
ఏఐతో కలుపుతీసే రోబో
ఆవిష్కరించిన గీతం విద్యార్థులు
పటాన్‌చెరు: ఆధునిక వ్యవసాయాన్ని మరింత విప్లవాత్మకంగా మార్చడానికి విద్యార్థులు తమ మేధకు పదునుపెడుతున్నారు. గీతంలో చదువుతున్న బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థిని సి.అమూల్య నేతృత్వంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో కలుపుతీసే రోబోకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా సోమవారం అమూల్య రోబో గురించి వివరించారు. ఆధునిక సాంకేతికత సహాయంతో అది కలుపు మొక్కలను గుర్తించి తొలగిస్తుందని చెప్పారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా అమూల్య, ఆమె బృందాన్ని అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, టెక్నాలజీ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి ప్రశంసించారు.

ఏఐతో కలుపుతీసే రోబో