Sangareddy District Latest News
-
అంగన్వాడీకి కొత్త భవనం
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కంది(సంగారెడ్డి): కంది మండల పరిధిలోని మామిడిపల్లిలో శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని కూల్చివేసి అదేస్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలోని అంగన్వాడీ భవనాన్ని బుధవారం చంద్రశేఖర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, సీడీపీవో జయరాం నాయక్, పంచాయతీ కార్య దర్శి శ్రీధర్ స్వామి, అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 332 సెల్ఫోన్లు రికవరీ ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జోన్: జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ఫోన్ల రికవరీ కోసం ఐటీ విభాగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం ఆవరణలో బుధవారం మొబైల్ రికవరీ మేళాను నిర్వహించి పోగొట్టుకున్న, చోరీకి గురైన 332 మంది మొబైల్ ఫోన్ బాధితులకు సెల్ఫోన్లను అధికారులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు నమోదు చేయబడిన 9,878 దరఖాస్తులలో 2,150 ఫోన్లను గుర్తించి, బాధితులకు అందించామన్నారు. తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన, ప్రమోట్ చేసినా అలాంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు,సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ రాజలింగం పాల్గొన్నారు. ధర్నా విజయవంతం చేయాలిజహీరాబాద్ టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య బుధవారం విలేకరులతో మాట్లాడుతూ...ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలన్నారు. కులగణన సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అమృత్, సంఘం నాయకులు యూనస్, శివకుమార్, విశ్వనాథ్ రాథోడ్, కిషన్ బానోత్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కుస్తీపోటీలునారాయణఖేడ్: శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని నారాయణఖేడ్‌లో బుధవారం నిర్వహించిన కుస్తీపోటీలు హోరాహోరీగా సాగాయి. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కుస్తీపోటీలు నిర్వహించారు. ఖేడ్తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీపోటీల్లో తలపడ్డారు. ఉత్సవాల చివరోజు ఉదయం రాములోరిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఉమ్మడి జిల్లా ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు నగేశ్ షెట్కార్, మాజీ ఆలయ చైర్మన్ ముత్యం హన్మాండ్లు, వివేకానంద్, పాండు తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: జిల్లా కలెక్టర్
సంగారెడ్డిజోన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, ఎల్ఆర్ఎస్, మున్సిపల్ పన్ను వసూలు, రాజీవ్ యువ వికాసం అంశాలపై వివిధ విభాగాల అధికారులతో బుధవారం కలెక్టర్రేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలన్నారు. ఘనంగా పూలే జయంతి మహాత్మా జ్యోతి బా పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ క్రాంతి వివరించారు. భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అందించే ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండవ దశ దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. అదేవిధంగా అగ్నివీర్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు. -
సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు
ప్రగతి ఆధారంగా పంచాయతీరాజ్ మార్కులు ● ఉమ్మడి జిల్లాలో బీ గ్రేడ్‌లో 24,సీ గ్రేడ్‌లో 1,419, డీ గ్రేడ్‌లో 171 జీపీలు ● ఏ పంచాయతీకి దక్కనిఅచీవర్స్ హోదా సాక్షి, సిద్దిపేట: పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన వంటి తొమ్మిది అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి మెతుకుసీమలోని 24 పల్లెలు పురోగతిలో ఫ్రంట్‌రన్నర్‌గా నిలిచాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా మార్కుల జాబితాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు గణనీయమైన మార్కులు సాధించాయి. తొమ్మిది అంశాల ఆధారంగా... కేంద్రప్రభుత్వం పంచాయతీ ముందస్తు సూచి(అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) పేరుతో ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1,615 గ్రామ పంచాయతీలు దరఖాస్తు చేశాయి. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల స్వావలంబనకు అనుకూలమైన విధానాలు అనే అంశాల ఆధారంగా గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం మార్కులను కేటాయించింది. ఇందులో 24 పంచాయతీలు ఫ్రంట్‌రన్నర్‌గా నిలవడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పంచాయతీకీ అచీవర్స్ హోదా దక్కలేదు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన గ్రామం గుడాటిపల్లి 39.39 మార్కులతో ‘ఈ’గ్రేడ్‌లో నిలిచింది. అలాగే బీ గ్రేడ్‌లో నిలిచిన పటేల్‌గూడ, సుల్తానాపూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామం తొమ్మిది అంశాలలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు వైకుంఠథామం, డంపింగ్‌యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, తాగునీటి సరఫరాను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంతో 77.90మార్కులు సాధించింది. దీంతో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో 939 గృహాలుండగా 3,184 జనాభా ఉన్నారు. 2009–10లో నిర్మల్ పురస్కారం, 2021లో పారిశుద్ధ్య నిర్వహణలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ భవనంపై సోలార్‌ను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నారు. మిట్టపల్లి గ్రామం 77.59 మార్కులు సాధించడంతో పంచాయతీ కార్యదర్శి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పచ్చదనం పెంపు ఇలా విభాగాల సమన్వయంతో ముందుకు సాగుతూ ఏ గ్రేడ్‌లో నిలిచేందుకు కృషి చేస్తాం. – దేవకీ దేవి, డీపీఓ, సిద్దిపేట -
హామీ కోల్పోయిన ఉపాధి
జహీరాబాద్‌టౌన్: జహీరాబాద్ పట్టణానికి సమీపంలోని గ్రామాలను మున్సిపల్లో విలీనం చేయడంతో ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం బంద్ అయింది. కేంద్రం నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలి. పట్టణానికి సమీపంలో ఉన్న పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్, హోతి(కె) ఐదు పంచాయతీలను 2019 సంవత్సరంలో ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. అప్పటినుంచి ఆ యా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిలిచిపోయా యి. జాబ్ కార్డులున్న పథకానికి దూరమయ్యారు. పూర్తిగా పల్లె వాతావరణం జహీరాబాద్ మున్సిపల్లో విలీనమైన పస్తాపూర్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్,రంజోల్,హోతి(కె) గ్రామాలు పూర్తిగా పల్లెవాతారణం నెలకొని ఉంది. ఆయా గ్రామాల్లో అధిక శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 2019 సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు ఏడాదికి వందరోజులు ఉపాధి అవకాశాలు కల్పించారు. కుటుంబాలకు జాబ్ కార్డులు కూడా జారీ చేసి పనులు చూపించి కూలీ డబ్బులు ఇచ్చారు. మున్సిపల్లో విలీనం తర్వాత పనులు నిలిపివేయడంతో ఆయా గ్రామాల కూలీలంతా ఇతర పనులకు వెళ్తున్నారు. మంత్రి సీతక్క ప్రకటనతో... మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీకి ప్రత్యామ్నాయంగా మరో పథకం అమలు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు ఇటీవల మంత్రి సీతక్క ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రకటనపై వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019 సంవత్సరంలో విలీనమైన గ్రామాలను కొత్త పథకం కింద పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఐదు పంచాయతీల్లో 1,168 మంది కూలీలు జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన ఐదు పంచాయతీల్లో 1,168 మంది కూలీలు ఉపాధి హామీ పథకానికి దూరంగా ఉన్నారు. రంజోల్ గ్రామంలో 1,464 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 261 కుటుంబాల్లోని 392 మంది కూలీలు ఉన్నారు. అల్లీపూర్లో 678 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 33 కుటుంబాల్లోని 44 మంది కూలీలు పనులకు వచ్చారు. పస్తాపూర్‌లో 762 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 16 మంది కూలీలు, హోతి(కె) గ్రామంలో 833 కటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా 337 కుటుంబాల్లో 556 మంది కూలీలు పనులకు వచ్చారు. ఇప్పుడు వీరంతా ఉపాధి పనులకు దూరంగా ఉంటూ ఇతర పనులు చేసుకుంటున్నారు.విలీన గ్రామాల్లో పనులు చేపట్టాలి జహీరాబాద్ మున్సిపల్లో విలీనమైన ఐదు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలి. విలీన వల్ల గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉన్న కూలీలకు పనులు పనిలేకుండా పోయింది. ఎండాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇదే విషయమై సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకొచ్చాం. – బి.రాంచందర్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడుమున్సిపల్ విలీన గ్రామాల్లోపనులు బంద్ 1,168 కూలీలు పనికి దూరం -
97.18%
పన్ను వసూలుసంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటితోపాటు గ్రామ పంచాయతీలు ప్రత్యేకంగా పన్ను వసూలు చేస్తారు. జిల్లాలో గడిచిన ఆర్థిక ఏడాది(2024–25)లో ఆస్తి పన్ను వసూలు 97.18% శాతం పూర్తి చేశారు. వసూలైన పన్ను గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతుంది. 633 గ్రామ పంచాయతీల్లో వసూలు... జిల్లాలో 633 గ్రామపంచాయతీలు ఉండగా ఆయా జీపీలలో రూ.23,53,58,096లు వసూలు చేయాల్సి ఉండగా సంబంధిత శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి మొత్తంగా రూ.22,87,24,676లు పన్ను వసూలు చేశారు. నిర్దేశించిన మార్చి 31 తేదీ లోపు వసూళ్ల ప్రక్రియను ముగించారు. వసూలు చేసిన పన్నును చలాన్ తీసి బ్యాంకులలో సంబంధిత గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేశారు. 100 శాతం పూర్తి చేసిన మండలాలు జిల్లాలోని కల్హేర్, మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్, సిర్గాపూర్, అమీన్పూర్, ఆందోల్, మునిపల్లి, వట్పల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో 100% పన్ను వసూలు పూర్తిచేసి జిల్లాలో ముందంజలో నిలబడ్డాయి. అదేవిధంగా మరికొన్ని మండలాలు 99% పన్ను వసూలు పూర్తి చేశాయి. అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు వసూలు చేసిన పన్నులతో సంబంధిత గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకోసం ఆ నిధులను కేటాయిస్తారు. గ్రామంలోని వీధి దీపాల నిర్వహణ, మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్య పనులతోపాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెచ్చిస్తారు. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారులు, సంబంధిత పంచాయతీ కార్యదర్శి తీర్మానం చేసి, అధికారుల అనుమతితో ఖర్చు చేస్తారు. పాలకవర్గం లేకపోవడం నిధులు నిలిచిపోవడంతో వసూలైన పన్నులు పంచాయతీలకు కొంతమేర ఊరటనిచ్చింది.జిల్లాలోని గ్రామ పంచాయతీలు 633 వసూలు కావాల్సిన పన్ను రూ.23,53,58,096 వసూలైన పన్ను రూ.22,87,24,676 100శాతం వసూలు చేసిన మండలాలు 11రూ.22.87కోట్ల ఆదాయం జీపీ ఖాతాలో జమ చేసిన అధికారులు ఇంటింటికీ తిరిగి పన్ను వసూలు మౌలిక వసతులకు నిధులుకేటాయించనున్న యంత్రాంగం -
కార్యకర్తలకు అండగా ఉంటా
పటాన్చెరు: బీఆర్ఎస్ కోసం కష్టించి పనిచేసే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పటాన్చెరు మండలం గణేశ్‌గడ్డలో బుధవారం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశానికి హరీశ్‌రావు హాజరై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్కు దూరంగా ఉంటుండటంతో ఆపార్టీ కార్యకర్తలు డీలా పడిన పరిస్థితుల నేపథ్యంలో హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై గానీ, పటాన్చెరు స్థానిక రాజకీయాలపైగానీ హరీశ్‌రావు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. వరంగల్ సభలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకుంటారని స్థానికంగా ప్రచారం జోరుగా సాగుతోంది. బహుశా అదే కారణంగానే హరీశ్‌రావు కూడా మహిపాల్‌రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. వెన్నవరం ఆధ్వర్యంలో తొలిసమావేశం పటాన్చెరు నియోజకవర్గ సమన్వయకర్తగా వెన్నవరం ఆదర్శ్‌రెడ్డిని నియమించిన తర్వాత తొలిసారి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం, హరీశ్‌రావు రాకతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ సమావేశానికి ప్రధాన నాయకులు మెట్టుకుమార్ యాదవ్, కొలన్ బాల్‌రెడ్డి, సోంరెడ్డి, వెంకటేశ్(జిన్నారం), శ్రీధర్‌చారి, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, స్థానిక యువనాయకుడు మ్యాథరి పృథ్వీరాజ్ హాజరయ్యారు. కలసి పనిచేద్దాంః ఆదర్శ్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటే పార్టీ కేడర్ కూడా వెళ్లిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆదర్శ్‌రెడ్డి కొట్టిపారేశారు. అందరం కలసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. ప్రజల పక్షాన తాము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని తెలిపారు. కొంతమంది నేతల్లో అసంతృప్తి! నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదర్శ్‌రెడ్డి నియామకం ప్రకటన పట్ల కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ నియామక ప్రకటన ప్రక్రియ తమకు ముందుగా తెలియదని ఆదర్శ్‌రెడ్డే స్వయంగా ఫోన్ చేసి చెప్పుకున్నారని కొంతమంది బీఆర్ఎస్ నేతలు పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ఇది రాజకీయ సమావేశమా లేక వ్యక్తిగత సమావేశమా అని కొంతమంది నేతలు బాహాటంగానే విమర్శించడం గమనార్హం. ఆదర్శ్‌రెడ్డి నియామకాన్ని హరీశ్‌రావే స్వయంగా తమతో చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. పటాన్చెరు సభలో హరీశ్‌రావు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాం
ఆర్టీసీ ఈడీ సోలోమన్హుస్నాబాద్రూరల్: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని, ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులు సహకరించాలని ఈడీ సోలోమన్ అన్నారు. బుధవారం రాత్రి హుస్నాబాద్ బస్టాండ్ డిపోను పరిశీలించారు. బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ బస్టాండ్‌ను సందర్శించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. మహాలక్ష్మీ ప్రయాణికులకు సేవలందించడానికి ఆర్టీసీ ఉద్యోగులు ముందుంటారని చెప్పారు. హుస్నాబాద్ డిపో బస్టాండ్ అభివృద్ధి కోసం ఉద్యోగులతో సమీక్షించి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. బస్టాండ్‌లో గతంలో నిర్మించిన మూత్రశాలల ఎత్తు పెంచడం, షాపింగ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసి ఆదాయ వనరులను పెంచుతామన్నారు. వీరి వెంట ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, డీఎం వెంకన్న ఉన్నారు. -
ఉద్యాన సాగులో బయోడిగ్రేడబుల్ ప్లాస్టికల్చర్
● గ్లోబల్ వార్మింగ్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం ● ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి ● బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో యూనివర్సిటీ ఒప్పందం ములుగు(గజ్వేల్): ఉద్యాన వ్యవసాయ పంటల సాగులో పర్యావరణ అనుకూల బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్లాస్టిక్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ఉద్యానవర్సిటీ సంకల్పించిందని ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు ములుగు ఉద్యానవర్శిటీలో బుదవారం బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టికల్చర్తో అభివృద్ధి, శిక్షణ సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. ఇవి భూమిలో క్షీణిస్తున్నప్పుడు మీథేన్, ఇథలీన్ వాయువులను విడుదల చేసి గ్లోబల్ వార్మింగ్‌ను మరింత పెంచుతుందన్నారు.ప్లాస్టిక్ కాలుష్యం నేలను నిస్సారం చేసి పంట దిగుబడిని తగ్గిస్తుందన్నారు. కలుపు మొక్కల అణచివేత, తేమ నిలుపుదల కోసం సాంప్రదాయ ప్లాస్టిక్ మల్చ్ ఫిల్మ్‌లు వాడకుండా బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్లాస్టిక్లు రైతులు వినియోగించేలా మార్పు తేవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. ఇవి సులభంగా నేలలో కరిగిపోయి పర్యావరణ హానిని తగ్గించడంతో పాటు నేలను సుసంపన్నం చేస్తాయని వివరించారు. కార్యక్రమంలో ములుగు ఉద్యానవర్సిటీ, బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాస్టికల్చర్ అధికారులు భగవాన్, శుభం రతి, చీనానాయక్, లక్ష్మీ నారాయణ, సురేశ్ కుమార్, రాజశేఖర్, శ్రీనివాసన్, వీణజోషి, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
కిలో మీటరున్నర పైపు లైన్
ఉష్కెతెప్ప వద్ద బోరు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 800 ఫీట్ల లోతు బోరు వేశా. కిలోమీరున్నర దూరంలో పొలం ఉంది. పొలానికి సాగు నీరు పైపులైన్ వేసి పారిస్తున్నాం. ఇక్కడ 5 ఎకరాలు ఉండగా రెండు పంటలకు నీరు అందుతుంది. బోరులో 500 ఫీట్లలోతు నుంచి నీళ్లు తోడి పైపులైన్‌తో నీరు పారిస్తున్నాం. పైపులైన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు అయినా పంటలు సాగు అవుతుండటంతో ఇబ్బంది లేదు. – గాదె రాములు, రైతు పాంపల్లి గ్రామాన్ని ఆదుకుంటుంది ఉష్కెతెప్ప గ్రామాన్ని ఆదుకుంటుంది. నాకు కట్టకింద అర ఎకరం భూమి ఉంది. బోరు లేదు. అయినా యాసంగిలో పైనుంచి వచ్చే వర్షం నీరు, ఇతర రైతుల బోర్ల నుంచి వచ్చే నీటితోనే సాగు చేస్తా. ఇక్కడ బోరు వేస్తే నీళ్లు తప్పక వస్తాయన్న నమ్మకం ఉంది. ఉష్కెతెప్ప వద్ద బోర్లతో ఇంచుమించి ఊరిలోని ఎక్కువ భూమి సాగవుతుంది. చెరువు నీటితో సంబంధం లేకుండా బోర్లు నీళ్లు పోస్తాయి. – నర్సింలు, రైతు పాంపల్లి -
చిరుత దాడిలో దూడ మృతి
హవేళిఘణాపూర్(మెదక్): చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బ్యాతోల్ అటవీ ప్రాంతంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బ్యాతోల్ గ్రామానికి చెందిన రైతు రాజయ్య తన పశువులను అటవీ ప్రాంతంలో కట్టేసి వచ్చాడు. ఉదయం వెళ్లేసరికి చిరుత వచ్చి లేగదూడను చంపి తిని పడవేసినట్లు బాధితుడు తెలిపారు. ఘటనా స్థలాన్ని సెక్షన్ ఆఫీసర్ స్రవంతి, బీట్ ఆఫీసర్ అశ్వక్ పరిశీలించి వెటర్నరీ అధికారులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి చిరుతపులి దాడి చేసినట్లు పోస్టుమార్టంలో వెటర్నరీ అధికారులు గుర్తించారు. బాధిత రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. పులి సంచరిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు లు రాత్రివేళల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. బావిలో పడి వ్యక్తి మృతి అక్కన్నపేట(హుస్నాబాద్): బావిలో పూడికతీత పనులు చేస్తుండగా కాలుజారి పడిపోవడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన శివరాత్రి కనకయ్య(40) ఒడ్డెర కార్మికుడు. రేగొండ గ్రామానికి చెందిన రైతు బొడిగే మల్లయ్య బావి పూడికతీత పనుల కు వెళ్లాడు. 15 రోజులుగా పనులు చేస్తు న్నారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బావి పైన మట్టి పెళ్లలు, బండరాళ్లు తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారి కాలు జారి బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యా డు. 108 అంబులెన్స్‌లో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం కనకయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌భాస్కర్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వివాహిత.. శివ్వంపేట(నర్సాపూర్): చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మండల పరిధి కొంతన్‌పల్లి గ్రామానికి చెందిన చెల్లి వినోద(32) కుటుంబ కలహాలతో ఆరు రోజుల కిందట పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అత్తింటి వేధింపులతోనే వినోద ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. కూతురి మృతికి కారకులైన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి తండ్రి డాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడికి జైలు శిక్ష నంగునూరు(సిద్దిపేట): గుడిలో దొంగతనం చేసిన వ్యక్తికి సిద్దిపేట అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఏడాదిపాటు జైలు శిక్ష విధించినట్లు రాజగోపాల్‌పేట ఎస్ఐ అసీఫ్ తెలిపారు. కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన బోదాసు యాదగిరి ఎనిమిది నెలల కిందట నంగునూరు మండల గట్లమల్యాలలోని పెద్దమ్మ గుడిలో దోపిడీకి పాల్పడ్డాడు. రూ.35 వేల నగదుతో పాటు బంగారం, ఇత్తడి గంటను దొంగిలించాడు. విచారణ అనంతరం నిందితుడిని గుర్తించి చార్జీషీట్ దాఖలు చేయడంతో రూ.500 జరిమానతోపాటు సాధారణ జైలు శిక్ష విధించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ చేర్యాల(సిద్దిపేట): తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం మండల పరిధిలోని ఆకునూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఉల్లెంగుల వెంకటేశ్ భార్య మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లింది. పొలం పనుల నిమిత్తం వెంకటేశ్ ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. తిరిగి రాత్రి వచ్చిచూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.25 వేలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డట్లు బాధితుడు వాపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నీరేశ్ తెలిపాడు. -
సన్నాల సాగుకే సై
పెరుగుతున్న సాగు విస్తీర్ణం ● వానాకాలంలో మరింత రెట్టింపు ● రెండేళ్లుగా స్పష్టంగా పెరుగుదల ● బోనస్ పథకంతో రైతులకు మేలు ● సన్న బియ్యం పంపిణీతో మరింత ధీమా పెరిగిన సన్నాల వాడకం.. ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా సన్న బియ్యం వాడకం విపరీతంగా పెరిగింది. పదేళ్ల కిందట వరకు రైతులు, గ్రామీణ స్థాయిల్లో దొడ్డు బియ్యం వాడకం కొనసాగేది. రైతులు తమ కమతాల్లో సాగైన బియ్యం తినేందుకే ఇష్టపడేవారు. కానీ కాలంతోపాటు సన్నాల కొనుగోళ్లు పెరగడంతో గ్రామీణ స్థాయిలో మధ్యతరగతి వర్గాల వరకు సన్న బియ్యంను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్ బియ్యం కూడా జనాలు అమ్మేసి సన్న బియ్యం కొనుగోలు చేస్తుండడంతో దీన్ని నివారించేందుకు ప్రభుత్వమే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెలలో పంపిణీ జరిగిన సన్న బియ్యంను జనాలు తినేందుకు ఇష్టపడుతున్నారు. రానున్న కాలంలో సన్నాల వినియోగమే అధికంగా మారనుండటంతో రైతులు కూడా అందుకు అనుగుణంగా సన్నాల వైపు మళ్లుతున్నారు. అన్నదాతలు సన్నాల సాగుకు సై అంటున్నారు. ఇంతకాలం దొడ్డు రకాలకు, సన్నరకాలకు ఒకే కనీస మద్దతు ధర ఉండటంతో గిట్టుబాటు కాదని భావించిన రైతులు బోనస్ పథకం అమలులోకి రావడంతో సన్నాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం కూడా ప్రారంభించడంతో రైతులకు మరింత ధీమా వచ్చింది. రానున్న వానాకాలంలో వరి సాగులో 70 శాతం వరకు సన్నాలే సాగవుతాయని, సన్నరకాల విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తుంది. – నారాయణఖేడ్ 2023–24 యాసంగిలో జిల్లాలో సన్నాలను 2,312 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. 2024– 25 యాసంగిలో సాగు విస్తీర్ణం 3,640కి పెరిగింది. 2024–25 వానాకాలం వచ్చేసరికి 5,474 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. రానున్న వానాకాలం 2025–26కు గాను గత వానాకాలం కంటే రెట్టింపుగా 10,948 ఎకరాలకు సన్నాల సాగు చేరవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విస్తీర్ణం కంటే అధికంగా పెరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంటున్నారు. గతంలో సన్నాల సాగు చూద్దామంటే కనిపించని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉండేది. కానీ ప్రస్తుతం రైతులు మారుతున్న కాలంతోపాటు మార్పు దిశగా పయణిస్తూ సన్నాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. బోనస్‌తో మేలు.. ప్రభుత్వం బోనస్ పథకం ప్రవేశపెట్టడంతో రైతులు సన్నాల సాగును పెంచేందుకు దోహదం అవుతుంది. కనీస మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,300 ఉండగా దానికి రూ.500 కలపడంతో రూ.2,800కు చేరింది. దీంతో బహిరంగ మార్కెట్లో ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. గత వానాకాలంలో జై శ్రీరాం లాంటి పలు రకాల సన్నాలకు మంచి డిమాండ్ పలికింది. జిల్లాలో డెల్టా, కావేరి, కోనవరం సన్నాలు, జగిత్యాల సన్నాలు, తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్ 15048) తదితర రకాలను సాగు చేస్తుంటారు. వ్యవసాయశాఖ 34 రకాల సన్నాలను గుర్తించింది. ముఖ్యంగా నల్గొండ లాంటి ప్రాంతాల్లో భారీ మిల్లులు ఉండటంతో అక్కడ మాశ్చర్ (తేమశాతం) 25 వచ్చినా కొనుగోలు చేస్తుండడం, జిల్లాలో 17 మాశ్చర్ (తేమశాతం) కావాలనడంతో రైతులకు కొంత నష్టదాయకమే. మాశ్చర్ విషయంలో మినహాయింపులు ఉండాలని రైతులు కోరుతున్నారు. సన్నాలకు ‘చీడ’ సమస్య! సన్నాల విస్తీర్ణం పెరుగుతోంది సన్నాల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. మూడేళ్ల కాలంతో పరిశీలిస్తే పెరుగుదల స్పష్టంగా కన్పిస్తుంది. ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడం, పౌర సరఫరాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం, ప్రభుత్వ ప్రోత్సాహం, వ్యవసాయ అధికారుల ప్రచారం వల్ల సన్నాల సాగు పెరిగింది. చీడ పీడల సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు సలహాలు, సూచనలు పొందాలి. మంచి దిగుబడులు సాధించవచ్చు. – నూతన్‌కుమార్, ఏడీఏ, నారాయణఖేడ్ దొడ్డు రకం వరి ధాన్యంతో పోలిస్తే సన్న రకం వరి ధాన్యానికి చీడ పీడల సమస్య కాస్త అధికంగా ఉండనుంది. సన్నాలు, దొడ్డురకం రెండు పంటలూ 120 రోజుల కాలంలోనే కోతకు వస్తుంటాయి. సన్నాలకు మార్కెట్లో బోనస్‌తో కలిపితే ధర అధికంగా ఉంటుంది. అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు, ఆకుచుట్ట పురుగు తదితర తెగుళ్లు సోకే అవకాశాలు సన్నాలకు అధికంగా ఉంటాయి. -
కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్‌గ్రేడ్ చేయాలి
సిద్దిపేట పీజీ కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరసనసిద్దిపేట ఎడ్యుకేషన్: సిద్దిపేటలోని యూనివ ర్సిటీ పీజీ కళాశాల (ఓయూ) పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న వారిని కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్‌గ్రేడ్ చేయాలని పార్ట్ టైమ్ అధ్యాపకులు అన్నారు. బుధవారం యూనివర్సిటీ పీజీ కళాశాల ఎదుట నల్ల బ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. జీవో నంబర్ 21 కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని వెంటనే సవరించాలన్నారు. శాశ్వత నియామకాల కోసం విడుదల చేసిన జీవో నంబర్ 21లోని పార్ట్‌టైమ్ అధ్యాపకుల సేవకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నత విద్యా కమిషన్ అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నెలకు రూ.50,000 కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వాలన్నారు. పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరసనకు కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ రమేశ్, డాక్టర్ సౌజన్య కుమార్, డాక్టర్ ఛత్రపతి, డాక్టర్ శ్రీహరి, రాజేందర్ మద్దతు తెలుపారు. కార్యక్రమంలో కళాశాల పార్ట్‌టైమ్ అధ్యాపకులు డాక్టర్ సౌందర్య, స్వాతి, షంషాద్ అలీ, అశోక్, డాక్టర్ రత్నాకర చారి, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు. -
జానపద సాహిత్యంపై జాతీయ సదస్సు
సిద్దిపేట ఎడ్యుకేషన్: జానపద సాహిత్య ఆధ్య పరిశోధకులు ఆచార్య బిరుదు రాజు రామరాజు శత జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో 15, 16 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, సదస్సు కన్వీనర్ తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జానపద సాహిత్యానికి తెలంగాణం కేంద్ర స్థానమని, ఇక్కడ ఉన్నంత జానపద సాహిత్య సంపద దేశంలో మరో ప్రాంతానికి లేదన్నారు. బిరుదురాజు రామరాజు తెలంగాణ జానపదసాహిత్యంపై చేసిన విశ్వవిద్యాలయస్థాయి డాక్టరేటు పరిశోధన దక్షిణ భారతదేశంలోనే మొదటిదన్నారు. అప్పటి నుంచి జానపద సాహిత్య సేకరణ, పరిశోధన నిర్విరామంగా నడుస్తుందన్నారు. ఈ సదస్సుకు రెండు తెలుగురాష్టాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటుగా ఇతర ప్రాంతాలనుంచి పరిశోధకులు పత్రసమర్పణలు చేస్తారన్నారు. ఈ రంగంలో విశేష పరిశోధనలు చేసిన ఆచార్యులు, పరిశోధకులు వక్తలుగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో సదస్సు సమన్వయకర్త పిట్ల దాసు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, తెలుగుశాఖ అధ్యాపకులు సంపత్ కుమార్, నరేశ్, రామస్వామి, శైలజ, సాయి సురేశ్, నర్సింహులు, రమణ, సిబ్బంది, తదిత రులు పాల్గొన్నారు.15, 16 తేదీల్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహణ -
10 గుంటలు.. 15 బోర్లు
‘ఉష్కెతెప్ప’తో పుష్కలంగా నీళ్లు ● పక్కపక్కనే బోర్లు వేసినా తగ్గని జలం ● సుమారు 120 ఎకరాల వరకు సాగు నీరు ● కిలో మీటరున్నర దూరం నుంచి పైపులైన్లు ● రైతులను ఆదుకుంటున్న పాంపల్లి సోమనికుంట చెరువు కింద ఉష్కెతెప్ప కౌడిపల్లి(నర్సాపూర్): ఒకే చోట పక్కపక్కనే పదిహేను బోర్లు. మీటరు స్థలంలో రెండు, నాలుగు మీటర్ల స్థలంలోనే నాలుగు బోర్లు. అయినా ఏ బోరులోనూ తగ్గని నీళ్లు. మండుటెండల్లో వేరే ప్రాంతాల్లో బోర్లు ఫైయిల్ అవుతున్నా ఇక్కడ చుక్క నీరు తగ్గదు. సుమారు 10 గుంటల స్థలంలో 15 బోరు బావులు ఉండగా గ్రామ రైతులకు చెందిన సుమారు 120 ఎకరాలు సాగు అవుతున్నాయి. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలకు జీవం పోసింది కౌడిపల్లి మండలం పాంపల్లి గ్రామంలోని సోమనికుంట కిందగల ‘ఉష్కె తెప్ప’. దీంతో రైతులకు సాగు నీటి కష్టాలు తీరాయి. మండలంలోని పాంపల్లి సోమనికుంట కింద గ్రామానికి చెందిన పలువురు రైతుల సాగు భూములు ఉన్నాయి. సాగు నీటి కోసం బోర్లు వేస్తే ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పక్కనే ఉన్న ఉష్కెతెప్ప ప్రాంతంలో బోర్లు వేయగా పుష్కలంగా నీళ్లు పడ్డాయి.ఈ క్రమంలో ఆ ప్రాంత రైతులంటా అక్కడే బోర్లు వేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలు పక్కనపెట్టి ఎలాంటి ద్వేషాలు లేకుండా పక్కపక్కనే బోర్లు వేసుకొని పంటలు సాగు చేస్తున్నారు. ఇలా సుమారు 10 గుంటల విస్తీర్ణంలో 15 బోర్లు వేశారు. వీటికి పైప్లైన్లు వేసి పదేళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. గ్రామంలోని సుమారు 120 ఎకరాల వరకు ఈబోర్లతో పంట సాగు అవుతుంది. 400 నుంచి 500 ఫీట్ల లోతులో నీళ్లు ఇక్కడ గ్రామానికి చెందిన పెరుమండ్లకాడి వెంకటయ్య, అర్జున్, శంకరయ్య, లింగమయ్య, కిష్టయ్య, గాదె రాములు, దుర్గయ్య, పోచయ్య, అంబూరి భిక్షం, కొత్తింటి రాములు, గుండు వెంకటయ్య, గుడ్డంల రాములు, వెంకటస్వామి, పాం కిష్టయ్య రైతులకు చెందిన బోరుబావులు ఉన్నాయి. మరికొంత దూరంలో మరికొన్ని బోర్లు ఉన్నాయి. రైతులు ఒక్కో బోరు 600 నుంచి 800 ఫీట్ల లోతు వరకు వేశారు. 400 నుంచి 500 ఫీట్ల లోతుకు వెళ్లాక బోరులో నీళ్లు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మీటరు దూరంలో రెండు బోర్లు, నాలుగు మీటర్ల దూరంలో నాలుగుబోర్లు ఉన్నా ఏ బోరులోనూ నీరు తగ్గడం లేదు. ఇక్కడ సగం మంది రైతులు 500 ఫీట్ల లోతు నుంచి కిలోమీటర్న్నర దూరం నాలుగు ఇంచుల పైపుతో పంటలకు నీళ్లు పారిస్తున్నారు. ప్రస్తుతం మండు టెండలోనూ బోరు బావుల్లో నీరు తగ్గలేదు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నార్సింగి మండల కేంద్రానికి చెందిన బేడబుడగ జంగాల దుర్గయ్య కుమారుడు శివకుమార్(30) గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గ్యాస్ స్టవ్, మిక్సీ కుక్కర్లు బాగు చేస్తుంటాడు. సోమవారం చేగుంట మండలం మక్కరాజ్‌పేటలో గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఎక్సెల్ పై నార్సింగి జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి దుర్గయ్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నీటి కుంటలో పడి యువకుడు అల్లాదుర్గం(మెదక్): నీటి కుంటలో పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం మేరకు.. టేక్మాల్ మండలం దన్నూర గ్రామానికి చెందిన నాయికిని సురేశ్(25) ముస్లాపూర్ గ్రామానికి చెందిన మమతతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది.పెళ్లి చేసుకొని ఇల్లరికం అల్లుడిగా వెళ్లారు. సోమవారం సురేశ్ అదే గ్రామానికి చెందిన ఆగమయ్య, సంగమేశ్తో కలిసి సీతారామా కుంటలో ఎడ్లను కడగడానికి వెళ్లారు. సురేశ్ కుంటలో మునిగిపోయాడని ఆగమయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సురేశ్‌ను బయటికి తీసి జోగిపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సురేశ్ మృతిపై అనుమానం ఉందని తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పారిశ్రామిక వాడలో సెక్యూరిటీ గార్డు మనోహరాబాద్(తూప్రాన్):అనారోగ్యంతో పారిశ్రామిక వాడలో సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. మంగళవారం ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజు గాంధీ (58) ఆరు నెలల నుంచి మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో మూతపడిన తనయ్ ఎకోవేర్స్ విస్తరాకుల పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. షిఫ్ట్ ఛేంజ్‌లో భాగంగా సోమవారం తెల్లవారుజామున తోటి సెక్యూరిటీ గార్డ్ అరుణ్ మిశ్రా పరిశ్రమ వద్దకు వచ్చాడు. అప్పటికే సెక్యూరిటీ రూం వద్ద రాజు గాంధీ కిందపడి మృతి చెంది ఉన్నాడు. వెంటనే మృతుడి కుటుంబీలకు, పరిశ్రమ యజమానికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి పరిశీలించారు. అనారోగ్యంతో మృతి చెందాడని మృతుడి కుమారుడు శివరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మట్టి పరీక్ష.. పంటకు రక్ష
● భూసార పరీక్షలు చేయిస్తేనే అధిక దిగుబడి ● అవసరం మేరకు ఎరువులు వాడితేనే మేలు ● రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు చిన్నకోడూరు(సిద్దిపేట): పంటలు సాగు చేసే రైతులు మేలైన దిగుబడి సాధించాలంటే భూమి సారవంతంగా ఉండాలి. అయితే ఏ భూమిలో ఎంత మేరకు పోషకాలున్నాయనే విషయం భూసార పరీక్షలతోనే తేలిపోతుంది. భూములు ఖాళీగా ఉన్నందున భూసార పరీక్షలకు ఇదే సరైన సమయమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ మట్టి నమూనాల సేకరణ, పరీక్షల ఆవశ్యకతను వివరిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మండలంలో 5,391 మట్టి నమూనాలు సేకరించినట్లు ఏఓ జయంత్ కుమార్ తెలిపారు. 2 నుంచి 3 ఏళ్లకోసారి చేయించాలి నేలలో అనేక పోషకాలు ఉంటాయి. కానీ పంటల దిగుబడి కోసం వ్యాపారులపైనే ఆధారపడుతున్న పలువురు రైతులు అదనంగా సేంద్రియ, రసాయనిక ఎరువులను వాడుతున్నారు. తద్వారా సాగు ఖర్చు పెరగడమే కాక నేల తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఇలా జరగొద్దంటే ప్రతీ రైతు 2 నుంచి 3 ఏళ్ల కోసారి భూసారాన్ని తెలుసుకోవాలి. తద్వారా అవసరమైన ఎరువులు వాడితే ఫలితం ఉంటుంది. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలిసిపోతుంది. సమస్యాత్మకమైన భూములు ఉంటే వాటిని సవరించుకునే విధానాలు తెలుసుకోవచ్చు. ఫలితాల ఆధారంగా.. భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. భూసార పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ల లభ్యతను తెలుసుకునే వీలు ఉంటుంది. దీని ద్వారా అవసరమైన మోతాదులో ఎరువుల వినియోగానికి అవకాశం ఉంటుంది. రైతులు భూమిని కాపాడుకునేందుకు మట్టి పరీక్షలు తప్పక చేయించుకోవాలని సూచిస్తున్నారు. భూసార పరీక్షలతో మేలు.. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు తమ భూమిలో భూసార పరీక్షలను ప్రతీయేటా చేయించుకోవాలి. భూమికి కావాల్సిన పోషక విలువలు తెలసుకోవచ్చు. ఆపై అవసరమున్నంత ఎరువులను ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. – జయంత్ కుమార్, ఏఓ, చిన్నకోడూరు -
తల్లిని వేధిస్తున్నాడనే యువకుడి హత్య
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులుజహీరాబాద్: తన తల్లిని తరచూ ఫోన్లో వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇద్దరు నిందితులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం చిరాగ్పల్లి పోలీసు స్టేషన్లో హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు. మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామానికి చెందిన అబ్బస్అలీ ఆటో నడుపుతూ జీవినం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఖలీషా అనే వ్యక్తి తల్లిని అబ్బాస్‌అలీ తరచూ బూతులు తిడుతుండేవాడు. ఫోన్ చేసి చేసి వేధించేవాడు. ఈ విషయమై ఖలీషా పలుమార్లు అబ్బాస్ ను హెచ్చరించాడు. అయినా వేధింపులు మానుకోలేదు. ఇదే విషయాన్ని ఖలీషా తన స్నేహితుడు మహతాకు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి అబ్బాస్అలీని చంపాలనుకున్నారు. 6న అబ్బాస్‌అలీ గ్రామ శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నాడని తెలిసింది. ఖలీషా, మహతాబ్‌లు మారణాయుధాలతో మోటారుసైకిల్‌పై వెళ్లి అబ్బాస్‌పై దాడి చేసి హత్య చేశారు. అడ్డుగా వచ్చిన అబ్బాస్ స్నేహితుడు షేక్ అబ్బాస్‌అలీ ముఖంపై బీర్ బాటిల్‌తో కొట్టి గాయపర్చారు. అనంతరం పారిపోతూ శేఖర్ అనే వ్యక్తిని దారిలో అడ్డగించి ఎయిర్ గన్, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను చూపించి బెదిరించి మోటారు సైకిల్‌ను తీసుకొ పరారయ్యారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఫుగట్నగర్లో మహతాబ్ ఇంటి వద్ద నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శివలింగం, ఎస్ఐ రాజేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి గూడ్స్ ఆటో బోల్తా
ఇద్దరికి తీవ్ర గాయాలు కొండపాక(గజ్వేల్): అదుపుతప్పి గూడ్స్ ఆటో బోల్తా పడిన ఘటన కొండపాక గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ కాజీపేట నుంచి ఆయిల్ ప్యాకెట్లను లోడ్ చేసుకొని గూడ్స్ ఆటో హైదరాబాద్‌లోని నాగోల్‌కు వెళ్తుంది. కొండపాక శివారులోని మెదక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద అదుపుతప్పి రాజీవ్ రహదారిపై పల్టీ కొట్టి బోల్తా పడింది. ఆటోలో ఉన్న రామకృష్ణ, డ్రైవర్ నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పట్టపగలే ఇంట్లో చోరీ నంగునూరు(సిద్దిపేట): పట్ట పగలే దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం వెంకటాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రేకులపల్లి శ్యామల ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.15 వేల నగదు, రెండున్నర తులాల బంగారం దోచుకెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న శ్యామల దొంగతనం జరిగినట్లు గుర్తించి రాజగోపాల్‌పేట పోలీసులకు సమాచారం అందించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ మోసం
● పలువురు నుంచి రూ.90 లక్షలు వసూలు ● నిందితుడి రిమాండ్సిద్దిపేటకమాన్: తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ పలువురు నుంచి డబ్బులు వసూలు చేసిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన చేపూరి రవికుమార్ పట్టణంలో బంగారం షాపును నిర్వహిస్తున్నాడు. కొద్ది నెలలుగా షాపునకు వచ్చే కస్టమర్లను తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ నమ్మిస్తున్నాడు. సుమారు 25 మంది బాధితుల నుంచి రూ.90 లక్షల వరకు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇచ్చిన వారికి రవి బంగారం ఇవ్వడం లేదు. పట్టణానికి చెందిన అంబడిపల్లి భాస్కర్ పలు విడతలుగా రూ.7 లక్షలు, జక్కుల కుంటయ్య నుంచి రూ.6.9 లక్షలు, వెంకటభాస్కరరావు నుంచి రూ.9 లక్షలు రవి తీసుకొని బంగారం, డబ్బులు ఇవ్వలేదని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది కనకరాజు, అజయ్, స్వామి నిందితుడైన రవికుమార్‌ను పట్టణంలోని అతడి దుకాణం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ధాన్యం దళారుల పాలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తోటపల్లి గ్రామానికి చెందిన రాంగోపాల్‌రావు. వారం రోజుల కిందట వరి కోసి నాలుగు ట్రాక్టర్లలో 50 క్వింటాళ్ల ధాన్యం మిల్లుకు తీసుకుపోయిండు. వ్యాపారులు తాలు సాకు చూపి క్వింటాల్‌కు 5 కిలోల ధాన్యం కోత పెట్టారు. 50 క్వింటాళ్లకు 2.5 క్వింటాల్లు కోత పెట్టడంతో రూ.4,500 నష్టం జరిగింది. అలాగే ప్రభుత్వ మద్దతు క్వింటాల్‌కు రూ.2,320 ఉంటే వ్యాపారులు మాత్రం రూ.1,800కి కొన్నారు. ఇందులోనూ రూ.500 వ్యత్యాసంతో 50 క్వింటాళ్లకు రూ.25,000 నష్టం పోయాడు. అనంతరం హమాలీ ఖర్చుల కింద క్వింటాల్‌కు రూ.40 చొప్పున 50 క్వింటాళ్లకు రూ.2,000 తీసుకున్నారు. మొత్తంగా 50 క్వింటాళ్ల ధాన్యం అమ్మితే రూ.31,500 నష్టపోయాడు. డబ్బులకు 12 రోజులు వాయిదా పెట్టారు. ఇది ఒక రాంగోపాల్‌రావు కష్టమే కాదు మిల్లుకు ధాన్యం తీసుకొచ్చే ప్రతీ రైతులందరిది ఇదే పరిస్థితి.చర్యలు తీసుకోవాలి రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు. మిల్లులను తనిఖీ చేసి రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం పరిశీలించాల్సి బాధ్యత లేదా.? అధికారులు వ్యాపారులు ఇచ్చే ముడుపులకు ఆశపడితే రైతులు దోపిడీ గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అక్కడే రైతులు ధాన్యం అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలి. దోపిడీ చేసే వ్యాపారులపై చర్యలు తీసుకోకపోతే మిల్లుల ముందు రైతులతో ఆందోళనకు దిగుతాం. – మల్లికార్జున్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు అధికారులతో తనిఖీలు చేయిస్తాం రైతులు పచ్చివడ్లు అమ్ముకోవద్దు. గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ము కోవాలని చెబుతున్నాం. కొందరు రైతులు ఆరబెట్టడం ఏంటని చేనులోనే వరి కోసిన వెంటనే మిల్లుకు తీసుకుపోతున్నారు. వ్యాపారులకు ఇది వరకే చెప్పాం. రైతుల ధాన్యం కొనుగోలు చేయొద్దని ఒక వేళ చేస్తే మద్దతు ధర చెల్లించాలని చెప్పినాం. తూకములో మోసం గురించి అధికారులతో తనిఖీ చేయించి చర్యలు తీసుకుంటాం. – టీ.తిరుపతిరెడ్డి, మార్కెట్ చైర్మన్,హుస్నాబాద్ హుస్నాబాద్‌రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. రైతులకు ధర తక్కువగా చెల్లించి నిలువునా దోచుకుంటున్నారు. వరి కోసం మిల్లులకు ధాన్యం తెచ్చిన తర్వాత ధాన్యం పచ్చిగా ఉందని, తాలు సాకు చూపించి క్వింటాల్ రూ.100 కోత పెడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320లు ఉంటే వ్యాపారులు రూ.1760కే కొనుగోలు చేసి క్వింటాల్‌కు రూ.560 లాభం పొందుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొస్తే మిల్లులోని వే బ్రిడ్జి పై ధాన్యం తూకం వేస్తారు. బయటి వే బ్రిడ్జిలకు మిల్లుల వే బ్రిడ్జిలకు 10 నుంచి 20 కిలోల వ్యత్యాసం చూపిస్తుందని రైతులు వాపోతున్నారు. మార్కెటింగ్ అధికారులు ఎప్పుడు మిల్లుల వే బ్రిడ్జిలను తనిఖీ చేయరు. రైతుల ఫిర్యాదు మేరకు మిల్లులకు వచ్చిన అధికారులు ముడుపుల ఆశ చూపించి పంపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 29 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 19 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు లేని రైతులు దళారులను ఆశ్రయించడంతో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. శనివారం రోజు గోమాత కాటన్ మిల్లులో ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకు ధర చెల్లింపులో కోతలు పెట్టడంతో ఆగ్రహించి ఆందోళనకు దిగారు. రైతులను శాంతింప చేసిన వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1800లు చెల్లించడంతో రైతులు అందోళన విరమించారు. పత్తి మిల్లులో ధాన్యం కొనుగోలు చేయరాదు. పార బాయిలర్ మిల్లులోనే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం బోగస్ రైతుల పేరున ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి లాభాలను పొందుతున్నారు. తూకంలో మోసం, ధరలో వ్యత్యాసం క్వింటాల్‌కు రూ.500ల తేడా తాలు సాకుతో క్వింటాల్‌కు 5 కిలోలు కోత విధిస్తున్న వైనం రైతులను నిలువునా ముంచుతున్న వ్యాపారులు క్షేత్రస్థాయిలో గమనించని అధికారులుపత్తి అమ్మిన రైతుల పేరునే ధాన్యం అమ్మకాలు -
చివరికి బుగ్గిపాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటంతా విద్యుదాఘాతంతో బుగ్గి పాలైంది. ఈ ఘటన అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన తొందూరు ఎల్లయ్య వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఏర్పడిన షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో 30 గుంటల వరి పంటంతా కాలిపోయింది. పైపులు, బోరు మోటారు, 100 మీటర్ల సర్వీస్ వైర్, తదితర వస్తువులు కాలిపోయ్యాయి. సమాచారం అందుకు న్న ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పేశాడు. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లి నట్లు రైతులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని కోరారు. విద్యుదాఘాతంతో 30 గుంటల వరి దగ్ధం పైపులు, మోటార్ కాలిబూడిద రూ. 3 లక్షల వరకు నష్టం -
నాణ్యమైన సన్న బియ్యమివ్వాలి
సింగూరు కాల్వలకు సింగారంసంగారెడ్డి జోన్: నాణ్యతతో కూడిన సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని మూడవ వార్డులో కిట్టు, స్వప్నల ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలసి కలెక్టర్ భోజనం చేశారు. సన్న బియ్యం పంపిణీతో తమ కుటుంబం సంతోషంగా ఉందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేషన్ షాపును పరిశీలించి, సన్న బియ్యం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 846 రేషన్ షాపులకు గాను 3లక్షల,78 వేల728 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,999 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం నాణ్యత లేక పోవటంతో రీసైక్లింగ్ చేయడం, ఇతరులకు అమ్మడం జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు తగిన వసతులు కల్పించాలి వయో వృద్ధులకు తగిన వసతులు సమకూర్చాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వృద్ధాశ్రమం, బాల రక్షాబంధన్‌ను ఆమె సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేయనున్న జనరిక్ మెడికల్ షాపు స్థలాన్ని, ఐకేపీ మహిళల పెట్రోల్ బంక్‌ను కూడా పరిశిలించారు. వృద్ధాశ్రమంలో అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించి అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి వనజా రెడ్డి, డీఈ దీపక్, డీసీపీఓ రత్నం, ఎఫ్ఆర్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న దివ్యాంగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో దివ్యాంగుల ప్రజావాణి నిర్వహించారు. ఈ మేరకు 23 వరకు అర్జీలు వచ్చాయి. సదరం సర్టిఫికెట్, రెన్యూవల్ కోసం సంబంధిత దివ్యాంగులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సదరం క్యాంపులో స్లాట్ బుకింగ్ కోసం మొబైల్ యాప్‌లో సిటిజన్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. నెలలో రెండుసార్లు సదరం స్లాట్ బుకింగ్, నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధూరి, వైద్యారోగ్య శాఖ, డీఆర్డీఏ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుల్కల్(ఆందోల్): సింగూరు కాల్వలకు సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. పనులు దక్కి ంచుకున్న కాంట్రాక్టర్ మొదట కాల్వల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి కొలతల ప్రకా రం మట్టిని తీసేశారు. కాల్వలకు కాంక్రీట్ పోయడానికి వీలుగా మార్కింగ్ చేస్తున్నారు. దశాబ్దం క్రితం నుంచి సాగునీరు అందిస్తున్న కాల్వలకు నీటి పారుదలశాఖ అధికారులు ఇప్పటివరకు మరమ్మతు లు చేయలేదు. దీంతో కాల్వల్లో మట్టి పేరుకుపోయి ముళ్లకంప మొలిచింది. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకొని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేయడానికి నిధులు మంజూరు చేశారు. రూ.169.30 కోట్లతో మరమ్మతులు సింగూరు డ్యామ్‌కు కుడి, ఎడమన 60 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ, 160 కిలోమీటర్ల మేర డైవర్షన్ కెనాల్లు ఉన్నాయి. దశాబ్దం నుంచి మరమ్మతులు చేయకపోవడంతో కాల్వల్లో పిచ్చి మొక్కలు మొలిచి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక చౌటకూర్, అందోల్ మండలాల్లోని పిల్ల కాల్వలకు నీరందడం లేదని రైతులు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు ఉండటంతో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షించి సిమెంట్ లైనింగ్ మరమ్మతులకు రూ.169.30 కోట్లు మంజూరు చేశారు. అధికారులు రూ.133.51 కోట్లకు టెండర్ ప్రక్రియ ప్రారంభించగా.. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ 4.95 ఎక్సెస్‌తో పనులు దక్కించుకున్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్ 18 నెలలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. పంటలకు క్రాఫ్ హాలిడే.. కాగా, కాల్వల్లో నీటి ప్రవాహం ఉంటే పనులకు ఆటంకం కలుగుతుందని ఆయకట్టు కింద రెండు పంటలకు సాగునీరు వదలడం లేదు. దీంతో బోరు బావులతోనే సాగు చేసుకున్నారు. సిమెంట్ లైనింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నారు.కలెక్టర్ క్రాంతి ఆదేశం లబ్ధిదారులతో కలసి భోజనం పేదలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య రూ.169.30 కోట్లతో సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభించిన గుత్తేదారు కాంక్రీట్ వేయడానికి మార్కింగ్ ఏడాదిన్నరలో పనులు పూర్తికి ఒప్పందం -
జిన్నారం ఇక బల్దియా..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కాబోతోంది. జిన్నారం మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిన్నారంతో పాటు తొమ్మిది గ్రామాలను కలిపి ఈ మున్సిపాలిటీగా ఏర్పాటు కానుంది. జిన్నారం, కొడకంచి, ఊట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకత్వ, అండూర్, జంగంపేట, మంగంపేట గ్రామాలు కలిపి కొత్త బల్దియాగా రూపాంతరం చెందనుంది. మొత్తం 17,956 మంది జనాభా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటికే ఈ మండలంలో గడ్డపోతారం గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసిన విషయం విదితమే. తాజాగా జిన్నారంను కూడా మున్సిపాలిటీగా మారుస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. జిన్నారం మొత్తం అర్బన్ మండలమే.. జిన్నారం మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన గడ్డపోతారం మున్సిపాలిటీలో ఐదు గ్రామపంచాయతీలను విలీనం చేశారు. ఇప్పుడు మిగిలిన పది గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీగా చేయడంతో ఈ మండలంలో అసలు గ్రామ పంచాయతీలే ఉండవు. దీంతో ఈ మండలం మొత్తం అర్బన్ మండలంగా రూపుదిద్దుకోనుంది. కాగా జిల్లాలో ప్రస్తుతం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిన్నారంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 13కు చేరనుంది. తీర్మానాలు చేస్తున్న జీపీల స్పెషల్ ఆఫీసర్లు ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని కోరుతూ ఆయా పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఈ గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు కలిసి ఈ తీర్మానాలు చేసి కలెక్టరేట్‌కు పంపారు. ఈ తీర్మానాల ఆధారంగా ఈ పది గ్రామాలతో కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. జిల్లాలో మరో కొత్త మున్సిపాలిటీ ప్రభుత్వానికి కలెక్టరేట్ నుంచి ప్రతిపాదనలు జిన్నారం, తొమ్మిది గ్రామాలతో కలిపి ఈ మున్సిపాలిటీ ఏర్పాటు -
ఖేడ్ తహసీల్దార్‌గా హసీనాబేగం
నారాయణఖేడ్: ఖేడ్ తహసీల్దార్‌గా హసీనాబేగం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన సి.భాస్కర్ కంగ్టి తహసీల్దార్‌గా బదిలీపై వెళ్లగా మొగుడంపల్లి తహసీల్దారుగా పనిచేస్తున్న హసీనాబేగం ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆమె ఇక్కడ బాధ్యతలను స్వీకరించగా.. డిప్యూటీ తహసీల్దార్ రాజుపటేల్ తోపాటు ఆర్ఐ మాధవరెడ్డి, కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు. డిజిటల్ భిక్షాటన నారాయణఖేడ్: భిక్షాటనను డిజిటలైజ్డ్ చేసిన అంశాన్ని సినిమాల్లో, సీరియల్స్ల్లో కామెడీ సీన్‌గానే ఇన్నాళ్లు చూశాం. కానీ అన్ని రంగాల్లో అప్డేటెడ్ అవుతున్న తరహాలోనే ఓ బిచ్చగాడు అప్డేటెడ్ అయి సినిమా సీన్‌ను నిజం చేశాడు. మహారాష్ట్రలోని బాల్కికి చెందిన శ్రీను (21) తలలో డప్పు వేసుకొని అడుక్కొంటూ డప్పు కు ఏకంగా డిజిటల్ యూపీఐ స్కానర్‌ను ఏర్పాటు చేశాడు. చిల్లర లేవని ఎవరైనా పంపిస్తే ఫోన్‌పే, లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి ధర్మం చేయడంటూ కోరుతున్నాడు. సంత రోజుల్లో నారాయణఖేడ్, శంకర్పల్లి, జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్, బీదర్, ఉద్గీర్ తదితర పట్టణాల్లో భిక్షాటన చేస్తానని తనకు నిత్యం రూ.800కు పైగా గిట్టు బాటు అవుతుందని తెలిపాడు. డిజిటల్ బెగ్గింగ్‌ను చూసి వ్యాపారులు నవ్వుకుంటూ యూపీ ఐ స్కాన్ చేసి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు. మూల్యాంకనంపై ఆరా రామచంద్రపురం (పటాన్చెరు): రామచంద్రపురం పరిధిలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలు జరుగుతున్న పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంగళవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఈవీ నరసింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కృష్ణారావు అధికారులు సందర్శించారు. మూల్యంకన కేంద్రంలోని బోధన, బార్ కోడింగ్ గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ లింభాజీ పాల్గొన్నారు. డీకే అరుణను కలిసిన రైతు హక్కుల నేతలు జహీరాబాద్: పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను జహీరాబాద్‌కు చెందిన రైతు హక్కుల సాధన సమితి నాయకులు, వక్ఫ్ భూ బాధిత రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం రాత్రి డీకే అరుణను ఆమె నివాసంలో కలిశారు. ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు పాస్ అయిన సందర్భంగా ఆమెకు స్వీటు తినిపించారు. జేపీసీ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమె రైతుల తరఫున తగిన సమాచారం సేకరించి కమిటీకి అందజేశారు. రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వైభవంగా జోగినాథ రథోత్సవం జోగిపేట (అందోల్): జోగిపేటలో జోగినాథ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది. ఐదు అంతస్తులలో నందీశ్వరుడు, గణపతి, శివలింగం, దుర్గామాత, జోగినాథ స్వామి దివ్యమూర్తులను ఏర్పాటు చేశారు. మొదటగా గౌనిచౌరస్తాలో సంప్రదాయాల ప్రకారం జోగినాథ రథోత్సవ కమిటీ అధ్యక్షుడు శివశంకర్, కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఎన్నాళ్లీ తిప్పలు
కుప్పలు తెప్పలుఇతర శాఖల దరఖాస్తుల వివరాలు శాఖ పేరు మొత్తం పరిష్కారం పెండింగ్‌లో దరఖాస్తులు అయినవి ఉన్నవి రెవెన్యూ 835 317 518 మున్సిపల్ 149 0 149 ఎంపీడీఓ 89 19 70 డీఆర్డీఓ 36 11 25 హౌసింగ్ కార్పొరేషన్ 32 12 20 జిల్లా పంచాయతి 20 10 10 సర్వే ల్యాండ్ రికార్డ్స్ 12 6 6 పోలీస్ శాఖ 45 5 40 వైద్య ఆరోగ్యం 16 11 5 కాలుష్యం 6 2 4 ఇతరములు 226 136 90 మొత్తం 1,466 529 937సంగారెడ్డిజోన్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నా యే తప్ప అవి పరిష్కారానికి మాత్రం నోచుకోవడంలేదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో అధికారలు అర్జీలను స్వీకరిస్తున్నారు. వచ్చిన వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తున్నా.. మిగతావి మాత్రం పెండింగ్‌లోనే ఉండటంతో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎనిమిది నెలల్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 1,466మంది ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. అందులో 529 సమస్యలు పరిష్కరించగా.. 937 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కటీ పరిష్కారం కాలేదు.. జిల్లాలోని మున్సిపల్ పరిధిలో వచ్చిన అర్జీలు ఒకటి కూడా పరిష్కారం కాలేదని గణాంకాల బట్టి తెలుస్తుంది. అందోల్–జోగిపేట 8, అమీన్పూర్లో 84, సంగారెడ్డిలో 22, తెల్లాపూర్‌లో 17, జహీరాబాద్‌లో 11, సదాశివపేటలో 6, బొల్లారంలో ఒకటి చొప్పున అర్జీలు రాగా.. అధికారులు వీటన్నింటినీ పరిష్కారం చూపక పెండింగ్‌లోనే ఉంచారు. వచ్చిన వారే మళ్లీ వస్తూ... తమ సమస్యలు పరిష్కా రం కాకపోవటంతో వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా, డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే ప్రధాన సమస్యలు ప్రజావాణిలో సుమారు 50కి పైగా శాఖలకు సంబంధించిన అర్జీలు వస్తుంటాయి. ప్రధానంగా ధరణిలో భూ వివరాలు లేకపోవటం, పట్టాపాసు పుస్తకం లేదని, డబుల్ రిజిస్ట్రేషన్, ఉన్న భూమి కంటే ఎక్కువ గా, తక్కువగా చూపించటం, పింఛన్ ఇప్పించాలని, రైతుబంధు రావటం లేదని, ఉపాధి కల్పన, రహదారుల మరమ్మతులు, భూముల సర్వే, వేతనాలు రాకపోవటం, ఇళ్ల మంజూరు, మిషన్ భగీరథ, పౌరసరఫరాలు, పంచాయతీశాఖ, మున్సిపల్‌తోపాటు తదితర శాఖలపై ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. పరిష్కారం చూపని ప్రజావాణి పెండింగ్‌లో 937 అర్జీలు రెవెన్యూ సమస్యలే అధికం కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు -
మరో తహసీల్దార్‌పై చర్యలకు రంగం సిద్ధం
● రూ.40 కోట్ల భూమి విషయంలోజిమ్మిక్కులు! ● కొనసాగుతున్న అంతర్గత విచారణ ● ఇటీవల కొండాపూర్ తహసీల్దార్‌పై బదిలీ వేటు, ఆర్ఐ సస్పెన్షన్.. ● ముడుపుల కోసం అడ్డదారులుతొక్కుతున్న అధికారులు ● చర్చనీయాంశంగా తహసీల్దార్ల వ్యవహారాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కొందరు రెవెన్యూ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముడుపులిస్తే చాలు తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగే వారే లేరన్నట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ శాఖ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కో ఎకరం భూమి రూ.కోట్లలో పలుకుతోంది. ఇది ఇలాంటి అక్రమార్కులకు వరంగా మారింది. నిబంధనల ప్రకారం పనిచేయాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఆయా భూమి మార్కెట్ విలువ ఎంతుంటుందో అదే స్థాయిలో వీరికి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఇక నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సిన పనులు వస్తే చాలు వీరి పంట పండుతోంది. రూ.లక్షల్లో ముడుపులు దండుకుంటున్నారు. ఒకటీ రెండు వ్యవహరాలు బెడిసికొట్టి బయటకు వస్తే...ఇలా బదిలీ వేటులు, సస్పెన్షన్లతో సరిపోతోంది. ఈ వ్యవహరం సద్దుమణిగాక తిరిగి పోస్టింగ్‌లు పొందుతుండటం రెవెన్యూశాఖలో పరిపాటిగా మారింది. తహసీల్దార్ల బదిలీల్లోనూ ఇంతే.. ఇటీవల జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు జరిగిన విషయం విదితమే. తమకు అనుకూలమైన మండలాలు, భూముల ధరలు ఎక్కువగా ఉన్న మండలాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువగా ఉన్నవి, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న మండలాల్లో పోస్టింగ్‌ల కోసం కొందరు తహసీల్దార్లు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకున్నారు. పట్టున్న మండలాలకు వెళితే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే కారణంగా వీరు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇదిలా ఉండగా అయితే కొండాపూర్ మండలంలో జరిగిన పట్టా భూమి పౌతీ విషయంలో అధికారుల జిమ్మిక్కులు బయటకు రావడంతో సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టారు. ఇలా బయటకు రాకుండా లోలోపల జరిగిన అనేక భూ వ్యవహరాలపై షోకాజ్ నోటీసులు, మెమోలతో సరిపెడుతున్న వ్యవహరాలు అనేకం ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రంజోల్ గ్రామంలో పీఆర్ఏ
పటం ద్వారా పంటల సాగుపై రైతులకు అవగాహన జహీరాబాద్: భాగస్వామ్య గ్రామీణ అనుభవ కార్యక్రమం(పీఆర్ఏ)లో భాగంగా కొండాలక్ష్మణ్ ఉద్యాన కళాశాల విద్యార్థినులు మండలంలోని రంజోల్ గ్రామాన్ని సందర్శించారు. నెలరోజులుగా విద్యార్థినులు రైతుల పొలాల వద్దకు వెళ్లి సాగు మెళకువలు నేర్చుకున్నారు. సోమవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామం రూపురేఖలను, సాగు చేసే పలు రకాల పంటల వివరాలను రంగులతో ముగ్గుల రూపంలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ కార్యాలయాలు, మందిరాలు, చర్చి, మసీదులతోపాటు పలు అంశాలను గుర్తించారు. అనంతరం పంటలసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రదీప్‌కుమార్, రైతులు విద్యార్థినులు కాత్యాయని, మహాలక్ష్మి, వర్ష, మేఘన, సంధ్య, యామిని, యశస్విని, మాధురి, రవీనా, జ్యోతి, నవ్య, ప్రియాంక, రేచల్, సాయి లేఖన, సబిహా, స్నేహ,వర్షిత, స్వప్న, శ్రీజ, తనయ, సంస్కృతి, ఫిలోమిన, మానస, శిరీష పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
నారాయణఖేడ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రమాదంలోపడ్డ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ మండలం పైడిపల్లి గ్రామంలో జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్‌లో భాగంగా సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాలు, కులాలకు చెందిన పార్టీ అని అన్నారు. దేశస్వాతంత్య్రం కోసం పోరాడిన, రాజ్యాంగాన్ని రచించిన మహాత్ములపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద వర్గాల అభ్యున్నతికి చాలా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని మండిపడ్డారు. అందువల్లే కోపం వచ్చిన రాముడు అయోధ్యలో బీజేపీని గెలవకుండా చేశాడని పేర్కొన్నారు. పైడిపల్లిలో కమ్యూనిటీ భవనానికి రూ.5లక్షలు తన నిధులనుంచి ఇస్తానని ఎంపీ తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్లో సీసీరోడ్లు... సీసీ రోడ్డు, మురుగు కాల్వలు ఎన్ఆర్ఈజీఎస్లో మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. జగన్నాథ్ పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమ ఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి ధనలక్ష్మి, టీపీసీసీ సభ్యులు కర్నెశ్రీనివాస్, యువజనకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, తాహెర్‌అలీ, వినోద్‌పాటిల్, రమేశ్ చౌహన్, పండరీరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కేతకీ ఆలయాభివృద్ధికి కృషి
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ హామీనిచ్చారు. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఆలయంలో నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయన గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ...ఆలయానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి పాటుపడతానన్నారు. అభివృద్ధి జరిగితేనే మరింతగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా పాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రావు పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, నాయకులు శంకర్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామ్ లింగారెడ్డి, ఉదయ్ శంకర్ పాటిల్, రాకేష్ షెట్కార్, నరేష్‌గౌడ్, తన్వీర్, తదితరులు పాల్గొన్నారు. చైర్మన్‌తో పాటు మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం ఆలయ ఆవరణలో పాలకమండలి చైర్మన్‌గా ఈదులపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో పాటు సభ్యులుగా మల్లికార్జున్, నవాజ్ రెడ్డి, లక్ష్మయ్య, మల్లప్ప, శివకుమార్, శ్రీనివాస్, తిరుమలేశ్, మల్శెట్టి, లక్ష్మీ, విట్టల్‌రెడ్డి కోఆప్షన్ సభ్యుడిగా బసయ్య స్వామి ప్రమాణం చేశారు. మతసామరస్యానికి ప్రతీక ఈద్ మిలాప్ జహీరాబాద్ టౌన్: మతసామరస్యానికి ఈద్ మిలాప్ ప్రతీకని జహీరాబాద్ ఎంపీ.సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో మాజీ సొసైటీ చైర్మన్ సయ్యద్ రియాజ్ సోమవారం నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...రంజాన్ అనంతరం నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని కులాల మతాల పెద్దలు, ప్రజలు హాజరుకావడం అభినందనీయమన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ...కుల మతాలకతీతంగా ఈద్ మిలాప్ ద్వారా కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ తన్వీర్, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు రాంలింగారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం -
ఎంఆర్ఐ,సీటీ స్కాన్లను ఏర్పాటు చేయండి
ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సంగారెడ్డి రూరల్: సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటుతో పాటు వైద్య సిబ్బందిని పెంచాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ కు ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్రతో కలసి ఫోరమ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ.. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కి అనుబంధం కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న స్కానింగ్ యంత్రాలు, సిబ్బంది సేవలు, ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపోవడం లేదని వివరించారు. 13న లింగాయత్సమాజ్ సమావేశంనారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని బసవ మండపంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు తాలుకా స్థాయి లింగాయత్ సమాజ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు తాలుకా లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు ఆనంద్ స్వరూప్ షెట్కార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని బసవేశ్వర్ చౌక్‌లో సంఘసంస్కర్త బసవేశ్వరుడి నూతన విగ్రహం ఏర్పాటు కోసం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
డ్రోన్లతో అదనపు ఆదాయం
కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డిజోన్: మారుతున్న పోటీ ప్రపంచంలో మహిళా సభ్యులకు సాధికారత కల్పించేందుకు వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగంతో మహిళలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో నమో డ్రోన్ దీదీ, కిసాన్ డ్రోన్ ఆపరేటర్ శిక్షణపై హెటిరో, సింక్రో, ఫ్లయింగ్ వెడ్జ్, కంపెనీల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మహిళల శక్తికి సాంకేతికత కూడా తోడైతే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు డ్రోన్ శిక్షణను రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలోనే ప్రారంభించామని తెలిపారు. ఈ శిక్షణను క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ లేదా సీ్త్రనిధి ద్వారా మహిళలకు త్వరితగతిన రుణాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో జ్యోతి, అదనపు డీఆర్డీవో జంగారెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు హేటిరో హెడ్ సుధాకర్, సింక్రో సర్వీస్ విభాగాధిపతి నరసింహ, ఎయిరోస్పేస్ విభాగాధిపతి విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా పటాన్చెరు: గూడెం
పటాన్చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామ పరిధిలోని ఎంక చెరువులను రూ.10.78 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు చెరువుల వద్ద సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు ముత్తంగి పరిధిలో ప్రజలకు ఆహ్లాద కేంద్రాలుగా ఉండేందుకు చెరువులను సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు. ప్రతీ చెరువుకట్టపై సెంట్రల్ లైటింగ్ సిస్టం, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్ఎండీఏ చెరువుల విభాగం డీఈ రామకృష్ణ పాల్గొన్నారు. పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యంఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పేదల కడుపు నింపేందుకే ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నాగల్గిద్ద మండలం దామర్గిద్ద గ్రామంలోని సోమ వారం దళిత కుటుంబంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారుడి ఇంట్లో కుటుంబ సభ్యుల తో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. లబ్ధిదారుడికి పంపిణీ అయిన బియ్యం నాణ్యత గూర్చి అడిగి తెలుసుకున్నారు. పేదల కష్టాలు తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పథకాలు చేపడుతుందని అన్నారు. అనంతరం ఖేడ్ మండలం రుద్రారం, పైడిపల్లి, పంచగామ తదితర గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేపట్టారు. ఖేడ్ బస్సుడిపో సమీపంలోని పద్మశాలికాలనీలో రూ.10 లక్షలతో సీసీరోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వినోద్‌పాటిల్, దారం శంకరన్, షెట్టి చంద్రశేఖర్, పంతంగి రమేశ్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు.పాలిసెట్‌కు దరఖాస్తులు ఆహ్వానంసంగారెడ్డి టౌన్: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకి దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. www.poycet.sbtet.telangana. gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ‘స్పాట్’కు రాలేదని మెమోలుసంగారెడ్డి ఎడ్యుకేషన్: పదవ తరగతి స్పాట్ వ్యాల్యూషన్ కేంద్రంలో సోమవారం విధులకు హాజరు కానీ 180 మంది స్పెషల్ అసిస్టెంట్లకు మెమోలు జారీ చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. నేటి వరకు రిపోర్టు చేయని పక్షంలో అసిస్టెంట్లకు సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తామన్నారు. హనుమాన్ జయంతికరపత్రం ఆవిష్కరణజహీరాబాద్టౌన్: జహీరాబాద్ పట్టణంలో ఈ నెల 12న నిర్వహించనున్న హనుమాన్ జయంతి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆవిష్కరించారు. జహీరాబాద్ పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. చిత్రంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ -
నెత్తిన బండ
ఆదాయం ఫుల్.. వట్పల్లి గ్రామ పంచాయతీకి ఆదాయం దండిగా ఉన్నా గ్రామసంతలో మాత్రం వసతులేమితో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వివరాలు 9లో u● ఒక్కో గ్యాస్ సిలిండర్ రూ.50 పెంపు ● రూ.855 నుంచిరూ.905లకు చేరిన ధర ● వినియోగదారులపైరూ.2.83కోట్ల అదనపు భారంసంగారెడ్డి జోన్: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. కేంద్రం ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ. 50లు పెంచింది. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ సిలిండర్ రూ.855 ఉండగా రూ.50లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ.905లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 35 ఏజెన్సీలు ఉండగా గ్యాస్ కనెక్షన్లు 5.66లక్షలు పైగా ఉన్నట్లు సమాచారం. దీంతో కుటుంబాలపై ప్రతీ నెల దాదాపుగా రూ.2.83కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ పెంపు ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్లకు సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద మధ్య తరగతి కుటుంబాలకు రూ.500లకు సిలిండర్‌ను అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను మహాలక్ష్మి లబ్ధిదారులది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ.500లకు అందజేస్తున్న సిలిండర్ ధరను సైతం రూ.550లకు పెంచడంతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఈ పెంపు వర్తింపజేస్తుందా లేదా అనే నిర్ణయం తీసుకోలేదు. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ పెంపు ప్రభావం తెలంగాణ ప్రభుత్వంపై భారీగానే పడనుంది. -
‘నారింజ’కు జలకళ
● వేసవిలోను నీటితో తొణికిసలాడుతున్న ప్రాజెక్టు ● పెరిగిన భూగర్భజలాలు జహీరాబాద్ టౌన్: వేసవికాలం ప్రారంభమైనప్పటికీ జహీరాబాద్ ప్రాంతంలోని నారింజ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భూగర్భజలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బోరు బావులు నిండుగా నీరు పోస్తున్నాయి. బోరు బావుల కింద ఉన్న పంటలు పచ్చగా కనిపిస్తున్నాయి. శాశ్వత నీటి వనరులు లేనందున ఈ ప్రాంత రైతులు బోరు బావులపై ఆధారపడి పంటల పండిస్తున్నారు. చెరువులు లేనందున వేల రుపాయలు ఖర్చు చేసి బోరు తవ్వించి పంటలు పండిస్తుంటున్నారు. అయితే అనావృష్టి వల్ల 500 అడుగుల లోతు ఉన్న బోర్లలో కూడా నీరు ఇంకిపోయే పరిస్థితులు ఉండేవి. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. వేసవిలోనూ రైతులు హాయిగా పంటలు పండించుకుంటున్నారు. కాలువలు దెబ్బతినడంతో.. పంటల సాగు కోసం నిర్మించిన నారింజ ప్రాజెక్టు పలు కారణాల వల్ల ఊట చెరువుగా మారింది. ప్రాజెక్టు ఎడుమ, కుడి కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో గేట్లు మూసి నీటిపారుదల శాఖ అధికారులు నీటిని నిలువ ఉంచడం ప్రారంభించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నారింజ ప్రాజెక్టు గేట్లు దెబ్బతినడంతో లీకేజీతో నీరు ఖాళీ అయ్యేది. ప్రాజెక్టులోని నీరంతా వృథాగా కర్ణాటకకు తరలిపోయేది. దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతూ వస్తున్నారు. అప్పటి కలెక్టర్ హన్మంత్‌రావు స్పందించి ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించి పేరుకుపోయిన పూడిక మట్టిని తీయించారు. అప్పటి నుంచి గేట్ల నుంచి లికేజీలు బంద్ అయ్యాయి. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టులో నీరు చేరి జలకళ సంతరించుకుంది. భూగర్భ జలాలు పెరిగి కొత్తూర్(బి), మల్కాపూర్, బూచినెల్లి, బుర్దిపాడ్, సత్వార్, రేజింతల్, అల్గోల్, మిర్జాపూర్(బి) తదితర గ్రామాల పరిధిలోని బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. బోరు బావుల్లో నీరు ఉండటంతో వాణిజ్య పంటలైన చెర కు, అల్లం, కూరగాయాలను రైతులు పండిస్తున్నారు. -
వన్యప్రాణుల దాహార్తి తీరేలా..
● అటవీ ప్రాంతంలో నీటి తొట్లు ఏర్పాటు ● 15 రోజులకు ఒకసారి నీటిని నింపుతున్న అధికారులు ● సీసీ కెమెరాలతో జంతువుల కదలికలు నమోదు ● దుబ్బాక రేంజ్ పరిధిలో 16,326 ఎకరాల అడవి విస్తీర్ణందుబ్బాకటౌన్: మండుతున్న ఎండలతో అడవుల్లో నీటి జాడ లేక వన్య ప్రాణులు అలమటిస్తున్నాయి. తాగు నీటి కోసం వణ్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో వాటి రక్షణకు దుబ్బాక అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆరు నెలలుగా వర్షాలు లేక అటవీ ప్రాంతంలోని నీటి జాలు గుంతలన్నీ వట్టి పోయాయి. దీంతో అడవి జంతువులకు తాగునీరు దొరకడం కష్టంగా మారింది. వాటి దాహాన్ని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన నీటి తొట్లలో అటవీ శాఖ అధికారులు నీటిని నింపుతున్నారు. దుబ్బాక రేంజ్‌లోని ఫారెస్టులో 28 నీటి తొట్లు ఏర్పాటు చేశారు. 15 రోజులకు ఒక్కసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఆ నీటితోనే జంతువులు, పక్షులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. 16,326 ఎకరాల అడవి దుబ్బాక రేంజ్ పరిధిలో దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్పేట భూంపల్లి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, సిద్దిపేట రూరల్ పరిధితో కలుపుకొని 16,326 ఎకరాల అడవి విస్తీర్ణం ఉన్నట్లు అధికారు లు చెబుతున్నారు. అడవిలో దుప్పిలు, చిరుత పు లులు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు, అడవి పందులు, నక్కలు, అడవి గొర్రెలు, కుందేళ్లు ఇలా పలు రకాల జంతువులు సంచరిస్తున్నాయి. కెమెరాలకు చిక్కిన జంతువుల ఫొటోలు నీటి తోట్ల పరిసర ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలను సైతం అమర్చారు. నీరు తాగేందుకు వచ్చే పక్షులు, జంతువులు చిత్రాలు కెమెరాల్లో నమోదవుతున్నాయి. కెమెరాల నుంచి ఫొటోలను డంప్ చేసుకొని వాటి బాగోగులను, ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జీవాల రక్షణకు చర్యలు వేసవిలో అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు సాసర్ పిట్లలో నీటిని నింపుతున్నాం. దుబ్బాక రేంజ్ పరిధిలో వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –సందీప్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, దుబ్బాక -
మద్యం మత్తులో ఉరేసుకొని ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం మేరకు.. నర్సాపూర్ పట్టణంలోని చైతన్య పూరి కాలనీకి చెందిన మల్లెపూల వెంకటేశ్ మద్యానికి బానిసై తరచూ భార్య సంతోష, ఇతర కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించి మళ్లీ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. సోమవారం తెల్లవారు జామున ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో మహిళ చిన్నశంకరంపేట(మెదక్): కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండలం వల్లూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం మేరకు.. వల్లూర్‌కు చెందిన డోడ్లె సురేశ్‌కు వెల్దుర్తి మండ లం బండపోసాన్‌పల్లి గ్రామానికి మౌనిక(30)తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మౌనిక స్థానికంగా ఉన్న పరిశ్రమలో పనికి వెళ్తుండగా సురేశ్ వ్యవసాయం, ఉపాధి కూలీ పనులు చేస్తుంటాడు. కొద్ది రోజులు గా పరిశ్రమలో పనికి వెళ్లొద్దని దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం పరిశ్రమలో పనికి వెళ్లొద్దని సురేశ్ భార్యకు చెప్పి ఉపాధి పనికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పనులు ముగించుకొని ఇంటికొచ్చిన భర్త చూసి పోలీస్‌లకు సమాచారం ఇచ్చాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక మృతిపై తల్లి శేఖమ్మ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కామారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీస్‌ల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి–వడియారం రైల్వేస్టేషన్ల మధ్యలో కామారం తండా 226 రైల్వే గేట్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు చూసి రైల్వే పోలీస్‌లకు సమాచారం అందించారు. కామారెడ్డి రైల్వే పోలీస్ ఎస్హెచ్ఓ హనుమండ్లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే కామారెడ్డి రైల్వే పోలీస్‌లను సంప్రదించాలని కోరారు. మూర్ఛవ్యాధితో యువకుడు.. నర్సాపూర్ రూరల్: మూర్ఛ వ్యాధితో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని రుస్తుంపేటలో సోమవారం వెలుగు చూసింది. ఎస్ఐ లింగం కథనం మేరకు.. గ్రామానికి చెందిన కర్రె అనిల్ (26) 5న ఇంటి నుంచి కూలీ పనుల కోసం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. 6న పంట పొలాల వైపు వెళ్లిన గ్రామస్తులకు బురుదలో పడి అనిల్ మృతి చెంది కనిపించాడు. మూర్చ వ్యాధితో తన కుమారుడు చనిపోయాడని తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతిసిద్దిపేటరూరల్: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. సీఎం ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.18 వేలకు పెంచి, జీఓ నంబర్ 51ను సవరించాలన్నారు. అదే విధంగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం బకాయి వేతనాలకు నిధులు కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో నోటికాడి ముద్దను లాక్కున్నట్లుగా ట్రెజరీలో వేసిన చెక్కులకు ఆర్థిక శాఖ డబ్బును కేటాయించకుండా నిలిపివేయడంతో తొమ్మిది నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. కుటుంబాల పోషణ భారమై కార్మికులు అప్పుల పాలవుతున్నారన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 19 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని సమ్మె నోటీస్‌ను అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేశ్, జిల్లా నాయకులు బాకీ యాదగిరి, రాజమౌళి, కనకయ్య, బాల నర్సవ్వ, అండాలు వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
● ములుగులో ఐదుగురు, మునిపల్లిలో ఇద్దరు ● 1,040 గ్రాముల గంజాయి స్వాధీనంజాతీయ స్థాయి శిక్షణకు ముగ్గురు విద్యార్థులు ఇస్రో ఆధ్వర్యంలో యువికా–2025 శిక్షణఆరోగ్యమే మహాభాగ్యం.. ములుగు(గజ్వేల్): గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి సోమవారం గజ్వేల్ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు ములుగు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ములుగు మండలం కొట్యాల గ్రామ శివారులో కొందరు గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం అందింది. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాం. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన సారా నవీన్(21), సారా అశోక్(20), సారా సుధాకర్(23), యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోమాజిపల్లి తాండాకు చెందిన కేతావత్ సంజయ్‌కుమార్(20), మేడ్చెల్–మల్కాజిగిరి జిల్లా అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన కార్తీక్(20) గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. వెంటనే వారిని అరెస్టు చేసి 920 గ్రాముల గంజాయి, రూ.33 వేల నగదు, 2 బైక్‌లు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని గజ్వేల్ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. 120 గ్రాముల గంజాయి స్వాధీనం మునిపల్లి(అందోల్): వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఇద్దరి నుంచి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కంకోల్ శివారు 65వ నంబర్ జాతీయ రహదారి టోల్ ప్లాజా సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ చేస్తున్నాం. స్కూటీపై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మహమ్మద్ అయూబ్ అలీ, షేక్ సమీర్ 120 గ్రాముల గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశాం. బీదర్‌లోని ఇరానీ గల్లీలో ఇర్ఫాన్ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేశ్ నాయక్, పోలీస్ సిబ్బంది ఎండీ. అనీఫ్, పాండు, తుకారాం, దత్తు, సునీల్‌ను కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. దుబ్బాక: ఇస్రో ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న యువికా–2025 శిక్షణకు దుబ్బాక మున్సిపల్లోని లచ్చపేట మోడల్ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇస్రో ఈ శిక్షణకు జనవరి నెలలో దేశ వ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 350 మంది విద్యార్థులు ఎంపిక కాగా తెలంగాణ నుంచి 12 మంది ఎంపికయ్యారు. ఇందులో లచ్చపేట మోడల్ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు విద్యార్థులు హర్షవర్ధన్, కౌశిక్, సుశాంత్ ఎంపిక కావడం విశేషం. మే నెలలో 15 రోజులపాటు ఇస్రో పరిశోధన కేంద్రంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇస్రో జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికై న లచ్చపేట మోడల్ స్కూల్ విద్యార్థులను, గైడ్ టీచర్ జ్యోతిని సోమవారం ఎంఈఓ ప్రభుదాసు, ప్రిన్సిపాల్ సామలేటి బుచ్చిబాబు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. సిద్దిపేటకమాన్: ఆరోగ్యమే మహాభాగ్యమని.. ఆరోగ్యానికి మించిన సంపద ఏదీ లేదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ఆదేశాల మేరకు సిద్దిపేట కోర్టులో సోమవారం నిర్వహించిన మెడికల్ హెల్త్ క్యాంపును న్యాయమూర్తి స్వాతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారని సూచించారు. ఆహార నియమాలు పాటిస్తూ వాకింగ్, యోగా, వ్యాయామం చేయాలన్నారు. తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హెల్త్ క్యాంపులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు బీపీ, షుగర్, గుండె, గ్యాస్ట్రాలజీ సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు మిలింద్ కాంబ్లీ, చందన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి తాటికొండ రమేశ్, డాక్టర్ శ్రీకాంత్, న్యాయవాదులు పత్రి ప్రకాశ్, లక్ష్మీనారాయణ, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి స్వాతిరెడ్డి -
శివలింగం వద్ద నాగుపాము
శివ్వంపేట(నర్సాపూర్): శివలింగం వద్ద నాగుపాము గంటపాటు పడగ విప్పి ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి బిజ్లిపూర్లోని హనుమాన్ ఆలయంలోకి ఆదివారం అర్థరాత్రి ప్రాంతములో నాగుపాము ప్రవేశించింది. పడగ విప్పి గంటపాటు అక్కడే ఉంది. అదే సమయంలో అటుగా వెళ్లిన గ్రామ యువకులు నవీన్, నర్సింలు సెల్ఫోన్లో చిత్రీకరించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడని సోమవారం ఉదయం గ్రామస్తులు శివలింగంకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ముంపు గ్రామాల కార్మికులకు వేతనాలు చెల్లించండిగజ్వేల్రూరల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ.. ఆర్అండ్ఆర్ కాలనీలో ఉంటున్న ముంపు గ్రామాల పంచాయతీ కార్మికుల ఖాతాలను మూసివేయడంతో నాలుగు నెలలుగా వారికి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కార్మికుల ఖాతాలను తిరిగి పునరుద్ధరించి బకాయి వేతనాలు చెల్లించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు. యువకుడి మృతదేహం లభ్యం పటాన్చెరు టౌన్: గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్ శివారులోని మెడికల్ డివైస్ పార్క్‌లోని క్వారీ గుంతలో సోమవారం గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 22 నుంచి 27 వరకు ఉంటుందని తెలిపారు. ఛాతిపై యాదమ్మ అని పచ్చబొట్టు ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించామని, మృతుడి బంధువులు ఉంటే అమీన్పూర్ పోలీసులను సంప్రదించాలన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలపై పోతిరెడ్డిపల్లిలో నిరసనజహీరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం జరిపారు. అంబేడ్కర్‌ను కించపరిచేలా అమిత్‌షా వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కాంగ్రెస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, పార్టీ నాయకులు సుధీర్‌కుమార్, విష్ణు, మల్లన్న, ఏసు, రవీందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, షంషీర్, హాజీ, తుల్జారాం, తుల్జయ్య, సాయిలు, వీరారెడ్డి, బలరామ్, బాల్‌రాజ్, పరమేశ్ పాల్గొన్నారు.సామూహిక కుంకుమార్చన కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ అంటూ 125 మంది మహిళలు కుంకుమార్చన చేశారు. రాత్రి పూట సీతారామ చంద్ర స్వామిల ఉత్సవ విగ్రహాలను భక్తుల దర్శనార్థం హంస వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. -
ఆత్మహత్య కాదు.. హత్య
● వృద్ధ దంపతుల మృతిపై వీడిన మిస్టరీ ● నిందితుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ మధు నంగునూరు(సిద్దిపేట): తాగుడు, చెడు అలవాట్లకు బానీసలుగా వారిన యువకులు నగల కోసం వృద్ధ దంపతులను ధారుణంగా కొట్టి చంపారు. మూడు రోజుల కిందట నంగునూరులో జరిగిన వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతిపై సిద్దిపేట ఏసీపీ మధు ఆదివారం వివరాలు వెల్లడించారు. నంగునూరు మండల బద్దిపడగకు చెందిన పసుపుల సంపత్, మాలోతు రాజు, మాలోతు శ్రీకాంత్ ముగ్గురు తాగుడుకు అలవాటు పడి జల్సాగా తిరుగుతున్నారు. నంగునూరుకు చెందిన పర్షరాములు వ్యవసాయ బావి వద్ద ఉన్న పౌల్ట్రీఫౌమ్లో పనులకు వెళ్లారు. పర్షరాములు తండ్రి ఆవుల కొమురయ్య, తల్లి భూదవ్వ పౌల్ట్రీఫామ్ వద నివాసం ఉంటున్నారని తెలుసుకొని వారి వద్ద ఉన్న నగలును దొంగిలించాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వృద్ధులు పడుకున్న ఇంటి కిటికీలను తొలగించి లొనికి వెళ్లారు. అలికిడికి వృద్ధులు లేవడంతో గొంతు పిసికి, సిమెంట్ ఇటుకతో బాది హత్య చేశారు. అనంతరం భూదవ్వపై ఉన్న మాటీలు, కమ్మలు, వెండి మొలతాడు దొంగిలించి కిటికిని ఎప్పటిలాగే పెట్టి పారిపోయారు. కేసు దర్యాప్తు చేసిన సిద్దిపేట రూరల్‌సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్ఐ అసిఫ్ నిందితులను మూడు రోజుల్లో పట్టుకొని వారి వద్ద నుంచి రెండు బైకులు, మూడు సెల్ఫోన్లు, వెండి మొలతాడు, రూ.30,800 స్వాధీనం చేసుకొని నిదుతులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
అల్లం సాగుకు.. వేసవి అనుకూలం
విత్తనం.. రకాలు మారన్, సుపభ్ర, సురుచి, సురభి, వైనాడ్, నదియా, రియోడిజనీరో రకాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి. జహీరాబాద్ ప్రాంత రైతులు అధికశాతం మంది మారన్ రకం పండిస్తున్నారు. ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి విత్తనం సేకరించాలి. విత్తనం పొడుగు 4.5 సె.మీ,30 గ్రాముల బరువు రెండు నుంచి మూడు కన్నులుండాలి. విత్తన దుంపలు 10 రోజుల ముందు నుంచి 24 గంటలు నానబెట్టడం వల్ల మొలక శాతం పెరుగుతుంది. 500 గ్రాముల ఎం45 మందును తగినంత నీటిలో కలిపి అల్లం విత్తనం నానబెట్టాలి. అల్లం విత్తనం నుంచి చిన్న చిన్న మొలకలు మొలిచేంతవరకు అంటే రెండు రోజుల పాటు ఆరబెట్టాలి. ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. ● పెట్టుబడి వ్యయం అధికం ● ధర కలిసివస్తే లాభాలు ఘనం ● జహీరాబాద్ ఏడీఏ భిక్షపతిజహీరాబాద్ టౌన్: అల్లం.. సుగంధ ద్రవ్యపు పంట. సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం అవటంతో పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అన్ని కాలాల్లో డిమాండ్ ఉండడం.. మద్దతు ధర లభించడం వల్ల కూడా రైతుల దృష్టి ఆకర్షిస్తుంది. సారవంతమైన ఎర్రనేలల్లో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండని నల్లరేగడిలో కూడా పండుతుంది. అల్లం పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి లక్షవరకు ఖర్చవుతుంది. దిగుబడి కూడా అదేస్థాయిలో వస్తుంది. ధర కలిసొస్తే గిట్టుబాటవుతుంది. ఏప్రిల్ రెండవవారం నుంచి మే నెల రెండవ వారం వరకు అల్లం సాగుకు అనుకూలం. 20 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అల్లం పంటను రైతులు సాగుచేస్తున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో పంటసాగవుతుంది. ఎనిమిది నెలల్లో చేతికొచ్చె అల్లంను సేంద్రియ ఎరువులతో సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి పేర్కొన్నారు. నేలలు.. వాతావరణం ఎర్రనేలలు, గరపనేలలు చెల్క భూములు అల్లం పంట సాగుకు అనుకూలం. నీరు నిలిచే భూములు పనికిరావు. నీడ ఉన్న ప్రదేశాల్లో కూడా పంట పండుతుంది. వర్షపాతం 700 నుంచి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు విత్తుకోచ్చు. సాగు విధానం పొలాన్ని లోతు వరకు దున్ని దుక్కిచేసుకోవాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల (సేంద్రియ)ఎరువు, 300 నుంచి 500 కిలోల వేప పిండి, 200 గ్రాముల సింగల్ సూపర్ పాస్పెట్ 25 గ్రాముల మైక్రో న్యూట్రిన్స్ కలిపి తయారు చేసిన బెడ్‌పై వేయాలి. బెడ్‌ను తడిగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న విత్తనం నాటాలి. క్రమం తప్పకుండా నీటి తడులను పెడుతుండాలి. డ్రిప్ విధానం చాలా మంచిది. సాగు చేసే నీరు, వర్షం నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఎకరాకు 500 నుంచి 800 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన దుంపలను 10 నుంచి 24 గంటలు నానాబెట్టడం వల్ల మొలకల శాతం పెరగుతుంది. యాజమాన్య పద్ధతులు ‘విత్తనం నాటిని 25–40 రోజుల తర్వాత 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెటే ఆఫ్ పొటాష్, లేదా 3 కిలోల అమోనియా సల్ఫేట్. 0.5 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, 1 గ్రామం మిరెట్ ఆఫ్ పోటాష్లను కలిపి డ్రిప్ పైపుల ద్వారా నీటిలో వదలాలి. 40–100 రోజుల వ్యవధిలో 54 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, 1 గ్రామం మిరెట్ ఆఫ్ పొటాష్ కలిపి ప్రతి రోజు రెండు నెలల పాటు పంటకు అందించాలి. 100–150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్ 1 కి.గ్రా, మ్యారిట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి. 150–180 రోజుల మధ్య మ్యారిట్ ఆఫ్ పొటాష్ 1 గ్రామం వేయాలి. తెగులు నివారణ రైజోమ్వాట్ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్ ఎక్సిల్ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రైజోమాప్లే తెగులు సోకుతే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరెడ్ గ్రానివల్స్ను వేయాలి. లీఫ్ బైట్ తెగుల కారణంగా ఆకులపై చిన్నచిన్న మచ్చాలు ఏర్పడుతాయి. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఉమ్మడి జిల్లాలో ఆదివారం వేర్వేరు ఘటనల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. 108 వాహనం బైక్ ఢీకొని... దుబ్బాకటౌన్: 108 వాహనం, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన రాయపోల్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని రాంసాగర్ గ్రామానికి చెందిన శంభు రమేశ్ తన బైక్‌పై రాంసాగర్ నుంచి రాయపోల్ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న 108 వాహనం రాయపోల్ కేంద్రంలోని నాగులమ్మ గుడి వద్ద బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి రమేశ్ కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘుపతి తెలిపారు. రోడ్డు దాటుతుండగా... సంగారెడ్డి క్రైమ్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాట్ల మహేశ్ అలియాస్ యోహాన్ (28), మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపునకు వేగంగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. తీవ్రగాయాల కావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మేసీ్త్ర యూనియన్ లీడర్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ బైక్ ఢీ.. జిన్నారం (పటాన్చెరు): ట్రాక్టర్, బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి (38)బైక్‌పై పొలం వద్దకు కూరగాయలు తేవడానికి వెళ్తుండగా జోడు బావుల మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జైపాల్‌రెడ్డి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
జహీరాబాద్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని హోతి(కె) జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సురేఖ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తుకు గడువు ఉందని వెల్లడించారు. 2025 మార్చిలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి సంగారెడ్డి ఎడ్యుకేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డిలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ...కార్యకర్తలందరూ పార్టీ పటిష్టత కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నడూ లేనివిధంగా నేడు దక్షిణాదిలో కూడా కాషాయ జెండా రెపరెపలాడే సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తోంది సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పటాన్చెరు టౌన్: కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను కేంద్రంలోని మోదీ సర్కారు కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ విమర్శించారు. కార్మిక వర్గాల ఐక్యత కోసం సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివె ఎనలేని కృషి చేశారన్నారు. బీటీ రణదివె 35వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం పటాన్‌చెరులోని శ్రామిక్ భవన్ లో ఆయన చిత్రపటానికి మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ....సామాజిక న్యాయ వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 14 వరకు మహనీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చిరస్థాయిగా గద్దర్రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజా సమస్యల కోసం పోరుబాట పట్టిన ప్రజా గాయకుడు గద్దర్ అణగారిన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల పేర్కొన్నారు. తెల్లాపూర్‌లోని గద్దర్ విగ్రహం వద్ద మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, గద్దర్ గళం వ్యవస్థాపకుడు కె.సత్తయ్య ఆధ్వర్యంలో రూ.1.25 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గద్దర్ స్మృతివనానికి ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...1997 ఏప్రిల్ 6న ప్రజా గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగాయని గుర్తు చేశారు. అణగారిన వర్గాలలో చైతన్యం రగిలించి అస్తమించిన సూర్యుడే గద్దరని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, గజ్జల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు తీస్తున్న సరదా
పండుగ పూట విషాదంఈత సరదా యువకుల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో కేవలం ఆరునెలల వ్యవధిలో పాతికేళ్లలోపు యువకులు నలుగురు మృత్యువాత పడ్డారు. గతంలో మంజీరా నదిలో ఇద్దరు.. తాజాగా శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడిలో మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. –మెదక్‌జోన్ అందరూ పాతికేళ్లలోపు వారే.. అయితే బొల్లారం మత్తడి మెదక్ మండలంలోని పలు గ్రామాలకు సమీపంగా ఉంటుంది. ఇందులోకి ఘనపూర్ ఆనకట్ట నుంచి నీరు వచ్చి చేరటంతో మండు వేసవిలో నిండుకుండలా మారుతుంది. దీంతో యువత అందులోకి ఈత కోసం వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు ఈ మత్తడి నలుగురు యువకులను బలి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో జానకంపల్లికి చెందిన యువకుడు మిత్రులతో కలిసి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతిచెందాడు. అలాగే తిమ్మక్కపల్లికి చెందిన మరో యువకుడు మత్తడిలో మునిగి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. అలాగే ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం సమీపంలో మంజీరా నది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది. భక్తులు ముందుగా మంజీరా పాయల్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే గత నెల 1వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఏడుపాయలకు వచ్చి మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. అందులో ఇద్దరు యువకులు పోతంశెట్‌పల్లి 2వ బ్రిడ్జి వద్ద నదిలో ఈతకు దిగి నీటమునిగి దుర్మరణం చెందారు. మంజీరాలో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు రాళ్లు రప్పలతో నిండి ఉంది. ఈ ప్రదేశంలోనికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్కడ నిరంతరం పోలీస్ సిబ్బందిని ఉంచితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.ఈతకు వెళ్లి కానరాని లోకాలకు.. మెదక్ మండలం బాలనగర్‌కు చెందిన తుండు అనిల్ (17), తుండుం నవీన్ (25) శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడికి ఈతకు వెళ్తున్నా మని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు మత్తడి వద్దకు వెళ్లి చూడగా గడ్డపై ఇద్దరి దుస్తులు, చెప్పులు కనిపించారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా ఆదివారం మధ్యా హ్నం ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామానికి చెందిన తుండుం లలిత, పద్మయ్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా కూతురు పెళ్లిచేయగా.. అనిల్ పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్ద తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే చేతికందివచ్చిన కొడుకు నీటి మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే గ్రామానికి చెందిన తుడుం బాలయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నీట మునిగి మృతిచెందిన నవీన్ (25) రెండో కుమారుడు. అతడికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. భర్త నీటి మునిగి చనిపోయాడని తెలియటంతో ఆమె రోదనలు మిన్నంటాయి. ఆరునెలల వ్యవధిలో నలుగురు మృత్యువాత కుటుంబాలకు తీరని వ్యథ నీటి వనరుల వద్ద కానరాని భద్రతా చర్యలు -
కుక్కల దాడిలో జింక మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): కుక్కల దాడిలో జింక మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిగుల్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఆదివారం ఉదయం గ్రామంలోని గణేశ్‌పల్లి రోడ్డు పక్కన పంట భూమిలో జింక ఉండగా కుక్కలు చూసి వెంటపడ్డాయి. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీట్ అధికారి రాజు ఘటనా స్థలానికి చేరుకొని జింకను పరిశీలించి పంచనామా చేశారు. పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెడతామని తెలిపారు. బోరుబావుల వద్ద కేబుల్‌వైర్లు చోరీ దుబ్బాక: దుబ్బాక పట్టణం శివారులోని రుషీవనం సమీపంలో 10 మంది రైతులకు చెందిన కేబుల్‌వైర్లు చోరీకి గురయ్యాయి. బోరు బావులకు చెందిన స్టార్టర్ డబ్బా నుంచి మోటర్ల వద్దకు వెళ్లే వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసుకొని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీ సులు కేబుల్‌వైర్లు చోరీకి గురైన బోరుబావులను పరిశీలించారు. కాగా చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకోవాలని బాధిత రైతులు కోరారు. చేపల వేటకు వెళ్లి.. మంజీరాలో మునిగి కొల్చారం(నర్సాపూర్): చేపల వేట కోసం మంజీరా నదిలోకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని తుక్కాపూర్ శివారులో ఆదివారం జరిగింది. కొల్చారం పోలీసులు తెలిపిన వివరాలు.. టేక్మాల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన గుండు యాదగిరి (32) శనివారం రాత్రి సమీపంలోని మంజీరా నదిలో చేపల వేట కోసం ఇంటి నుంచి స్కూటీపై వెళ్లాడు. తెల్లవారిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నది సమీపంలోకి వెళ్లి చూడగా తెప్ప మాత్రమే కనిపించింది. అనుమానం వచ్చి గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతికారు. చేపల వల చుట్టుకొని నిర్జీవంగా ఉన్న యాదగిరి మృతదేహం లభించింది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీసుకున్న డబ్బులివ్వాలని అడిగితే.. హత్య గజ్వేల్‌రూరల్: తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్న వ్యక్తిపై దాడికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని కోమటిబండలో ఆదివారం వెలుగుచూసింది. గజ్వేల్ పోలీసుల కథనం ప్రకారం... గజ్వేల్ పట్టణానికి చెందిన సన్నిది దుర్గయ్యకు ముగ్గురు కూతుర్లు, కొడుకు ఆంజనేయులు(30) ఉన్నాడు. కోమటిబండకు చెందిన ప్రేమకు భర్తతో పాటు ఒక కూతురు ఉన్నారు. కూలీ పనులు చేసుకునే ఆంజనేయులుకు ఆమెతో పరిచయం ఏర్పడటంతో 2020లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి హైద్రాబాద్‌తో పాటు సూర్యాపేట, చేవెళ్ల ప్రాంతాల్లో జీవనం సాగించగా కొడుకు శ్రీనాథ్(2) ఉన్నాడు. ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లిన ఆంజనేయులు 15రోజుల క్రితం బయటకు రావడంతో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోమటిబండకు వెళ్లి అత్త భారతిని కలిసి తనకు రావాల్సిన రూ. 3లక్షలు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంటిని తన పేరున రాసివ్వాలని గొడవకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి దుర్గయ్య అక్కడికి చేరుకొని అతడికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. తిరిగి సాయంత్రం మళ్లీ వెళ్లి వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆంజనేయులుకు వరుసకు సోదరుడు(సడ్డకుడు) అయిన నక్కల శివ ఇనుప గడ్డపారతో తలపై కొట్టాడు. ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీల్లో కంటి పరీక్షలు
నారాయణఖేడ్: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి, మానసిన సమస్యలను గుర్తించేందుకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నెల 7న ప్రారంభించి రెండునెలల పాటు పూర్తయ్యే వరకు ఈ పరీక్షలు కొనసాగించనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. జిల్లా మొత్తంలో 1,504 అంగన్వాడీ కేంద్రాల్లో 80,277మంది 0– 6 ఏళ్లలోపు చిన్నారులు పౌష్టికాహారం పొందుతూ చదువుకుంటున్నారు. వీరందరికీ కంటి, మానసిక పరీక్షలను చేయనున్నారు. ఇదివరకే రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) ద్వారా ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు రెండు విడతలుగా కంటి పరీక్షలను పూర్తి చేశారు. మూడో విడతగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేది పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలే. కాగా, ఆయా పిల్లలు సరైన పర్యవేక్షణ లేక కంటి, మానసిన సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యలు చిన్న తనంలోనే గుర్తించి సరిచేసేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు ఉపక్రమించింది. పరీక్షలు ఇలా.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్ల వైద్య సిబ్బందితోపాటు ఆఫ్తాల్మిక్ నిపుణులు చిన్నారులకు లీచార్ట్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్‌ను భాగస్వాములను చేస్తూ చిన్నారులకు ప్రత్యేకంగా బొమ్మలతో రూపొందించిన లీ చార్ట్ చూపిస్తూ ప్రశ్నించనున్నారు. చూపు సరిగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించనున్నారు. చిన్నారులకు కంటిలో ఏవైనా మచ్చలున్నాయా, దృష్టితోపాటు, మెల్లకన్ను, కార్నియా సమస్యలు, నిర్ధారిత దిశలో కళ్లు చూడకపోవడం, కళ్లల్లో తగినంత తేమ లేకపోవడం, పొడిబారుతుందా తదితర విషయాలపై ఆఫ్తాల్మిక్ నిపుణులు పరీక్షించనున్నారు. కంటి సమస్యలున్న చిన్నారులకు బోధనాస్పత్రుల్లో తగిన చికిత్సలు అందిస్తారు. మానసిక సమస్యలపై పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహించనున్నారు. చిన్నారుల ఎదుగుదల, ఎత్తు, బరువు, ఎలా మాట్లాడుతున్నారు? మాటలు సరిగా వస్తున్నాయా లేదా, ఆయా వస్తువులను గుర్తిస్తున్నారా లేదా, ప్రవర్తనల్లో ఏమైనా మార్పులున్నాయా అనే అంశాలను కూడా వైద్యులు అడిగి తెలుసుకుంటారు. నేటి నుంచి ప్రారంభం జిల్లావ్యాప్తంగా 1,504 కేంద్రాలు 80,277 మంది చిన్నారులకు పరీక్షలు రెండునెలల పాటు కార్యక్రమం పరీక్షలకు సిద్ధం జిల్లాలోని 0– 6 ఏళ్లలోపు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు కంటి, మానసిక ఎదుగుదలపై పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 7 నుంచి విద్యార్థులందరికీ పూర్తయ్యే వరకు రెండునెలలపాటు పరీక్షలు నిర్వహిస్తాం. గాయత్రీదేవి, జిల్లా వైద్యాధికారి, సంగారెడ్డి -
వేర్వేరు ఘటనల్లో నలుగురు ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకొని వ్యక్తి... దుబ్బాకటౌన్: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్ మండలం రామారంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కొమ్మాయిపల్లి రామస్వామి (40) ఆరు నెలల కింద పక్షవాతానికి గురయ్యాడు. వైద్యం చేయించుకున్నప్పటికీ పూర్తిగా తగ్గలేదు. దీంతో పక్షవాతం తగ్గడం లేదన్న మనోవేదనకు గురయ్యేవాడు. ఆదివారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో వారికి చెప్పి వెళ్లాడు. పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల రైతులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘుపతి తెలిపారు. మద్యం మత్తులో... తొగుట(దుబ్బాక): మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బంజేరుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానివేయాలని భార్య సరిత పలుమార్లు వారించినా వినిపించుకోలేదు. రోజూ మాదిరిగా ఉదయం సరిత గ్రామంలో కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి భర్త ఉరేసుకున్నాడు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో ఆయనను కిందకి దించిచూడగా అప్పటికే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడు, కూతురు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. మద్యానికి బానిసై...సిద్దిపేటరూరల్: మద్యానికి బానిసై అప్పులపాలై ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని చింతమడక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పెద్దెల్లి నర్సిహులు(38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాగుడుకు బానిసై గ్రామంలో అప్పులు చేశాడు. దీంతో శనివారం ఉదయం భార్య విజయలక్ష్మి తాగుడు మానేయమంటూ భర్తను నిలదీయడంతో అప్పులు చేసిన నేనే అప్పులు తీర్చుతానంటూ కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా అతడు ఇంటికి రాలేదు. దీంతో విజయలక్ష్మి మరిది యాదగిరిని బావి వద్దకు వెళ్లి చూడాలని చెప్పింది. అక్కడికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఇంటికీ ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూసేసరికి అప్పటికే చనిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీజిల్ పోసుకొని మహిళ... సిద్దిపేటకమాన్: మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం కాలనీలో వటారికారి సాయికుమార్ తన తల్లి గాయత్రి (55)తో కలిసి నివాసం ఉంటున్నాడు. సాయికుమార్ పట్టణంలో ఫుట్‌వేర్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గాయత్రి భర్త ఏనిమిదేళ్ల క్రితం మృతి చెందడంతో అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగా లేదు. దీంతో హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స అందించి ప్రస్తుతం మందులు వాడుతున్నారు. ఆదివారం రోజు మాదిరిగానే సాయికుమార్ షాప్‌నకు వెళ్లగా గాయత్రి ఇంట్లో డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న సాయికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని చూడగా తన తల్లి మృతి చెంది ఉంది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నప్పటి నుంచి క్రికెట్ ఇష్టం
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. రోజంతా పనిలో ఉండి ఆడలేక పోయే వాళ్లం. మళ్లీ క్రికెట్ ఆడటం వీలు కాదనుకున్నా. కానీ సంగారెడ్డిలో బాక్స్ క్రికెట్ స్టేడియంలు ఏర్పాటు చేయడం సంతోషకరం. రాత్రి వేళలో బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం. ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆటలు మానవ శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం, అందరూ సమయం దొరికినప్పుడు ఏదో ఒక ఆటని ఆడే అలవాటు చేసుకోవాలి. – షాబుద్దీన్, క్రికెట్ క్రీడాకారుడు సుమారు రూ.15 లక్షల ఖర్చు బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు వచ్చింది. సాధారణ రోజుల కంటే వీకెండ్లలో ఎక్కువగా వస్తుంటారు. క్రికెట్‌తో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్ బాల్ , స్నూక్కర్ ఆడుకోవడానికి సౌకర్యం ఉంది. దూర ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో ఆటలు ఆడుతున్నారు. మంచి లాభాలు పొందుతున్నాం. – ఆసిఫ్, బాక్స్ క్రికెట్ నిర్వాహకుడు -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
జిన్నారం (పటాన్చెరు): చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన కొడకంచి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగలక్ష్మి కథనం మేరకు.. గ్రామానికి చెందిన కంచనపల్లి ఆంజనేయులు (49) పుట్టగూడ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు శుక్రవారం వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో కాళ్లకు వల చుట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వేటకు వెళ్లిన ఆంజనేయులు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆచూకీ కోసం మత్స్యకారులు గ్రామస్తులతో కలిసి చెరువులో గాలించగా మృతదేహం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి కుమారుడు జితేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. కొల్చారం(నర్సాపూర్): విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వరిగుంతం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలయ్య వాళ్ల పోచయ్య(39) సెంట్రింగ్ మేసీ్త్రగా పని చేస్తున్నాడు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీళ్లు పట్టేందుకని వెళ్తున్నానని భార్య చంద్రకళకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. కొద్దిసేపటికి నీళ్లు పడుతున్న క్రమంలో పోచయ్య చేయి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కరెంట్ షాక్ కొట్టి కిందపడిపోయాడు. వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ వెల్దుర్తి(తూప్రాన్) : ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని శంశిరెడ్డిపల్లి తాండా పంచాయతీ పరిధి బండమీదిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పిట్టల శంకర్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగా శనివారం గ్రామ శివారులో జరిగిన ఉపాధి హామీ పనులకు వెళ్లి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురి కావడంతో వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. వడదెబ్బ సోకడంతోనే అస్వస్థతకు గురై మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో రింగురోడ్డుపై శనివారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లిలోని ఓ పౌల్ట్రీ ఫాంలో వాచ్‌మెన్‌గా పని చేసే ఎలుక గోపిరెడ్డి(75) ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య సత్తమ్మను చూసేందుకు స్కూటీపై మనుమడు కార్తీక్‌రెడ్డితో కలిసి బయలుదేరాడు. ప్రజ్ఞాపూర్ శివారులో రింగురోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న గోపిరెడ్డి ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన గోపిరెడ్డిని 108 వాహనంలో ప్రజ్ఞాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మద్యం మత్తులో ఉరేసుకొని ఆత్మహత్య
తొగుట(దుబ్బాక): మద్యం మత్తులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్‌రావు కథనం మేరకు.. తొగుట గ్రామానికి చెందిన మేకల స్వామి (39) మద్యానికి బానిసయ్యా డు. భార్య లక్ష్మీ ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోకుండా రోజూ మద్యం సేవించేవాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఎదుట రేకుల గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిరుత కలకలం పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రైతు పిల్లుట్ల జాన్సన్ కథనం మేరకు.. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన తల్లి మంజులతో కలిసి పొలం నుంచి ఇంటికి వస్తుండగా జానకీసాగర్ కుంట వైపు వెళ్లే బ్రిడ్జి దగ్గర చెట్టు కింద చిరుత నిద్రిస్తుంది. బైక్ శబ్దం విని లేవడంతో తాము భయపడి వేగంగా ఇంటికి వచ్చామన్నారు. అనంతరం గ్రామస్తులకు విషయం చెప్పాం. అక్కడకు వెళ్లి చూడగా చిత్తడి నేలలో చిరుత అడు గులు పోలిన గుర్తులు కనిపించాయి. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని సూచించినట్లు తెలిపారు. ఫారెస్ట్ వాచర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. తాము ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా అడుగుల గుర్తులు చిరుతను పోలి ఉన్నాయని చెప్పారు. పరిసరాలను గమనించగా అడవిలోని కొద్ది దూరంలో చిరుత కళ్లలా కనిపిస్తున్నాయని తెలిపారు. ఉదయం వరకు చిరుత అక్కడి నుంచి వెళ్లకుంటే బోనును ఏర్పాటు చేసి పట్టుకుంటామన్నారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
శనివారం వేర్వేరు చోట్ల మహిళ, యువకుడు, వృద్ధురాలు అదృశ్యమయ్యారు.దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తతో గొడవ పడి భార్య సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి మహిళ అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన కుమ్మరి నారాయణ, సుగుణమ్మ(40) దంపతులు. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. 20 రోజుల కిందట దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన మహిళ గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పని ఉందని వెళ్లి యువకుడు గజ్వేల్‌రూరల్: పని ఉందని బయటకి వెళ్లి యువకుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్‌లో చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాడ మల్లారెడ్డి(28) 4న హైదరాబాద్‌లో పని ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బైక్‌పై వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తెలిసిన చోట, బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. శనివారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బైక్‌లు చోరీ చేసి.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి
● ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ● రెండు బైక్‌లు, కంప్యూటర్, ప్రింటర్ స్వాధీనం సిద్దిపేటకమాన్: బైక్‌లను దొంగతనం చేస్తున్న వ్యక్తిని, అతడికి సహకరిస్తూ దొంగ బైక్‌లకు ఫోర్జరీ కాగితాలు సృష్టిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. సిద్దిపేట కేసీఆర్ నగర్ దక్కల కాలనీలో నివాసం ఉంటున్న ఓర్సు కృష్ణ ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తూ అమ్మేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. అలాగే దొంగిలించిన బైక్‌లకు సిద్దిపేట కేసీఆర్ నగర్‌కు చెందిన బండ్లగుండ్ల నాగరాజు ఒరిజినల్ పత్రాలు పోల్చే విధంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు, బైక్ ఆర్సీలను సృష్టించి కృష్ణకు సహకరించేవాడు. ఇలా ఇద్దరూ బైక్ దొంగతనాలు మొదలు పెట్టారు. కొద్ది రోజుల కిందట పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన బాబు అనే వ్యక్తి తన ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది కనకరాజు, సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి శనివారం కరీంనగర్ రోడ్డు మార్కెట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి కృష్ణ, నాగరాజు పారిపో తుండగా వెంబడించి పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేస్తున్న దొంగతనాలు, నేరాలు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఫోర్జరీ కాగితాలను తయారు చేయడానికి వినియోగించిన కంప్యూటర్, ప్రింటర్, సీపీయూ, ఫోర్జరీ పత్రాలు స్వాధీ నం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ప్రజలకు చేరువలో న్యాయస్థానాలు
● పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి ● హైకోర్టు న్యాయమూర్తులు ● జహీరాబాద్‌లో అదనపు జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం జహీరాబాద్ టౌన్: ప్రజలకు చేరువలో న్యాయస్థానాలు ఉండాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన అదనపు జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టీస్ శ్రీసుదా, జస్టీస్ అనిల్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ నాయకులు ఇచ్చిన వినతిపత్రానికి స్పందించిన న్యాయమూర్తులు ప్రభుత్వ స్థలం లభిస్తే కోర్టులన్నీ ఒకే చోట ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ వల్లూర్ క్రాంతి మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ కోరిక మేరకు వాహనాల పార్కింగ్ స్థలం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి భవానీ చంద్ర, ఎస్పీ పరితోష్ పంకజ్, జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్, ఏజీపీ దత్తాత్రేరెడ్డి, న్యాయవాదులు పాండురంగా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నతానీయల్, గోపాలకృష్ణ, అనుషా, నరేశ్, శశికాంత్, మానెన్న, ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ దశరథ్ జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, పలు కోర్టుల న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
బావ బామ్మర్దుల మృతదేహాలు లభ్యం
హత్నూర(సంగారెడ్డి): ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు శనివారం లభించాయి. పోలీసుల కథనం మేరకు.. హత్నూర మండలం బోర పట్ల గ్రామ శివారులోని భీముని చెరువులో శుక్రవారం గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్, కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని షాహిపేట గ్రామానికి చెందిన ప్రేమ్ కుమారు గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా మృతదేహాల కోసం మత్స్యకారులు అధికారులు భీముని చెరువు వద్ద గాలిస్తున్నారు. శనివారం ఎట్టకేలకు రెండు మృతదేహాలు లభించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరసకు బావబామ్మర్దిలిద్దరూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. -
గంటకు రూ.700 నుంచి రూ.900
సంగారెడ్డిలో క్రికెట్ కాకుండా స్నూకర్, బ్యాడ్మింటన్ ఆడేందుకు ప్రత్యేకంగా నెట్ ప్రాక్టీస్ కేంద్రాలను నెలకొల్పారు. ఒకేసారి ఒక క్రికెట్ టీమ్ (12) మంది ఆడేందుకు వీలుగా గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. వేసవిలో ఈ ప్రాక్టీస్ కేంద్రాల్లో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కోచింగ్ ఇస్తున్నారు. క్రికెట్ ఆడుకునేవారి కోసం రాత్రివేళల్లో వెలుతురులో ప్రాక్టీస్ చేసుకునేందుకు సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఒక జట్టుకు గంటకు రూ.700 నుంచి 900 వరకు చెల్లిస్తున్నారు. -
అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబూ జగ్జీవన్ రామ్
● టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ మెదక్‌జోన్ : అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబూ జగ్జీవన్ రామ్ అని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఉద్ఘాటించారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ, రక్షణ శాఖ, భారత ఉప ప్రధానిగా పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించి దేశ అభ్యున్నతికి నూతన సంస్కరణలు చేపట్టి ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక దృక్పథంతో కుల వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరిచే అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ పాషా, కోశాధికారి ఎం.చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి శివాజీ, సంతోష్ , తదితరులు పాల్గొన్నారు. మహిళపై అత్యాచారం,హత్యాయత్నం కేసులో.. ● నిందితుడి అరెస్ట్ జోగిపేట(అందోల్): మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏర్పుల అనిత అనే మహిళ కొద్ది రోజులుగా భర్తతో గొడవపడి అమ్మవారి ఇంట్లోనే తన పిల్లలతో గోంగులూరు తండాలోనే ఉంటూ సంగారెడ్డిలో కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తుంది. మిన్పూర్కు చెందిన ఆంజనేయులుతో కూలీ పని వద్ద పరిచయం ఏర్పడింది. 2న ఆంజనేయులు కూలీ పని ఉందని అనితకి ఫోన్ చేయడంతో ఆమె చౌటుకూరు బస్టాప్ వద్దకు వచ్చింది. బైక్‌పై ఎక్కించుకొని పోసానిపల్లి– బొమ్మరెడ్డిగూడెం మధ్యలోని అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోతుండగా ప్రతిఘటించింది. పెనుగులాటలో నిందితుడు ఆమైపె కత్తితో దాడి చేయడంతో మెడపై గాయమైంది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోసానిపల్లి రోడ్డు పైకి వచ్చి పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి కాపాడారు. ఆంజనేయులు ఆమె ఫోన్‌ను తీసుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు, ఏజెన్సీపై కేసు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు సంబంధించి రూ.28 లక్షల మేర జీఎస్టీ, పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు చెల్లించకుండా స్వాహా చేసిన హిమాన్ష్ సీఆర్ఎం సర్వీసెస్ ఏజెన్సీపై గతంలో ఆలయ ఈవో రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. శనివారం ఆలయ అధికారులతో విచారణ చేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు చేర్యాల సీఐ శ్రీను తెలిపారు. ఆరేళ్ల కిందట అదృశ్యం.. నేడు పోలీసులకు ఫిర్యాదు ● ఏడేళ్ల వరకు ఆచూకీ దొరక్కపోతే డెత్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం! కల్హేర్(నారాయణఖేడ్): వృద్ధురాలు అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్ఐ డీ.వెంకట్‌రెడ్డి శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. సిర్గాపూర్ మండలం పోట్పల్లికు చెందిన శరద సాయవ్వ ఆరేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన సమయం నుంచి ఏడేళ్ల వరకు ఆచూకీ లభించకపోవడంతో ఎఫ్ఐఆర్ సమర్పించి డెత్ సర్టిఫికెట్ పోందే అవకాశం ఉంటుంది. సాయవ్వ పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. దీంతో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ఆట పూట మారిందోచ్
సంగారెడ్డిలో వెలుస్తున్నబాక్స్ గ్రౌండ్లు ● ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ఆటలు ● ఆసక్తి చూపుతున్న యువత, ఉద్యోగులు ● అన్ని వయస్సుల వారు ఇష్టంగా ఆడుతున్న క్రికెట్ ● ఆట సమయాన్ని బట్టి ధరలు ● రూ.లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటుచేస్తున్న నిర్వాహకులు ● అన్ని క్రీడలకు అవకాశంరాత్రిపూట క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులుసంగారెడ్డి టౌన్: మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఖాళీ సమయం దొరికితే చా లు క్రికెట్ ఆడుతుంటారు. అప్పట్లో ఆటలు ఆడేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద పెద్ద మైదానాలు ఉండేది. కానీ రాను రానూ గ్రామాలతో పాటు పట్టణాల్లో స్థలాల విలువ పెరగడం ఆట స్థలాలు లేకుండా పోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మైదానాలు కనుమరుగవుతుండటంతో పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ప్రతీ పిల్లవాడి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. యూట్యూబ్ చూడటం, ఫోన్ లోనే ఆటలు ఆడడమే తప్ప శరీరానికి ఉపయోడపడే ఆటలు ఆడటం మరచిపోయారు. దీన్ని దృష్టిలో సంగారెడ్డిలో కొందరు అన్ని వసతులు, ఆహ్లాదకర వాతావరణంలో బాక్స్ క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ వెసులుబాటు ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. క్రికెట్‌కు ప్రత్యేకంగా కోచింగ్ ప్రస్తుతం వేసవి కావడం, ఇంటర్ కళాశాలల విద్యార్థులకు సెలవులు రావడం, ఒంటిపూట బడులు ఉండటంతో ఇప్పడూ ఎక్కడ చూసిన క్రికెట్ సందడి నెలకొంది. దీంతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో క్రికెట్‌కు ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చేందుకు నెట్ ప్రాక్టీస్ శ్రీకారం చుట్టారు. ఉదయం, సాయంత్రం వేళలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో కోచింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డితోపాటు పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో బాక్స్ క్రికెట్లు ఏర్పాటు చేశా రు. తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను సా యంత్రం వేళల్లో కోచింగ్ ఇప్పించేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యోగులు తమ పిల్లలకు శిక్షణ ఇప్పించేందుకు సమయం వెచ్చిస్తున్నారు. వీకెండ్లలో యువకులు పెద్ద ఎత్తున సంగారెడ్డితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వీకెండ్లలో యువకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. నర్సాపూర్, జోగిపేట్, శివ్వంపేట్, తదితర గ్రామాల నుంచి క్రీడాకారులు డాక్టర్లు, ఉద్యోగులు, క్రికెట్‌తోపాటు వివిధ ఆటలు ఆడడానికి వస్తుంటారు. సాయంత్రం వేళలో సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్లను ముందుగా బుకింగ్ చేసుకొని ఆటలు ఆడుతుంటారు. వీకెండ్లలో స్నేహితులందరూ ఒకచోట చేరి క్రికెట్ ఆడుతుంటారు. జిల్లా అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు సాయంత్రం వేళల్లో ఆడటానికి ఆసక్తి చూపుతున్నారు. 12 బాక్స్ క్రికెట్ గ్రౌండ్లు సంగారెడ్డి చుట్టపక్కల సుమారు 12 బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లు ఉన్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో రాత్రి 11 వరకు ఉదయం 5 నుంచి 7 వరకు ఆడుతున్నారు. బాక్స్ క్రికెట్ లో చుట్టూ నెట్ ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్లో కింద గ్రీన్ మ్యాట్‌తో ఉంటుంది. ప్రతీ క్రికెట్ ఆటకు నెలకు రూ.700 నుంచి రూ.900, వాలీబాల్‌కు రూ. 600 నుంచి రూ.750 ఒక ఆటకు, స్నూకర్ రూ.150 నుంచి 250, బ్యాడ్మింటన్ రూ.250 నుంచి రూ.300 ధరలు ఉన్నాయి. -
తప్పిపోయిన బాలిక తల్లిదండ్రుల చెంతకు
జిన్నారం (పటాన్చెరు): అదృశ్యమైన బాలికను కనుగొని గంట వ్యవధిలోనే పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన ఆకుల ప్రణవి (6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు సెలవు రోజని మర్చిపోయి తల్లిదండ్రులు రోజు మాదిరిగానే బడికి పంపారు. ఈలోగా పాఠశాల లేదని తెలియడంతో తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లగా కూతురు ప్రణవి కనిపించలేదు. ఆందోళన చెందిన వారు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై మహేశ్వర్ రెడ్డి నలుగురు సిబ్బందితో సుమారు గంట పాటు దోమడుగు గ్రామంలో వెతకగా ప్రణవి ఓ చోట ఆడుకుంటూ కనిపించింది. వెంటనే పాపను సంరక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
నిండుకున్న నిల్వలు
సంగారెడ్డి పట్టణంలో ఉన్న ఓ రేషన్‌షాపులో ప్రతినెలా సుమారు 98 క్వింటాళ్ల బియ్యం పంపిణీ అవుతుంటాయి. ఈ రేషన్‌షాపునకు ఈ నెలలో కేవలం 60 క్వింటాళ్లు మాత్రమే సన్నబియ్యం వచ్చాయి. రేషన్కార్డుదారులందరు వచ్చి బియ్యం తీసుకోవడంతో వచ్చిన స్టాక్ రెండు రోజుల్లో అయిపోయింది. దీంతో మిగిలిన కార్డుదారులందరూ నిరాశతో వెనుదిరిగి పోయారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే జిల్లా అవసరాల మేరకు ఈ సన్నబియ్యం నిల్వలు జిల్లాకు రాలేదు. దీంతో చాలా రేషన్‌షాపుల్లో ఈ బియ్యం పంపిణీకి బ్రేకు పడింది. సన్నబియ్యం కోసం రేషన్‌షాపులకు వెళ్లిన కార్డుదారులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ప్రస్తుతం స్టాక్ లేదని, రెండు రోజుల్లో స్టాక్ వచ్చాక ఇస్తామని రేషన్‌షాపుల నిర్వాహకులు కార్డుదారులకు సర్ది చెబుతున్నారు. పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డిల నుంచి.. సంగారెడ్డి జిల్లాలో సన్నధాన్యం సాగు తక్కువే. కొంతమంది రైతులు ఈ సన్న రకాలను సాగు చేసినప్పటికీ వారి సొంత అవసరాలకే వాడుకుంటారు. దీంతో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్దగా రాదు. ఈ కారణంగా జిల్లాలో సన్నబియ్యం అందుబాటులో లేవు. అయితే జిల్లా అవసరాల కోసం ప్రభుత్వం నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి సన్నబియ్యాన్ని సంగారెడ్డి జిల్లాకు తరలిస్తోంది. సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి నుంచి ఇక్కడికి లారీలు రావాలంటే తీవ్ర జాప్యం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి రావాలన్నా 160 కిలోమీటర్లు రవాణా చేయాల్సి వస్తోంది. పక్కనే ఉన్న మెదక్, కామారెడ్డి జిల్లాల నుంచి కేటాయింపులు జరిపినా అవి తక్కువగానే ఉన్నాయి. దీంతో ఈ బియ్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోజుకు 30 నుంచి 35 లారీలు మాత్రమే వస్తున్నాయి. దీంతో జిల్లా భారీ అవసరాల మేరకు సన్నబియ్యం స్టాక్ సకాలంలో చేరడం లేదు. 60 శాతమే వచ్చిన సన్నబియ్యం.. జిల్లాలో మొత్తం 3.78 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఈ కార్డుదారులకు మొత్తం 846 రేషన్‌షాపుల ద్వారా ప్రతినెలా 7,990 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే శనివారం నాటికి జిల్లాకు వచ్చిన సన్నబియ్యం సుమారు 4,794 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా సుమారు 3,196 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రావాల్సి ఉందని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు.సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల నుంచి రోజుకు 30 లారీలే రాక పూర్తిస్థాయిలో జిల్లాకు చేరని వైనం కార్డులు ఎక్కువ ఉన్న షాపులకు సగమే పంపిణీ.. స్టాక్ వచ్చాక ఇస్తామంటున్న అధికారులు కేటాయింపుల్లోనే ఆలస్యం బియ్యం కేటాయింపులో ఆలస్యం కారణంగానే స్టేజ్–1 స్థాయిలో సన్నబియ్యం రవాణాలో జాప్యం జరుగుతోంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖ అధికారులు ఈ కేటాయింపుల విషయంలో చొరవ చూపకపోవడంతో సన్నబియ్యం స్టాక్ రాకపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రానున్న నెల నుంచి ప్రతినెలా 20వ తేదీలోగా కేటాయించాలని కలెక్టర్ పౌరసరఫరాలశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.త్వరగా తెప్పిస్తున్నాం.. సన్నబియ్యం నిల్వలను వీలైనంత త్వరగా తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పక్క జిల్లాలు కాకుండా దూరంగా ఉన్న పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలు కేటాయించడంతో ఈ బియ్యం నిల్వలు రావడంలో కాస్త సమయం పడుతోంది. రెండు రోజుల్లో నిల్వలను జిల్లాకు తెప్పించి..కార్డుదారులందరికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిరుపేదలు నివాసముండే ప్రాంతాల్లోని రేషన్‌షాపులకు ముందుగా ఈ బియ్యాన్ని తరలిస్తున్నాం. తర్వాత రామచంద్రాపురం, పటాన్చెరు వంటి అర్బన్ ప్రాంతాల్లోని రేషన్‌షాపులకు నిల్వలు పంపుతాం. –మాధురి, అదనపు కలెక్టర్ -
శ్రీరామనవమికి నాచగిరి సిద్ధం
నేడు సీతారాముల కల్యాణం వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలోని శ్రీరామాలయం శ్రీరామనవమి మహోత్సవానికి ముస్తాబైంది. శ్రీలక్ష్మీ నృసింహుని గర్భగుడి చెంతనే గుహలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి, ఆ పక్కనే ఆంజనేయ స్వామి కొలువుదీరారు. ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో విశాలమైన కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటలకు జగదభిరాముని కల్యాణోత్సవం జరుగుతుంది.శ్రీరామనవమి ఏర్పాట్ల పరిశీలనజిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సదాశివపేట(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని శ్రీరామ కళామందిరంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను శనివారం పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు సదాశివపేట సంగారెడ్డి పట్టణాలలో ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను, శోభ యాత్ర జరిగే ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఎస్పీతోపాటు డీఎస్పీ సత్తయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. కేతకీలో హైకోర్టు జడ్జీలు ఝరాసంగం(జహీరాబాద్): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీ సుధా, జస్టిస్ అనిల్ కుమార్ శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఆలయ నిర్వాహకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగ తం పలికారు. అనంతరం పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి భవానీచంద్ర, జహీరాబాద్ కోర్టు జడ్జి శ్రీధర్, ఆర్డీఓ రాంరెడ్డి, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ హనుమంతు, చంద్రశేఖర్ పాటిల్ పాల్గొన్నారు. ఓడీఎఫ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలికంది(సంగారెడ్డి): ఓడీఎఫ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓడీఎఫ్ ఉద్యో గులు ఈనెల 3నుంచి చేపట్టిన ఆందోళనలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జయవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగులను రిటైర్ అయ్యేంత వరకు ప్రభుత్వ కొలువుల్లోనే కొనసాగించాలన్నారు. ఈ నెల10 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నేడు చిన్నచల్మెడకు మంత్రిమునిపల్లి(అందోల్): చిన్నచల్మెడలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం మధ్యా హ్నం 2 గంటలకు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. -
ఒకే తాటిపైకి రెవెన్యూ ఉద్యోగులు
సిద్దిపేటఅర్బన్: రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, రెవెన్యూ ఉద్యోగులకూ భరోసా ఉంటుందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెబుతుందని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్నారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖల్లోకి వస్తున్న గ్రామ పరిపాలన అధికారులు (జీపీవో) సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వీరందరికి కామన్ సర్వీస్, పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడం వల్ల రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తాయని ఆయన వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను క్రమంగా సాధించుకుంటున్నామని, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూభారతి చట్టంతో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని, సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు చల్లా శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, టీజీజీఏ జనరల్ సెక్రెటరీ పూల్‌సింగ్, టీ జీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.రాంరెడ్డి, భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనం గౌడ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, సీసీఎల్ఏ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణచైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేశం, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. భూభారతితో రైతులకు మెరుగైన సేవలు త్వరలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం -
పట్టివేతలు... స్వాధీనాలు
కొకై న్ జహీరాబాద్ టౌన్: నిషేధిత మత్తు పదార్థం కొకై న్ను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేసి అతడి వద్దనుంచి 10.03 గ్రాముల కొకై న్ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శనివారం హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సులో తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి అనుమాన్పదంగా కనిపించాడు. అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఈ కొకై న్ బయటపడింది. నిందితుడిని ఏపీలోని కృష్ణ జిల్లా బంటు మిల్లపురం మండలం సోమకృష్ణపురం గ్రామానికి చెందిన డి.చంద్రశేఖర్(30)గా పోలీసులు గుర్తించారు. రేషన్ బియ్యం సంగారెడ్డి: రాష్ట్రం నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పుల్కల్ పోలీసులు పట్టుకున్నారు. చౌటకూర్ మండలం తాడ్దాన్పల్లి టోల్గేట్ వద్ద శనివారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో రెండు లారీల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ తెలిపారు. ఎర్రరాయి న్యాల్కల్(జహీరాబాద్): రాష్ట్ర సరిహద్దు వద్ద శనివారం అనుమతుల్లేకుండా ఎర్రరాయిని అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఎర్రరాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఎస్సై చల్లా రాజశేఖర్ వెల్లడించారు. అనుమతుల్లేకుండా ఎర్రరాయిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అక్కరకురాని ‘ఉపాధి’
వెంటనే విడుదల చేయాలి కష్టపడి పని చేస్తున్నా వేతనాలు అందడం లేదు. వెంటనే ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలి. పనిచేస్తున్నాం కానీ కుటుంబాన్ని పోషించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి? విజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు, హత్నూరఆందోళనకు వెనుకాడం వెంటనే మూడు నెలల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. అధికారులకు ఇప్పటివరకు వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చాలీచాలని వేతనాలు ఆపై నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి? వెంటనే వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన బాట పట్టేందుకు వెనుకాడమన్నారు. సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిహత్నూర (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వలసల నివారణ కోసం కూలీలకు గ్రామాల్లోనే పని కల్పిస్తూ పనులను పర్యవేక్షిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు లేవు. క్షేత్రస్థాయిలో అధికారుల ఆదేశాలు పాటిస్తూ కూలీలకు పని కల్పించడమే కాకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం ప్రతినెలా రావడం లేదు. జిల్లాలో 619 గ్రామపంచాయతీలలో 486 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. 2006లో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియామకం చేపట్టింది. 2019లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను పక్కకు పెట్టారు. తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమాలు చేసి కోర్టు కేసు ద్వారా తిరిగి 2023 సెప్టెంబర్ 11న ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి గ్రేడ్ వన్ ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.12,120, గ్రేడ్ 2 ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.10,120, గ్రేడ్ 3 ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.9,100 వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. కానీ గత మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు గ్రామంలోని పనులు కల్పించడంతోపాటు జాబ్ కార్డులను చూసి రికార్డులు రాయాలి. వీటితోపాటు ప్రస్తుత ప్రభుత్వం అదనంగా గ్రామపంచాయతీ కార్యక్రమాల్లో కూడా వాడుకుంటుందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల చేరవేతలోనూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు చేరవేయడంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు భాగస్వాములు అవుతున్నారు. కానీ మాకు వేతనాలు ఇప్పించాలని జిల్లా మండల స్థాయి అధికారులకు సైతం నెలల తరబడి వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇకనైనా వేతనాలు మంజూరు చేయకుంటే ఆందోళన బాట పట్టేందుకు జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు ఇప్పటికే సమావేశమై కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఉపాధి హామీ పథకం రోజురోజుకు క్షేత్రస్థాయిలో నిర్వీర్యం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలుగా లేని వేతనాలు జిల్లాలో 486మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వినతి పత్రాలిచ్చినా ఫలితం శూన్యం ఆర్థిక ఇబ్బందుల్లో సిబ్బంది ఆందోళనకు దిగే అవకాశం! -
జగ్జీవన్‌రామ్ సేవలు ప్రశంసనీయం
సంగారెడ్డి జోన్: స్వతంత్ర సమరయోధుడిగానే కాకుండా స్వాతంత్య్రానంతరం భారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రామ్ అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, నాయకులతో కలిసి పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అత్యధిక కాలం కేబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత బాబు జగ్జీవన్ రామ్‌కే దక్కుతుందన్నారు. భారత ఉప ప్రధానమంత్రిగా, వ్యవసాయ, రక్షణ, రైల్వే మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన మహనీయుడన్నారు. అలాంటి మహనీయుని సేవలను స్మరించుకోవడం భవిష్యత్ తరాలకు గుర్తుకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, గ్రంథాయల చైర్మన్ అంజయ్య, అధికారులు జగదీశ్, అఖిలేశ్‌రెడ్డి, రామాచారి తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
ఎస్పీ పరితోష్ పంకజ్ పటాన్చెరు టౌన్: సివిల్ తగాదాలలో తలదూర్చకూడదని, మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. బీడీఎల్ పోలీసు స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సిబ్బంది, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. నైట్‌బీట్, పెట్రోలింగ్ అధికారులు వీధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీడీఎల్ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
చట్ట్టాలు అమలు కావడంలేదు
జిల్లాలో వలస కార్మికులు చట్టలు అమలు కావడం లేదు. ఈ విషయంపై గతంలో కలెక్టర్, జిల్లా కార్మిక సంక్షేమ అధికారులకు అనేకమార్లు వినతిప్రతాలు ఇచ్చాం. పరిశ్రమలలో ఎవరైన మృతి చెందితే యాజమాన్యాలు వారి కుటుంబ సభ్యులను తెప్పించుకుని ఎవరికీ తెలియకుండా అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని తరలించేస్తున్నారు. వారికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం ఇవ్వడం లేదు. – కె.రాజయ్య, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు పకడ్బందీగా అమలు చేస్తున్నాం జిల్లాలో వలస కార్మికుల చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులున్నా వాటి పరిష్కారానికి కృషి చేసున్నాం. ఎవరికై నా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలి. –రవీందర్‌రెడ్డి, జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారి -
సీతారామ కల్యాణానికి మంత్రి దామోదరకు ఆహ్వానం
జోగిపేట(అందోల్): జోగిపేటలోని శ్రీపబ్బతి హనుమాన్ దేవాలయంలో ఈనెల 6న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి హాజరు కావాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో శుక్రవారం దామోదరను కలసి ఆహ్వాన పత్రిక ను అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఎ.చిట్టిబాబు, ఆలయ పూజారి లక్ష్మణాచారి, ఆత్మకమిటీ సభ్యుడు చిట్యాల మధు, యువజన కాంగ్రెస్ నాయకుడు డాకూరి రఘునాథ్ ఉన్నారు. నూకలు లేకుండా పంపిణీ చేయాలిఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర (సంగారెడ్డి): పేదలకు నూకలు లేకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. హత్నూర మండలం దేవులపల్లి గ్రామంలో శుక్రవారం రేషన్ దుకాణంలో సన్నబియ్యాన్ని ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సన్నబియ్యం పేరుతో నూకలు పంపిణీ చేయొద్దని దీనివల్ల లబ్ధిదారులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫొటోలకు తప్ప ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేసి పేదలకు నాణ్యమైన సన్నబియాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఐలా అభివృద్ధికి సంపూర్ణ సహకారంఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పటాన్చెరు: పటాన్చెరు పారిశ్రామికవాడ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు ఐలా నూతన కార్యవర్గం కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ...ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో పరిశ్రమల యాజమాన్యాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు రావాలని కోరారు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పోషకాహారలోపం నిర్మూలనకు కృషిసంగారెడ్డిజోన్: జిల్లాలో పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి పేర్కొన్నారు. హైదారాబద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న లలితకుమారి మాట్లాడుతూ...పోషకాహారం తగ్గించడంపై జిల్లా, గ్రామస్థాయిలో ప్రతీ ఒక్కరు బాధ్యత వహించాలన్నారు. శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోవాలి శాంతి సమావేశం నిర్వహించిన డీఎస్పీసంగారెడ్డి క్రైమ్: శ్రీరామనవమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ సత్తయ్య గౌడ్ సూచించారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని యువకులంతా కులం, మత భేదం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దని పట్టణ సీఐ రమేశ్ సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని సభ్యులు, ఇస్లామిక్ సభ్యులతో పాటు ఇతరులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక దోపిడీ
– పర్చా శ్రీనాథ్, రామచంద్రాపురం●వలస జీవుల బతుకు పోరు..గంజాయి మత్తులో లేబర్ క్యాంపులలో గంజాయి గుప్పుమంటోంది. వలస కార్మికలు కొంత మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసి రాత్రి కాగానే గంజాయి మత్తులో తూలుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొంత మంది వలస కార్మికులు కష్టానికి తగిన ఫలితం రాకపోవడంతో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో గంజాయి అమ్మడానికి సిద్ధమవుతున్నారు. దళారుల పెత్తనం ఈ ప్రాంతంలో పరిశ్రమలు, నిర్మాణరంగం అభివృద్ధి చెందటంతో పాటు ఇటుక బట్టీలు ఎక్కువగా ఉండటంతో కార్మికులకు మంచి డిమాండ్ ఉంది. స్థానికులు ఎక్కువ వేతానాలను డిమాండ్ చేయడంతో తక్కువ వేతనాలతో పనిచేసే వలస కార్మికులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో దళారులు రాజ్యమేలుతున్నారు. పాలకులపై కోర్టు ఆగ్రహం వలస కూలీల దుర్భర పరిస్థితులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను 2020 మే లో జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. అయినా వారి బతుకులు మారడం లేదు. తక్కువ వేతనాలకు వలసకార్మికులు ఎక్కువ పనిగంటలు ఎందుకు పనిచేయాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రమాదకరమైన చోట పని చేస్తున్నా వారికి ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తోందని ప్రశ్నించగా సమాధానం చెప్పలేక అప్పటి సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు నీళ్లునమిలారు.గాలిలో కలుస్తున్న ప్రాణాలు పరిశ్రమలలో, నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు వారు పనిచేసే చోట సరైన భద్రత లేకపోవడంతో వారి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలలో వలస కార్మికులు మృతి చెందిన వెంటనే వారి మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించి యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయి. కొన్నిచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే నామమాత్రంగా నగదు ముట్టజెప్పి కుటుంబ సభ్యులతో రాజీపడుతున్నారని కార్మిక సంఘా నేతలు వాపోతున్నారు. ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలు పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయడం లేదు. వీరికి అన్‌స్కిల్డ్ వేతనం మాత్రమే ఇస్తున్నారు. 12గంటలు పని చేయిస్తున్నారు. చట్ట ప్రకారం రావలసిన ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించడంలేదు. ప్రమాదాలు జరిగిన పట్టించుకోవడంలేదు. ప్రమాదంలో మృతి చెందితే వారి మృతదేహాలను ఆగమేఘాల మీద స్వగ్రామాలకు తరలిస్తున్నారు.రామచంద్రాపురం(పటాన్చెరు): ఉన్న ఊరిలో ఉపాధి కరువై..బుక్కెడు బువ్వ కోసం వలస కార్మికులు పడుతున్న కష్టాలు ఇక్కడ వర్ణనాతీతం. కనీస వేతనాలు లేక శ్రమకు తగిన ఫలితం రాక వారికి అండగా ఉండాల్సిన చట్టాలు అమలు కాక వలస కార్మికులు నరకయాతనకు గురవుతున్నారు. కుటుంబ పోషణ కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న వలస కార్మికులు తిరిగి ఇంటికి ప్రాణాలతో వెళ్తామన్న నమ్మకం కూడా వారిలో లేకపోవడంతో చూస్తే వారి జీవితాలు ఎంత దుర్భంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. వలస కార్మికుల కుటుంబాలలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. ఇన్ని జరుగుతున్నా పాలకులు మాత్రం వలసకార్మికుల చట్టాలను పకడ్బందీగా అమలు చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం శూన్యం. జోరుగా వలసలు అతిపెద్ద పారిశ్రామికవాడైన పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమలు, జోరుగా నిర్మాణాలు జరుగుతుండటంతో ఈ ప్రాంతాలకు వలస కార్మికులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కేవలం పటాన్చెరు, రామచంద్రాపురం పరిధిలోనే సుమారు 2లక్షలకు పైగా వలస కార్మికులుంటారని కార్మిక సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. బొల్లారం, కాజిపల్లి, పాశమైలారం, బొంతపల్లి, హత్నూర, కొండాపూర్, సదాశివపేట్ , జహీరాబాద్‌లతో పాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల మంది వలస కార్మికులు ఉండవచ్చని అంచనా. వ్యాపారంగా మారిన కూలీల తరలింపు కొంతమంది దీనిని వ్యాపారంగా మార్చివేశారు. ఉత్తర భారతదేశం నుంచి తక్కువ వేతనాలతో పనిచేసే కార్మికులతో ఒప్పందం చేసుకుని వారిని ఇక్కడ తీసుకొస్తున్నారు. వారితో పని చేయిస్తూ దళారులు సంస్థల వద్ద నుంచి డబ్బులు తీసుకుని వీరికి తక్కువ వేతనాలిస్తున్నారు. బహిరంగ రహస్యంగా ఉన్న ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా ఈ దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎలాంటి భద్రత లేకుండా సుమారు 20 అంతస్తులపై పని చేస్తున్న కార్మికులు -
నీట మునిగిన బావ బామ్మర్దులు
హత్నూర (సంగారెడ్డి): ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. హత్నూర మండల పరిధిలోని బోరుపట్ల గ్రామ శివారులో భీమునిచెరువులో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం...బోరుపట్ల గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల కోసం మల్కాపూర్ గ్రామపంచాయతీలోని కుతుప్ షాహీపేట గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ భార్యా పిల్లలతో కలసి అత్తవారింటికి చుట్టపుచూపుగా వచ్చారు. మధ్యాహ్నం చెరువులోకి స్నానం చేసేందుకు ప్రేమ్ కుమార్ చెరువులో దిగాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నీట మునిగిపోయాడు. ఎంతసేపటికీ పైకి రాకపోవడంతో అక్కడున్న మరికొందరు గ్రామంలోని ఆయన బంధువులకు సమాచారమిచ్చారు. భార్యా పిల్లలతోపాటు బంధువులు గ్రామస్వారిలోని భీముని చెరువు వద్దకు వచ్చి అతడి కోసం గాలించారు. బావకోసం... ప్రేమ్‌కుమార్ బావమరిది బోరుపట్ల గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్ మరికొంతమంది యువకులతో కలసి చెరువులోకి దిగాడు. కొద్ది సేపటి తర్వాత నవీన్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొంతమంది యువకులు చెరువులోకి దిగి ఈ యువకులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలికి తహసీల్దార్ పరిహీన్ షేక్, ఎంపీడీవో శంకర్ ఎస్సై సుభాష్, ఆర్ ఐ శ్రీనివాస్ చేరుకుని సహాయక చర్యలో పాల్గొన్న సహాయక బృందాలకు పలు సూచనలు చేశారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. స్నానానికి వెళ్లి ఒకరు... కాపాడబోయి మరొకరు రాత్రివరకూ తెలియని ఆచూకీ పొద్దుపోవడంతో ఆపేసిన గాలింపు చర్యలు బోరుపట్ల గ్రామంలో ఘటన -
హాస్టల్ విద్యార్థి అదృశ్యం
వట్పల్లి(అందోల్): సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం దేవునూరు బాలుర హాస్టల్ నుంచి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పక్షం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని పెద్దతండాకు చెందిన మెగావత్ కుమార్(15) దేవునూరు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ.. అదే గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్లో ఉంటున్నాడు. గత నెల మార్చి 20న కుమార్ పాఠశాలకు హాజరుకాగా.. అదే రోజున సాయంత్రం హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా అదే తండాకు చెందిన పలువురు విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోగా..తమ కుమారుడు రాలేదని కుమార్ తల్లిదండ్రులు వార్డెన్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే.. కుమార్ ఇంటికి వెళ్లినట్లు వార్డెన్ సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. వార్డెన్‌ను నిలదీశారు. అనంతరం వారు శుక్రవారం వట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ సుధాకర్ వివరాలు సేకరించే క్రమంలో మార్చి 29 వరకు విద్యార్థి హాస్టల్లో ఉన్నాడని, తర్వాత కనపించలేదని వార్డెన్ చెప్పే మాటలకు, స్కూల్ రిజిస్టర్లో మార్చి 20 వరకు మాత్రమే విద్యార్థి హాజరైనట్లుగా నమోదై ఉంది. వార్డెన్ మాటలకు పొంతన లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ తీరును నిరసిస్తూ విద్యార్థులతో కలిసి హాస్టల్ గేటు ఎదుట బైఠాయించారు. విషయం తెలిసిన జోగిపేట సీఐ అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. విద్యార్థి తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 15 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి.. హాస్టల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ధర్నా -
దుర్గంధమే శ్వాసగా... సాగిపోవాలిక్కడ
సంగారెడ్డి జోన్: ప్రధాన జాతీయ రహదారికి ఇరువైపులా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండాల్సిన పరిసరాలు అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ, పట్టింపులేనితనంతో రోడ్డు పక్కన ఇష్టారాజ్యంగా చెత్తను డంపింగ్ చేస్తున్నారు. చెత్తను, వ్యర్థాలను పారేయడంతో రాకపోకలు సాగించేవారు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డున వెళ్లాలంటే ‘సాహసం శ్వాసగా చేసుకుని’ప్రయాణించాలని వ్యంగ్యంగా చెబుతున్నారు. చెత్త కుప్పలు.... వ్యర్థ పదార్థాలు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ప్రధాన జాతీయ రహదారి 65 జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణం మీదుగా వెళ్తుంది. రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సంగారెడ్డిపట్టణం నుంచి జహీరాబాద్ వెళ్లే రహదారి పక్కన పచ్చని చెట్ల కింద చెత్తను కుప్పలు కుప్పలుగా పారబోస్తున్నారు. అంతే కాకుండా వృథాగా మిగిలిన కూరగాయలు, వివిధ రకాల పండ్లు ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. సంచులలో నింపి పారేసి వెళ్తున్నారు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సంగారెడ్డి శివారులో రోడ్డు పక్కన ప్లాస్టిక్ కాగితాలు చెత్త విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. దీంతో రహదారుల పక్కన డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్నాయి. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు రహదారులకు ఇరువైపులా చెత్తకుప్పలను వేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో చెత్తకుప్పలో నుంచి ప్లాస్టిక్ కాగితాలు, చెత్తాచెదారం రహదారుల పైకి వస్తోంది. చెత్తకుప్పలకు మంట పెట్టిన సమయంలో వచ్చే పొగతో ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు చెబుతున్నారు. ఫలితంగా వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. మూగజీవాలకు సైతం ఇబ్బందులు చెత్త వేసిన ప్రాంతాలలో పశువులు సంచరించడంతో వాటికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కుళ్లిన వ్యర్థాలు తినడంతో రోగాల బారిన పడే అవకాశం ఉంది. రహదారులకు ఇరువైపులా చెత్తను వేయకుండా చూడాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన కనీసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు చెబుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు చెత్తను పారబోయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. చెత్తను ఇష్టానుసారంగా పారబోస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. వెదజల్లుతున్న దుర్వాసన వివిధ రకాల కూరగాయలు, పండ్లు ఇతర రకాల వ్యర్థాలను ఇష్టానుసారంగా పారేస్తున్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. తోడుగా కురిసిన వర్షం నీటికి మరింతగా భరించలేని కంపు కొడుతోంది. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించే వాహనదారులు దుర్వాసనకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అంతేకాకుండా పలు సందర్భాలలో చెత్తను కుప్పలు గా వేసి తగలబెడుతున్నారు. వృక్షాలుగా మారిన మొక్కలు కాలిపోతున్నాయి. జాతీయ రహదారిపక్కనే చెత్త డంపింగ్ కుప్పలు కుప్పలుగా వ్యర్థ పదార్థాలు ఇష్టానుసారంగా వదిలేస్తున్న వైనం రహదారుల పక్కన వెదజల్లుతున్న దుర్వాసన పట్టించుకోని అధికారులు -
డంప్‌యార్డును పరిశీలించిన డీపీఓ
కంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కంది శివారులో గల డంప్‌యార్డును శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) సాయిబాబ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శనివారం నుంచి జేసీబీలతో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రక్కన పేరుకు పోయిన చెత్తను ప్రస్తుతం ఉన్న షెడ్డు వద్దకు తరలించాలని సూచించారు. షెడ్డును పూర్తిస్థాయిలో వినియోగించుకుని చెత్తశుద్ధి యంత్రంతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్నారు. అలాగే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీయల్పీవోఅనిత, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి విద్యాధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం
ఇరుక్కుపోయిన డ్రైవర్.. తీవ్ర గాయాలు తూప్రాన్: ముందు వెళుతున్న కంటైనర్‌ను వెనకాల నుంచి డీసీఎం ఢీకొనడంతో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనకాల నుంచి డీసీఎం అతివేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన డీసీఎం డ్రైవర్ కబ్రేజ్ క్యాబిన్‌లోనే ఇరక్కుపోయాడు. కుడికాలు నుజ్జునుజ్జయింది. జీఎమ్మార్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు స్తంభించి పోయాయి. -
తప్పిపోయిన బాలుడు తల్లి చెంతకు
పటాన్చెరు టౌన్: తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లోనే తల్లి వద్దకు చేర్చిన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేష్ కథనం ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా కాలనీ శివాలయం రోడ్డుకు చెందిన హనుమంత్ కుమారుడు కృష్ణ (3) శుక్రవారం ఆడుకుంటూ తప్పిపోయాడు. ఒక దగ్గర ఏడ్చుకుంటూ కనిపించడంతో స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాల కోసం ఆరాతీయగా.. బీరంగూడలోని శివాలయం రోడ్డుకు చెందిన హనుమంతు, సునంద దంపతుల కుమారుడు కృష్ణగా గుర్తించారు. బాలుడిని తల్లి సునందకు అప్పగించారు. దీంతో కానిస్టేబుళ్లు స్వప్న, మహేశ్వర్, జయరాజ్‌లకు ఆమెఓ కృతజ్ఞతలు తెలిపింది. తప్పిపోయిన శిశువు ఎక్కడ? కొల్చారం/చిలప్‌చెడ్(నర్సాపూర్): తప్పిపోయిన ఆరు నెలల పసికందును అమ్మేశారా.. లేక చంపేశారా అన్న విషయం కొల్చారం, ఇటు చిలప్‌చెడ్ మండలాలలో చర్చనీయాంశంగా మారింది. చిలప్‌చెడ్ మండలం టోప్యా తండాకు చెందిన మహిళను కొల్చారం మండలం సీతారాంతండాకు చెందిన నునావత్ రాజుతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి నాలుగు నెలల పాప ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో జనవరి 20న రాజు ఇంటికి వచ్చే సరికి తల్లికూతుళ్లు కనిపించలేదు. ఈ , విషయాన్ని తన మామకు తెలియజేశాడు. జనవరి 28న కేసు నమోదు చేయడంతో తల్లిని తీసుకొచ్చారు. చిన్నారి గురించి తల్లిని విచారించగా, పొంతన లేని సమాధానాలు ఇస్తుందని పోలీసులు తెలిపారు. కాగా తన భార్య, కూతురు అదృశ్యమైన విషయమై తాను ముందుగానే కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, పోలీసులు తనను విచారణ చేసి కేసు నమోదు చేయలేదని, తన భార్య తండ్రి దీప్ల ఫిర్యాదును కేసుగా నమోదు చేయడం ఏమిటని రాజు అనుమానం వ్యక్తం చేశాడు. యువకుడి ఆత్మహత్య హవేళిఘణాపూర్ (మెదక్): ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. హవేళిఘణాపూర్కు చెందిన నరేశ్ (24) కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేశ్.. ఇంట్లో తలుపులు వేసుకొని దూలానికి ఉరి వేసుకున్నాడు. గమనించిన అతని కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. బైండోవర్ ఉల్లంఘనలో జరిమాన అక్కన్నపేట(హుస్నాబాద్): బైండోవర్ ఉల్లంఘన కేసులో ఇద్దరికి జరిమానా విధించారు. ఈ సంఘటన అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ ఎకై ్సజ్ శాఖ సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోతు భూలి, ఈర్య గతంలో గుడుంబా కేసులో తహసీల్థార్ ఎదుట బైండోవర్ అయ్యారు. ఇటీవల మళ్లీ గుడుంబా తయారీ చేస్తూ పట్టుబడటంతో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘన కింద తహసీల్దార్ అనంతరెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరికి రూ.50 వేల చొప్పన జరిమాన విధించారు. యువకుడి అదృశ్యంపటాన్చెరు టౌన్: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి కథనం ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మారావు కాలనీకి చెందిన వేణు ప్రసాద్ (21) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న బయటకెళ్తున్నానని తన తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేసి చూడగా స్విచ్ ఆఫ్ ఉంది. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు ఈ సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి ఫసల్వాది గ్రామానికి చెందిన బైండ్ల ప్రవీణ్ (21) పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలోని తోషిబా కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన స్నేహితుడు ఇమ్రాన్‌తో కలిసి కంపెనీలో తనకు వచ్చే డబ్బులు తీసుకోవడానికి వెళ్లాడు. అక్కడి నుంచి పాశమైలారానికి ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. రుద్రారం శివారులో పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రవీణ్‌కు సంవత్సరం క్రితమే వివాహం జరిగిందని, ప్రస్తుతం అతడి భార్య గర్భవతి అని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. నిజామాబాద్ వాసి మృతి రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణ శివారులో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవన్‌పల్లి సాకేత్ (19) మృతి చెందాడు. సాకేత్ తన స్నేహితుడు శివతో కలసి స్కూటీపై హైదరాబాద్ వెళుతుండగా, రామాయంపేట శివారులో ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనగా, తలకు తీవ్ర గాయాలవడంతో సాకేత్ అక్కడికక్కడే మృతి చెందగా, శివ తీవ్రంగా గాయపడ్డాడు. సాకేత్ హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తేనే...
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యలను స్థానికులు అనేకసార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకున్న పాపానపోవడంలేదు. ఇక చేసేదేమీ లేక ఆ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. వెంటనే తన దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలపై కలెక్టర్ స్పందించడంతోపాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అనేక సమస్యలు కలెక్టర్ పుణ్యమంటూ పరిష్కారమయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ దృష్టికి వచ్చిన సమస్యలపై స్థానిక అధికారులను వివరణ కోరడంతోపాటు వాటిని వెంటనే పరిష్కారించాలని ఆదేశిస్తుండటంతో స్థానిక అధికారులు ఆగమేఘాలమీద చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది తెల్లాపూర్ పరిధిలో జోరుగా నీటి దందా జరగడంతో దీనిని అరికట్టాలని స్థానికులు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోకపోవటంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాత్రికి రాత్రే అధికారులు నీటి ట్యాంకర్లను సీజ్ చేశారు. తిరిగి కొద్ది రోజులుగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో జోరుగా నీటి దందా మొదలైంది. దీనిని నియంత్రించాలని అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకునిపోవడంతో అధికారులలో తిరిగి చలనం వచ్చింది. అక్రమ నిర్మాణాలపై సైతం అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో నేరుగా కలెక్టర్ దృష్టికే తీసుకునిపోతున్నారు. లేదంటే ఎక్కడి గొంగళి అక్కడే... సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్న స్థానికులు తలలు పట్టుకుంటున్న అధికారులు -
దూరం పెట్టిందని మట్టుబెట్టాడు
జహీరాబాద్ టౌన్: కొంత కాలం సహజీవనం సాగించిన తర్వాత దూరం పెట్టిందని కక్షతో మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. శుక్రవారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఝరాసంగం మండలం చిలేమామిడికి చెందిన లక్ష్మి(40)కి భర్త లేడు, ఉపాధి కోసం పట్టణానికి వచ్చి పస్తాపూర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కోహీర్ మండలం గొటిగార్పల్లికి చెందిన సత్యారం రమేష్(26)కు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. రమేష్ ప్రవర్తన నచ్చక దూరం పెట్టింది. అప్పటి నుంచి ఆమైపె కక్ష పెంచుకున్నాడు. తనను దూరం పెట్టి మరొకడితో ఉంటుందన్న కోపంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించాడు. మార్చి 29న రమేష్ కల్లుతాగి లక్ష్మికి ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న పెంట్రోల్ను పోసి నిప్పు పెట్టాలని చూశాడు. గట్టిగా కేకలు వేయడంతో పక్కింటి మహిళా మరియమ్మ పరుగెత్తుకుంటూ రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అదేనెల 31న ఉదయం రమేష్ మళ్లీ ఆమె ఇంటికి వెళ్లి బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కళ్లలో కారం చల్లి గ్యాస్ సిలిండర్ తీసుకుని తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతురాలి సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. శుక్రవారం హైదరాబాద్ పారిపోవడానికి ఆర్టీసీ బస్డాండ్‌కు రాగా నిందితుడిని అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశామన్నారు. నిందితుడిని సకాలంలో పట్టుకున్న సీఐ.శివలింగం, ఎస్ఐ.కాశీనాథ్, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్టు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
కేబుల్ వైర్ల దొంగ పట్టివేత
కొల్చారం(నర్సాపూర్): బోరు బావుల దగ్గర నుంచి కేబుల్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్తున్న దొంగను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని ఎనగండ్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. చిలప్‌చెడ్ మండలం గౌతాపురం గ్రామానికి చెందిన నదరి భూమయ్య జల్సాలకు అలవాటుపడి వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లను దొంగిలించి, వాటిని అమ్ముకుంటున్నాడు. ఉదయం గ్రామ శివారులోని రక్షిత మంచినీటి బోరు వద్దగల కేబుల్ వైరును దొంగిలిస్తుండగా పట్టుకున్నారు. కేబుల్ వైర్ల దొంగతనం విషయమై భూమయ్యను రైతులు విచారించగా.. చుట్టుపక్కల గ్రామాల్లో సైతం కేబుల్ వైర్లు దొంగతనం చేసినట్లు, దుంపలకుంట చౌరస్తాలో గల ఓ ఇంజనీరింగ్ దుకాణంలో వాటిని అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులకు అప్పగించారు. యువకుడి రిమాండ్మిరుదొడ్డి(దుబ్బాక): అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో ఫార్వాడ్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. మిరుదొడ్డి మండలం లక్షీనగర్కు చెందిన పుట్ట అనిల్ కొన్ని రోజుల క్రితం తన ఫోన్ ద్వారా అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. సైబర్ సెక్యూరిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, డీవీడీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
పన్ను వసూళ్లలో ఖేడ్ టాప్
నారాయణఖేడ్: ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ మున్సిపాలిటీగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ నిలిచింది. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ కమిషనర్ జగ్జీవన్‌కు మున్సిపల్ డైరెక్టర్ సీడీఎంఏ శ్రీదేవి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి నారాయణఖేడ్ మున్సిపాలిటీ ద్వారా 2023–2024, 2024–2025 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యానికి మించి పన్నులను వసూలు చేసినందుకు ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపిక చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.2.62 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, 2023 –2024 సంవత్సరంలో 85% వసూళ్లను చేపట్టగా, 2024 –2025 ఆర్థిక ఏడాదిలో 86.55% రూ.2.32 కోట్లు వసూలు చేశారు. -
అర్హులందరికీ రేషన్‌కార్డులు
● వచ్చేనెల నుంచే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ● మంత్రి దామోదర రాజనర్సింహ ● జోగిపేటలో సన్న బియ్యం పంపిణీకార్యక్రమం ప్రారంభం ● కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష జోగిపేట(అందోల్)/సంగారెడ్డి జోన్: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం జోగిపేట గంజి మైదానంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెకర్ వల్లూరు క్రాంతితో కలసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సన్నరకం బియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల వద్ద సన్న బియ్యం క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించి సేకరించిందన్నారు. తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు అందోలు, జోగిపేట ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. వచ్చే నెల నుంచే అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. పనులు వేగవంతం చేయాలి సంగారెడ్డి మెడికల్ కళాశాల, విద్యార్థుల వసతి గృహం, అందోల్ నర్సింగ్ కళాశాలలోని హాస్టల్స్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. అందోల్‌ను మెడికల్ హబ్‌గా రూపొందించడంలో భాగంగా వట్పల్లి, కంకోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం పనులు వెంటనే పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కొమరయ్య ఆశయ సాధనకు కృషి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి దామోదర పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని కొమరయ్య విగ్రహానికి మంత్రితోపాటు కలెక్టర్ వల్లూరు క్రాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతం కోసం డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాస ప్రయాసలకోర్చి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి పౌరసరఫరాల శాఖ డీఎం రాజేశ్వర్ అంబదాస్, ఆర్డీవో పాండు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మొహన్రెడ్డి, పాల్గొన్నారు. -
పాతాళానికి నీరు
