
బిడ్డ చదువు కోసం ఆరాటం
విజయ ఒక్కగానొక్క కూతురు సాత్విక.. ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతోంది. కట్టుకున్న భర్త దూరం అయ్యాక.. బిడ్డ భవిష్యత్ కోసం ఆమె పడుతున్న తపన వర్ణనాతీతం. ఎన్ని కష్టాలు వచ్చినా సాత్విక చదువుకు ఆటంకం రాకుండా ఉన్నదాంట్లో సర్దుకుపోతుంది. భర్త బతికి ఉన్నప్పుడు రెండో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదివించింది. భర్త దూరం అయ్యాక ప్రైవేటు విద్య ఆర్థికంగా ఇబ్బంది కావడంతో రెండేళ్లు ఆకారం ప్రభుత్వ పాఠశాలలో చేర్చింది. తిరిగి సిద్దిపేటకు బతుకు దెరువు కోసం వచ్చి పిండి గిర్ని నడుపుతూ బతుకును వెళ్లదీస్తుంది. మొదట్లో చదివిన స్కూల్‌లో సాత్వికను చేర్పించి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారం, చేయూతతో కూతురు చదువుకు ఆటంకం లేకుండా చదువు సాఫీగా సాగుతుంది..