ఇసుక రవాణాపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఇసుక రవాణాపై చర్యలు

Published Sun, Apr 20 2025 7:55 AM | Last Updated on Sun, Apr 20 2025 7:55 AM

ఇసుక

ఇసుక రవాణాపై చర్యలు

మద్దూరు(హుస్నాబాద్‌): అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని దూల్మిట్ట తహసీల్దార్‌ సింహాచలం మధుసూదన్‌ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ జాలపల్లిలోని మోయతుమ్మెద వాగు నుంచి గ్రామానికి చెందిన మెతుకు రామకృష్ణారెడ్డి, మెతుకు సంజీవ్‌, తుపాకుల శ్రీనివాస్‌ అనే వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకున్నామన్నారు. ఒక్కో వాహనానికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యుదాఘాతంతో

సామగ్రి దగ్ధం

మద్దూరు(హుస్నాబాద్‌): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన దూల్మిట్ట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తుషాలపురం రమ ఇంట్లో శుక్రవారం రాత్రి వేళ ఫ్రిజ్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు ఎగిసి పడ్డా యి. ఒక్కసారిగా మంటలు చెలరేగి కూలర్‌, బట్టలు, ఇతర సామగ్రికి నిప్పంటుకొని కాలిపోయాయి. అదే విధంగా విలువైన డాక్యుమెంట్స్‌తోపాటు ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన నగదు కాలిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని రెవెన్యూ అధికారులు శనివారం సందర్శించారు.

ఫామ్‌ హౌస్‌లపై

పోలీసుల దాడి

8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్‌

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ఫామ్‌ హౌస్‌లపై పోలీసులు దాడి చేసిన ఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ కథనం మేరకు.. శుక్రవారం అర్థరాత్రి తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కూచారం, జీడిపల్లి శివారుల్లో ఫామ్‌ హౌస్‌లపై దాడి చేశాం. ఈ దాడిలో వింటర్‌ గ్రీన్‌ ఫామ్‌ హౌస్‌లో 8 మంది పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నాం. వీరినుంచి పేకముక్కలు, రూ. 11 వేల నగదు, 3 కార్లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సెక్యూరిటీ గార్డుపై దాడి

పటాన్‌చెరు టౌన్‌: ఓ పరిశ్రమలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బీడీఎల్‌ సీఐ స్వామి గౌడ్‌ కథనం మేరకు.. ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో గల ఉషా కాపర్‌ వైర్స్‌ పరిశ్రమలో సదాశివపేట పేటకు చెందిన కై రత్‌ మియా (53) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పరిశ్రమ గేటు ఎదుట డ్యూటీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ముఖంపై టవల్‌ కప్పి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గాయాలతో ఉన్న సెక్యూరిటీ గార్డును చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పటాన్‌చెరుకు తీసుకెళ్లారు. శనివారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బీడీఎల్‌ పోలీసులు పేర్కొన్నారు.

కలిసిమెలిసి ఉండాలి

హంపీ పీఠాధిపతి భారతీ స్వామి

మిరుదొడ్డి(దుబ్బాక): భారతీయ సంస్క ృతీ సాంప్రదాయాలు, సనాతన ధర్మం ఎంతో శ్రేష్ఠమైనవని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని అందె గ్రామంలోని శంభుని దేవాలయంలో శనివారం నిర్వహించిన బాణ లింగాభిషేక కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. లింగాభిషేకంలో పాల్గొన్న ఆయన గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతాయన్నారు. సమాజంలో ధర్మబద్ధంగా జీవిస్తేనే మోక్షం లభిస్తుందన్నారు. గ్రామాల్లో ఈర్ష, అసూయలు తగ్గించి అందరూ కలిసి మెలసి ఐక్యంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌జీ, శివలింగం, యాదగిరి, సుమన్‌, పోచయ్య, ప్రవీణ్‌, కుమార స్వామి, కనకరాజు పాల్గొన్నారు.

ఇసుక రవాణాపై చర్యలు 1
1/2

ఇసుక రవాణాపై చర్యలు

ఇసుక రవాణాపై చర్యలు 2
2/2

ఇసుక రవాణాపై చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement