రూ.62.28 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.62.28 కోట్లు

Published Tue, Apr 15 2025 7:19 AM | Last Updated on Tue, Apr 15 2025 7:19 AM

రూ.62

రూ.62.28 కోట్లు

ఉపాధి బకాయిలు

నిధుల విడుదలలో జాప్యం

రెండు నెలలుగా రాని మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు

కూలీల డబ్బులు కూడా కొందరికి రాలె..

త్వరలోనే విడుదల అవుతాయంటున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు రావడంలో ఆలస్యమవుతోంది. కొందరు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా కొంత మేరకు పెండింగ్‌లో ఉంది. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద జిల్లాలో పలు అభివృద్ది పనులు జరిగాయి. సీసీ రోడ్లు, డ్రైనే జీల నిర్మాణంతో పాటు, నిర్దేశించిన పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. అయితే ఈ పనులకు సంబంధించిన మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధు లు నిలిచిపోయాయి. నిబంధనల ప్రకారం పక్షం రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలి. కానీ కొందరికి దాదాపు రెండు నెలలుగా కూలీ డబ్బులు రాలేదు. చేసిన పనికి సకాలంలో కూలీ చేతికందకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కూలీలు ఈ పనులకు వెళు తున్నారు. కానీ చేసిన కష్టం చేతికందడంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.62.28 కోట్ల మేరకు బకాయిలు

జిల్లాలో మొత్తం 2.19 లక్షల జాబ్‌ కార్డులు ఉండగా, 4.02 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో రెగ్యులర్‌గా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు 2.09 లక్షల మంది ఉంటారు. అయితే ఈ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద కొన్ని రకాల అభివృద్ది పనులు చేస్తుంటారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదలలో సుమారు రెండు నెలలుగా జాప్యం జరుగుతోంది. అలాగే కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కలిపి మొత్తం రూ.62.28 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో గత ఆర్థిక సంవత్సరం 2024–25లో మార్చి 31 వరకు రూ.61.89 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు పెండింగ్‌లో ఉండగా, రూ.20 లక్షల వరకు కూలీలకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు రాలేదు. ఈ నెల ఏప్రిల్‌ మాసానికి సంబంధించి కూడా మెటీరియల్‌ కాంపోనెంట్‌, కూలీ డబ్బులు కలిపి రూ.18 లక్షలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడం, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో జాప్యం జరిగి ఉండవచ్చని చెబుతున్నారు.

మూడు నెలలుగా ఎదురు చూస్తున్నాం

మూడు నెలల నుంచి కూలీ డబ్బులు చెల్లించడం లేదు. 15 రోజులకు డబ్బులు చెల్లించాలి కానీ.. అలా జరగడం లేదు. డిసెంబర్లో చేసిన పనులకు గాను మొన్న వారం రోజుల డబ్బులు చెల్లించారు. పెండింగ్‌ కూలీ డబ్బుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వీలైనంత త్వరగా కూలీ డబ్బులు చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.

–విఠల్‌, ఉపాధి హామీ కూలి, మొగుడంపల్లి

రూ.62.28 కోట్లు1
1/2

రూ.62.28 కోట్లు

రూ.62.28 కోట్లు2
2/2

రూ.62.28 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement