రాజ్యాంగాన్ని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

Published Mon, Apr 21 2025 1:04 PM | Last Updated on Mon, Apr 21 2025 1:04 PM

రాజ్య

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

కందిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

(సంగారెడ్డి): కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నవ సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కందిలో ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. జైబాపు, జైభీమ్‌, జైసంవిధాన్‌ అనే ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. అనంతరం కంది చౌరస్తాలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బూడిద కుమార్‌, చిన్న సాయి శ్రీరామ్‌,అసద్‌ ఖాన్‌ శ్రీనివాస్‌,రాందాస్‌తోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విరమించేంత వరకూ

పోరాడుతాం

డంపింగ్‌యార్డ్‌కు

వ్యతిరేకంగా జేఏసీ నిరసనలు

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్‌ డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు 75వ రోజుకు చేరుకున్నా యి. ఆదివారం గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు, మహిళలు, దివ్యాంగులు నల్లవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రిలేనిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... ప్రభుత్వం డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటును విరమించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

విషవాయువుల నుంచి

కాపాడండి

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని తరచూ పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువుల నుంచి తమను కాపాడాలని నవ్య ది గ్రాండ్‌ కాలనీ వాసులు ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి విష వాయువులతో తామంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డామని..వారంలో ఒకసారి ఇదేవిధంగా జరుగుతోందని వివరించారు. చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి వారికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

నేడు పాలిటెక్నిక్‌

కళాశాలలో జాబ్‌ మేళా

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌ పేట పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జానకీదేవి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జాబ్‌ మేళాలో ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయని, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్పొరేట్‌ శక్తులకే

అనుకూలం

సీఐటీయూ అఖిల భారత కోశాధికారి

సాయిబాబు

పటాన్‌చెరు: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఆర్థిక విధానాలను అవలంబిస్తోందని ఈ నయా ఉదారవాద విధానాలపై పెద్ద ఎత్తున పోరాడాలని సీఐటీయూ అఖిలభారత కోశాధికారి సాయిబాబు పిలుపునిచ్చారు. పటాన్‌చెరులోని ఐలా భవన్‌లో తోషిబా పరిశ్రమలో సీఐటీయూ యూనియన్‌ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘నయా ఉదార వాద విధానాలు– లేబర్‌ కోడ్‌లు– కార్మికుల కర్తవ్యాలు’అనే అంశంపై ఆదివారం జరిగిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేకి అన్నారు. మోదీ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలతో ప్రజలకు, కూలీలకు, కార్మికులకు ఎవరికీ ఉపయోగపడటం లేదని విమర్శించారు. మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌, రాజయ్య, పాండు రంగారెడ్డి, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి1
1/1

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement