
ఇక మద్యం ముట్టం
మల్లారెడ్డిపేట గ్రామస్తులు ప్రతిన
మునిపల్లి(అందోల్): ఇంటిని ఒంటిని గుల్ల చేస్తున్న మద్యాన్ని ఇక నుంచి ఎవరం తాగబోమని మల్లారెడ్డిపేట గ్రామస్తులు ఆదివారం అంతా ఓ చోట చేరి ప్రమాణం ప్రమాణం చేశారు. జిల్లా మంజీర రైతు సమైఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మద్య నిషేధం కోసం చర్చించి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ...మద్యానికి బానిసై యువత పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం వల్ల భార్యాభర్తల మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరిగుతున్నాయన్నారు. ఇప్పటివరకు చాలామంది యువత మద్యానికి బానిసలై మృతి చెందినట్లు మంజీర రైతు సమైఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తెలిపారు.