
మంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం
పిచెర్యాగడికి వాటర్‌షెడ్ ప్రాజెక్టు పథకం మంజూరైనా ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు లేకపోవడంతో మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. చేసిన పనులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. శనివారం పిచెర్యాగడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్‌షెడ్ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.1.56కోట్ల చెక్కును ఉపాధి కోసం అందజేశారు. మంత్రి కార్యక్రమంతో నిధులు విడుదలై వాటర్‌షెడ్ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రైతులు, లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.