమీపంలోని గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. శనిగరం, మీర్జాపూర్, గురువన్నపేట అటవీ ప్రాంతంలో సౌరశక్తి పంపుల ద్వారా నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.నిధులు మంజూరైతే అడవిలో నిరంతరం జంతువులకు నీరు దొరుకుతుంది. అడవిలో పలు రకాల జంతువులు ఉన్నాయి. పులులు ఇప్పటి వరకు ఎక్కడా కెమెరాలకు చిక్కలేదు. – సిద్ధార్థరెడ్డి, ఎఫ్ఆర్ఓ, హుస్నాబాద్హుస్నాబాద్ రూరల్: వేసవిలో అడవిలో నీటి వనరులు లేక దాహం కోసం బయటకు వచ్చిన జంతువులు వేటగాళ్ల ఉచ్చులకు బలై మృత్యువాత పడుతున్నాయి. జింకల మందలు మైదానానికి రావడంతో కుక్కలు తరుమడంతో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అడవి జంతువుల దాహార్తి తీర్చడానికి సోలార్ పంపుల ద్వారా నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వేసవిలో సైతం నీటి కుంటలు నిండుగా ఉంటే జంతువులు అడవి విడిచి బయటకు రావనే ఆలోచనతో అధికారులు సౌరశక్తి కుంటల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. దుబ్బాక ఫారెస్టు పరిధిలో చింతమడక, చీకోడులో సోలార్ కుంటలు నిర్మించి జంతువులకు నీరు అందిస్తున్నారు. హుస్నాబాద్ ఫారెస్టు..హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, ధూలిమిట్ట, చేర్యాల ఏడు మండలాల్లో 4వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అడవిలో జింకలు, కొండ గొర్రెలు, నక్కలు, ఎలుగు బంట్లు, హైనా, నెమళ్లు లాంటి జంతువులు ఉన్నాయి. 2017లో మహ్మదాపూర్ గుట్టల్లో చిరుతపులి దాహం కోసం వ్యవసాయ బావుల వద్దకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి బలైపోయింది. అప్పటి నుంచే జంతువుల దాహార్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 3వేల నుంచి 5వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 19 సాసర్లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. వర్షాకాలం నీటిని నిల్వ చేయడానికి లోతట్టు ప్రాంతంలో 10 చెక్ డ్యామ్‌లు, 8 కుంటలను నిర్మించారు. హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ అటవీ ప్రాంతంలో మహాసముద్రం, జిల్లెలగడ్డలో గాడిదలలొద్ది చిన్ననీటి జలాశయాలను నిర్మించడంతో జంతువులు బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బాంబుల శబ్దాలకు భయపడి బయటకు.. ఉమ్మాపూర్ అటవీ ప్రాంతంలో మిషన్లతో గుట్టలను తవ్వడం, బండరాళ్లను తొలగించడానికి బాంబులను వినియోగించడం వల్ల పెద్ద పెద్ద శబ్దాలకు జంతువులు భయపడి బయటకు వస్తున్నాయి. అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ ప్రాంతంలో గుట్టల తవ్వకాలను, బాంబు పేలుళ్లను నిషేధించాలని వన్యప్రాణుల సంరక్షణ సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. -
చిరుతపులి దాడిలో లేగదూడ మృతి
నారాయణఖేడ్: లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపింది. ఈ ఘటన ఆదివారం నారాయణఖేడ్ మండలంలో జరిగింది. బాధిత రైతు నారాయణ, గ్రామస్తుల కథనం ప్రకారం.. సంజీవన్‌రావుపేట్ గ్రామానికి చెందిన రైతు నారాయణ శనివారం రాత్రి గ్రామ శివారులోని తన చేను వద్ద పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా లేగదూడ శరీరం ఛిద్రమై మృతిచెంది ఉంది. గ్రామానికి కొద్దిదూరంలో అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి వచ్చి లేగదూడపై దాడి చేసి ఉండవచ్చని అనుమానించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది సందర్శించి పరిసరాల్లో గుర్తించిన పాదముద్రల ఆధారంగా చిరుతపులి సంచరించినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఖేడ్ అటవీశాఖ రేంజ్ అధికారి అనురాధ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను చేను వద్ద కట్టేయవద్దని సూచించారు. చిరుత ఎవరికై నా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
ఇరు వర్గాల మధ్య విభేదాలు
మిరుదొడ్డిలో పోలీసుల పికెట్ మిరుదొడ్డి(దుబ్బాక): ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఓ వర్గం యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పోలీసుల కథనం ప్రకారం... బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఒక వర్గానికి చెందిన యువకులు శనివారం రాత్రి మిరుదొడ్డి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఇదే గ్రామానికి చెందిన ఓ వర్గానికి చెందిన యువకుడు సోషల్ మీడియాలో కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేశాడు. దీంతో తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా పోస్టు పెట్టిన యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేయడానికి ఒక వర్గం యువకులు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే యువకుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో సదరు యువకుడిపై అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆదివారం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ర్యాపిడ్ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ మీడియాను మంచికి వాడకుండా ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
పటాన్చెరు టౌన్ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు శివకుమార్ కథనం ప్రకారం... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ సాయి కాలనీకి చెందిన శివకుమార్ ఈ నెల 18వ తేదీన సదాశివపేట్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంటి యజమాని శ్రీనివాస్ ఫోన్ చేసి మీ ఇంటి తాళం పగలగొట్టి ఉందని అతడికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చిన అతడు ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గుర్తు తెలియని దండుగులు ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింతకొండపాక(గజ్వేల్): ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న దుద్దెడకు చెందిన పలువురిని అడ్డగించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం సిద్దిపేట నుంచి కొండపాక వైపు బొలెరో వాహనంలో 9 ఆవులు, ఒక లేగను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండగా మురళి అనే వ్యక్తి గమనించి హిందూవాహిని సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలిపారు. దీంతో త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని దుద్దెడ టోల్గేట్ వద్ద వాహనాన్ని అడ్డగించి డ్రైవర్‌ను విచారించారు. నల్లగొండ సంత నుంచి హైద్రాబాద్‌లోని మూసాపేట్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని తేలడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం తూప్రాన్: ట్రావెల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం, ప్రయాణికుల కథనం ప్రకారం... పట్టణ సమీపంలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోని హల్దీవాగు వద్ద రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విశ్వకర్మ ట్రావెల్స్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. తూప్రాన్ పట్టణ సమీపంలోని హల్దీవాగు వద్దకు చేరుకోగానే బస్సు ముందు చక్రాలు ఊడిపోయి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమేదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్సును ఢీకొట్టిన కారు – పలువురికి స్వల్ప గాయాలు నర్సాపూర్ రూరల్: కారు ముందు టైర్ పేలి అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై రెడ్డిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఇద్దరు భక్తులు ఏడుపాయల వనదుర్గామాతను దర్శనం చేసుకొని కారులో నర్సాపూర్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో రెడ్డిపల్లి సమీపంలో కారు ముందు టైరు పేలి అదుపు తప్పడంతో మెదక్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు, కారులో ఉన్న ఇద్దరు భక్తులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ స్వామి సమన్వయంతో బస్సును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న భక్తుల వివరాలు తెలియ రాలేదు. బస్సు కిందపడి వ్యక్తి మృతి పటాన్చెరు టౌన్ : బస్సు ఎక్కుతున్న క్రమంలో ఓ వ్యక్తి కింద పడగా అతడి కుడి కాలు పై నుంచి బస్సు వెనుక టైర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాన్ మొహమ్మద్ (40) బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం వచ్చి పటాన్చెరు డివిజన్ పరిధిలోని కటిక బస్తీలో నివాసం ఉంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సంగారెడ్డిలో ఉన్న లారీని తీసుకువచ్చేందుకు బస్టాండ్‌లో పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎక్కుతున్న క్రమంలో కింద పడ్డాడు. దీంతో అతడి కుడికాలుపై నుంచి బస్సు వెనుక టైర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స కోసం 108 వాహనంలో పటాన్చెరు, సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారంగానే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య ఫుల్జాహ బేగం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
వేర్వేరు చోట్ల ఇద్దరు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. పెద్ద శంకరంపేట(మెదక్): వరి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద శంకరంపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం... మక్త లక్ష్మాపూర్‌కు చెందిన నాగధర్ బేతయ్య(50) తాను సాగు చేస్తున్న వరి పంటను అడవి పందుల నుంచి రక్షించేందుకు చుట్టూ విద్యుత్ వైర్లను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగలడంతో రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుడి భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో కరెంట్ రావట్లేదని చెక్ చేస్తుండగా.. మద్దూరు(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లద్నూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మచ్చ యాదగిరి(48) అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో జరిగే బొడ్రాయి పండుగ కోసం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం ఇంట్లో కరెంట్ రాకపోవడంతో విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లి చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
దుబాయిలో చిక్కుకున్న వ్యక్తికి ఆపన్నహస్తం
హుస్నాబాద్: తాను దుబాయిలో చిక్కుకున్నానని రక్షించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య అనే గల్ఫ్ కార్మికుడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వేడుకుంటూ ఇటీవల ఓ సెల్ఫీ వీడియో పంపించాడు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం. వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దుబాయిలోని సామాజిక సేవకులు సుతారి సత్యం పటేల్‌ను సంప్రదించి లింగయ్యకు అవసరమైన సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. విద్యుత్ వైర్లు తగిలి పశుగ్రాసం దగ్ధం శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదభరితంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం పోతులబోగూడ నుంచి ఉసిరికపల్లి వైపునకు గడ్డి లోడ్‌తో (పశుగ్రాసం) వస్తున్న ట్రాక్టర్‌కు పాంబండ వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. గుర్తించిన ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి గడ్డి లోడ్‌కు కట్టిన తాడు తొలగించి ట్రాలీని లేపి గడ్డిని కిందపడేశాడు. దీంతో వెల్దుర్తి– ఉసిరికపల్లి ప్రధాన రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న నర్సాపూర్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో మంటలను ఆర్పివేసి రాకపోకలను పునరుద్ధరించారు. నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి విద్యుత్ వైర్లు పలు చోట్ల కిందికి ప్రమాదభరితంగా వేలాడుతుండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
గజ్వేల్‌రూరల్: అంగన్వాడీ కేంద్రానికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని దాచారంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వల్లెపు యాదగిరికి 20 ఏళ్ల క్రితం నర్సమ్మ అనే మహిళతో వివాహం జరుగగా ఆమె మృతి చెందింది. దీంతో ఆరేళ్ల క్రితం కామారెడ్డి ప్రాంతానికి చెందిన శ్రీలతను రెండో వివాహం చేసుకోగా వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 16న ఓ పరిశ్రమలో పనికోసం వెళ్లిన యాదగిరి రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుస్తులు అమ్మడానికి వెళ్లిన యువకుడు రామాయంపేట(మెదక్): దుస్తులు అమ్మడానికి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని ఖానాపూర్ జిల్లా అలపూర్ గ్రామానికి చెందిన బాబులు సింగ్ (23) నాలుగేళ్ల క్రితం రామాయంపేటకు వచ్చి దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 18న ఉదయం దుస్తులు అమ్మడానికి బైక్‌పై బోడ్మట్పల్లి వైపు వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజులుగా అతడి ఆచూకీ లభించకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. అతడి బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. పటాన్చెరు టౌన్: స్కూటీని కారు ఢీకొట్టిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ భూపాల్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం (50), అతడి బంధువు ఎం.డి ఖాజా ఇరువురు కలిసి శనివారం స్కూటీపై కిష్టారెడ్డిపేట్ వైపు నుంచి పటాన్చెరు వైపు వస్తుండగా మార్గమధ్యలో ఎల్లంకి కాలేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం షేక్ ఇబ్రహీంను మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని ఒకరు.. హత్నూర(సంగారెడ్డి): ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో దౌల్తాబాద్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగింది. ఎస్సై సుభాష్ కథనం ప్రకారం... మాదుర గ్రామానికి చెందిన లింగన్నగారి దశరథ్ రోజువారి మాదిరిగానే దౌల్తాబాద్ వచ్చి రాత్రి స్వగ్రామానికి తన మోటార్ సైకిల్ పై తిరిగి వెళ్తున్నాడు. దేవులపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే హత్నూర వైపు నుంచి ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథ్ (45)తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ దశరథను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గాయాలైన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. మృతుడి భార్య వీరమని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఎమ్ శివయ్య (52) సోమవారం పట్టణంలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. తిరిగి తన ద్విచక్ర వాహనంపై సిద్దిపేట నుంచి రామునిపట్ల వైపు వెళుతుండగా మందపల్లి స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా
కంగ్టి(నారాయణఖేడ్): పక్షం రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్ రైతు వేదికలో కంగ్టి ప్యాక్స్ చైర్మన్ మారుతిరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రూ. 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...తడ్కల్ మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తే తడ్కల్‌లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రేషన్‌లో సన్నబియ్యం ఉచితంగా ఇస్తూన్నా నూకలు ఇచ్చారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ తడ్కల్ మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం -
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
కందిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ (సంగారెడ్డి): కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కందిలో ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ అనే ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. అనంతరం కంది చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బూడిద కుమార్, చిన్న సాయి శ్రీరామ్,అసద్ ఖాన్ శ్రీనివాస్,రాందాస్తోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విరమించేంత వరకూ పోరాడుతాండంపింగ్యార్డ్కు వ్యతిరేకంగా జేఏసీ నిరసనలు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్‌యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 75వ రోజుకు చేరుకున్నా యి. ఆదివారం గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు, మహిళలు, దివ్యాంగులు నల్లవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రిలేనిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... ప్రభుత్వం డంపింగ్‌యార్డ్ ఏర్పాటును విరమించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విషవాయువుల నుంచి కాపాడండిపటాన్చెరు టౌన్: పటాన్చెరు డివిజన్ పరిధిలోని తరచూ పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువుల నుంచి తమను కాపాడాలని నవ్య ది గ్రాండ్ కాలనీ వాసులు ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి విష వాయువులతో తామంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డామని..వారంలో ఒకసారి ఇదేవిధంగా జరుగుతోందని వివరించారు. చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి వారికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నేడు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళాసంగారెడ్డి టౌన్: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జానకీదేవి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జాబ్ మేళాలో ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయని, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేట్ శక్తులకే అనుకూలంసీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు పటాన్చెరు: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆర్థిక విధానాలను అవలంబిస్తోందని ఈ నయా ఉదారవాద విధానాలపై పెద్ద ఎత్తున పోరాడాలని సీఐటీయూ అఖిలభారత కోశాధికారి సాయిబాబు పిలుపునిచ్చారు. పటాన్‌చెరులోని ఐలా భవన్లో తోషిబా పరిశ్రమలో సీఐటీయూ యూనియన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘నయా ఉదార వాద విధానాలు– లేబర్ కోడ్లు– కార్మికుల కర్తవ్యాలు’అనే అంశంపై ఆదివారం జరిగిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేకి అన్నారు. మోదీ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలతో ప్రజలకు, కూలీలకు, కార్మికులకు ఎవరికీ ఉపయోగపడటం లేదని విమర్శించారు. మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, రాజయ్య, పాండు రంగారెడ్డి, అనంతరావు తదితరులు పాల్గొన్నారు. -
చివరి గింజవరకూ కొంటాం
నారాయణఖేడ్: రైతుల మేలుకోసమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని, చివరి గింజవరకూ ధాన్యాన్ని కొంటామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నిజాంపేట్ మండలం జంబికుంట గ్రామంలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. తమ ప్రభుత్వం రైతులకు పనిముట్లు, విత్తనాలు సైతం అందజేస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌తో ఇన్నాళ్లూ రైతులు పడ్డ కష్టాలు భూ భారతితో తొలగిపోయాయని వివరించారు. భూ భారతి ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని వెల్లడించారు. అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట ఖేడ్ మండలం నమ్లిమెట్ గ్రామంలో దుర్గాభవానీమాత ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామపెద్దలు వారిని శాలువాతో సన్మానించారు. బాధిత కుటుంబానికి పరామర్శ ఖేడ్ మున్సిపాలిటీలో నీటి సరాఫరా విభాగం సూపర్వైజర్గా పనిచేస్తున్న జన్వాడె బస్వరాజ్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం ఆయన స్వగ్రామమైన సిర్గాపూర్ మండలం చిన్నముబారక్ పూర్ గ్రామానికి సంజీవరెడ్డి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీవో సంగ్రాం, కాంగ్రెస్ నాయకులు అంతన్నగారి మల్లేశం, రాధాకిషన్, నాయకులు యాదవరెడ్డి, అశోక్‌పాటిల్, పండరిరెడ్డి తదితరులు ఉన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
సంచారం లేని శౌచాలయం
సంగారెడ్డి: గత కొన్ని నెలలుగా పబ్లిక్ టాయిలెట్ బస్సు మూలన పడింది. సంగారెడ్డి పట్టణంలో వివిధ మార్కెట్లలో ప్రజల సౌకర్యార్థం ఉంచేందుకు లక్షల రూపాయలు వెచ్చించి మొబైల్ టాయిలెట్ బస్సును కొనుగోలు చేశారు. కొన్ని రోజులు వాడి చేతులు దులుపుకున్నారు. సంవత్సరం పాటుగా ఈ బస్సు పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఓ మూలన పడి ఉంది. పట్టణంలో జరిగే సంతలలో పబ్లిక్ టాయిలెట్స్ లేక అక్కడికి వచ్చే వ్యాపారులు,కొనుగోలుదారులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నా అధికారుల్లో మాత్రం కదలిక లేదు. ఇప్పటికై నా పబ్లిక్ టాయిలెట్ బస్సును సంతలో ఉంచి తమ సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజాధనం వృథా ప్రజల అవసరాల కోసం లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు తప్ప వాటిని ఉపయోగించడం లేదు. పన్నులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారేగానీ వాటికి తగ్గ సౌకర్యాలు కల్పించడం లేదు. – మల్లేశం, సంగారెడ్డి ఈవెంట్స్ అయితేనే పెడుతున్నాం పట్టణంలో ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు అయితే మొబైల్ టాయిలెట్ బస్సు వాడుతున్నాం. మార్కెట్లలో పెట్టే సంగతి నాకు తెలియదు. ఇక పైనుంచి మొబైల్ టాయిలెట్లు అన్ని మార్కెట్లలో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటాం. –ప్రసాద్ చౌహన్, మున్సిపల్ కమిషనర్మా బాధలు ఎవరికి చెప్పాలి ప్రతీ అంగడి రోజు ఉదయం 10 గంటలకు సంతలోకి వచ్చి రాత్రి 8 గంటల వరకు కూరగాయల అమ్ముకుంటున్నాను. శౌచాలయాలు లేక ఉదయం నుంచి రాత్రి వరకు మూత్రానికి కూడా పోవడం లేదు. అధికారులు గతంలో ఇక్కడ బస్సు ఉంచేవారు. ఇప్పుడు ఆ బస్సు కూడా లేకపోవడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. – అంజమ్మ, కూరగాయల వ్యాపారి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు ప్రజాధనం వృథా -
దైవ దర్శనానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి
శివ్వంపేట(నర్సాపూర్): దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధి చాకరిమెట్ల అటవీ ప్రాంతంలో తూప్రాన్– నర్సాపూర్ హైవే పై శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ చింతల్ ప్రాంతానికి చెందిన గొల్ల లోకేశ్ (42) లిఫ్ట్ రిపేర్లు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం చాకరిమెట్లలోని ఆంజనేయస్వామి దర్శనం కోసం ఒక్కడే బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి లక్ష్మాపూర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట అనారోగ్యంతో.. సిద్దిపేటకమాన్: అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. భువనగిరికి చెందిన ఎండీ నవాజ్ (40) ఏడాదిగా పట్టణంలోని ఓ హోటల్లో పని చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల కిందట క్యాన్సర్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నాడు. దీంతో హోటల్లో పని మానేశాడు. అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ రోడ్డు డివైడర్ పక్కన నవాజ్ మృతి చెంది పడి ఉన్నట్లు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న హోటల్ యజమాని జాకీర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు శనివారం కౌడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని శేరితండా పంచాయతీ వసురాంతండాకు చెందిన దుంగావత్ గేమ్‌సింగ్(35) కొన్నేళ్లుగా భార్యతో కలిసి గుమ్మడిదలలో ఉంటున్నాడు. 18 తండాలో చిట్టీ డబ్బులు కట్టాలని రూ.40 వేలు తీసుకొని గ్రామానికి వచ్చాడు. రాత్రి తండాకు చెందిన మోహన్, సలాబత్‌పూర్‌కు చెందిన జహీర్‌తో కలిసి మద్యం సేవించాడు. అనంతరం దాబాలో భోజనం చేస్తుండగా గేమ్‌సింగ్ అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే కౌడిపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెదక్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తన భర్త వెంట ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి భార్య శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇసుక రవాణాపై చర్యలు
మద్దూరు(హుస్నాబాద్): అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని దూల్మిట్ట తహసీల్దార్ సింహాచలం మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ జాలపల్లిలోని మోయతుమ్మెద వాగు నుంచి గ్రామానికి చెందిన మెతుకు రామకృష్ణారెడ్డి, మెతుకు సంజీవ్, తుపాకుల శ్రీనివాస్ అనే వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకున్నామన్నారు. ఒక్కో వాహనానికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధం మద్దూరు(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన దూల్మిట్ట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తుషాలపురం రమ ఇంట్లో శుక్రవారం రాత్రి వేళ ఫ్రిజ్‌కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఎగిసి పడ్డా యి. ఒక్కసారిగా మంటలు చెలరేగి కూలర్, బట్టలు, ఇతర సామగ్రికి నిప్పంటుకొని కాలిపోయాయి. అదే విధంగా విలువైన డాక్యుమెంట్స్తోపాటు ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన నగదు కాలిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని రెవెన్యూ అధికారులు శనివారం సందర్శించారు. ఫామ్ హౌస్‌లపై పోలీసుల దాడి ● 8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ మనోహరాబాద్(తూప్రాన్): ఫామ్ హౌస్‌లపై పోలీసులు దాడి చేసిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. శుక్రవారం అర్థరాత్రి తూప్రాన్ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కూచారం, జీడిపల్లి శివారుల్లో ఫామ్ హౌస్‌లపై దాడి చేశాం. ఈ దాడిలో వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్‌లో 8 మంది పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నాం. వీరినుంచి పేకముక్కలు, రూ. 11 వేల నగదు, 3 కార్లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ గార్డుపై దాడి పటాన్చెరు టౌన్: ఓ పరిశ్రమలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బీడీఎల్ సీఐ స్వామి గౌడ్ కథనం మేరకు.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో గల ఉషా కాపర్ వైర్స్ పరిశ్రమలో సదాశివపేట పేటకు చెందిన కై రత్ మియా (53) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పరిశ్రమ గేటు ఎదుట డ్యూటీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ముఖంపై టవల్ కప్పి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గాయాలతో ఉన్న సెక్యూరిటీ గార్డును చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పటాన్‌చెరుకు తీసుకెళ్లారు. శనివారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బీడీఎల్ పోలీసులు పేర్కొన్నారు. కలిసిమెలిసి ఉండాలి ● హంపీ పీఠాధిపతి భారతీ స్వామి మిరుదొడ్డి(దుబ్బాక): భారతీయ సంస్క ృతీ సాంప్రదాయాలు, సనాతన ధర్మం ఎంతో శ్రేష్ఠమైనవని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని అందె గ్రామంలోని శంభుని దేవాలయంలో శనివారం నిర్వహించిన బాణ లింగాభిషేక కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. లింగాభిషేకంలో పాల్గొన్న ఆయన గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతాయన్నారు. సమాజంలో ధర్మబద్ధంగా జీవిస్తేనే మోక్షం లభిస్తుందన్నారు. గ్రామాల్లో ఈర్ష, అసూయలు తగ్గించి అందరూ కలిసి మెలసి ఐక్యంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్‌జీ, శివలింగం, యాదగిరి, సుమన్, పోచయ్య, ప్రవీణ్, కుమార స్వామి, కనకరాజు పాల్గొన్నారు. -
జేఈఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
హుస్నాబాద్‌రూరల్: దేశవ్యాప్తంగా విడుదల చేసి న జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో గిరిజన గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపించి 26 మంది అర్హత సాధించారు. శనివారం గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలలో ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ రాజు అభినందించారు. కళాశాల నుంచి 31 మంది పరీక్షలకు హాజరైతే 26 మంది అర్హత సాధించగా 10 మంది మంచి మా ర్కులు పొందినట్లు చెప్పారు. బీ.సునీల్ (81.98), టీ.రాజేశ్(81.94), జే.హర్షవర్ధన్ (81.72), డీ.సిద్ధార్థ (77.33), బీ.మోక్షజ్ఞ (77.04) మార్కులు సాధించారు. గురుకులాల కేంద్ర కార్యాలయం అందించిన స్టడీ మెటీరియల్ చదువడం ద్వారానే మా విద్యార్థులు ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
చేగుంట(తూప్రాన్): ఈత కొట్టడానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. చేగుంటకు చెందిన తిరుపతి సంజయ్ (21) రామాయంపేట మండలం దామర చెరువులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామంలో బంధువులు, స్నేహితులు అంతా కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టడానికి వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్ లోకి దూకిన సందీప్ తలకు గాయమై ఫిట్స్ రాగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సందీప్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ రామాయంపేట(మెదక్): చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన బొగ్గుల అమృత (40) శుక్రవారం సాయంత్రం బట్టలు ఉతకడానికి గాను సమీపంలో ఉన్న పాండ చెరువు వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఆమె మృతదేహం నీటిలో తేలగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.కామారెడ్డి జిల్లాలో చేగుంట యువకుడు మృతి -
ఇంజనీర్ల ఇలాకా..
40 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది వీరే..● చదువుకోవడానికి8 కిలో మీటర్లు వెళ్లే యువత ● వలసలు వెళ్లి చదివించిన తల్లిదండ్రులు ● ఒకరిని చూసి మరొకరుఉద్యోగాల వైపు అడుగులు ● గతంలో బాహ్య ప్రపంచానికితెలియని తండా ● నేడు ఆదర్శంగా నిలిచిన కంగ్టిమండలంలో జమ్గి(బీ) సాధు తండా సాధించాలనే పట్టుదలతో .. మా ఇద్దరు కూతుళ్లు ఒకరు ఎంబీబీఎస్ పూర్తి చేయగా మరో అమ్మాయి ఎన్ఐటీ త్రిచిలో సీటు సాధించింది. తల్లి ఉపాధ్యాయురాలు. దీంతో ఇంటిల్లిపాది ఉద్యోగాలు పొంది ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. మారుమూల తండానుంచి ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. కే. పండరి, హైదరాబాద్ జిల్లా మేనేజర్(టీజీఆర్‌ఈడీసీఓ) పోటీతత్వంతో ఉన్నత చదువులు తండాలో యువకులు ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తితో ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం అభినందనీయం. తల్లిదండ్రులు సైతం పిల్లల చదువుల కోసం ప్రోత్సహించడంతో మా తండావాసులు ఉన్నత స్థాయిలో నిలుస్తున్నారు. – నారాయణ, ఏఈ ట్రాన్స్‌కో, నారాయణఖేడ్ వలసలు వెళ్లి చదివించారు మా తల్లిదండ్రులు వలసలు వెళ్లి డబ్బు సంపాదించి మాకు మంచి చదువులు చదివించడంతో మా జీవితాలు మారాయి. మేము మా పిల్లలను సైతం ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నాం. తండాలోని యువతలో పోటీతత్వం, పోరాట పటిమ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – మోతీరాం,ఏఈ ట్రాన్స్‌కో, మనూరు మంచి పేరు ప్రఖ్యాతలు గడించాం సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇరిగేషన్లో ఏఈగా ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాను. మా తండా నుంచి యువకులు, విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడి సాధిస్తుండటంతో మంచి ఖ్యాతి ఉంది. యువకులకు ఉన్నత చదువుల కోసం ప్రోత్సాహం అందిస్తున్నాం. – కుషాల్, ఏఈ ఇరిగేషన్, నిజామాబాద్ వలసలు వెళ్తే గాని పూట గడవదు తండాలో 120 ఇల్లు, కుటుంబాలు 152 ఉంటాయి. ఇక్కడ ఉన్న భూములు కూడా సాగు నీటి వసతి లేని ఎర్ర చెలుక భూములే. ఏడాదిలో ఎనిమిది నెలలు చెరకు నరికేందుకు, ఇటుక బట్టీలకు వలసలు వెళ్తే తప్ప బతుకు బండి నడవదు. పిల్లలను బడికి పంపేకంటే కూలీకి పంపితేనే బాగుంటుందని భావించే దుస్థితి. అలాంటి దుర్భర పరిస్థితిలో నుంచి ఏక కాలంలో నలుగురు ఇంజనీర్లను అందించింది ఈ సాధుతండా. అప్పటి నుంచి ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వరిస్తుందనే నమ్మకం కల్గింది తండాలోని గిరిపుత్రులకు. ఏకంగా 20 మంది ఇంజనీర్లు అయ్యి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.కంగ్టి(నారాయణఖేడ్): అదో మారుమూల తండా. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. అక్కడేం ఉంటుందనుకుంటే పొరపాటే. తరచిచూస్తే చదువులమ్మకు నమస్కరించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తోంది. రోడ్డు వసతి ఉన్నా బస్సు ఎరగరు. తీవ్ర సమస్యలుంటే తప్ప అధికారులు సందర్శించిన దాఖాలాలుండవు. తాగునీటి కోసం తంటాలు పడాల్సిన దుస్థితి. సాగు భూములంతగా లేవు. వ్యవసాయ కూలీ పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితి. అలాంటి తండా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు బయటకు కొచ్చా రు. ఒక్కరి నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగం.. ఆ తర్వాత ముగ్గురు.. ఇలా ఒక్కొక్కరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ ఇప్పుడు ఆ సంఖ్య 40కి చేరింది. ఒకప్పుడు ఎవరికీ తెలియని కంగ్టి మండలంలో జమ్గి(బీ) సాధుతండా ఇప్పుడు అందరి నోటా వినబడుతుంది. చదువుకోవడానికి 8 కిలో మీటర్లు జమ్గి(బీ) సాధుతండాలో పాఠశాల లేదు. మండల కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి పిల్లలు చదువుకోవాలంటే నిత్యం ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న తడ్కల్ గ్రామానికి నడుచుకుంటూ వెళ్లేవారు. తాము పడే కష్టం తమ పిల్లలు పడకూడదని చదివించారు. మొదట 1998లో ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. తండాకు చెందిన 1998లో కే.పండరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించాడు. తర్వాత నారాయణ, మోతీరం 2000 సంవత్సరంలో ఒకేసారి ఉద్యోగం సాధించారు. అనంతరం 2004లో కుషాల్ ఇరిగేషన్ ఏఈగా ఉద్యోగం సాధించాడు. ఇలా ఒకరి వెనుక మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.40 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో.. ప్రస్తుతం మండలంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న తండాగా సాధు తండా పేరొందింది. దాదాపు 40 మందికి పైగా యువతీ, యువకులు పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 మంది ఇంజనీరింగ్ ఉద్యోగులే ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే బ్యాంకుల్లోనూ, ఉపాధ్యాయులుగాను, వ్యవసాయాధికారులుగాను, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనూ, దేశ సరిహద్దుల్లో సైనికులుగాను విధులు నిర్వహిస్తూ తండా ఖ్యాతిని నలుదిశలకు వ్యాపింపజేశారు. ఇంతే కాకుండా బయోటెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన అక్కాచెల్లెళ్లు చైతన్య, సింధూ యూఎస్ఏ లో స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నారు. తండాకు చెందిన రవిందర్ అనే యువకుడు దేశ సరిహద్దులో సైనికుడిగా పని చేస్తున్నాడు. తండాలో ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొంది చదువులు కొనసాగిస్తున్నవారు ఉన్నారు. ప్ర భుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. -
చెరకు సాగులో నూతన వంగడాలు
● 3102 రకం సాగుపై రైతుల ఆసక్తి ● ఎకరాకు 60 టన్నుల దిగుబడి ● జహీరాబాద్‌లో సుమారు3 వేల ఎకరాల్లో సాగు ● పెరుగుతున్న పంట విస్తీర్ణం జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక వాణిజ్య పంట కావడంతో సంవత్సరం కాలంపాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. పాత రకాలనే సాగు చేయడం, మరో వైపు పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు రైతులు ఎంచుకుంటారు. ప్రస్తుతం జహీరాబాద్ ప్రాంత రైతులు 3102 రకం చెరకు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. – జహీరాబాద్ టౌన్ జహీరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల రైతులు అధిక విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన రకాలనే పండిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 40 టన్నుల వరకు దిగుబడి రావాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 25 టన్నులు దాటడం లేదు. అందుకని రైతులు అధిక దిగుబడి ఇచ్చే రకాల సాగుపై మొగ్గు చూపుతుంటారు. జిల్లాలో అధికశాతం కో 86032, కో 808005, 87025, 83ఎ30 తదితర రకాలను పండిస్తున్నారు. వీటిలో చెక్కర శాతంతోపాటు దిగుబడి కూడా వస్తుందని కర్మాగారాల యాజమాన్యాలు వీటినే సూచిస్తున్నారు. పెద్దగా లాభాలు లేకున్నా నష్టం రాదన్న ఉద్దేశ్యంతో తప్పని పరిస్థితుల్లో రైతులు ఈ రకాల పంటను పండిస్తున్నారు. పెరిగిన 3102 రకం పంట విస్తీర్ణం జహీరాబాద్ ప్రాంతంలో రెండు, మూడేళ్ల నుంచి కొంత మంది రైతులు అధిక దిగుబడినిచ్చే 3102 కొత్త రకం చెరకు పంటను పండిస్తున్నారు. ఈ రకం పంట అధిక దిగుబడి వస్తుందని సాగుపై మొగ్గు చూపడంతో పంట విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాల్లో ఈ రకం చెరకు పంట సాగవుతోంది. అధిక విస్తీర్ణంలో సాగవుతున్న కో 86032, కో 808005 తదితర రకాల చెరకు పంట ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అదే 3102 రకం అయితే 60 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. చెరకు గడలు ఏపుగా పెరుగుతాయి. ఎరువులు, కలుపు మొక్కల నివారణ ఖర్చులు తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. కొత్త రకం పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతుండటంతో విత్తనంకు డిమాండ్ పెరిగి టన్నుకు రూ. 5 వేలు పలుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. లాభాలు వస్తున్నాయి శాస్త్రవేత్తలు, చెక్కర కర్మాగారం కంపెనీ యాజమాన్యం సూచించిన కో 86032, కో 808005 రకాలకు కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. పెట్టుబడులు పెరగడం తప్ప ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. లాభాలు తగ్గడంతో రెండేళ్ల నుంచి 3102 రకం పంటను సాగు చేస్తున్నా. పంట దిగుబడి పెరిగి లాభాలు వస్తున్నాయి. విత్తనం కూడా మంచి డిమాండ్ ఉంది. -
పేదోడి కడుపు నింపేందుకే సన్న బియ్యం
● గరిబోళ్ల ఆరోగ్యం, ఆత్మగౌరవంపెంచిన కాంగ్రెస్ సర్కార్ ● కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ ● ముత్తంగిలో దళితుల ఇంట్లో భోజనంపటాన్చెరు టౌన్: ప్రతీ పేదోడి కడుపు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో దళిత సోదరుడు విఠల్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం కుటుంబ సభ్యులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న పాలనపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనికి ఆ కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల ప్రజలు సానుకూలంగా సమాధానం చెప్పి ఇందిరమ్మ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యం పంపిణీతో అన్నం తినలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడేవారని మరో పక్క దొడ్డు బియ్యం పక్కదోవ పట్టి దళారుల దందాకు ఉపయోగపడేవన్నారు. అందుకే నిరంతరం పేదల సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచించే సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ పేద బిడ్డ కడుపు నింపాలనే తలంపుతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ముత్తంగి మాజీ ఎంపీటీసీ గడ్డ యాదయ్య, నాయకులు శ్రీను, అశోక్, సన్నీ యాదవ్, శంకర్, దశరథ్, వెంకటేశ్, శ్రీను, ప్రవీణ్, కాళిదాస్, రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
మంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి జోన్: వేసవి కాలం ఉన్నందున గ్రామీణ ప్రాంతాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...మూడు నెలల పాటుపంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి నీటి సమస్యను అధిగమించాలన్నారు. ప్రతీ పది రోజులకు ఒకసారి జిల్లాలోని తాగునీటి సరఫరాపై సమీక్ష జరిపి, అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
ఊరిస్తూ.. ఉస్సూరుమనిపిస్తూ!
నిమ్జ్ కోసం భూసేకరణ సరే..పరిశ్రమలేవీ..? ● భూములు కోల్పోయి దశాబ్దం గడుస్తున్నా.. ● ఉపాధి దక్కేదెన్నడంటున్న నిర్వాసితులు.. ● ఇప్పటికే సేకరించిన భూములు 5,109 ఎకరాలు.. ● తాజాగా 941 ఎకరాల సేకరణకు మరో నోటిఫికేషన్సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) భూసేకరణ తీరు విమర్శలకు దారితీస్తోంది. ఈ నిమ్జ్ కోసం దశాబ్ద కాలంగా వందల ఎకరాల భూములు సేకరిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఈ నిమ్జ్‌లో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా ఉత్పత్తిని ప్రారంభించలేదు. భూములు పొందిన ఒకటీ రెండు పరిశ్రమలు కూడా కనీసం వాటి నిర్మాణం పనులకు కూడా శ్రీకారం చుట్టలేదు. అయితే భూముల సేకరణ ప్రక్రియ మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా న్యాల్కల్ మండలం హుస్సెల్లీలో 653 ఎకరాలు, హద్నూరులో 288 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా ఈ నిమ్జ్ కోసం వందలాది మంది రైతులు భూములు కోల్పోతున్నప్పటికీ.. తమకు కనీస ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం రావడం లేదని నిర్వాసిత రైతులు, రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి కొనసాగుతున్న సేకరణ తొలిసారిగా ఈ నిమ్జ్ కోసం 2014లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామం పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను 2015లో పంపిణీ చేశారు. అలాగే చీలపల్లి, ఎల్గొయి తదితర గ్రామాల్లో కూడా భూములను సేకరించారు. ఇలా తొలి విడతలో 2,892 ఎకరాలను సేకరించి దాదాపు దశాబ్దం గడిచినా ఒక్క పరిశ్రమ కూడా ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఒక్క ఉద్యోగాన్నివ్వలేదు. ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఉన్న భూములు కోల్పోయి రైతుల పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా తయారైంది. ఏళ్ల తరబడి జాప్యం.. పలు బహుళజాతి కంపెనీలు ఈ నిమ్జ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నాయి. ఈ మేరకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ వాహనాల ఉత్పత్తి సంస్థ ట్రైటాన్ ఈ నిమ్జ్‌లో రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్లు రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అలాగే రక్షణరంగ ఉత్పత్తులు చేసే మరో సంస్థ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భావించాయి. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ నిర్మాణం దిశగా శ్రీకారం చుట్టలేదు. ఉత్పత్తిని ప్రారంభించలేదు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు మాత్రం నిర్వాసితులుగా మారుతున్నారు.12,635 ఎకరాల లక్ష్యం..మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..రూ.వేల కోట్ల పెట్టుబడులు అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం 2012లో జహీరాబాద్ వద్ద ఈ నిమ్జ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ నిమ్జ్ కోసం న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలో 17 గ్రామాల పరిధిలో మొత్తం 12,635 ఎకరాల భూములు సేకరించి ఇవ్వాలని టీజీఐఐసీ రెవెన్యూశాఖను అభ్యర్థించింది. తొలివిడతలో సేకరించిన 2,892 లతో రెండో విడతలో సేకరించిన భూములతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 5,109 ఎకరాలను తీసుకున్నారు. మిగిలిన 7,526 ఎకరాలను ఇంకా సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాజా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. -
పోయింది అధికారం మాత్రమే
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేట(సంగారెడ్డి): బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారం మాత్రమేనని ప్రజల గుండెల్లో ఉండేది గులాబీ జెండానే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని ఎన్‌గార్డెన్‌లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ...బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న హన్మకొండలోని ఎల్కతుర్తిలో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో రజతోత్సవ సభ గురించి ప్రజలకు వివరించి వాల్‌పోస్టర్లు అతికించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు,కార్యదర్శి అరిఫోద్దిన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సుధీర్‌రెడ్డి, మల్లాగౌడ్, తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. హోప్ ఆస్పత్రికి రూ.50 వేల జరిమానాసంగారెడ్డి: నిబంధనలు పాటించకుండా వైద్యం చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగారెడ్డిలోని హోప్ న్యూరో ఆస్పత్రికి రూ.50 వేల జరిమానా విధించడంతోపాటు నోటీసులు అందించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి శనివారం మీడియాకు వివరించారు. కోహీర్ మండలం పైడి గుమ్మల్ గ్రామా నికి చందిన నవీన (37) హోప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 2న మరణించాడు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈనెల 4న ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా నిబంధనలు పాటించకుండా వైద్యం చేసినట్లు విచారణలో తేలింది. మరో ఐదు రోజుల్లో రోగి మృతికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొనట్లు ఆమె వెల్లడించారు. పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలిజిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సంగారెడ్డి టౌన్: రైతులు పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలో శనివారం రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పత్తి పంట పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అధిక సాంద్రత పద్ధతిలో వేసిన పంటలను సాగు చేస్తే మేలైన దిగుబడి ఉంటుందని మంచి లాభాలు వస్తాయన్నారు. రైతులకు పత్తి సాగులో మెళకువలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త కో ఆర్డినేటర్ రాహుల్ విశ్వక్, మండల అధికారి ఝాన్సీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఆరో తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో telanganams.cgg.in వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. మండుతున్న ఎండలు 42డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జోన్: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 41డిగ్రీలు దాటి 42కు చేరువలో నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావడానికి జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకురావటం లేదు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఇళ్లలో ఉక్కబోతకు భరించలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో విద్యుత్తు సరఫరా లేని సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో శనివారం 16 మండలాలల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. అత్యధికంగా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్లో 41.8డిగ్రీలు నమోదు కాగా అత్యల్పంగా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్లో నమోదైంది. -
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
భోజనంలో నాణ్యతలోపిస్తే జైలుకేసంగారెడ్డి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దామోదర హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వారిని ఆదుకునే పథకాలను తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్రంలో కులగణన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకతీతంగా గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాయితీ రుణాలను ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వ్లెడించారు. త్వరలో మరో 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్ ,టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.● మంత్రి దామోదర హెచ్చరిక ● అందోలులో కేజీబీవీ, నర్సింగ్ కళాశాలల సందర్శన జోగిపేట(అందోల్): విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే అందుకు బాధ్యులైన వారినందరినీ జైలుకే పంపిస్తామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. అందోలులోని ప్రభుత్వ నర్సింగ్, మహిళా పాలిటెక్నిక్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో మంత్రి విద్యార్థినిలతో మాట్లాడారు. పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రిన్సిపాల్, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ల్యాబ్‌లలో కొత్త కంప్యూటర్లు, డైనింగ్ హాల్లో కొత్త టేబుళ్లు, ఇతర సామగ్రి సమకూర్చినందుకు మంత్రికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. ల్యాబ్‌లలో ఏసీలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కళాశాల పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కళాశాల నుంచి హాస్పిటల్‌కు, హాస్పిటల్ నుంచి కాలేజీకి వెళ్లడానికి కొత్త బస్సు ఏర్పాటు చేయిస్తానని విద్యార్థులకు మంత్రి హమీ ఇచ్చారు. అందోలులోని 1141 సర్వే నంబరులోని స్థలంలో నిర్మాణంలో ఉన్న 50 బెడ్ల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, వంద బెడ్ల ఏరియా హాస్పిటల్, నూతన నర్సింగ్ కళాశాల భవనాలతోపాటు కళాశాల ముందు నిర్మిస్తున్న బస్టాండ్లు, ఫోర్‌లైన్ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆర్డీఓ పాండు, ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు, స్థానికులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ -
ఊళ్లల్లో ఉపాధి జోరు
39.96లక్షల దినాల కల్పన లక్ష్యం ● గతేడాది లక్ష్యాన్ని మించి పనులు ● రోజురోజుకు పెరుగుతున్న కూలీల సంఖ్య ● పెరిగిన కూలితో కూలీలకు గిట్టుబాటుసంగారెడ్డి జోన్: గ్రామాలలో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలన్నదే ఉపాధి హామీ లక్ష్యం. ఇందులో పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి జాబ్ కార్డులు మంజూరు చేసి 100 రోజుల పని కల్పిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులతోపాటు మరి ఏ ఇతర పనులు లేకపోవడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు జోరుగా సాగుతున్నాయి. పని ప్రదేశాలు కూలీలతో సందడిగా కనిపిస్తున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకే.. ఉపాధి హామీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 39.96 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఈ ఆర్థిక ఏడాదిలో చేపట్టి పనులను గుర్తించేందుకు గతేడాది డిసెంబర్లో గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి ఉపాధి పనులను గుర్తించారు. గుర్తించిన పనుల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి వాటిని చేపడుతున్నారు. అవసరమైతే ప్రజలు, రైతుల అవసరం మేరకు మరిన్ని పనులు చేపడుతున్నారు. లక్ష్యాన్ని మించి పనులు గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి ఎక్కువగా పనులు చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక ఏడాదిలో 49.56లక్షలు నిర్దేశించగా ఈ ఏడాది 50.02లక్షల పని దినాలు కల్పించారు. సుమారు 50 వేల పని దినాలు అదనంగా కల్పించారు. పెరుగుతున్న కూలీల సంఖ్య ఉపాధి హామీలో పనులు ప్రారంభించిన నాటి నుంచి రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలో 24 మండలాల్లో 619 గ్రామపంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమలవుతుంది. జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతీరోజు 40 వేలమందికి పైగా పనులకు హాజరవుతున్నారు. పెరిగిన కూలీతో... ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో పనులు చేస్తున్న కూలీలకు రూ.7లను అదనంగా పెంచింది. దీంతో కూలి రూ.307లకు పెరిగింది. దీంతో కూలీలకు గిట్టుబాటు లభించినట్లయ్యింది. అంతేకాకుండా కూలీలకు గిట్టుబాటు వేతనం అందేవిధంగా పనులు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఉపాధి పథకం వివరాలు గతేడాది పనిదినాల లక్ష్యం 49.56లక్షలు గతేడాదిలో పూర్తి చేసిన పనిదినాలు 50.02లక్షలు ఉపాధిహామీ అమలవుతున్న పంచాయతీలు 619 రోజూ హాజరవుతున్న కూలీల సంఖ్య 42,600అవగాహన కల్పిస్తున్నాం సొంత గ్రామంలోనే పని కల్పించటం ఉపాధి పథకం యొక్క లక్ష్యం. ప్రతీ ఒక్కరు పనులకు హాజరయ్యేవిధంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ కూలీకి గిట్టుబాటు అయ్యేవిధంగా ప్రణాళికబద్ధంగా పనులు కల్పిస్తున్నాము. ఉపాధి హామీని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. –జ్యోతి, డీఆర్డీఏ, సంగారెడ్డి జిల్లా -
భూభారతితో సులభతరం
కలెక్టర్ వల్లూరు క్రాంతిపుల్కల్(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతులకు సంబంధించిన భూలావాదేవీలు సులభతరమవుతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. పుల్కల్లో శనివారం రైతువేదికలో ఏర్పాటుచేసిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాలలో పర్యటించి, మేధావుల, పలు రైతు సంఘాలతో చర్చించి ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందన్నారు. గతంలోలాగా కాకుండా భూ భారతిలో భూసమస్యలు 30 రోజుల్లో పరిష్కారం అవుతాయని సూచించారు. అనంతరం కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసి 8,9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు,తహసీల్దార్ కృష్ణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.దుర్గారెడ్డి, నాయకులు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్లో ఆల్ ట్రేడ్స్ యూనియన్స్ నాయకులు ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి, సామాన్యులపై భారం మోపుతుందన్నారు. కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు మే 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్జమర్రి మల్లేశం, జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ, కోరింకల మల్లేశం, సంతో ష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నందం, వివిధ రంగాల కార్మికులు, ఆల్ ట్రేడ్స్ యూనియన్స్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై మే 20 సమ్మె సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమై ఘటన అక్కన్నపేట మండలం పంతుల్‌తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భానోతు పకాలియా–సారవ్వ కుటుంబ సభ్యులు గురువారం వ్యవసాయ పొలం పనులు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మంట లార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగానికి పైగా వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇటీవల మహిళా సంఘం ద్వారా వచ్చిన డబ్బులు రూ.లక్ష ఇంట్లో దాచిపెట్టగా బుగ్గిపాలయ్యాయి. అదే విధంగా ఫ్యాన్లు, గిన్నెలు, ఫ్రీజ్, కూలర్‌తోపాటు బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, గిరిజన మోర్చా మండలాధ్యక్షుడు రైనా నాయక్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.రూ.లక్ష నగదు, విలువైన వస్తువులు కాలి బూడిద -
ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయండి
తూప్రాన్: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని టీఎస్‌యూఈఈయూ –సీఐటీయూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏ.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ కా ర్మికులను విద్యార్హతలను బట్టి వారికి సబ్ ఇంజనీర్, జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో కార్మికులకు హామీ ఇచ్చిన విషయంను గుర్తుచేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో మెరుపు సమ్మెకు కూడా వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడల రవీంద్ర ప్రసాద్, సురేశ్, జీవన్, రాజిరెడ్డి, శ్రీను, సలీం, దుర్గయ్య, సిద్ది రాములు, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్‌ఈఏసీ సభ్యురాలిగాకౌడిపల్లి మహిళా రైతు
● కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి అరుదైన గౌరవం ● వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలు సాగు కౌడిపల్లి(నర్సాపూర్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్‌ఈఏసీ (రిసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యురాలిగా కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నాయిని లక్ష్మీ ఎంపిక అయ్యారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నత్నయపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శోభ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూలో గురువారం ఆర్‌ఈఏసీ సమావేశం వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులు ఎంపిక కాగా ఇందులో లక్ష్మీని ప్రభుత్వం ఎంపిక చేసిందని రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగుతుందన్నారు. లక్ష్మీ కంచన్పల్లిలోని తన వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలతోపాటు అదనపు ఆదాయం కోసం ఒరంగట్టుపై టేకు మొక్కలు పెంపకం, కోళ్లఫారమ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఇచ్చిన మినికిట్స్తో విత్తన వరిని సైతం సాగు చేస్తుందన్నారు. ఆర్‌ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్‌లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బల్లెపు సంగయ్య (34) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1న జహీరాబాద్ నుంచి రైలులో వికారాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఇప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి వృద్ధుడు మిరుదొడ్డి (దుబ్బాక ): వృద్ధుడు అదృశ్యమైన ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. గురువారం ఎస్సై బోయిని పరశురామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వనం యాదయ్య(55) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతుండేవాడు. 14న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుండ్లపల్లిలో వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధి గుండ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుల్ల మల్లేశం 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతికని వెళ్లి వ్యక్తి -
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..
● ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి ● మరో నలుగురికి గాయాలు ● నిజాంపేట్ మండలంలో ఘటననారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండిన వరి ధాన్యాన్ని తానే ట్రాక్టర్ నడుపుతూ రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. కొద్దిదూరంలో కొనుగోలు కేంద్రం ఉందనగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజాంపేట్ మండలం శాఖాపూర్‌కు చెందిన గడ్డమీది అశోక్ (38) తన పొలంలో పండిన ధాన్యంను నిజాంపేటలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు ట్రాక్టర్లో లోడ్ చేశాడు. ట్రాక్టర్‌ను తోలుకుంటూ అశోక్ వస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రానికి కొద్ది దూరంలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న రైతు అశోక్ ట్రాక్టర్ స్టీరింగ్ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న బీర్ల లక్ష్మయ్య, బీరయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అశోక్ భార్య సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మొరంగపల్లి రాజయ్య(79) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం సదాశివపేట పట్టణానికి టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఆరూర్ శివారులోని ఎవరెస్ట్ పరిశ్రమ వద్దకు రాగానే వెనుక వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజయ్యను సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి చిన్నశంకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన క్యాసారం ఎల్లయ్య కుమారుడు దాసు(32) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. గొర్రెలను మేపడానికి గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దాసు చందంపేట గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద దాహం తీర్చుకునేందుకు వెళ్లాడు. బోరు బావి స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు గజ్వేల్‌రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అక్కారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గొర్లకాడి దుర్గాప్రసాద్(26) బైక్‌పై ప్రజ్ఞాపూర్ నుంచి తీగుల్ వైపు వస్తున్నాడు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి ఏడాది కిందట చేర్యాల ప్రాంతానికి చెందిన పుష్పతో వివాహం జరుగగా ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణీ అని గ్రామస్తులు పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మాకేది పరిహారం?
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో3 వేల ఎకరాల్లో ఎండిన చేన్లు ● వట్టిపోయిన బోర్లు,చుక్క నీరు లేని బావులు ● వడగళ్లకు నష్టపోయినపంటలకే ఇస్తే ఎలా? ● ఎండిన పంటలకు సైతంఇవ్వాలని డిమాండ్ ● గౌరవెల్లి ప్రాజెక్ట్ కిందమెట్ట రైతులను వీడని కరువు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భైరి భిక్షపతి. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుడు. ప్రాజెక్టులో ఊరు గుడాటిపల్లె ముగిని పోతే ముల్లె మూట సర్దుకొని హుస్నాబాద్‌కు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. గాంధీనగర్‌లో మూడు ఎకరాలు సెలక కొని రూ.4 లక్షలు పెట్టి రెండు బోర్లు వేయించాడు. వానాకాలం బాగానే పంట వచ్చింది. ఈ యాసంగి వరి పెడితే ఒక బోరులో నీళ్లు లేక రెండు ఎకరాల వరి ఎండిపోయింది. బోరుకు తెచ్చిన బాకీలు రూ.2లక్షలు తీరకముందే రూ.60 వేల నష్టం వాటిల్లింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి ఊరు విడిసిన గోదారి నీళ్లు రాకపాయే కరువు తప్పకపాదాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతం ఊట బావులు, బోర్ల నీటి లభ్యత మేరకు రైతులు పంటలు సాగు చేస్తారు. డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో యాసంగి 68,272 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తే 53,280 ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. వానా కాలం వర్షాలు సమృద్ధి కురిసినా భూగర్భజలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోవడంతో రైతుల పంట చేన్లకు నీరు అందక ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు మార్చి 11 వరకు 593 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు అంచనా వేశారు. మీర్జాపూర్ క్లస్టర్ పరిధిలోనే 600 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. హుస్నాబాద్ డివిజన్లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకొని నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. పంట నష్ట పరిహారం ఏది? వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రూ.వేల కొద్ది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మాకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యరని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో రైతు బంధు ఇవ్వకపోతే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటల బీమా లేకపోవడంతో నష్టపోయిన పరిహారం అందడం లేదు. బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సమయంలో పంట బీమా చేసినా ఏ రైతుకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. 18 ఏళ్లుగా గోదావరి నీళ్ల ముచ్చటే! మెట్ట ప్రాంత రైతులకు కరువు దూరం చేయాలని 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టుకు పునాదులు వేశాడు. అప్పటికే 90 శాతం పనులు పూర్తి చేసినా మహానేత మరణంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి 8 టీఎంసీల వరకు 2020లో పనులు పూర్తి చేశారు. అధికారులు ముంపునకు గురైన గుడాటిపల్లె, తెనుగుపల్లె, కొత్తపల్లితో పాటు నాలుగు గిరిజన తండాలను ఖాళీ చేయించి 2023 జూన్ 30న గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రైయల్ రన్ చేసి గోదావరి నీళ్లు వస్తున్నాయని ఆశలు కల్పించారు. ఎన్జీటీలో కేసు ఉండటంతో పనులు నిలిపేయాలని స్టే ఇవ్వగా అధికారులు నిలిపేశారు. 2024 ఆగస్టులో ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.431 కోట్లు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తాయని నాయకుల ప్రసంగాలతో రైతులకు భరోసా కల్పించారు. కాల్వల ద్వారా నీళ్లు రాకపోయినా ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తే బావుల్లో నీటి ఊటలు పెరిగుతాయని ఆశ పడ్డారు. 18 ఏళ్ల నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయనే నాయకుల మాటలే తప్ప ఇప్పటికీ నీళ్లు తీసుకరాలేదని రైతులు వాపోతున్నారు. రూ.5 లక్షల వరకు నష్టం గాంధీనగర్‌లో సొంత పొలంలో పశువులను పెంచి సేంద్రియ ఎరువు తయారుతోనే పంటలు సాగు చేస్తున్నా. ఎరువును ఇరుగు పొరుగు వారికి సరఫరా చేస్తా. 10 ఏళ్ల నుంచి ఎప్పుడూ చూడని కరువును ఇప్పుడు చూశా. రెండు బావులు, ఒక బోరు ఎండిపోతే రూ.1.50 లక్షలతో మరో 600 ఫీట్ల బోరు వేయించిన రూ.1.50 లక్షలతో మోటారు బిగిస్తే ఒక్క రోజులోనే ఎండిపోయింది. 3.20 ఎకరాల సేంద్రియ సన్నరకం వరి పంట ఎండిపోయింది. రూ.5 లక్షల వరకు నష్టం వచ్చింది. పశువుల మేతకు మరో దగ్గర నుంచి పశుగ్రాసం కొనుగోలు చేయాల్సి దుస్థితి వచ్చింది. – మాదాడి రాజేశ్వర్‌రావు, గాంధీనగర్ హుస్నాబాద్2 ఎకరాలు ఎండింది వానాకాలం వరి కోతల వరకు వర్షాలు పడ్డాయని బావుల్లో నీళ్లు ఉంటే మూడు ఎకరాలు వరి వేసిన. ఉగాదికి ముందే ఊటలు వెనక్కి వెళ్లిపోవడంతో బాయి నీళ్లు అడుగంటిపోయి మొదటి మడి పారలేదు. వరుస తాళ్లు పెడితే ఒక ఎకరం పంట చేతుకి వచ్చింది. రెండు ఎకరాలు కళ్ల ముందే ఎండిపోతే పశువులకు మేతకు వదిలేసిన. రూ.45 వేలు పెట్టుబడి నష్టపోయిన ప్రభుత్వం మాకు పరిహారం ఇయ్యాలే. – దేవేందర్ నాయక్, భల్లునాయక్ తండా -
గొర్రెలు, మేకల దొంగలు అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గొర్రెలు, మేకలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నీరజ్‌కుమార్ ఇంచురే(21), మాఖన్ విశాల్‌సింగ్(22), రాహుల్, బాబు నలుగురూ గొర్రెలు, మేకలను అపహరించడమే లక్ష్యంగా ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 24న దిల్‌సుఖ్‌నగర్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చీర్ల మల్లేశంకు చెందిన మేకల దొడ్డిలో 4 మేకలను అపహరించారు. కారులో వేసుకొని హైదరాబాద్‌లోని జియాగూడలో విక్రయించారు. రెండ్రోలకు 26న తొగుట సమీప రాంపూర్‌లో 4 గొర్రెలు అపహరించి విక్రయించారు. బాధితుడు చీర్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం గౌరారం హోటల్ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన ముఠాలోని ఇద్దరు సభ్యులు నీరజ్‌కుమార్ ఇంచురే, మాఖన్ విశాల్సింగ్లను అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చోరీలు చేసింది తామే అని ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కౌడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఇటీవల మండలంలోని రాజిపేట శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో చోరీ జరుగగా కేసు నమోదు చేశాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. గురువారం కౌడిపల్లి శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని దేవులతండాకు చెందిన విస్లావత్ ప్రేమ్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆలయంలో రూ.2 వేలు నగదు, రోల్డ్‌గోల్డ్, వెండి అభరణాలు చోరీ చేయగా దీంతోపాటు శివ్వంపేట మండల కొత్తపేట్ ఎల్లమ్మగుడి, చండీలోని ఆలయం, నర్సాపూర్ మండలం గొల్లపల్లిలోని మల్లన్నగుడిలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాము తెచ్చిన తంటా..
● నాలుగు గ్రామాలకు నిలిచిన కరెంట్ కౌడిపల్లి(నర్సాపూర్): ఓ పాము సబ్‌స్టేషన్‌లోకి దూరింది. అంతటితో ఆగకుండా స్తంభాలపై నుంచి తీగలపైకి ఎక్కింది. విద్యుత్‌షాక్‌కు గురై చనిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో సబ్‌స్టేషన్‌లోని సీటీ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. దీంతో కౌడిపల్లి 132/11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని కౌడిపల్లి, దేవులపల్లి, మహమ్మద్‌నగర్, ధర్మసాగర్ గ్రామాలకు కరెంట్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి, ఏఈ సాయికుమార్ విద్యుత్ సిబ్బంది పరిశీలించి రాత్రి వరకు మరమ్మతు చర్యలు చేపట్టారు. 100 ట్రిప్పుల ఇసుక సీజ్ చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వేచరేణి శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసినట్లు తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్ గురువారం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వేచరేణి శివారు వాగులో నుంచి కొందరు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి ఒక చోట డంప్ చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు వెళ్లి ఇసుక సీజ్ చేశామన్నారు. ఆయన వెంట ఆర్ఐలు రాజేందర్ రెడ్డి, ఐలయ్య, స్థానిక రైతులు ఉన్నారు. విషపు ఆహారం తిని.. ● మూడు ఆవులు మృతి హత్నూర (సంగారెడ్డి): విష ఆహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్ల మాచునూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య పాడి గేదెలు, ఆవులను మేపుతూ జీవిస్తున్నాడు. గ్రామ శివారులో గల చెరువు సమీపంలో ఇటీవల సినీ ఇండస్ట్రీ వాళ్లు సినిమా షూటింగ్లో భాగంగా అమ్మవారికి అన్నం రతి పోసి నైవేద్యం సమర్పించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. సుమారు 3 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం వదిలేసి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట వండిన అన్నం కావడంతో పూర్తిగా కుళ్లిపోయింది. ఆ ఆహారాన్ని బుధవారం సాయంత్రం మూడు ఆవులు తిని మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం కేసులో జైలుమర్కూక్(గజ్వేల్): దొంగతనం కేసులో కోర్టు ఇద్దరికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు మర్కూక్ ఎస్ఐ దామోదర్ తెలిపారు. 2017 సెప్టెంబర్‌లో మర్కూక్ గ్రామానికి చెందిన తుప్పటి కొమురవ్వ వ్యవసాయ క్షేత్రం నుంచి ఇంటికి వెళ్తుంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన అందనాగారం సాయిగౌడ్, బెండి రజనీకాంత్ ద్విచక్రవాహనంపై వచ్చి కొమురవ్వ మెడలో నుంచి రూ.60 వేలు విలువ చేసే బంగారు గొలుసును అపహరించారు. వెంటనే మర్కూక్ పోలీసులో ఫిర్యాదు చేశారు. గురువారం ఇద్దరు నిందితులను పట్టుకొని గజ్వేల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక ఎదుట హాజరు పర్చగా సంవత్సరం జైలుతోపాటు రూ.10వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలు చోరీ రామాయంపేట(మెదక్): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన రామాయంపేటలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న చర్చి ఫాదర్ మాసాయిపేట దయానంద్ 14న ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి ఊరికి వెళ్లాడు. 15న ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పాడు. దయానంద్ వెంటనే వచ్చి చూడగా ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలు మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం రాత్రి పలు టీస్టాల్స్, పాన్‌షాపులు, హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ ఆదేశాల మేరకు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచనలతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. టీ స్టాల్స్ పాన్ షాపులు, హోటళ్లలో గంజాయి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. డాగ్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్‌తో తనిఖీలు చేశామన్నారు. ఎస్ఐ అమర్, ఆర్ఎస్ఐ భవానీ కుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
సంగారెడ్డిటౌన్/సదాశివపేట: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని నాగపూర్‌లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల వద్ద దళారులకు ఎక్కడా తావు లేకుండా చూడాలన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నిర్మలరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉంటుందని ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ అంతకుముందు సదాశివపేటలో విలేకరులతో ఎమ్మెల్యే చింతా మాట్లాడుతూ... హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బహిరంగసభ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నియోజకవర్గ నాయకుడు శివరాజ్‌పాటిల్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, విద్యాసాగర్‌రెడ్డి, ముబిన్, తదితరులు పాల్గొన్నారు.సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ -
వామ్మో... చిరుత!
●ఇక్రిశాట్లో సంచారం ●భయాందోళనలో ప్రజలుఎక్కడ నుంచి వస్తున్నాయి..? అసలు ఇక్రిశాట్లో చిరుతలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం మాత్రం చిక్కడం లేదు. గతంలో వచ్చిన చిరుతను ఎవరో పెంచుకుని ఇక్రిశాట్లో వదిలేఽశారని చర్చ జోరుగా సాగింది. దాని కారణంగా దానిని పట్టుకోవడం కోసం బోనులో మేకను ఉంచితే అది దానిని తినకుండా మేకతో ఆడుకుని పోయిందనే ప్రచారం జరిగింది. ఇక్రిశాట్ వెనుక భాగంలో రైల్వేలైన్ ఉండటంతో వికారాబాద్ అటవీ ప్రాంతంలో నుంచి రైల్వేట్రాక్ మీదగా ఇక్రిశాట్లోకి వస్తున్నాయన్న వాదన సైతం వినిపిస్తోంది. చిరుతలకు రాత్రి సమయంలో సంచరించే అలవాటు ఉంటుందని అలా కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్రిశాట్లో పెద్దపెద్ద చెట్లు ఉండటంతో పాటు వాటికి కావలసిన నీరు, ఆహారం లభించడంతో ఇక్కడ తిష్ట వేసే అవకాశం కూడా లేకపోలేదని వాదన కూడా వ్యక్తమవుతోంది. రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని ఇక్రిశాట్లో తాజాగా చిరుత చిక్కడంతో స్థానిక ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఇక్రిశాట్లో చిరుత సంచరిస్తున్న విషయం అధికారులు గోప్యంగా ఉంచి వేట మొదలు పెట్టారు. ఎవరూ ఊహించని విధంగా బోను ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే చిరుత చిక్కడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే మరోవైపు ఇక్రిశాట్లో మరో చి రుత కూడా సంచరిస్తుందన్న అనుమానంతో అటవీ శా ఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. గతంలో చిక్కిన రెండు చిరుతలు.. ఇక్రిశాట్లో మొట్టమొదటిసారిగా 2014 ఆగస్టులో ఇక్రిశాట్లో చిరుత చిక్కింది. ఆ సమయంలో చిరుత కనిపించిన 150 రోజులకు తర్వాతగానీ బోనుకు చిక్కలేదు. తిరిగి 2019లో ఇక్రిశాట్లో చిరుత కనిపించడంతో రంగంలోకి దిగిన అధికారులు 120రోజులు శ్రమిస్తేగానీ చిరుత చిక్కలేదు. తాజాగా చిరుతను గుర్తించిన కొద్ది రోజుల్లోనే చిరుత చిక్కడం విశేషం. ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులు ఇక్రిశాట్లో మూడు చిరుతలను పట్టుకున్నారు. మరికొన్ని ఉండవచ్చని అనుమానం! తాజాగా ఓ చిరుత అధికారులు చిక్కినప్పటికీ, మరొకటి కూడా ఇక్రిశాట్లోనే సంచరిస్తుందన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికీ ఓ నిర్ధారణకు రాకపోయినా అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక్రిశాట్లో వెయ్యి ఎకరాలకు పైగాభూమి ఉంటుంది. దాంతో ఇందులో మరిన్ని చిరుతలు ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. భయాందోళనలో స్థానికులు.. ఇక్రిశాట్ను ఆనుకొని రామచంద్రాపురం, పటాన్చెరు పట్టణంతోపాటు, తెల్లాపూర్, ఈదుల నాగులపల్లి, వెలిమెల గ్రామాలు ఉంటాయి. ప్రధానంగా మాక్స్సొసైటీ కాలనీ, విద్యుత్‌నగర్, ఇక్రిశాట్ పెన్సింగ్ ఏరియా, పటాన్‌చెరులోని పలు కాలనీలు ఇక్రిశాట్‌కు ఆనుకుని ఉంటాయి. చిరుత చిక్కడంతో ఈ ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు జన నివాసాల మధ్యలోకి చిరుతలు వచ్చే అవకాశం ఉండవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే రైల్వేస్టేషన్.. ఇక్రిశాట్ ఫెన్సింగ్‌ను ఆనుకునే రామచంద్రాపురం ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ ఉంది. రాత్రి సమయంలో ఎంఎంటీఎస్ రైలు ఇక్కడనే ఉంచి తిరిగి ఉదయం బయల్దేరి వెళ్తుంది. రాత్రి సమయంలో ఎంఎంటీఎస్‌లో వచ్చే అవకాశం ఉంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఇక్రిశాట్లో మరొక చిరుత ఉందని మేము నిర్థారించ లేదు. కానీ, చిరుత కోసం ఏర్పాటు చేసిన ఆధునిక కెమెరాలను అలాగే ఉంచి పరిశీలిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. –విజయ్ కుమార్, రేంజ్ అధికారి, అటవీ శాఖ -
సిటీ స్కాన్ సెంటర్ సీజ్
నారాయణఖేడ్: అనుమతిలేకుండా పట్టణంలో కొనసాగుతున్న సిటీ స్కాన్ కేంద్రంతోపాటు జీవవ్యర్థాల అమలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ల్యాబ్‌ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. గురువారం నారాయణఖేడ్‌లో జిల్లా వైద్యాధికారిణి డా.గాయత్రీ దేవి ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, సిటీస్కాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతిలేకుండా సిటీ స్కాన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ తనిఖీల్లో గుర్తించిన అధికారులు వెంటనే నోటీసులిచ్చి సీజ్ చేశారు. కాగా, ఈ సిటీ స్కాన్ కేంద్రానికి రెండేళ్ల క్రితం కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ అనుమతులు తీసుకోకపోవడంతోనే సీజ్ చేసినట్లు గాయత్రీదేవి చెప్పారు. జిల్లాలో మూడేళ్ల కాలంలో 74 అనుమతి లేని ఆస్పత్రులను సీజ్ చేశామని, 48 ఆస్పత్రులకు రూ.3.78లక్షల జరిమానా కూడా విధించినట్లు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.సంధ్యారాణి, ఇన్చార్జీ డీఐఓ డా.మనోహర్, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ జెట్ల భాస్కర్ ఉన్నారు.సక్రమంగా విధులు నిర్వహించాలి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు విధి నిర్వహణలో తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం రెండు రోజులపాటు నిర్వహించిన ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్‌తోపాటు ఎంఎస్‌సీడీ పాపిలోన్ డివైస్‌పై రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ పింకీ కుమారి, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫెయిల్ విద్యార్థులకు మరోసారి అవకాశం సదాశివపేట(సంగారెడ్డి): డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి గురువారం తెలిపారు. 2016 నుంచి 2021 మధ్య డిగ్రీ చదివి 1 నుంచి 6 సెమిస్టర్ వరకు ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్‌టైం సెటిల్మెంట్ ప్రకారం పరీక్షలు రాసేందుకు ఉస్మానియా వర్సిటీ అవకాశం కల్పించిందని ఆమె వెల్లడించారు. పరీక్షలకు అపరాధ రుసుం లేకుండా మే 19 వరకు అపరాధ రుసుంతో మే 29 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9701956872, 8341298597 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించాలి డీఈఓ వెంకటేశ్వర్లు కంది(సంగారెడ్డి): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. కందిలోని లక్ష్మీనగర్‌లో గల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన క్యాలెండర్‌ను డీఈఓ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...పాఠశాలకు అదనపు తరగతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాతలు కాశీనాథ్, సురేశ్‌నాయక్, మహమ్మద్ తయ్యబ్‌లను అభినందించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటలక్ష్మి, పాఠశాల హెచ్ఎం లీలావతితోపాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సదాశివపేటరూరల్(సంగారెడ్డి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొల్కుర్ గ్రామంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కష్టపడి పండించిన పంటను దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కలెక్టర్ వల్లూరు క్రాంతి కొండాపూర్(సంగారెడ్డి): రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. మండల పరిధిలోని గోకుల్ గార్డెన్ ఫంక్షన్ హాలులో రైతులకు భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం –2025 పై అవగాహన సదస్సును టీజీఐఐసీ చైరపర్సన్ నిర్మలారెడ్డితో కలసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. లోప భూ ఇష్టమైన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. భూభారతితో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి పాల్గొన్నారు. -
క్యాన్సర్ అంటే భయం వద్దు
● సకాలంలో గుర్తిస్తే ఆదిలోనేజయించే అవకాశం ● మున్సిపల్ చైర్మన్ మంజుల ● సిద్దిపేటలో 19న ఉచిత వైద్య శిబిరంసిద్దిపేటజోన్: క్యాన్సర్ అంటే ప్రజల్లో ఒక భయం ఉందని, అలా భయపడొద్దని ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే జయించే అవకాశం ఉందని మున్సిపల్ చైర్మన్ మంజుల, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాంలు పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ మధు, డాక్టర్ శ్రవణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక చొరవతో కిమ్స్ ఆస్పత్రి సౌజన్యంగా ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 19న స్థానిక విపంచి ఆడిటోరియంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో మమోగ్రఫీ, పాప్ స్మియర్, బోత్బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, ఎండోస్కోపీ, అల్ట్రా సౌండ్ తదితర పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఈర్షద్, వర్మ, రాములు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
అతి పెద్ద జైన విగ్రహాన్ని కాపాడాలి
నంగునూరు(సిద్దిపేట): నంగునూరులోని చిన్న కొండపై వేల ఏళ్ల కింద వెలసిన వర్ధమాన మహావీరుడి విగ్రహం వద్ద క్వారీ పనులను ఆపి విగ్రహం ధ్వంసం కాకుండా చూడాలని పురావస్తు పరిశోధకుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరులోని జాకీరమ్మ బండపై ఉన్న జైన శిల్పం గురించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ శివనాగిరెడ్డికి వివరించడంతో బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు బండలను తొలుస్తున్న క్రమంలో విగ్రహం ధ్వంసం అయ్యే అవకాశం ఉందన్నారు. 9 అడుగుల జైన శిల్పం కాయోత్సర్గాసనంలో నిలబడి ఉందని, విగ్రహం తలపై ఊష్ణిష చిహ్నం రాష్ట్ర కూటుల కాలపు జైన తీర్థంకర లక్షణానికి అద్దం పడుతోందని తెలిపారు. కొండకు దిగువన ఇటుక రాతి శకలాలు, రాతి స్తంభంపై పద్మాసనం వేసుకొని కూర్చున్న మహావీరుడి శిల్పంతోపాటు గ్రామంలో హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో జైన తీర్థంకరుల శిల్పాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నంగునూరులోని అరుదైన విగ్రహం చుట్టూ రాతిని తొలగించడంతో 11వ శతాబ్దపు ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయని వీటిని కాపాడాలన్నారు. కార్యక్రమంలో అహోబిలం కరుణాకర్, పవన్, శిల్పి సుధాకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి -
ఉచిత కరెంట్‌తో ఇటుక బట్టీలు
ట్రాన్స్‌కో ఆదాయానికి భారీగా గండి తూప్రాన్: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంట్ అక్రమ ఇటుకల వ్యాపారులకు వరంగా మారింది. పంటల సాగు కోసం వినియోగించాల్సి న ఉచిత విద్యుత్‌ను తమ వ్యాపారానికి వినియోగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం అవసరమయ్యే నీటి కోసం విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఓ పక్కా రైతులు వేసిన పంటలకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందించలేక, లో వోల్టేజీ కారణంగా బోరుమోటార్లు కాలిపోతున్నా యి. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టినట్లైతే విద్యుత్ సరఫరా మారింత మెరుగుపడనుందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మండలంలో 16 బట్టీలు ఉమ్మడి మండలంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో తదితర గ్రామల్లో కొంతమంది ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. నిత్యం లారీలు, ట్రాక్ట ర్లలో ఇతర ప్రాంతాలకు సరఫరా తరలిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లోని ఉచిత కరెంటు వినియోగిస్తూ జోరుగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో ప్రజలు నూతన ఇళ్ల నిర్మా ణాలను అధికంగా చేపడుతున్నారు. దీంతో ఇటు కల అవసరం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జోరుగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. సుమా రు ఉమ్మడి మండలంలో 16 బట్టీలకు పైగా మండలంలో కొనసాగుతున్నాయి. వీటికి నిర్వాహకులు ఉచిత కరెంట్‌ను వినియోగిస్తున్నారు. బావుల దగ్గర నడవని మోటార్ల నుంచి కరెంట్ తీసుకొని వాడుకుంటున్నారు.వ్యాపారులు ఇటుక బట్టీలకు తప్పనిసరిగా కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటిది ఏదీ తీసుకోవడం లేదు. దీంతో రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ విషయం ట్రాన్స్‌కో అధికారులకు తెలిసినా నామ మాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటూ... పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు విసిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకం ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని ప్రభుత్వ భూముల్లోంచి లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. అర్థరాత్రి నుంచి తెల్లవారు జామువరకు ముడి సరుకును గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్లో, చెరువులు, కుంటలు ఎక్కడబడితే అక్కడ వీరి అక్రమ వ్యాపా రానికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై దృష్టి సారించి వ్యాపారులను ను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ బావుల నుంచి అక్రమంగా తీసుకుంటున్న నిర్వాహకులు ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టి తవ్వకం చోద్యం చూస్తున్న అధికారులుచర్యలు తీసుకుంటాం ఇటుక బట్టీలకు ఉచిత విద్యుత్‌ను వినియోగిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేశాం. వ్యాపారులు ఇటుక బట్టీలకు తప్పనిసరిగా కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో వారిని గుర్తించి చట్టరీత్యా కేసులు నమోదు చేస్తాం. – వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఏఈ, తూప్రాన్ -
ధాన్యం కుప్పను ఢీకొట్టిన బైక్
యువకుడికి తీవ్ర గాయాలు రామాయంపేట(మెదక్): ధాన్యం కుప్పను బైక్ ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఝాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మంగళవారం బైక్‌పై ఖాజాపూర్ గ్రామానికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో రో డ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బాల్‌రాజ్ తెలిపారు. -
మొగులు..
