
ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయండి
తూప్రాన్: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని టీఎస్‌యూఈఈయూ –సీఐటీయూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏ.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ కా ర్మికులను విద్యార్హతలను బట్టి వారికి సబ్ ఇంజనీర్, జేఎల్‌ఎం, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో కార్మికులకు హామీ ఇచ్చిన విషయంను గుర్తుచేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో మెరుపు సమ్మెకు కూడా వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడల రవీంద్ర ప్రసాద్, సురేశ్, జీవన్, రాజిరెడ్డి, శ్రీను, సలీం, దుర్గయ్య, సిద్ది రాములు, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.