
పోలీసు దిగ్బంధంలో జిన్నారం
● ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు ● పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ పంకజ్
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండల కేంద్రాన్ని పోలీసులు ఎక్కడికక్కడ దిగ్బంధం చేశారు. గ్రామంలోని తాంబేలు గుట్టపై విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లను చేపట్టారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశాల మేరకు 163 సెక్షన్ విధించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతాబలగాలతో పహారా చేపట్టారు. జిన్నారం గ్రామానికి వచ్చే నలుమూలల వద్ద పోలీసు బలగాలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.