ఈ ఫొటోలో కనిపిస్తుంది దుబ్బాకకు చెందిన కౌలు రైతు మల్లారెడ్డి. యాసంగిలో వేసిన 3 ఎకరాల వరి పంట ఇంకో 15 రోజులైతే కోతకొచ్చేది. ఆకాశంలో మబ్బులు అవుతుండటంతో భయంతో వరి గొలుసు ఎర్రబడక ముందే కోయించాడు. వర్షం పడితే ఇత్తు చేతికి రాదు ఉన్న పంటనన్నా చేతికొస్తే చాలనుకొని పచ్చిగా ఉన్నా వరిని కోశాడు. ఇది ఈ ఒక్క రైతు మల్లారెడ్డిదే పరిస్థితే కాదు.. జిల్లాలోని చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. మొగులు గుబులుతో నష్టం అయినా సరే పంటనన్నా కాపాడుకోవాలనే పచ్చి వరిని కోయిస్తున్నారు. దుబ్బాక : ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్న వేళ రైతుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఏ క్షణాన గాలి దుమారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం రెక్కలు ముక్కలు జేసుకొని.. పుట్టెడు పెట్టుబడులు పెట్టి కండ్లళ్ల ఒత్తులు వేసుకొని యాసంగిలో పంటలు కాపాడుకుంటూ వస్తున్న రైతులకు వాన మొగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వరి పంటలు చేతికొచ్చే దశలో వారం రోజులుగా ఆకాశంలో మబ్బులు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. 20 రోజుల కిందట వడగండ్ల వానలు పడటంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ గాలి దుమారం, వడగండ్ల వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతోపాటు వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు పచ్చి వరి పంట చేలనే కోస్తున్నారు. 20 శాతంకు పైగా నష్టమైనా.. వర్షాలు పడే సూచనలు ఉండడంతోపాటు వారం రోజులుగా చినుకులు కూడా పడుతుండటంతో రైతులు భయంతో 70 శాతం కూడా పూర్తి కాని వరి పంటలను కోయించుకుంటున్నారు. భూమి ఆరక దిగబడుతుండటంతో ఖర్చు ఎక్కువైనా చైన్ మిషన్లను పెట్టి కోయిస్తున్నారు. సుమారుగా 20 శాతంకు పైగా గింజలు తాలుపోయి నష్టం జరిగే అవకాశాలు ఉంది. జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా చాలా వరకు నీరందక పంటలు ఎండిపోయాయి. గతంలో కురిసిన వడగండ్ల వర్షంతో కొంత వరి పంటలకు నష్టం వాటిల్లింది. తీరా మళ్లీ ఆకాశంలో మార్పులతో పూర్తిగా కాని చేలనే కోస్తుండటంతో చాలా నష్టం వాటిల్లేటట్లు కనిపిస్తుంది. -
ట్రాక్టర్ బోల్తా : యువకుడు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి ఘటన అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లింగాల భాను(23) వ్యవసాయ పనుల నిమిత్తం తన మామయ్య లింగాల యాదయ్య దగ్గర నుంచి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. పనులు పూర్తి చేసిన అనంతరం తెల్లవారుజామున తీసుకొస్తుండగా గ్రామ శివారులో కల్వర్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో భాను ట్రాక్టర్ ఇంజన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. అందరితో కలివిడిగా ఉండే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్ ఢీకొని వ్యక్తి టేక్మాల్ (మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మతి చెందిన ఘటన టేక్మాల్ మండల పరిధిలోని లక్ష్మణ్ తండాలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ దయానంద్ కథనం మేరకు.. జోగిపేట– లక్ష్మీనగర్ రోడ్డుపై 14న తండాకు చెందిన కాట్రోత్ పోమ్లా నాయక్ (55) వడ్లు ఆరబోస్తుండగా అతివేగంగా బైక్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సాయంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధ వారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు బిక్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌లో యువకుడు జోగిపేట(అందోల్): వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌లో యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ పాండు కథనం మేరకు.. జోగిపేట పట్టణానికి చెందిన యాదుల్ (45) చౌరస్తాలోని టీ స్టాల్లో పనిచేస్తుంటాడు. బుధవారం మద్యం సేవించేందుకు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న పద్మావతి వైన్స్‌కు వెళ్లాడు. అతిగా మద్యం సేవించి కూర్చున్నచోటే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ అనిల్‌కుమార్, ఎస్ఐ పాండు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫర్వీన్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వడదెబ్బ లక్షణాలతో వృద్ధుడు? రామాయంపేట(మెదక్): వడదెబ్బ లక్షణాలతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(68) ప్రతిరోజూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు రోజులుగా అస్వస్థతకు గురై పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వాంతులు చేసుకున్న బాలయ్యను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. తన భర్త వడదెబ్బతోనే మృతి చెందినట్లు మృతుని భార్య తెలిపింది. సమాచారం అందుకుని వైద్యశాఖ అధికారులు మృతుడి ఇంటికెళ్లి వివరాలు సేకరించారు. వడదెబ్బతో మృతి చెందలేదని, అలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు. -
హైనా దాడిలో గొర్రెలు మృత్యువాత
మద్దూరు(హుస్నాబాద్): హైనా దాడిలో గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని రేబర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన ఈరి శ్రీనివాస్ తన వ్యవసాయ బావి వద్ద షెడ్డు నిర్మించుకొని గొర్రెల పెంపకం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గొర్రెలను షెడ్డులోకి తోలి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం షెడ్డు వద్దకు వెళ్లి చూడగా హైనా దాడిలో ఏడు గొర్రెలు మృతి చెంది కనిపించాయి. మరో మూడు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సూమారు రూ.లక్ష వరకు నష్ట వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తండ్రిపై హత్యాయత్నం ● కుమారుడు రిమాండ్ నర్సాపూర్ : తండ్రిపై హత్యాయత్నం చేసిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ లింగం తెలిపారు. మండలంలోని చిన్నచింతకుంటకు చెందిన వడ్ల నాగరాజు తన తండ్రి దశరథను ఎలాగైనా చంపాలన్న ఉద్దేశ్యంతో 12న నర్సాపూర్‌లో కత్తి కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి తండ్రితో గొడవ పడి కత్తితో దాడి చేశాడు. ఆస్తి పంచడం లేదని, తనకు మరో పెళ్లి చేయడం లేదన్న నెపంతో కత్తితో తండ్రిపై దాడి చేశాడని పేర్కొన్నారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దాడి కేసులో ఇద్దరు అరెస్ట్ నంగునూరు(సిద్దిపేట): రెండు వేర్వేరు చోట్ల దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనట్లు రాజగోపాల్‌పేట ఎస్ఐ అసీఫ్ తెలిపారు. నర్మేటకు చెందిన సాయికుమార్ మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ మద్యం తాగించాలని కోరాడు. డబ్బులు లేవని చెప్పడంతో దాడి చేయగా సాయికుమార్‌కు గాయాలయ్యాయి. అలాగే, మంగళవారం హుస్నాబాద్‌లో జరిగిన వెళ్లి వేడుకల్లో జరిగిన గొడవ విషయమై మాట్లాడుతుండగా నంగునూరుకు చెందిన జిడ్డి రజినీకాంత్, సంపత్‌లపై ముండ్రాయికి చెందిన జున్నుబోయిన అనిల్ దాడి చేశాడు. రెండు ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని బుధవారం రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు. అంబేడ్కర్నురాజకీయాలతో ముడిపెట్టొద్దు ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య దుబ్బాక : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను స్వార్థ రాజకీయాలకు ముడిపెట్టడడం బాధాకరమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 13న దౌల్తాబాద్ మండలం ముబారస్‌పూర్‌లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టడడం తగదన్నారు. ముబారస్‌పూర్‌లో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నాతోపాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీబీఎఫ్ జాతీయ నాయకులు శంకర్ అక్కడే ఉన్నామని కింద ఉన్న వ్యక్తి జెండా కావాలని అడుగడంతో ఎమ్మెల్యేపై నుంచి జెండాను ఆ వ్యక్తికి వేశాడని అన్నారు. అనవసరంగా దీనిపై రాజకీయాలు చేయడం మంచి పరిణామం కాదన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి జెండాను కింద పడేస్తే మేమే ఖండించేవారిమని దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. తల్లీకొడుకులమృతిపై కేసు నమోదు కల్హేర్(నారాయణఖేడ్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తల్లీకొడుకులు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కల్హేర్ ఎస్ఐ వెంకటేశం బుధవారం తెలిపారు. నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగోడ్ మండలం పట్టెపొలం తండాకు చెందిన తల్లీకొడుకులు లావుడ్య సక్రిబాయి, సుభాష్ దుర్మరణం చెందారు. మృతురాలు సక్రిబాయి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల వాహనాన్ని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
10 రోజులకు కోసేదుండే..
నేను 4 ఎకరాల్లో వరి పంట వేసిన. ఇంకో 10 నుంచి 15 రోజులైతే వరి పూర్తిగా కోతకు వచ్చేది. వాన భయంతో ముందుగానే కోయించిన. కొంత పొల్లు పోయినా వాన పడితే ఇత్తు చేతికి రాదనే భయంతోనే కోయించిన. ఏం చేస్తాం బాకీ ఉన్న కాడికి అయితాయి. ఇంకా 10 రోజులు ఉంచితే చేతికొస్తదనే గ్యారంటీ లేదాయే. నేనే కాదు చాలా మంది పచ్చి చేలనే కోయిస్తుండ్రు. – గన్నె వెంకట్రాజిరెడ్డి, రైతు దుబ్బాక 20 రోజుల కిందటే వరి ఈనుతున్న దశలోనే వడగండ్ల వర్షం పడింది. మళ్లీ చేతికొస్తదనుకున్న సమయంలో మొగుల్లు కావట్టే. మళ్లీ రాళ్లు పడితే పంటగింజ కూడా దక్కదు. పచ్చిగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కోయించిన. యాసంగిలో పంట చేతికొచ్చేది నమ్మకం లేదు. పోయిన యాసంగిలో రాళ్లవాన పడి పంట చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మొగుల్లు అవుతుండటంతో 2 రోజుల కిందటనే పచ్చిచేనునే కోయించినా. – ఎంగారి నరేశ్ రెడ్డి, రైతు వానపడితే చేతికిరాదనే భయం.. -
చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి టౌన్: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పీఎసీఎస్ కార్యాలయ ఆవరణలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ..రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సగం మందికి చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి మద్దతుధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బో నస్ ఇస్తామన్నారని, దొడ్డు రకం ధాన్యానికి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పట్నం మాణిక్యం, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు ఉచిత కంటి వైద్య శిబిరం నారాయణఖేడ్: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న గురువారం సత్యసాయి మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సమితి బాధ్యులు తెలిపారు. శిబిరంలో కంటి సమస్యలున్న వారికి ఉచితంగా చికిత్సతోపాటు శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని వెల్లడించారు. పూర్తి వివరాలకు 9676171527 నంబరులో సంప్రదించాలని సూచించారు. 28 నుంచి వేసవి శిక్షణ తరగతులు నారాయణఖేడ్: ఖేడ్ శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 18 వరకు సంస్కార సాధనావర్గ వేసవి శిక్షణా శిబిరం–2025 నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్ల బాలబాలికలకు చిత్రలేఖనం, రంగులు వేయడం, సాంస్కృతిక కళలకు సంబంధించిన చెక్కభజన, యోగా, కోలాటం, డంబుల్స్, భారతీయ ఆటలు, కర్రసాముల్లో రోజూ ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు శిక్షణనిస్తారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూమయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాలకు 8099811208, 9391845885, 814322 2295 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పెండింగ్ బిల్లులు చెల్లించండి ట్రాన్స్‌కో సీఎండీని కలిసిన కరెంట్ కాంట్రాక్టర్లు సంగారెడ్డి: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌కో సీఎండీ ముషారఫ్ అలీని విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు కలసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ప్రజాభిప్రాయసేకరణజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఆందోళనలు 71వ రోజుకు చేరుకున్నాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై అధికారులు వారం రోజులుగా కొనసాగిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రి య గురువారంతో ముగియనుంది. ఈ మేరకు తహసీల్దార్ పరమేశం బుధవారం మీడియాకు వెల్ల్లడించారు. కార్యక్రమం ముగిసేలోపు ప్రజలు స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలు అందించవచ్చన్నారు. సేకరించిన అభిప్రాయాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో అందించనున్నట్లు తెలిపారు. -
డెక్కన్ టోల్ వేస్‌కు గ్రీన్ హైవేస్–2023 అవార్డు
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దు నుంచి సంగారెడ్డి వరకు 65వ జాతీయ రహదారిని ఉత్తమంగా నిర్వహిస్తున్నందుకుగాను సంగారెడ్డికి చెందిన డెక్కన్ టోల్ వేస్ సంస్థకు గ్రీన్ హైవేస్–2023 కేటగిరీలో రజత పురస్కారం లభించింది. మంగళవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో డెక్కన్ టోల్ వేస్‌కు చెందిన ప్రాజెక్టు హెడ్ రాజేశ్ విచారెకు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అవార్డును ప్రదానం చేశారు. జాతీయ రహదారి పొడుగునా పచ్చదనం నింపడం, పునరుత్పాదక ఇంధన సృష్టి, నీటి సేకరణ, వినూత్న మొక్కలు నాటడం, నీటి నిర్వహణ పద్ధతులపై చేస్తున్న కృషికిగాను డెక్కన్ టోల్ వేస్ సంస్థకు అవార్డు లభించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో ప్రభుత్వం టీఎన్జీఎస్ నూతన భవన నిర్మాణంకు కేటాయించిన స్థలంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్లతో కలిసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. అలాగే భవన నిర్మాణానికి తమవంతుగా కృషి చేస్తామని, కలెక్టర్ ఉద్యోగుల పక్షానే ఉంటారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. టీఎన్జీవోస్కు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి జావేద్ అలీ, సంఘం జిల్లా కార్యదర్శి వి.రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, పి.వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ జిల్లా లోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ టీఎన్జీవో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ -
పోషకాహార లోపాన్ని అరికట్టాలి
సంగారెడ్డి: ఎప్పటికప్పుడు మహిళల్లోనూ, గర్భస్థ శిశువుల్లోనూ పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. చౌటకూరు మండలం, శివంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి రెండేళ్లవరకు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒత్తిడి తగ్గేందుకు వ్యాయా మాలు, యోగాలు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో నేర్పించాలని సూచించారు. ప్రతీ నెలలో రెండవ శుక్రవారం, నాలుగో శుక్రవారం తల్లికి కుటుంబ సభ్యులకు పౌష్టికాహారంపై కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఇంట్లోని వయో వృద్ధులను, తల్లిదండ్రులను భారంతో కాకుండా బాధ్యతతో చూడాలని చెప్పారు. తల్లిదండ్రుల్ని వద్ధుల్ని ఇబ్బంది గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూ ఓ లలితకుమారి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిణి వసంతకుమారి, డీఈఓ వెంకటేశ్వ ర్లు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఆర్డీఓ పాండు, సీడీపీఓలు, సంబంధిత అధికారులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. శివంపేటలో పోషణ పక్షం కార్యక్రమం కలెక్టర్ వల్లూరు క్రాంతి -
నీటి ఎద్దడిపై అప్రమత్తంగా ఉండాలి
నారాయణఖేడ్: వేసవి తీవ్రత అధికంగా ఉండడానికి తోడు భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రస్తుతం కొన్నిచోట్ల విద్యుత్ సమస్య ఇతర కారణాలతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలియడంతో మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని సక్రమంగా సరఫరా చేయించడం కోసం ప్రత్యేకంగా రూ.70 లక్షలతో డెడికేటేడ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించామన్నారు. ఇందిరమ్మ గృహాల కోసం అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో నారాయణఖేడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు వినోద్‌పాటిల్, దిగంబర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు. విద్యుత్ సమస్య నివారణకు రూ.70లక్షలతో డెడికేటెడ్ లైన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష -
వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ప్రజా సంఘాలు, దళిత నేతల డిమాండ్ సంగారెడ్డి టౌన్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలు సృష్టించి అవమానించిన అరుణ్‌కుమార్, నాగార్జునపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని అటువంటి వ్యక్తిని కించపరుస్తూ పోస్టులు పెట్టడం ఆయనను తీవ్రంగా అవమానించడమేనని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ హెచ్చరించారు. శివాజీ మహారాజ్ పాదాలకు అంబేడ్కర్ నమస్కరించినట్లుగా పోస్ట్చేసిన అరుణ్ కుమార్, నాగార్జున అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్ఝరాసంగం/న్యాల్కల్ (జహీరాబాద్): ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్‌లకు పాల్పడకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. మండల కేంద్రమైన ఝరాసంగంలోని బుధవారం పోలీస్ స్టేషన్‌తోపాటు న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పీఎస్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణను సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఎలాంటి కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికబద్ధంగా ప్రతీ కేసును పరిష్కరించాలన్నారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నైట్ బీట్, పెట్రోలింగ్ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. సరిహద్దుల వద్ద తనిఖీలు తప్పనిసరిగా చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, రూరల్ సీఐ హన్మంతు, ఎస్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అధ్యాపకుడికి ప్రతిభా అవార్డు
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ వైకుంఠం కళారంగంలో చేసిన సేవలకుగాను సౌత్ ఇండియన్ కల్చరల్ ఫెస్టివల్స్ ఉగాది పురస్కారాల్లో భాగంగా అవార్డును అందుకున్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కల్చరల్ ఫైన్ఆర్ట్స్ ఫెడరేషన్ హైద్రాబాద్, ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో అక్కడి లోక్ కళామంచ్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందించినట్లు చెప్పారు. ఐటీ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వర్రావు, సినీ నిర్మాత మంత శ్రీనివాస్, ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ఆది ఫౌండేషన్ చైర్మన్ ఆది నారాయణ, సీనియర్ కూచిపూడి నాట్యగురు సీతనాగజ్యోతి తదితరులు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని కళామతల్లి సేవలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటానన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ పిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఈఓ డాక్టర్ గోపాలసుదర్శనం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రద్ధానందం, ఇన్చార్జి పీడీ విశ్వనాథం తదితరులు వైకుంఠంను అభినందించారు. చర్చలతోనే సమస్యలు పరిష్కారం – అరుణోదయ సాంస్కృతిక నాయకురాలు విమలక్క హుస్నాబాద్: పీపుల్స్‌వార్ చర్చలకు ముందుకు రావడం, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఇరుపక్షాల చర్చలతో సమస్యలు పరిష్కామవుతాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో జనశక్తి నాయకుడు రిక్కల సహదేవ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడారు. బూటకపు ఎన్కౌంటర్లో సహదేవ రెడ్డి అమరుడయ్యాడని తెలిపారు. తాను ఏదైతే సమ సమాజం కోసం కలలు కన్నాడో దాని కోసం పోరాడటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. కలలు నెరవేర్చడానికి పౌర సమాజం ఆ దిశగా ఆలోచించాలన్నారు. ముంచుకొస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల దృక్పథంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కృషి జరగాలన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ముందుకురాలని అన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ మనోహరాబాద్(తూప్రాన్): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని రంగాయపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దానప్ప సత్యనారాయణ బంధువుల పెళ్లి నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. సోమవారం ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని అరతులం బంగారం, ఆరు తులాల వెండి, రూ.80 వేల నగదు కనిపించలేదు. దొంగలు చోరీ చేసినట్లు గుర్తించి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. తడిసిన ధాన్యం.. రైతుల దైన్యం మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని పలు గ్రామాలలో సోమవారం మధ్యాహ్నం కురిసిన ఆకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొన్ని చోట్ల వడగళ్లు కురవడంతో వరి పంట దెబ్బతింది. మండలంలోని వల్లంపట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. -
ఫ్లెక్సీ తొలగింపు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఎదుట ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, చలివేంద్రం చాటున ప్రైవేట్ ప్రచారం పేరుతో సోమవారం ‘‘సాక్షి’’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. వెంటనే వైద్యాధికారులు సిబ్బందితో ఫ్లెక్సీని తొలగించారు. ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫ్లెక్సీలు, ప్రచారానికి సంబంధించినవి ఏర్పాటు చేయకూడదని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని వైద్యాధికారులు సిబ్బందికి సూచించినట్లు సమాచారం. ప్రైవేటు ఆస్పత్రులకు ఎవరినైనా రెఫర్ చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
నర్సాపూర్ : కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని కాపాడారు. ఎస్ఐ లింగం కథనం మేరకు.. నర్సాపూర్‌కు చెందిన మన్నె జయ మ్మ సోమవారం నాలుగేళ్ల కుమారుడితో కలిసి స్థానిక రాయరావు చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెరువులో దిగి నీటి లోపలికి వెళ్తుండగా వాచ్మెన్ రమేశ్ గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసు హెడ్ కానిస్టేబుల్ పాండరి, కానిస్టేబుల్ భిక్షపతి, యాదయ్య, నాగరాజు వెంటనే చెరువు వద్దకు వెళ్లి తల్లి కుమారుడిని నీటిలోంచి బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని జయమ్మ నిశ్చయించుకుందని ఎస్ఐ తెలిపారు. అనంతరం జయమ్మ భర్త అనిల్‌కుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిచారు. తల్లికుమారుడిని కాపాడిన సిబ్బందిని ఎస్ఐతోపాటు పలువురు అభినందించారు.చెరువులోకి వెళ్తుండగా కాపాడిన పోలీసులు -
మహనీయుడా.. మన్నించు
– దాత పేరు లేదని విగ్రహావిష్కరణ వాయిదా పాపన్నపేట(మెదక్): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహ దాత తన పేరు పెట్టాలన్న డిమాండ్ ఆవిష్కరణకు బ్రేకులు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేటలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించాలని గ్రామంలోని మూడు యువజన సంఘాలు సంకల్పించాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దాత విగ్రహం వితరణ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ మేరకు యువజన సంఘాలు మండల కాంప్లెక్స్ సముదాయం ముందు సుమారు రూ.2 లక్ష లు ఖర్చు చేసి గద్దె నిర్మించారు. అనుకున్న ప్రకారం వారం రోజుల కిందట విగ్రహం వచ్చింది. ముసుగు వేసి గద్దైపె ఉంచారు. మంగళవారం ఓ ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించాలనుకున్నారు. విగ్రహం ప్రతిష్టించే గద్దైపె తన పేరు ఉండాలని దాత డిమాండ్ చేశాడు. యువజన సంఘాలు ఇందుకు ససేమీర అనడంతో విగ్రహాన్ని వెనక్కి తీసుకెళ్లారు. బోసిపోయిన గద్దెను చూసి మండల ప్రజలు అవాక్కయ్యారు. -
దైవ దర్శనానికి వెళ్తుండగా..
