
మహానందిలో మల్లుపల్లి వాసి ఆత్మహత్య
మిరుదొడ్డి(దుబ్బాక): మిత్రులతో కలిసి సరదాగా విహార యాత్రకని వెళ్లిన యువకుడు అక్కడ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల చిన్న బోయ రాజు (36) కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పని చేస్తూ భార్య సుమలతతోపాటు, ఆరేళ్లలోపు కుమారుడు, కూతురిని పోషించుకుంటున్నాడు. 17న ఉమ్మడి మండల పరిధిలోని 14 మంది కేబుల్ ఆపరేటర్లందరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా మహానందిలో మంగళవారం సాయంత్రం దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం టెంపుల్‌కు సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్‌కు రాజు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
విహారయాత్రకు వెళ్లి ఉరేసుకున్న యువకుడు