
ఫ్లెక్సీ తొలగింపు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఎదుట ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, చలివేంద్రం చాటున ప్రైవేట్ ప్రచారం పేరుతో సోమవారం ‘‘సాక్షి’’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. వెంటనే వైద్యాధికారులు సిబ్బందితో ఫ్లెక్సీని తొలగించారు. ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫ్లెక్సీలు, ప్రచారానికి సంబంధించినవి ఏర్పాటు చేయకూడదని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని వైద్యాధికారులు సిబ్బందికి సూచించినట్లు సమాచారం. ప్రైవేటు ఆస్పత్రులకు ఎవరినైనా రెఫర్ చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఫ్లెక్సీ తొలగింపు