
ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రామచంద్రాపురం(పటాన్‌చెరు)/పటాన్‌చెరు: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. భారతీనగర్, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో గురువారం పలు కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీలకతీతంగా చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతోపాటు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని వివరించారు.
దైవభక్తి పెంపొందించుకోవాలి
ప్రతీ ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల శ్రీ సాయిబాబా దేవాలయం వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్‌లు వి.సింధురెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పుష్ప, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.