
10 రోజులకు కోసేదుండే..
నేను 4 ఎకరాల్లో వరి పంట వేసిన. ఇంకో 10 నుంచి 15 రోజులైతే వరి పూర్తిగా కోతకు వచ్చేది. వాన భయంతో ముందుగానే కోయించిన. కొంత పొల్లు పోయినా వాన పడితే ఇత్తు చేతికి రాదనే భయంతోనే కోయించిన. ఏం చేస్తాం బాకీ ఉన్న కాడికి అయితాయి. ఇంకా 10 రోజులు ఉంచితే చేతికొస్తదనే గ్యారంటీ లేదాయే. నేనే కాదు చాలా మంది పచ్చి చేలనే కోయిస్తుండ్రు. – గన్నె వెంకట్రాజిరెడ్డి, రైతు దుబ్బాక
20 రోజుల కిందటే వరి ఈనుతున్న దశలోనే వడగండ్ల వర్షం పడింది. మళ్లీ చేతికొస్తదనుకున్న సమయంలో మొగుల్లు కావట్టే. మళ్లీ రాళ్లు పడితే పంటగింజ కూడా దక్కదు. పచ్చిగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కోయించిన. యాసంగిలో పంట చేతికొచ్చేది నమ్మకం లేదు. పోయిన యాసంగిలో రాళ్లవాన పడి పంట చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మొగుల్లు అవుతుండటంతో 2 రోజుల కిందటనే పచ్చిచేనునే కోయించినా.
– ఎంగారి నరేశ్ రెడ్డి, రైతు
వానపడితే చేతికిరాదనే భయం..

10 రోజులకు కోసేదుండే..