రామచంద్రాపురం(పటాన్చెరు): దైవ దర్శనానికి వెళ్తుండగా టెంపో వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాదకర ఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు రింగ్‌రోడ్డుపై సోమవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది. కొల్లూరు ఎస్ఐ రవీందర్ కథనం మేరకు.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన హరి కిసాన్ హజారీ బీదర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. తిరుపతి, శ్రీశైలం వెళ్దామని తనకు తెలిసిన వ్యక్తి మాదయ్య(45) టెంపో వాహనం అద్దెకు మాట్లాడుకున్నాడు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు తల్లి సునీత బాయి, అతడి భార్య శిల్పరాణి, కూతురు అనుష్క, కుమారుడు ఆయూష్, తమ్ముడు దీపక్ కిసాన్ సింగ్, అతడి భార్య అమృత, కూతురు ఆరాధ్య, చెల్లెలు హారతి, ఆమె భర్త అజయ్ సింగ్, పిన్ని జీవన్ బాయి, వారి ఇంట్లో డ్రైవర్ ధనరాజ్‌తో కలిసి ఇంటి నుంచి దైవ దర్శనానికి బయలుదేరారు. ముత్తంగి సమీపంలోకి రాగానే రింగ్‌రోడ్డు ఎక్కారు. సోమవారం తెల్లావారుజామున 2 గంటల సమయంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డుపై ముందు ఉన్న వాహనాన్ని తప్పించబోయి టెంపో మొదట డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన 12 మందిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హరి కిసాన్ హజారీ, కుమార్తె అనుష్క, ధన్‌రాజ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్శనానికి వెళ్లొస్తుండగా కారు ప్రమాదం – నలుగురికి గాయాలు కొండపాక(గజ్వేల్): మంచిర్యాలలోని శివాలయంలో దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో గల కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన తన్మయి, గీత, రోహిత్ రుద్రన్స్ కలిసి కారులో ఆదివారం మంచిర్యాలలోని శివాలయంలో దర్శనం కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుద్దెడ శివారులోకి రాగానే వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న ట్రాక్టరును ఢీకొడుతూ డివైడర్ దాటుకొని అవతలి వైపును కారు దూకెళ్లింది. ఈ ప్రమాదంలో తన్మయికి తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక 108 అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రీ టౌన్ కేసు నమోదు చేశారు. టెంపో వాహనంబోల్తా పడి ఒకరు మృతి 12 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఘటన -
భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
పటాన్చెరు టౌన్: భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన భర్త రోకలి బండతో కొట్టి చంపాడు. అడ్డొచ్చిన అత్త పై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వినాయక రెడ్డి కథనం మేరకు.. జిన్నారం మండలం కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కి పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన రమీలా(24)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉండగా పటాన్చెరు మండలం ఇంద్రేశం సాయి కాలనీలో ఉంటున్నారు. సురేశ్ ఓ ప్రైవేటు వెంచర్లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా పాపను తీసుకొని పెద్ద కంజర్లలోతల్లిగారింటికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని సోమవారం అత్తగారింటికి వచ్చి భార్యతో సురేశ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రేకుడై రోకలి బండతో భార్యపై దాడి చేయగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డువచ్చిన అత్తపై దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని ఎస్ఐ వెంకట్ రెడ్డితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాం. మృతురాలి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేశ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాపురానికి రావడం లేదని ఘాతుకం అడ్డొచ్చిన అత్తపై దాడి పటాన్చెరు మండలంలో ఘటన -
వసతి.. ఇదీ దుసి్థతి
కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్వృథాగా మంచాలు, డైనింగ్ టేబుల్స్ వసతి గృహంలోని గదుల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. లైట్లు వెలగడంలేదు. ఇక్కడి సమ స్యలు ఎవరికై నా చెబితే హాస్టల్ సిబ్బంది ఇబ్బందులు పెడతారని వాపోయారు. అలా గే, వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యం కోసం రూ.లక్షలు వెచ్చించి మంచాలు, టేబుల్స్ కొనుగోలు చేసినా వినియోగించడం లేదు. దీంతో విద్యార్థులు కిందనే పడుకుంటున్నారు. కొత్త మంచాలు స్టోర్‌రూంలో పడేసి పాడైపోయేలా చేస్తున్నారు. బెడ్ షీట్స్సైతం వాడకపోవడంతో చిరిపోతున్నాయి. దీనికితోడు విద్యార్థులు డైనింగ్ స్టీల్ మెటీరియల్ టేబుల్స్, బెంచీలు డైనింగ్ హాల్లో వాడకుండా పడేశారు. విద్యార్థులు కింద కూర్చోని భోజనం చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకం ఫ్యూరీఫైడ్ మిషన్ పాడైపోయి ఏడాది గడిచినా బాగు చేయించలేదు. విద్యార్థులకు ఇచ్చిన డ్రెస్‌లు సైతం ఇవ్వకుండా మూలన పడేశారు. కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. దూరం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి న వారిని అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. భోజనంలో వెంట్రుకలు వస్తాయి.. ఇంకొంచం పెట్టమంటే పెట్టరు. ఫ్యాన్లు తిరగవు లైట్లు వెలగవు. చిరిగిపోతున్న బెడ్లు, వృథాగా మంచాలు పడి ఉన్నాయి. అయినా ఎవరూ పట్టించుకోకరు. దీంతో విద్యార్థులు అరకొర వసతుల మధ్యే కొంటూ తమ చదువులు కొనసాగిస్తున్నారు. కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో సాక్షి విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగు చూశాయి. వసతి గృహంలో మొత్తం 154 మంది విద్యార్థినీలు ఉన్నారు. వార్డెన్ నర్సమ్మతోపాటు కుక్, వాచ్మెన్, కామాటీ విధులు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులు 34 మంది పరీక్షలు పూర్తి అవడంతో ఇటీవల వెళ్లిపోయారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో ప్రస్తుతం 97 మంది వసతి గృహంలో ఉంటున్నారు. కాగా, ఉదయం టిఫిన్‌తోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం సరిగా వండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. భోజనంలో వెంకట్రుకలు వస్తున్నాయని, నీళ్ల చారు ఇష్ట మొచ్చినట్లు వండుతున్నారని చెబుతున్నారు. రెండు నెలలుగా గుడ్డుపెట్టడంలేదని వాపోతున్నారు. హాస్టల్ సిబ్బందికి మంచి భోజనం వండుకొని తమకు మాత్రం ఇష్టం వచ్చినట్లు వండి పెడుతున్నారని ఆరోపించారు. మరోసారి భోజనం పెట్టాలని వెళ్తే సిబ్బంది తిడుతున్నారని చెప్పారు. వర్కర్లు లేక ఇబ్బంది వసతి గృహంలో వర్కర్లు లేక సామగ్రిని వాడటంలేదు. భోజనం మంచిగా చేసేందు చర్యలు తీసుకుంటాం. సెలవులు పూర్తి అయిన తర్వాత అన్నింటినీ వినియోగంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు సౌకర్యం కల్పిస్తాం. – నర్సమ్మ, వార్డన్ సమస్యల వలయంలోఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఫ్యాన్లు తిరగవు లైట్లు వెలగవు పాడైన వాటర్ ఫ్యూరీఫైడ్ మిషన్ చిరిగిన బెడ్ షీట్స్, వృథాగా మంచాలు భోజనంలో వెంట్రుకలు,మళ్లీ పెట్టమంటే తిట్లు -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో వివాదం
కొమురవెల్లి(సిద్దిపేట): అంబేడ్కర్ జయంతి రోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే.. కొమురవెల్లి మండల కేంద్రంలో గోషాల సమీపంలో వైజంక్షన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, మాజీ ఎంపీపీ తలారి కీర్తన కిషన్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో 40 ఏళ్ల కిందటే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, కొంత మంది వ్యక్తులు తమకు చెప్పకుండా ప్రభుత్వ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని దళిత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎంపీడీవో శ్రీనివాస వర్మ, పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్‌కు ఫిర్యా దు చేశారు. వెంటనే ఆవిష్కరణ నిలిపివేయాలన్నారు. వారి మాట వినకుండా సిద్దప్ప, కీర్తన కిషన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొంత మంది కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు మోహరించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయని, శిలాఫలకం తొలగించాలని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి శిలాఫలకానికి రంగు వేయడంతో సమస్య సద్దు మనిగింది. అనంతరం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు అంబేడ్కర్‌కు పూల మాలలు వేసి నివాళులర్పించారు. శిలాఫలకంపై పేర్లు ఉన్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం చివరకు శిలాఫలకంపై రంగు -
వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం
మనోహరాబాద్(తూప్రాన్): యువతి అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్న చామంతుల గణేశ్, మంజులకు కూతురు నాగలక్ష్మీ(19), కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగలక్ష్మీ 10 రోజుల నుంచి మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ పరిధిలోని నేషనల్ మార్ట్‌లో పనికి వెళ్తుంది. 12న ఉదయం పనికి వెళ్లిన యువతి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్లాపూర్‌లో గృహిణి శివ్వంపేట(నర్సాపూర్): గృహిణి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ పంచాయతీ పిట్టల వాడలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. పిట్టలవాడకు చెందిన సునీత 6న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం సునీత భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. – సంగారెడ్డిలో యువకుడు, గృహిణి సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా రంగంపేట మండలానికి చెందిన ఎరుపుల వెంకట్ (37) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది కిందట పట్టణంలోని శాంతినగర్‌కి వచ్చి మేసీ్త్రగా పని చేస్తూ జీవిస్తున్నారు. గత నెల 28న దంపతులు గొడవ పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి అదే రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్న కుమార్, సరళ భార్యాభర్తలు. సరళ (30) భర్తతో గొడవపడి 11న నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.పనికని వెళ్లి యువతి -
ప్రాణం తీసిన అతి వేగం
● స్నేహితులను కలిసేందుకు వెళ్తుండగా..● అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా● యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుకొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని మర్పడ్గ శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గండివేటు గ్రామానికి చెందిన నామాల అనిల్ (24) హైదరాబాద్‌లోని బోడుప్పల్ ఉంటూ హోటల్లో పని చేస్తున్నాడు. బాన్సువాడ మండలంలోని దేశాయిపేటకు చెందిన సాయిబాబ(24) హైదరాబాద్‌లోనే ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అనిల్, సాయిబాబ ఇద్దరూ స్నేహితులు కాగా గతంలో వీరు సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో గల ఓ హోటల్లో పని చేశారు. ఆ సమయంలో వీరికి అక్కడ కొందరు స్నేహితులు అయ్యారు. వారిని చూసేందుకు ఆదివారం రాత్రి బోడుప్పల్ నుంచి కారులో అనిల్, సాయిబాబ బయలు దేరారు. రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా రుసుం తప్పించుకోవడానికి మర్పడ్గ మీదుగా సిద్దిపేటకు వెళ్తున్నారు. మర్పడ్గ శివారులో కారు అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనిల్ తలకు తీవ్ర గాయాలై కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిబాబకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు చూసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఇద్దరినీ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. లారీని ఢీకొని వ్యక్తి.. సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన అకోలా నాందేడ్ రహదారిపై శివ్వంపేట శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పు ల్కల్ ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ కథనం మేరకు.. ఓ లారీ సంగారెడ్డి వైపు నుంచి జోగిపేట వైపు వెళుంది. అలాగే అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన జర్నయ్య (43) బైక్‌పై జోగిపేట వైపే వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో కుడి వైపు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు పవన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి రామచంద్రాపురం(పటాన్చెరు): టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. శేరిలింగంపల్లి పరిధిలోని నేతాజీనగర్‌కు చెందిన ప్రభాకర్(55) క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం బెక్‌పై తెల్లాపూర్ నుంచి కొల్లూరు వైపు వెళ్తున్నాడు. రాజ్ పుష్ప సర్కిల్ వద్దకు రాగానే టిప్పర్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.62.28 కోట్లు
ఉపాధి బకాయిలునిధుల విడుదలలో జాప్యం ● రెండు నెలలుగా రాని మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ● కూలీల డబ్బులు కూడా కొందరికి రాలె.. ● త్వరలోనే విడుదల అవుతాయంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రావడంలో ఆలస్యమవుతోంది. కొందరు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా కొంత మేరకు పెండింగ్‌లో ఉంది. మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాలో పలు అభివృద్ది పనులు జరిగాయి. సీసీ రోడ్లు, డ్రైనే జీల నిర్మాణంతో పాటు, నిర్దేశించిన పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. అయితే ఈ పనులకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ నిధు లు నిలిచిపోయాయి. నిబంధనల ప్రకారం పక్షం రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలి. కానీ కొందరికి దాదాపు రెండు నెలలుగా కూలీ డబ్బులు రాలేదు. చేసిన పనికి సకాలంలో కూలీ చేతికందకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కూలీలు ఈ పనులకు వెళు తున్నారు. కానీ చేసిన కష్టం చేతికందడంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.62.28 కోట్ల మేరకు బకాయిలు జిల్లాలో మొత్తం 2.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 4.02 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో రెగ్యులర్‌గా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు 2.09 లక్షల మంది ఉంటారు. అయితే ఈ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద కొన్ని రకాల అభివృద్ది పనులు చేస్తుంటారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదలలో సుమారు రెండు నెలలుగా జాప్యం జరుగుతోంది. అలాగే కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కలిపి మొత్తం రూ.62.28 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో గత ఆర్థిక సంవత్సరం 2024–25లో మార్చి 31 వరకు రూ.61.89 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెండింగ్‌లో ఉండగా, రూ.20 లక్షల వరకు కూలీలకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు రాలేదు. ఈ నెల ఏప్రిల్ మాసానికి సంబంధించి కూడా మెటీరియల్ కాంపోనెంట్, కూలీ డబ్బులు కలిపి రూ.18 లక్షలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడం, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో జాప్యం జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. మూడు నెలలుగా ఎదురు చూస్తున్నాం మూడు నెలల నుంచి కూలీ డబ్బులు చెల్లించడం లేదు. 15 రోజులకు డబ్బులు చెల్లించాలి కానీ.. అలా జరగడం లేదు. డిసెంబర్లో చేసిన పనులకు గాను మొన్న వారం రోజుల డబ్బులు చెల్లించారు. పెండింగ్ కూలీ డబ్బుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వీలైనంత త్వరగా కూలీ డబ్బులు చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. –విఠల్, ఉపాధి హామీ కూలి, మొగుడంపల్లి -
నా సినిమాలో నిరసన సన్నివేశాలు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తాను తీస్తున్న సినిమాలో ఒక కలెక్టర్‌కు వ్యతిరేకంగా తాను చేసిన ధర్నాలు, రాస్తారోకోలు.. కలెక్టర్ బదిలీ అయ్యే వరకు చేసిన నిరసనలకు సంబందించిన సన్నివేశాలు ఉంటాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడి యాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సినిమాలో తన ప్రేమ కథ ఉండదని, ప్రేమ జంటకు అండగా నిలిచే పాత్రలో తాను నటిస్తున్నానని చెప్పారు. గతంలో తనపై పోలీసులు చేసిన ఒత్తిడిలు, నిర్బంధాలు, ఎస్పీతో జరిగిన వాగ్వాదాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో నీటి సమస్య నెలకుంది. మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించడంలేదని వారు సమ్మెకు దిగారు. పట్టణంలో నీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలో బోరుమోటారు లేవు. కేవలం మిషన్‌భగీరథ నీటిపైనే ప్రజలు ఆధారపడి ఉన్నారు. తాడగానికి వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తుండగా.. ఇంటి అవసరాల నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం సోమవారం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అవగాహనతో అగ్ని ప్రమాదాలకు చెక్ న్యాయమూర్తి భవానీ చంద్ర సంగారెడ్డి క్రైమ్: అవగాహన ఉంటే అగ్ని ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చని జిల్లా న్యాయమూర్తి భవానీ చంద్ర అన్నారు. సంగారెడ్డిలో అగ్నిమాపక దళ వారోత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలకు ప్రమాదాలు నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా వారోత్సవాలు నిర్వహించినట్లు పట్టణ అగ్నిమాపక కేంద్రం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తొలుత 1944లో ముంబై డాక్యార్డ్స్లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం అగ్నిమాపక అధికారులతో కలిసి వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ‘రన్ ఫర్ ’ అంబేడ్కర్ సంగారెడ్డి జోన్: బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలో రన్ ఫర్ అంబేడ్కర్ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవ్ రావు ‘రన్ ఫర్’ను జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొండాపురం జగన్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. -
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది సంగారెడ్డిలోని గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారిని ఉన్నత స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ 2010లో జూన్ 7న ఏర్పాటు చేయగా నాటి నుంచి ఎస్బీఐ సౌజన్యంతో యువతీ, యువకులకు ఉపాధి కల్పించే అనేక రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు 435 బ్యాచ్‌లకు శిక్షణ కల్పించి ఎంతోమంది ఉపాధికి బాటలు వేశారు. శిక్షణతోపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పించడమే కాకుండా వ్యాపార రుణాలను సైతం మంజూరు చేస్తోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ అండగా నిలుస్తూ ఉపాధి కల్పిస్తుండడంతో ఈ శిక్షణ కేంద్రంపై నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో రోజురోజుకు దీనికి ఎంతో ఆదరణ పెరుగుతుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గత 15 ఏళ్లుగా మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్, మగ్గంవర్క్, కంప్యూటర్ శిక్షణతోపాటు ఇటీవల ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ అందిస్తుండగా పురుషులకు మోటార్ వెహికల్ మెకానిక్, సెల్ ఫోన్ రిపేరింగ్, సీసీ టీవీ, ఫొటోగ్రఫీ, కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణతోపాటు ఉచితంగా వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో గ్రామీణ నిరుద్యోగ యువత శిక్షణ తీసుకునేందుకు తరలివస్తున్నారు. 30 రోజులపాటు శిక్షణ 2010 జూన్ 7న ప్రారంభమైన ఈ శిక్షణ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 11,545 శిక్షణ తీసుకోగా అందులో 8,116 మంది స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. 3,303 మందికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించారు. 834 మంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణలో భాగంగా వ్యక్తిత్వ వికాసం, వ్యాపార సంబంధ బ్యాంకింగ్ విషయాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత భోజనం, ఉచిత నివాసం ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తుంది. 30 రోజులపాటు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తారు. సొంతంగా బైక్ మెకానిక్ షాప్ పెట్టుకున్న స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా బైక్ మెకానిక్‌లో శిక్షణ పొంది అనంతరం సొంతంగా గ్రామంలోనే మెకానిక్ షాప్ పెట్టుకుని ఉపాధి పొందుతున్నాను. నెలకు రూ.35 వేల వరకు సంపాదిస్తూ నాతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. –సురేశ్, మునిపల్లి మండలం కంకోల్ గ్రామంకుటుంబానికి ఆసరాగా నిలుస్తా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మెషీన్ శిక్షణ తీసుకుంటున్నాను. శిక్షణ అనంతరం ఎస్బీఐ ద్వారా రుణం పొంది సొంతంగా కుట్టు మెషీన్ ప్రారంభించి కుటుంబానికి ఆసరాగా ఉంటాను. –అర్చన, మెదక్ జిల్లా, టేక్మాల్ మండలం, సూరంపల్లిబ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న న్యూస్ పేపర్లో వచ్చిన ఉచిత శిక్షణ ప్రకటనను చూసి సంగారెడ్డి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాను. ఆ తర్వాత ఉచితంగా హాస్టల్లో ఉంటూ బ్యూటీషియన్లో శిక్షణ పొందాను. ప్రస్తుతం సంగారెడ్డిలో పార్లర్ నడుపుతున్నాను. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నాను. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. –అశ్విని రాథోడ్, విట్టు నాయక్ తండ, మొగుడంపల్లి మండలం11,545 మంది ఉచిత శిక్షణ పొందారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణతోపాటు బ్యాంకు ద్వారా రుణాలను కల్పిస్తున్నాం. ఉచిత వసతితోపాటు వ్యాపారాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. శిక్షణ ఇవ్వడంతోపాటు సొంతంగా ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజేంద్ర ప్రసాద్, గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ ఉపాధి పొందుతున్న యువత ఎస్బీఐ సౌజన్యంతో వ్యాపార రుణాలు 11,545 మందికి ఉచిత శిక్షణ పూర్తి లబ్ధి పొందుతున్న నిరుద్యోగులు -
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
● ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ● రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు సంగారెడ్డి జోన్: సామాజిక వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, ఎస్సీ ఈడీ కార్పొరేషన్ అధికారి రామాచారి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరికి సమాన హక్కులు కల్పించారు: ఎమ్మెల్యే హరీశ్‌రావు రామచంద్రాపురం(పటాన్చెరు): చీకట్లో ఉన్న వారికి వెలుగును చూసిన మహానీయుడు అంబేడ్కర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, రమేష్, నర్సింహ పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు పాటుపడుదాం: ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్‌రావు జహీరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. సోమవారం జహీరాబాద్‌లో అంబేడ్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. అనంతరం హోతి(బి)లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బి,నర్సయ్య, కాంగ్రెస్, బీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఎంపీ కార్యాలయ పార్లమెంట్ ఇంచార్జి జి.శుక్లవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..
