
రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
సంగారెడ్డిటౌన్/సదాశివపేట: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని నాగపూర్‌లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల వద్ద దళారులకు ఎక్కడా తావు లేకుండా చూడాలన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నిర్మలరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉంటుందని ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు.
సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
అంతకుముందు సదాశివపేటలో విలేకరులతో ఎమ్మెల్యే చింతా మాట్లాడుతూ... హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించతలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బహిరంగసభ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నియోజకవర్గ నాయకుడు శివరాజ్‌పాటిల్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అపర్ణ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, విద్యాసాగర్‌రెడ్డి, ముబిన్, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్