బీజేపీ నేతలను పరామర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్హత్నూర (సంగారెడ్డి): అకారణంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినంతమాత్రాన అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆరు మంది బీజేపీ నాయకులపై కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారు. అయితే.. బాధిత కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. రాజకీయ కక్షతో కొంతమంది నాయకులు బీజేపీ నేతలపై అకారణంగా దాడి చేసి, పైగా పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, అయినా భయపడాల్సిన అససరం లేదన్నారు. ఆఖరుకు న్యాయమే గెలుస్తుందని, జైలు నుంచి విడిపించేందుకు అవసరమైతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీయాదవ్, ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్, నాయకులు సంఘసాన్ని సురేష్, రమేష్ గౌడ్, సతీష్, గ్రామ బిజెపి నాయకులు పాల్గొన్నారు. -
ఇక మద్యం ముట్టం
మల్లారెడ్డిపేట గ్రామస్తులు ప్రతిన మునిపల్లి(అందోల్): ఇంటిని ఒంటిని గుల్ల చేస్తున్న మద్యాన్ని ఇక నుంచి ఎవరం తాగబోమని మల్లారెడ్డిపేట గ్రామస్తులు ఆదివారం అంతా ఓ చోట చేరి ప్రమాణం ప్రమాణం చేశారు. జిల్లా మంజీర రైతు సమైఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మద్య నిషేధం కోసం చర్చించి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ...మద్యానికి బానిసై యువత పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం వల్ల భార్యాభర్తల మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరిగుతున్నాయన్నారు. ఇప్పటివరకు చాలామంది యువత మద్యానికి బానిసలై మృతి చెందినట్లు మంజీర రైతు సమైఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తెలిపారు. -
మున్సిపాలిటీపై నిరసనల సెగ
● ఆందోళనలో జిన్నారంమండల వాసులు ● రైతులు నష్టపోతారంటున్న ప్రజలుజిన్నారం (పటాన్చెరు): జిన్నారంను మున్సిపాలిటీగా మార్చాలన్న ప్రభుత్వ వైఖరిపై ఆ మండల వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీగా మార్చే ఆలోచన విరమించుకోవాలని రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిన్నారం మండలంలో గుమ్మడిదలతోపాటు గడ్డపోతారం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీగా మార్చారు. నగరానికి సరిహద్దు ప్రాంతమైన జిన్నారం మండలాన్ని సైతం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన మండలవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ వాతావరణం గల మండలాన్ని మున్సిపాలిటీగా మార్చే ఆలోచన చేయవద్దంటూ నిరసనలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దాదాపు 80% గ్రామీణ ప్రాంతాలతో కళకళలాడే మండలాన్ని మున్సిపాలిటీ చేయడం స్వార్థ రాజకీయాలకు పరాకాష్టని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలతో పాటు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. ఇంటి పన్నులు, వ్యాపార సంబంధిత ట్రేడ్ లైసెన్సులు తీసుకోవడంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని మున్సిపాలిటీ ఏర్పాటు ఆలోచన చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపాలిటీకి వ్యతిరేకం.. కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామపంచాయతీలను కలుపుతూ మండలాన్ని మున్సిపాలిటీగా మార్చడం సరైంది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది. మేమంతా ఏకమై మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. – శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, జిన్నారంరైతులు నష్టపోతారు జిన్నారం మండలంలో దాదాపు పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామపంచాయతీలపరంగా వ్యవసాయ ఆధారిత గ్రామాలే ఉన్నాయి. మున్సిపల్ ఏర్పాటుతో వ్యవసాయ భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తుంది. రైతన్నలకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – కొత్తకాపు జగన్ రెడ్డి, బీజేపీ జిన్నారం మండల అధ్యక్షుడు -
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే: హరీశ్ రావు
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు .. రాహుల్ గాంధీని అశోక్ నగర్‌కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి .. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగ పోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు. -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపు జహీరాబాద్ టౌన్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పార్టీ శ్రేణులను కోరారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొగుడంపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని మండిపడ్డారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, జహీరాబాద్ అధ్యక్షుడు తట్టునారాయణ, నాయకులు గుండప్ప, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా భ్రమరాంబికామల్లికార్జున స్వామి కల్యాణంరామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మల్లన్న గంపలు తీయటం, మల్లన్న కొట్నం, గొలుసు తెంపు, మల్లన్న బోనాలు సమర్పించడం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలుస్వీకరించారు. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దాంకేవీపీఎస్ పిలుపు నారాయణఖేడ్: అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింహులు, ఖేడ్ రక్తదాతల గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు ముజాహిద్ చిష్తీ, మానవహక్కుల పరిరక్షణ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు ఓంప్రకాష్ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఖేడ్ పల్లవి పాఠశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆశయసాధన కోసం ప్రతీఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యువకులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. ఆయా సంఘాల బాధ్యులు సంతోష్, గణపతి, సంతోష్‌రావు పాటిల్, కాన్షీరాం, సురేశ్‌గౌడ్, అరుణ్, మోహన్, శంకర్, సాయిలు, గౌతం పాల్గొని వలంటరీ సేవలు అందించారు. అర్హులు ఇందిరమ్మఇళ్లు నిర్మించుకోవాలినారాయణఖేడ్: అర్హులైన ప్రతీ ఒక్కరూ ఇదిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. మనూరు మండలం దుదగొండలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...అర్హులకే ఇళ్లను మంజూరు చేశామన్నారు. అనంతరం గ్రామంలో బీరప్పస్వామి, ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు వినోద్‌పాటిల్, దిగంబర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంగన్న, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కేతకీలో కర్ణాటక హైకోర్టు సివిల్ జడ్జి పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివ రుద్రప్ప, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సొంతిల్లు కలేనా!
ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి నారాయణఖేడ్: ఇందిరమ్మ పథకంతో పేదోడి సొంతింటి కల తీరుస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పథకం పనితీరు మందగించింది. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. సొంత స్థలాల్లో ఇండ్లను నిర్మించుకోవాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న పేదవారి కలలు సుదూర ప్రాంతాల్లో కానరావడంలేదు. పథకం ప్రారంభంలో ఉన్న ఉత్సాహం క్షేత్రస్థాయిలో అమలులోకి వచ్చే సరికి కనిపించడంలేదు. తాము సూచించిన యాప్‌ద్వారానే లబ్ధిదారులను నమోదు చేయాలని చెబుతూ హౌసింగ్ స్కీమ్‌పై కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తాము ఇందిరమ్మ యాప్‌లో పకడ్బందీగానే నమోదు చేశామని చెప్తుండటం చివరకు ఈ వాదనలు ఏ మలుపు తీసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ పథకం అమలు తీరులో మాత్రం మందగమనం నెలకొంది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుకింద ఎంపిక చేయడంతోపాటు తొలివిడతలో పలువురు లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలో ఇళ్ల కోసం 3,18,435మంది అర్జీలు సమర్పించారు. 1,36,821మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో జిల్లాలో 3,939మంది లబ్ధిదారులను తొలివిడతగా ఎంపిక చేశారు. కాగా వీరిలో కొందరు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కానీ, ప్రస్తుతం వీరిలో అనర్హులు ఎక్కువమంది ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో రీ వెరిఫికేషన్ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు రీ వెరిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనర్హులు ఉంటే ఇచ్చిన మంజూరీ పత్రాలను సైతం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో ఉండటం, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారిగురించి అధికారులు ఆరా తీస్తున్నారు. మంజూరు అయినా అనర్హులు ఉన్న పక్షంలో రద్దు చేయడం, మంజూరు పత్రాలను తిరిగి వెనక్కి తీసుకోనున్నారు. పథకంలో అర్హులనే ఎంపిక చేస్తామని అనర్హులు ఉన్న పక్షంలో వారి మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కాగా ప్రభుత్వం ఇలా రీ వెరిఫికేషన్ అనడంతో లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిర్మాణాల్లో ఆలస్యం.. జిల్లాలో 3,939మంది లబ్ధిదారులు ఎంపిక కాగా 1,231 ఇళ్లు నిర్మాణానికి మంజూరు చేశారు. వీరిలో 350మంది నిర్మాణ పనులు ప్రారంభించారు. బేస్మెంట్ లెవల్లో 60 ఇళ్ల పనులు జరిగాయి. మిగతా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేదు. ఇప్పటివరకు బేస్మెంట్ వరకు పనులు జరిగినా వారికి పైసా విడుదల కాలేదు. మంజూరీ పత్రాలు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా చాలా గ్రామాల్లో నిర్మాణపు పనులు ప్రారంభం కాలేదు. పైగా తిరిగి రీ వెరిఫికేషన్ చేస్తామని చెబుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.నారాయణఖేడ్: లబ్ధిదారుల ఎంపికకోసంవెరిఫికేషన్ చేస్తున్న అధికారులు (ఫైల్) జిల్లాలో ఇళ్ల నిర్మాణ తీరు ఆది నుంచి తాత్సారమే అనర్హులుంటే రద్దుకు ప్రభుత్వం చర్యలు!కాగా ఇందిరమ్మ పథకం ప్రారంభం నుంచి వస్తున్న ఆదేశాలు, మార్గ దర్శకాలు అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా మారాయి. లబ్ధిదారు పాత ఇంటిని ఆనుకొనిగానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ, కొంతవరకు కూల్చి వేసిన వాటికి గానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయకూడదు. ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. ఒక ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలంలో ఫొటో తీయాలి. ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్‌లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. రెండు గదులు, ఒక వంటగది, బాత్రూం ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి. ప్రతీ దశలోనూ ఫొటో తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్‌లో అప్లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆశించిన చాలామంది లబ్ధిదారులకు పథకం ప్రారంభం నుంచి వస్తున్న సందేహాలు, ఆదేశాలతో అమలు మందగిస్తుంది. ఇందిరమ్మ పథకం ప్రారంభం నుంచి వస్తున్న ఆదేశాలు, మార్గదర్శకాలు అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా మారింది. -
ఉల్లి రైతు
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఇన్నాళ్లు వినియోగదారులను కంట తడి పెట్టించిన ఉల్లి.. ఇప్పుడు ఆ పంట పండించిన రైతులను కంటతడి పెట్టిస్తోంది. సీజను ప్రారంభానికి ముందు మంచి ధర పలికిన ఉల్లిగడ్డ ఇప్పుడు ధర పడిపోవడంతో ఈ పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజను ప్రారంభమయ్యే వరకు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ధర పలికింది. పక్షం రోజుల్లో ఈ ధర పూర్తిగా పడిపోయింది. గరిష్టంగా రూ.1,300లకు పడిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పంట చేతికందిన సమయంలో ధర పడిపోవడంతో తామంతా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రధాన ఉల్లి మార్కెట్లలో ఒకటైన సదాశివపేట మార్కెట్‌యార్డులో ఈనెల 11న ఉల్లిగడ్డకు పలికిన ధరను పరిశీలిస్తే.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,369 పలకగా, కనిష్టంగా రూ.529కే పరిమితం కావడం గమనార్హం. గరిష్టంగా రూ.1,369 పలికింది అతి కొద్దిమంది రైతులకే కాగా, సుమారు 85 శాతం రైతులకు క్వింటాల్‌కు రూ.వెయ్యి లోపే కావడం గమనార్హం. జిల్లాలోని ఇతర ప్రధాన మార్కెట్లు పటాన్చెరు, జోగిపేట్ మార్కెట్లో కూడా దాదాపు ఇవే ధరలు పలికాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా రావంటున్న రైతులు జిల్లాలో ఉల్లిగడ్డను ఎక్కువగా మనూరు, కొండాపూర్ మండలాల్లో సాగు చేస్తారు. సదాశివపేట, నారాయణఖేడ్ మండలాల్లో కూడా రైతులు ఈ పంట వేసుకుంటారు. జిల్లావ్యాప్తంగా ఈసారి సుమారు 1,250 ఎకరాల్లో ఈ పంట సాగైనట్లు ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఈ ఉల్లిగడ్డకు మంచి ధర లభించింది. క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు పలికింది. దీంతో ఈసారి మరింత ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. తీరా ఇప్పుడు ధర పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉల్లినారు ఖర్చులు, నాట్లేసేందుకు..ఉల్లిగడ్డ తవ్వేందుకు కూలీల ఖర్చులు..పురుగు మందులు.. ఇలా సాగు కోసం వెచ్చించిన ఖర్చులు తడిసిమోపెడయ్యాయని రైతులు వాపోతున్నారు. పంటను విక్రయిస్తే కనీసం ఈ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.న్యూస్‌రీల్ కనిష్టంగా క్వింటాల్ రూ.600లకే పరిమితం పక్షం రోజుల్లో క్వింటాల్‌కురూ.వెయ్యి తగ్గిన వైనం లబోదిబోమంటున్న రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదన -
వక్ఫ్ బోర్డ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి
కుల్ జమాత్ తహఫుజ్ ఏ షరియా సంగారెడ్డి టౌన్: ఇటీవల కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కుల్ జమాత్ తహఫుజ్ ఏ షరియా కమిటీ డిమాండ్ చేసింది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో ఆదివారం పాత బస్టాండ్ నుండి ఐబీ వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ...దేశంలో ముస్లిం మైనార్టీలను అణగ తొక్కేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందన్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కేందుకు అనేక రకాల చట్టాలను అమల్లోకి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లును రద్దు చేయకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వివిధ సంఘాల మైనార్టీ నాయకులు, మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బస్సు
● ఐదుగురికి తీవ్ర , 10 మందికి స్వల్ప గాయాలు ● రెండు అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలింపుకొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారు లో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ పట్టణానికి చెందిన జుట్టు చంద్రదీప్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగే అతడి పెళ్లికి కరీంనగర్ నుంచి మూడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కుటుంబీకులు, బంధువులు శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ దుద్దెడ శివారులో టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రక్కన పార్కు చేసి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న 24 మంది నిద్ర మత్తులో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెళ్లి కొడుకు కుటుంబీకులు జుట్టు లక్ష్మి, జుట్టు లక్ష్మినారాయణలతో పాటు బంధువులు రుద్ర, లత, ఓదెమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓదెమ్మ, శ్రీలత, రాజ్‌కుమార్, అన్విత్, రాజవ్వ, మాధవి, జైదేవ్, సహస్రలతో పాటు మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులను రెండు అంబులెన్సులలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మినారాయణ, లత పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. -
మంటలంటుకొని వరి చేను దగ్ధం
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఆదివారం ప్రమాదవ శాత్తు వరి చేనుకు మంటలంటుకొని దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన కళవ్వ రెండెకరాల వరి సాగు చేస్తోంది. నీటి కొరత ఏర్పడగా రూ.20 వేలు ఖర్చు చేసి బావి పూడిక తీయించి వరుసతడులు పెడుతూ పంటను కాపాడుకుంటోంది. బావి దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ఎండల వేడికి ఫీజు వైర్ దగ్గర మంటలు వచ్చి వరి చేనులోకి వ్యా పించాయి. సమీప రైతులు చూసి మంటలు ఆర్పుతూ బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. వెంటనే కళవ్వ కుటుంబ సభ్యు లు అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇటు పంట, బావిలో విద్యుత్ మోటరు, పైపులు కాలిపోయి రూ.60 వేల నష్టం జరిగిందని బాధితులు వాపో యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వరి పంట కాలిపోయిందని, ప్రభుత్వం, అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఫొటో స్టూడియోలో చోరీకంప్యూటర్ ధ్వంసం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని ఓ ఫొటో స్టూడియోలో దొంగతనం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... కుకునూరుపల్లిలోని మారుతిసాయి డిజిటల్ ఫొటో స్టూడియో యజమాని శనివారం రాత్రి వరకు పనులు చేసి బంద్ చేసి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్టూడియో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి డబ్బులు, విలువైన వస్తువులు ఉన్నాయా అని వెతికారు. ఏమి దొరక్కపోవడంతో ఫొటోలను డిజిటల్ చేసే కంప్యూటర్ను ధ్వంసం చేసి వెళ్లారు. దీని విలువ సుమారు రూ. 20 వేల వరకు ఉంటుంది. వీటితో పాటు కొన్ని దేశాల నాణేలను జమచేసి స్టూడియోలో పెట్టగా వాటిని ఎత్తుకెళ్లారు. యజమాని ఉప్పల రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు శివ్వంపేట(నర్సాపూర్): భూమి విషయంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం... మల్లుపల్లి గ్రామానికి చెందిన గ్యాదరి శ్రీనివాస్‌కు సంబంధించిన భూమి విషయంలో అతడిపై పలువురు వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ప్రవీణ్, మహేష్, నెల్లూరు, మల్లేష్, భిక్షపతి, సాయిలు, ఆంజనేయులు, శ్రావణ్కుమార్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కార్మికుడి మృతి పటాన్చెరు టౌన్: పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బీడీఎల్ సీఐ స్వామి గౌడ్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర (32) మండలంలోని ఇస్నాపూర్‌లో నివాసం ఉంటూ కిర్బీ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 5వ తేదీన విధి నిర్వహణలో ఉండగా పెయింటింగ్ మిషన్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిశ్రమ యాజమాన్యం అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య
జిన్నారం (పటాన్చెరు): భార్యాభర్తల మధ్య గొడవలతో విసుగు చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం... గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద మనుషులు కలగజేసుకొని నచ్చచెప్పారు. కాగా మరోసారి గొడవ జరగడంతో భార్య అనిత పుట్టింటికి వెళ్లింది. మళ్లీ తల్లిదండ్రులు నచ్చచెప్పి భర్త వద్దకు పంపించారు. అలా వచ్చిన భార్య మెడలో నగలు లేకపోవడంతో నాగ రాజు నగలు తీసుకురావా లని భార్యను పంపించాడు. ఈ నెల నాగరాజు బయటకు వెళ్తుండగా అతడి తల్లి ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. ఊర్లోకి వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. ఆదివారం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి వ్యవసాయ పొలంలో నాగరాజు వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితోనే తన కొడుకు అత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి సాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
తోటల్లోనే టమాటా
గిట్టుబాటు ధర లేక కుదేలవుతున్న రైతులు● కిలో ధర రూ.5 నుంచి రూ.7 వరకు ● మార్కెట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు ● ధర పతనమవడంతో పశువులకు మేత మర్కూక్(గజ్వేల్): ఆరుగాలం కష్టించి పండించిన టమాటా పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పశువులను మేపుతున్నారు. కొన్ని రోజుల క్రితం రూ.15 పలికిన టమాటా ధర ఇప్పుడు రూ.5 నుంచి రూ.7వరకు పలుకుతోంది. కోటి ఆశలతో పంట సాగుచేస్తే పెట్టుబడి, రవాణా ఖర్చులు రాకపోగా చివరికి రైతులకు చెమట చుక్కలే మిగిలాయి. సాగు చేసే ముందు ధరలు బాగానే ఉన్నా తీరా పంట చేతికొచ్చేసరికి పూర్తిగా ధర పతనమై నష్టాల పాలయ్యామని రైతులు వాపోతున్నారు. మర్కూక్ మండలంలో పెద్ద ఎత్తున సాగు.. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు చాలా వరకు టమాటాను సాగు చేశారు. పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తే కనీసం కూలీల డబ్బులు రావడం లేదని ఏమీ చేయలేక పశువులకు మేతగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటిమామిడి, గజ్వేల్, జగదేవ్‌పూర్ ఈసీఐఎల్ లాంటి పెద్ద మార్కెట్లకు.. టమాటాను తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నా కొనేవారు కరువయ్యారు. చివరికి ఎంతో కొంత తక్కువ ధరకు ఇవ్వాల్సి వస్తోందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలోని ఎర్రవల్లి, మర్కూక్, పాములపర్తి, దామరకుంట, వర్ధరాజ్‌పూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ప్రతి వారం ఏర్పాటు చేసే సంతకు రైతులు టమాటను తీసుకెళ్తున్నారు. కానీ ఎవరు కొనడం లేదని, కొన్నా చివరికి రూ.5 నుంచి రూ.7లకు కిలో ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. మిగిలిన పంటను పశువులకు మేతగా వేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంటను కోసి మార్కెట్‌కు తరలిస్తే రవాణా చార్జీలు కూడా రావడం లేదని చెబుతున్నారు. గత సంవత్సరం కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.30 పలికింది. ఈ సారి టమాటాను సాగుచేస్తే లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ ధర పతనమవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పెట్టుబడి కూడా రాలేదు..
టమాటా ధర కిలో రూ.5నుంచి రూ.7 లు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. 2 ఎకరాల్లో వెదురు కట్టెలతో పందిరితో సాగు చేశా. ఎకరాకు లక్షా 20 వేల పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా, కూలీలకు అప్పు తెచ్చి ఇవ్వాల్సి వస్తోంది. రవాణా చార్జీలు కూడా రావడం లేదు. పంటను పారబోయాల్సి వస్తోంది. కొన్ని రోజుల క్రితం కిలో ధర రూ.15 పలికిన టమాటా అమాంతం రేటు పడిపోయి రూ.7 కు చేరడంతో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. – కానమైన రాజు, శివారు వెంకటాపూర్ -
మల్లన్న టర్నోవర్ రూ.45 కోట్లు
2024–2025 ఆర్థిక సంవత్సరానికి మల్లన్న ఆలయ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.45 కోట్ల టర్నోవర్ కాగా.. రూ.20 కోట్ల మేర నికర ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఆలయ అధికారులు ఆదాయ, వ్యయ వివరాలను ఆదివారం వెల్లడించారు. ఏడాది కాలంలో టికెట్లు, సేవల ద్వారా రూ.8.39 కోట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 6.31 కోట్లు, హుండీ లెక్కింపు ద్వారా రూ.7.59 కోట్లు, పెట్టుబడుల ద్వారా రూ.12.51 కోట్లు, వడ్డీల రూపంలో రూ. 92.25లక్షలు, లీజ్ అండ్ లైసెన్సుల ద్వారా రూ.2.88 కోట్లు, అన్నదానం ద్వారా రూ.25.72 లక్షలు, ఇతర ఆదాయం రూ. 81.78 లక్షలు, అడ్జెస్ట్మెంట్స్ ద్వారా రూ. 63.30 లక్షలు, ప్రారంభ నిల్వ రూ.55.60లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.5.03 కోట్లతో కలిపి మొత్తం రూ. 45కోట్ల 81లక్ష 77,096 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. వ్యయాల కింద ఉత్సవాల నిర్వహణకు రూ.95.78లక్షలు, ప్రసాదం తయారికీ 4.08 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ చార్జీలు రూ.5.72 కోట్లు, స్ట్యాటూటరీ చెల్లింపులు రూ.3.18 కోట్లు, అడ్జెస్ట్మెంట్ రూ. 12.77కోట్లు, ఇతరాలు రూ.74.72 లక్షలు , అన్నదానం రూ. 36లక్షలు, జాతర నిర్వహణ ఖర్చులు రూ. 94లక్షల 89 వేలు, వేతనాలు రూ.1.61కోట్లు, నిర్మాణాలు రూ.5.69 కోట్లు, శానిటేషన్‌కు రూ.1.03 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలిపారు. ముగింపు విలువగా నగదు రూ.15లక్షల 10,221, బ్యాంకు నిలువ రూ.7కోట్ల 2లక్షల 58వేల 281 ఉన్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం నికర ఆదాయం రూ.18.74 కోట్లు రాగా ఈ సంవత్సరం రూ.20 కోట్ల 97 లక్షల 93 వేల 956 ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరం కంటే 2.23కోట్లు అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
చలివేంద్రం చాటున ‘ప్రైవేట్’ ప్రచారం
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఎదుట ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవి దృష్ట్యా ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు చలివేంద్రం ఏర్పాటు చేసి నిర్వహణ మరిచారు. గత నాలుగు రోజులుగా చలివేంద్రంలో నీరు ఉండటం లేదని, వాటిని పట్టించుకునే వారు లేరని పలువురు చర్చించుకుంటున్నారు. చలివేంద్రం వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చిన పేషెంట్లను కమీషన్లకు ఆశపడి ఆస్పత్రి సిబ్బంది వారిని ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ముందు చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పక్కన అంబులెన్స్ వాహనాలు నిలపడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లే సమయంలో వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో సాయంత్రం తర్వాత మంచినీరు రావడం లేదని, బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్ పెషెంట్స్ వార్డులలోని వాష్ రూమ్‌లలో కూడా నీరు రావడం లేదని చికిత్స పొందుతున్న సైతం ఆరోపిస్తున్నారు. ఓ ఆస్పత్రి నిర్వాకం కమీషన్లకు ఆశపడి పట్టించుకోని అధికారులు -
మూర్చ వ్యాధితో కుంట లో పడి..
శివ్వంపేట(నర్సాపూర్): ఒడ్డున ఉన్న వ్యక్తికి మూర్చ రావడంతో కుంటలో పడి నీటి మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం... కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నీలం శేఖర్(28) శనివారం కొత్తపేట గ్రామంలో ఉన్న తన బావ జగ న్ ఇంటికి వచ్చాడు. బావ, బామ్మర్ది కలిసి గ్రామ శివారులో ఉన్న రాయునికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు. జగన్ చేపలు పట్టేందుకు కుంటలోకి దిగాడు. ఒడ్డున ఉన్న శేఖర్‌కు మూర్చ రావడంతో కుంటలో పడిపోయాడు. గుర్తించిన జగన్ కుంటలో నుంచి అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంకట్‌స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. కల్హేర్ ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం... మండలంలోని బీబీపేటకు చెందిన కుమ్మరి సునీత ఈ నెల 12న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతికినా ఆమె ఆచుకీ లభించలేదు. భర్త కుమ్మరి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనికి వెళ్లిన మహిళ.. శివ్వంపేట(నర్సాపూర్): మహిళ అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్ర శ్యామల శనివారం ఉదయం ఇంట్లో నుంచి కూలి పనికి వెళ్లి సాయత్రం వరకు ఇంటికి రాలేదు. భర్త సత్తయ్య తన విధులు ముగించుకొని ఇంటికి రాగా భార్య కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా భార్య ఆచూకీ లభించలేదు. దీంతో భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మల్లన్నకు కాసుల గలగల
● వార్షిక నికర ఆదాయం రూ.20 కోట్లు ● ఏటా కోటిమందికి పైగా భక్తుల దర్శనం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొనే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఆలయ అధికారులు, పాలకమండలి, అర్చకులు, ఒగ్గుపూజారులు, సిబ్బంది సైతం భక్తులకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. భక్తుల ఆదరణతో రోజురోజుకు కోరమీసాల స్వామికి కాసుల వర్షం కురుస్తోంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జితసేవలు, హుండీ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తున్నారు. గతంలో భక్తులు బ్రహ్మోత్సవాల సమయంలోనే ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునేవారు. ప్రస్తుతం సంవత్సరం పాటు ప్రతి ఆది, బుధ వారాల్లో వచ్చి పూజలు చేస్తున్నారు. భక్తులు సంవత్సరం పొడవున స్వామి వారి దర్శనానికి వస్తుండటంతో ఆదాయం భారీగా పెరిగింది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో మొదలై ఉగాది పర్వదినానికి వచ్చే ఆదివారంతో ముగుస్తాయి. మూడు నెలల పాటు కొనసాగే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా కోటి మందికి పైగా భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకోవడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. పెరుగుతున్న ఆదాయం ఆలయానికి వచ్చే వార్షిక నికర ఆదాయంలో జాతర బ్రహ్మోత్సవాల్లోనే సగం వరకు సమకూరుతోంది. 2023 బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవల ద్వారా రూ. 4.90 కోట్లు, హుండీ ద్వారా 4.32 కోట్లు, 2024 బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవల ద్వారా రూ 6.22 కోట్లు హుండీ ద్వారా రూ.4.22 కోట్ల ఆదాయం సమకూరింది. 2025 బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి భక్తులు ఆర్జిత సేవలు, పట్నం, బోనాలు, అభిషేకం, ప్రసాద విక్రయం, కేశఖండన, వసతి గదుల అద్దె మొదలగు సేవల ద్వారా రూ. 5.64 కోట్లు, హుండీ ద్వారా 3.92 కోట్లు సమాకూరాయి. గత రెండు బ్రహ్మోత్సవాలకంటే ఈ సంవత్సరం కొంత ఆదా యం తగ్గినా వార్షిక నికర ఆదాయం పెరిగింది. -
తపాస్పల్లిలో అక్రమ మైనింగ్
అధికారుల అండతో దర్జాగా వ్యాపారం కొమురవెల్లి(సిద్డిపేట): మండలంలోని తపాస్‌పల్లి గ్రామశివారులో కొందరు ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. సంబంధిత అధికారుల అండదండలతో దర్జాగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామంలోని సర్వే నం.93లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి రాయిని విక్రయిస్తున్నారు. రాయిని కట్ చేయడం కోసం అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వందలాది ట్రిప్పుల రాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా బండరాళ్లను కటింగ్ చేసిన విషయమై స్థానికుల ఆందోళనతో అధికారులు కేసులు నమోదు చేశారు. కానీ కొద్ది రోజులుగా అక్రమార్కులు తిరిగి బండరాళ్లను కట్‌చేయడం ప్రారంభించారు. స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రస్తుతం పనులు నిలిపివేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
మక్కల ట్రాక్టర్ బోల్తా
కోహెడరూరల్(హుస్నాబాద్): మక్కల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన మండలంలోని బస్వపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగసముద్రాల గ్రామానికి చెందిన చింతలపల్లి జనార్దన్ అనే రైతు మక్కల లోడ్‌తో సిద్దిపేటకు వెళ్తున్నాడు. బస్వపూర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతుకు ఎలాంటి గాయాలు కాలేదు. మక్కలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడ్డాయి. దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్ వర్గల్(గజ్వేల్): దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను శనివారం కోర్టులో రిమాండ్ చేసినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని సహస్రనగర్కు చెందిన వేముల చంద్రప్రకాశ్ అలియాస్ చందు(27), రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్(19) గతంలో దొంగతనం కేసుల్లో అరెస్టయ్యారు. కరీంనగర్ జైలులో వీరికి పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని 10న గురువారం వర్గల్ మండలం గౌరారం చేరుకున్నారు. అర్థరాత్రి వేళ పాములపర్తి చౌరస్తా వద్ద ఉన్న పూదరి శ్రీనివాస్‌గౌడ్ కిరాణషాపు షట్టర్‌ను పైకిలేపి మూడు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి రూ.5,000 నగదు ఎత్తుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన నిందితుల నుంచి రూ.800 నగదు, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకొని శనివారం గజ్వేల్ కోర్టులో రిమాండ్ చేశామని సీఐ పేర్కొన్నారు. బాలుడిపై కుక్కల దాడినర్సాపూర్: బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని హన్మంతాపూర్‌లో శనివారం ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హన్మంతాపూర్‌కు చెందిన స్వప్న, రాజు దంపతుల ఐదేళ్ల కుమారుడు ఉద్బవ్ ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. నాలుగైదు కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వార్డులో వీధి కుక్కల బెడద బాగా పెరిగిందని, వాటిని అదుపు చేయాలని కోరారు. అప్పుల బాధతో ఉరేసుకొని ఆత్మహత్య ములుగు(గజ్వేల్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు మండలం జప్తిసింగాయిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నీలం శ్రీవర్దన్‌రెడ్డి(34) ఇంటి వద్దనే ఉంటూ చెడు వ్యసనాల బారిన పడ్డాడు. కొంత మేరకు అప్పులయ్యాయి. అప్పులు తీర్చలేక తరచూ బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బాగిరెడ్డి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో యువ రైతు మృతి పుల్కల్(అందోల్): విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందాడు. పుల్కల్ మండల పరిధిలోని మిన్పూర్ తండాలో చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్ఐ క్రాంతికుమార్ కథనం మేరకు.. మిన్పూర్ తండాకు చెందిన రమావత్ రమేశ్ (32) నీళ్లు పారించడానికి శుక్రవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. అంత కు రెండు రోజుల ముందు.. గాలి వానకు విద్యుత్ తీగ తెగి కింద పడి పడింది. ఇది గమనించని రమేశ్ పొలం నుంచి అలాగే వెళ్తుండగా.. కాలికి తీగ తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి అయినా రమేశ్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఉదయం మరోసారి వెతుకుతుండగా పొలంలోనే చనిపోయి కనిపించాడు. మృతుని భార్య రమావత్ లత ఫిర్యాదు మేరకు పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
● ఇంట్లో చెప్పకుండా 2014లో వెళ్లిపోయిన యువకుడు ● అప్పటి నుంచి వెతుకుతున్న తల్లిదండ్రులు ● వారం కిందట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ● సాంకేతికతను ఉపయోగించి పట్టుకున్న పోలీసులు ● అమ్మానాన్నలకు భారం కావొద్దని వెళ్లానంటున్న తే జసాయి మెదక్ మున్సిపాలిటీ: తల్లిదండ్రులకు భారం కావొద్దని, సొంతంగా డబ్బులు సంపాదించి ఇంటికొస్తానని లక్ష్యంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన యువకుడు 11 ఏళ్ల తర్వాత దొరికాడు. దీంతో ఎప్పటికై నా తమ కుమారుడు ఇంటికొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వెల్లు విరిసింది. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన కూనమనేని శారద–శ్రీనివాస్‌రావు కుమారుడు కూనమనేని తేజసాయి హైదరాబాద్‌లోని డీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం 2014లో చేశాడు. తల్లిదండ్రులపై భారం కావద్దన్న ఉద్దేశ్యంతో 7 సెప్టెంబర్ 2024లో ఎవరికీ ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎక్కడా వెతకినా ఆచూకీ లభించలేదు. పదకొండేళ్లు గడిచిపోయినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో 3న పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. తేజ సాయి పేరు మార్చుకోకుండా అదేపేరుతో కొనసాగుతుండటం కేసు త్వరగా ఛేదించేందుకు దోహదపడింది. అతడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట నమోదైన మిస్సింగ్ కేసును త్వరగా మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్‌ను ఎస్పీ అభింనందించారు. ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యంతోనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయానని, బెంగుళూరులో ఉంటూ అక్కడే జీవనం సాగిస్తున్నట్లు తేజ సాయి చెప్పాడు. కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఆర్థికంగా ఎదిగాడు. తల్లిదండ్రులపై ఆధార పడకుండా ఏదైనా సాధించాలన్న ఉద్దేశ్యంతో వెళ్లానని, ఆర్థికంగా ఎదిగిన తర్వాతనే ఇరవై ఏళ్లకు వస్తానని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. -
ఇంటికి ఇద్దరేసి కవులను కన్న తెలంగాణ
కావ్యగాన సభలో కవి అందెశ్రీ సిద్దిపేటజోన్: ఇంటికి ఇద్దరేసి కవులను కన్న తెలంగాణ గడ్డ మీద పుట్టడం ఎంతో అదృష్టమని రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక విపంచి ఆడిటోరియంలో జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ శ్రీ శూద్ర గంగ కావ్యగానం చేశారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతంతో తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచే తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. మంజీర రచయిత సంఘంలో సిద్దిపేట కీలకమైన పాత్ర పోషించిందని చెప్పారు. శ్రీ శూద్ర గంగ కావ్య గానం చేసిన సుద్దాల అశోక్ తేజ తన అనుభవాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదాల కింద ఉండే వారు శూద్రులు అయినప్పుడు పాదాల కింద నుంచి వచ్చే గంగ శూద్ర గంగ ఎందుకు కాదనీ దాని నుంచే పుస్తకం పుట్టిందన్నారు కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు పరమేశ్వర్, జిల్లా జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు రంగాచారి, విష్ణు ప్రసాద్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు వర్మ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. దత్తగిరిలో ఘనంగా హనుమాన్ జయంతి ఝరాసంగం(జహీరాబాద్): బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం జయంతిని పురస్కరించుకుని బర్దీపూర్తోపాటు వివిధ గ్రామాల్లో వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, డోలారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలం రంగంపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోసన్న గారి యాదగిరి, రామమ్మ దంపతుల చిన్న కుమారుడు రంజిత్ కుమార్(22) 6న రాత్రి కోనాపూర్‌లో స్నేహితుడి వద్దకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా కోనాపూర్ శివారు మార్గమధ్యలో బైక్ పూర్తిగా దెబ్బతిని, తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న రంజిత్ కుమార్‌ను అటు వైపు వెళ్తున్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల కిందట గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. తమ కుమారుడిపై ఎవరో దాడి చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మంచంపై నుంచి కిందపడ్డ వ్యక్తి.. పాపన్నపేట(మెదక్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చీకోడ్‌లో శనివారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం పెంటారెడ్డి (72) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. 3న ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా ప్రమాద వశాత్తు కిందపడ్డాడు. తలకు గాయం కావడంతో మొదట స్థానికంగా వైద్యం చేయించారు. 11న మెరుగైన వైద్యం కోసం మెదక్‌కు అక్కడి నుంచి హైద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.