● పడిపోతున్న భూగర్భ జలమట్టం ● ఫిబ్రవరితో పోల్చితే 2.22 మీటర్ల లోతుల్లోకి... ● మనూరులో ప్రమాద ఘంటికలు ● అత్యధికంగా తొమ్మిది మీటర్లుకిందికి పడిపోయిన మట్టంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూగర్భ జల మట్టం పడిపోతోంది. ఎండల తీవ్రతకు జిల్లాలో సగటున 2.5 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. విచ్చలవిడిగా నీటిని తోడేస్తుండటం కూడా ఈ నీటి మట్టం పడిపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరిలో జిల్లా సగటు భూగర్భ జల మట్టం 12.57 మీటర్ల లోతులో ఉండగా, మార్చి మాసానికి వచ్చే సరికి నీటిమట్టం 14.79 మీటర్లలోతుకు పడిపోయింది. అంటే సగటున 2.22 లోతుకు దిగిపోయినట్లు భూగర్భ జలశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది 2024 మార్చితో పోలిస్తే భూగర్భ జల మట్టం పరిస్థితి దారుణంగా ఉంది. 2024 మార్చిలో జిల్లా సగటు నీటి మట్టం 12.45 మీటర్ల లోతులో ఉండగా, ఈ మార్చి నెలాఖరుకి 14.79 మీటర్లు ఉన్నాయి. గతేడాది ఇదే మార్చి నెల కంటే ఈసారి మార్చిలో 2.34 మీటర్లు తగ్గిపోయాయి. భూగర్భ జల నీటి వినియోగం భారీగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. మనూరులో 9 మీటర్లలోతులోకి... జిల్లాలో అత్యధికంగా మనూరు మండలంలో భూగర్భ నీటి మట్టం తగ్గిపోయింది. ఇక్కడ ఏకంగా 9.38 మీటర్ల లోతుకు పడిపోవడం ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ మండలంలో ఫిబ్రవరిలో 5.66 మీటర్ల లోతులో ఉన్న ఈ నీటిమట్టం ఇప్పుడు ఏకంగా 15.04 మీటర్లకు పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. నిజాంపేట్ మండలంలో 19.90 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం..మార్చి వచ్చేసరికి 24.73 మీటర్లకు దిగిపోయింది. కొండాపూర్ మండలంలో కూడా 4.17 మీటర్లు తగ్గాయి. ఈ మండలంలో 12.09 మీటర్ల నుంచి 16.26 మీటర్లకు పడిపోయాయి. 82 చోట్ల ఫీజో మీటర్లు జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టాన్ని లెక్కించేందుకు మొత్తం 82 చోట్ల ఫీజో మీటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో నేషనల్ హైడ్రాలిక్ ప్రాజెక్టు ఆర్థిక సాయం కింద ఏర్పాటు చేసిన ఫీజో మీటర్లు 36 ఉన్నాయి. ఈ 36 ఫీజో మీటర్లు ఆటోమేటిక్‌వి కాగా, మిగిలినవి మ్యానువల్ ఫీజో మీటర్లు. భూగర్భ జలశాఖ అధికారులు ప్రతినెలా 15వ తేదీ నుంచి 28 తేదీ వరకు ఈ ఫీజో మీటర్లలో నీటి మట్టాలను కొలుస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తారు.వర్షాల ప్రభావమే.. గతేడాది మార్చితో పోల్చితే ఈ మార్చిలో భూగర్భ జలాలు పడిపోవడానికి వర్షపాతమే ప్రధాన కారణమని భూగర్భ జలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2021, 2022, 2023 సంవత్సరాల్లో వర్షాకాలంలో సుమారు 40% అధిక వర్షపాతం నమోదైంది. గత వర్షాకాలంలో అంత అధిక వర్షపాతం రికార్డు కాలేదు. కేవలం 20 లోపే అధిక వర్షపాతం నమోదైంది. ఈ కారణంగానే ఈ మార్చిలో భూగర్భ జలమట్టం పడిపోవడానికి ప్రధాన కారణమని ఆ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు భూగర్భ జల వినియోగం పెరగడం కూడా ఒకింత కారణమని అభిప్రాయపడుతున్నారు. అయితే ఏప్రిల్, మే మాసాలకు వచ్చేసరికి మరింత లోతుకు పడిపోయే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. -
పలుచోట్ల అకాల వర్షాలు
రుద్రారంలో 4.9 సెం.మీలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో గురువారం పలు చోట్ల అకాల వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పంటలకు దెబ్బతిన్నాయి. జిల్లాలో పటాన్చెరు మండలం రుద్రారంలో అత్యధికంగా 4.9 సెం.మీల వర్షపాతం నమోదైంది. అలాగే పాశమైలారంలో 2.7 సెం.మీలు, గుమ్మడిదలలో 1.9 సెం.మీలు, చౌటకూర్‌లో 1.7 సెం.మీలు, సంగారెడ్డి 1 సెం.మీ వర్షపాతం రికార్డయింది. సదాశివపేట, మునిపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఇష్రితాబాద్లో పిడుగుపాటుకు 20 మేకలు చనిపోయాయి. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న జిల్లావాసులకు ఈ వర్షం కొంత ఊరట నిచ్చినట్లయింది. ప్రసవాల సంఖ్య పెంచాలిఇమ్యూనైజషన్ అధికారి మనోహర్‌రెడ్డి న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యూనైజషన్ అధికారి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. న్యాల్కల్లోని పీహెచ్‌సీని గురువారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా టీకాలు వేయించుకోని చిన్నారుల కోసం ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డాక్టర్ అమృత్‌రాజ్, హెచ్ఏ గుండయ్య, సీహెచ్‌ఓలు మొగులయ్య, రవికుమార్‌లతోపాటు సుదర్శన్, మార్తా, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పేస్కేల్ వర్తింపజేయాలిరాష్ట్ర ప్రణాళిక చైర్మన్ చిన్నారెడ్డికి వినతి జహీరాబాద్ టౌన్: ఉపాధి హామీ ఉద్యోగులకు పేస్కేల్ వర్తింప చేయాలని ఉపాధిహామీ పథకం జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక చైర్మన్ చిన్నారెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్‌కు వచ్చిన ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అశోక్‌కుమార్, రాజ్‌కుమార్‌లు మాట్లాడుతూ...గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక విభాగంలో పనిచేస్తున్న ఎఫ్టీఐ కాంట్రాక్టు ఉద్యోగులకు పేస్కేల్ అమలు కావడంలేదన్నారు. రాష్ట్రం మొత్తం 3,874 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, సెర్ప్ ఉద్యోగులకు ఇచ్చే విధంగా పేస్కేలు అమలు చేయాలని కోరారు. ఒకే కంప్యూటర్ ఆపరేటర్ల ఉన్న చోట మరొకరిని నియమించాలని, పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ రూ.20 లక్షలు ఇవ్వాలని, సిబ్బంది మరణిస్తే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, బేసిక్‌పై 12% పీఎఫ్ జమచేయాలని కోరారు. సిరుల ‘బ్రహ్మోత్సవం’నాచగిరికి రూ.16 లక్షల ఆదాయం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహుని నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కాసుల వర్షం కురిపించాయి. గత నెల 19 నుంచి పన్నెండు రోజులపాటు కొనసాగిన ఉత్సవాలలో ఆలయానికి రూ.16.13 లక్షల ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. దర్శనం, అభిషేకం, అర్చన, సేవా టికెట్లు తదితర సేవల ద్వారా మొత్తం రూ.16,13,328 ఆదాయం లభించినట్లు ఈఓ విశ్వనాథశర్మ పేర్కొన్నారు. -
చికెన్ ధర దడ దడ
● వేసవి కారణంగా తగ్గిన కోళ్ల ఉత్పత్తి ● అధిక డిమాండ్‌తో ధరలు ౖపైపెకి ● తగ్గిన బర్డ్ ఫ్లూ భయం జోగిపేట(అందోల్): చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్‌ఫ్లూ భయంతో సుమారు రెండు నెలల పాటు కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతోపాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా భారీగా తగ్గిన అమ్మకాలు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా రెండు నెలల క్రితం చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. బర్డ్ ఫ్లూ భయంతో కొందరు రైతులు కోళ్ల పెంపకాన్నే తగ్గించేశారు. కేజీ చికెన్ రూ.150 నుంచి రూ.180 లే ఉన్నా కొనేవారు లేక పోవడంతో చికెన్ షాపులు వెలవెల బోయాయి. కొనుగోలుకు ఆసక్తి బర్డ్ ఫ్లూ భయం క్రమంగా తొలగిపోతోంది. దీంతో సాధారణ రోజుల్లాగే చాలామంది చికెన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికెన్ డిమాండ్ పెరిగందన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదనుగా చికెన్ దుకాణాల నిర్వాహకులు ఒక్కొక్కరూ ఒక్కో ధరకు అమ్ముతున్నారు. జోగిపేట పట్టణంలోని కొన్ని చోట్ల కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.250 ఉంటే.. మరికొన్ని చోట్ల రూ. 270, రూ.280 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఏరియాకో విధంగా రేట్లున్నాయి. ధర భారీగా పెరగడంతో కేజీ చికెన్ తీసుకుందామని వచ్చిన వారు..అర కేజీ, ముప్పావు కేజీకే పరిమితం అవుతున్నారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతోనే ధరలు పెరిగాయని చెబుతున్నారు. పౌల్ట్రీ రైతులకు దక్కని రేటు చికెన్ ధరలు భారీ స్థాయిలో పెరిగినా పౌల్ట్రీ రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. రెండు కిలోల కోడిని పెంచేందుకు 40 రోజుల సమయం పడుతుండగా..ఇందుకు రూ.200 వరకు ఖర్చు అవుతోంది. చికెన్ దుకాణాలకు కోళ్లను సరఫరా చేసే వ్యాపారులు మాత్రం కిలోకు రూ.80, రూ.100 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఏడాది పొడవునా నష్టాలు చవి చూడాల్సి వస్తోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రేడర్లు, సెంటర్ల నిర్వాహకులు ఎవరి మార్జిన్ వారు చూసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారని, రేటు తగ్గినప్పుడల్లా ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. రెండు నెలలు ఇబ్బంది పడ్డాం బర్డ్‌ఫ్లూ సోకిందన్న ప్రచారంతో రెండు మాసాలుగా వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పాటు గిరాకీ లేక కోళ్లు చాలా వరకు చనిపోయాయి. అయినా నిలదొక్కుకున్నాం. ఎండీ.జావీద్, చికెన్ సెంటర్ యజమాని -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మరో ఇద్దరికి గాయాలు మునిపల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మండలంలోని బుదేరా చౌరస్తా 65వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. గురువారం బుదేరా గ్రామానికి చెందిన వనంపల్లి రమేశ్ (30) అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఎక్సెల్ వాహనంపై టీ తాగడానికి వస్తున్నారు. ఇదే సమయంలో సంగారెడ్డి నుంచి అతివేగంగా వచ్చిన క్వాలీస్ వాహనం ఎక్సెల్‌ను, అనంతరం ఇద్దరు పాదాచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వర్షానికి గోడ కూలి వ్యక్తి మృతి
గజ్వేల్‌రూరల్: వర్షానికి ప్రహరీ గోడ కూలి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జాలిగామ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. గజ్వేల్ పట్టణానికి చెందిన హిమ్మత్ఖాన్ 45)కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఎలక్ట్రిషియన్‌గా పని చేసే హిమ్మత్ఖాన్ జాలిగామ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాంలో గురువారం పనికి వెళ్లాడు. వర్షం రావడంతో ప్రహరీ గోడ కూలగా శిథిలాల్లో ఇరుక్కొని హిమ్మత్ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కిందపడి మేసీ్త్ర చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన చిట్టోజిపల్లిలోని పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమ జిల్లాకు చెందిన బూంది బగేల్(40) చిట్టోజిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న జిటెక్ పరిశ్రమలో మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. పైన పనులు చేస్తున్న క్రమంలో కాలుజారి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన అతడిని నార్సింగి ప్రైవేటు ఆస్పత్రికి తర లించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలి పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నీటి గుంటలో పడి గుర్తు తెలియని వ్యక్తి.. జిన్నారం (పటాన్చెరు): గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం మేరకు.. బొల్లారంలోని జ్యోతి థియేటర్ సమీపంలో 45 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి వర్షం కురుస్తుండగా మూర్చ వ్యాధితో కిందపడ్డాడు. స్థానికులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మల్లన్న బస్తీ సమీపంలో ప్రమాదవశాత్తు చిన్న నీటి గుంటలో పడి మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి కుదరడంలేదని బలవన్మరణం
చేగుంట(తూప్రాన్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశివనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యరెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్(32)కు రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల గొడవతో మనస్తాపం చెంది పాపన్నపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న మండల పరిధిలోని నార్సి ంగిలో గురువారం వెలుగు చూసింది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మంగలి సత్తయ్య, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నరేశ్ కుమార్(26) పీజీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. కొద్దిరోజులుగా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలతో మనస్తాపం చెందిన నరేశ్ కుమార్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
టీచర్ అసభ్యకర ప్రవర్తనపై విచారణ
పాపన్నపేట(మెదక్): మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా టీచర్‌పై తోటి టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని వచ్చిన ఆరోపణలపై పాపన్నపేట ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్‌రావు గురువారం విచారణ జరిపారు. డీఈఓ రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు విచారణ జరిపి స్థానిక హెచ్ఎం, టీచర్లు, మధ్యాహ్న భోజన ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మహిళల నుంచి లిఖిత పూర్వ వివరణ తీసుకున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వివరించారు. ఆల్ ఇండియా క్రీడా పోటీలకు కోహెడ యువకుడు కోహెడ(హుస్నాబాద్): ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలకు ఎంపికై నట్లు కోహెడ మండల కేంద్రానికి చెందిన యువకుడు హరిప్రసాద్ తెలిపారు. గురువారం యువకుడు మాట్లాడుతూ.. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. టగ్ ఆఫ్ వార్ క్రీడలో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు 5 నుంచి 9 వరకు పంజాబ్‌లోని లమ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీలో జరుగనున్నట్లు తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూల్ కోహెడ ప్రిన్సిపాల్ కె.నరేందర్‌రెడ్డి ప్రోత్సాహంగా తనకు రూ.10 వేలు అందించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కనీస వేతనం చెల్లించాలి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి సిద్దిపేటఅర్బన్: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై గోపాలస్వామి మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తామని, అర్హత కలిగిన వారిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు నెల నెలా ఇవ్వడం లేదని విమర్శించారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 7న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 19 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్‌కుమార్, జిల్లా నాయకులు ప్రభాకర్, రాజమౌళి, కనకయ్య, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి దుబ్బాకరూరల్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజ్ కథనం మేరకు.. కొక్కడగల్ల భాగ్యమ్మ(45) కొద్దిరోజుల కిందట భర్త చెందగా, కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులుండగా సిద్దిపేటలో పని చేస్తున్నారు. భాగ్యమ్మ తమ్ముడు పరమేశ్వర్ బుధవారం రాత్రి వచ్చి ఆమెతో మాట్లాడిచ్చి తిరిగి ఇంటికి వెళ్లి పోయాడు. పరమేశ్వర్ గురువారం ఉదయం వచ్చి చూసే సరికి భాగ్యమ్మ అన్నం తింటూ కూర్చున్న చోటే చనిపోయి ఉంది. చుట్టు పక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎండు గంజాయి, నాటు తుపాకీ పట్టివేత
ఒకరు రిమాండ్, పరారీలో మరో ఇద్దరు జిన్నారం (పటాన్చెరు): ఎండు గంజాయితోపాటు నాటు తుపాకీ, రెండు బుల్లెట్లను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. జిన్నారం సీఐ నయీముద్దీన్ కథనం మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన భూపేందర్ కుమార్ శర్మ (24) గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు గ్రామంలో పదేళ్లుగా ఉంటున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన మిథున్ ఆరేళ్లుగా దోమడుగు గ్రామంలో అద్దెకుంటూ శ్యాంపిస్తిన్ పరిశ్రమల కా ర్మికులుగా పని చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇద్దరూ కలిసి అప్పుడప్పుడూ సొంత రాష్ట్రానికి వెళ్లి ఎండు గంజాయిని తీసుకొచ్చి చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో పారిశ్రామిక వాడలో విక్రయిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో భూపేందర్ కుమార్ శర్మ సొంత రాష్ట్రానికి వెళ్లి పక్క గ్రామానికి చెందిన రోహిత్ అనే వ్యక్తి దగ్గర తపంచా నాటు తుపాకీతోపాటు రెండు గుండ్లు కొనుగోలు చేశాడు. దోమడుగు గ్రామంలో అద్దె ఇంట్లో వాటిని భద్రపరిచాడు. మిథున్ బీహార్ కు వెళ్లి ఎండు గంజాయిని తీసుకొచ్చి శర్మకు ఇవ్వగా వాటిని ఇంట్లో దాచాడు. గురువారం గుమ్మడిదల పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 930 గ్రాముల ఎండు గంజాయితోపాటు, నాటు తుపాకీ, రెండు బుల్లెట్లు గంజాయి ప్యాకింగ్ చేయడానికి వాడే వేయింగ్ మిషన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి భూపేందర్ కుమార్ శర్మను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు మిథున్, రోహిత్ పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామన్నారు. -
విష ప్రయోగమా.. ఆత్మహత్యా..?
● వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి ● మంత్రాల నెపంతో ఊరు వదిలిన వైనం ● ఏడాది నుంచి వ్యవసాయ క్షేత్రం వద్ద నివాసం ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ మధు, రూరల్ సీఐ శ్రీనునంగునూరు(సిద్దిపేట): వ్యవసాయ బావి వద్ద నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరులో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల కొమురయ్య (80), భూదవ్వ(70) దంపతులు. వీరికి మంత్రాలు వస్తాయనే అనుమానంతో ఏడాది కిందట గ్రామంలో గొడవ జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ తమ వ్యవసాయ బావి వద్ద ఉన్న గదిలో నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారు జామున వారి కుమారుడు పరుశరాములు వచ్చి చూడగా.. తలుపు గడియ పెట్టి ఉండడంతో దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. తల్లిదండ్రులిద్దరూ మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సిద్దిపేట ఏసీపీ మధు, రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ ఆసిఫ్ సంఘటన స్థలంలో మృతదేహాలను పరిశీలించారు. కుమారుడు పర్షరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విష ప్రయోగం చేశారా..? వ్యవసాయం క్షేత్రం వద్ద ఉంటున్న కొమురయ్య, భూదవ్వ దంపతులపై మంత్రాలు చేస్తారనే అభియోగం ఉంది. ఏడాది నుంచి గ్రామంలోకి రా కుండా వ్యవసాయ క్షేత్రం వద్దే ఉంటున్నారు. తల్లిదండ్రులకు కుమారుడు పరుశరాములు ప్రతి రోజు ఇంటి నుంచి భోజనం తెచ్చి ఇస్తున్నాడు. ఒకే రోజు వృద్ధ దంపతులు మృతి చెందడం, శరీరంపై ఎలాంటి గాయాలు, పెనుగులాడిన ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భోజనంలో విషం కలిపి చంపారా.. లేక ఆత్మహత్య చేసుకున్నారా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
● యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్ ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన నర్సాపూర్ రూరల్: యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్ సూచించారు. గురువారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమాయకంగా ఉండే యువతతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని డ్రగ్స్ ముఠా టార్గెట్ చేసుకొని మత్తు పదార్థాలకు అలవాటు చేయడంతో పాటు డబ్బుల ఆశ చూపి వ్యాపారం చేయిస్తారని అన్నారు. తాత్కాలిక సంతోషాల కోసం పొరపాటు చేస్తే బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం 1985 చట్టం చాలా శక్తివంతమైందన్నారు. మత్తు పదార్థాలు సేవించినా, రవాణా చేసినా 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష ఉంటుందని సూచించారు. 13 రకాల డ్రగ్స్ ను గుర్తించే కిట్లు ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, ప్రోగ్రామ్ అధికారి సురేశ్ కుమార్, అధ్యాపక బృందం రమేశ్, మహేందర్ రెడ్డి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
హెచ్‌సీయూ భూములు అమ్మొద్దు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములు అమ్మొద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను సీఎం రేవంత్‌రెడ్డి రియల్ వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు అమ్మేందుకు చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమిస్తుంటే వారిపై పోలీసులు లాఠీ చార్జి చేయడం విచారకరమన్నారు. ఒక చెట్టు కొట్టాలంటే తహసీల్దార్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా రాత్రికి రాత్రి యూనివర్సిటీ భూముల్లో వందలాది చెట్లను నరికి వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విదేశీ మహిళపై, రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై అఘాయిత్యాలు జరిగాయని, రోజు ఇలాంటి దుర్ఘటనలు జరగడం సర్వసాధరణమైయ్యాయని ఆమె వివరిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. నేడు మంత్రి దామోదర రాక మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నర్సా పూర్ రానున్నట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తా రని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, నర్సింలు, ప్రసాద్, సుధాకర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, పాష, తదితరులు పాల్గొన్నారు. -
ధర పడిపోయి.. టమాటా చితికిపోయి
జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి చెందిన రాములు అనే రైతు రెండు ఎకరాల్లో టమాటా పంట వేశాడు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఆశాజనకంగా ఉంది. కానీ పంట చేతికందుతున్న సమయంలో ధరలు పడిపోవడంతో నష్టపోవాల్సి వస్తుంది. ఝరాసంగం మండలంలోని కంబాలపల్లి గ్రామ రైతు తెనుగు శ్రీనివాస్ రెండు ఎకరాల్లో టమాటా పంట వేశాడు. సుమారు రూ. 60 వేలకు పైగా పెట్టబడి పెట్టాడు. ధరలు పతనం కావడంతో నష్టపోయాడు. కూలీ, రవాణా చార్జీలు కూడా రావడం లేదు. ఇలా జహీరాబాద్ నియోజకవర్గంలో టమాటా పంట పండిస్తున్న రైతుల పరిస్థితి ఉంది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ● కిలో రూ.10 అయినా ఎవరూ కొనని పరిస్థితి ● పెట్టుబడులు కూడా రాక రైతుల ఆందోళన ● పొలాల్లో వదిలేస్తున్న పంట జహీరాబాద్ టౌన్: జిల్లాలో సుమారు 560 ఎకరాల్లో టమాటా పంట ఉంటుంది. టమాటా నారు అందుబాటులో ఉండడం వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. పడిపోయిన ధరల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జహీరాబాద్ మార్కెట్‌కు లోకల్ టమాటాతోపాటు మహారాష్ట్ర నుంచి టమాటా వస్తుంది. డిమాండ్ కన్న దాదాపు రెట్టింపు రావడం వల్ల ధరలు పడిపోవడానికి కారణమవుతుంది. ఒక్కసారిగా పంట చేతికిరావడంతో ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో రూ.10 అయినా ఎవరూ కొనడానికి ముందుకు రావడంలేదు. కూలీలు, రవాణా ఛార్జీలు మీద పడుతున్నాయని కొంత మంది రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. దీంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
సిద్దిపేటఎడ్యుకేషన్: సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ తరాల మనుగడకు ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సహజ వనరులను, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రముఖ పర్యావరణ వేత్త, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో పర్యావరణ సమతుల్యత సమగ్రాభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న రెండ్రోజుల జాతీయ సదస్సును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీతతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వస్తున్న నూతన సాంకేతిక అవశ్యకతను గూర్చి ఐఐటీ హైద్రాబాద్ ప్రొఫసర్ సుబ్రమణ్యం, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాల ఆవశ్యకతపై ఆహార యోగా(ఎన్జీఓ) వ్యవస్థాపకుడు సామ ఎల్లారెడ్డి సమగ్రంగా వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 150 పరిశోధన పత్రాలు సదస్సుకు వచ్చాయని కన్వీనర్లు డా.హరిబాబు, డా. అయోధ్యరెడ్డి చెప్పారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ సదస్సులతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, సదస్సు నిర్వా హకులను అభినందించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) ఆర్థిక సహకారంతో, పొలిటికల్ సైన్స్, జువాలజీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.మధుసూదన్, మెదక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, కళాశాల సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు డా.లీలావతి, డా.ఉమామహేశ్వరీ, డా.మహేశ్, సుమలత తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలను కాపాడుకుందాం పర్యావరణ జాతీయ సదస్సులో వక్తలు -
పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
జిన్నారం (పటాన్చెరు): పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంబాపూర్ సమీపంలోని తిరుమల ఆయిల్ క్యాం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేపర్ పరిశ్రమలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేపర్ మెటీరియల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యాజమాన్యం ఫైర్ ఇంజన్లు, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకో గా ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీజేపీ కుట్రలను తిప్పికొడదాం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తొగుట(దుబ్బాక): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు అనేక రకాల కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం ఆరోపించారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం నుంచి కాన్గల్ గ్రామానికి గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తోందన్నారు. ఏఐసీసీ అధ్య క్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతారని అన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. తుక్కాపూర్‌లో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని విజయవంతం చేయాలని ప్రీతం అధికారులకు సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తని ఖీ చేసి కుల ఆదాయ ధ్రువపత్రాలు త్వరగా అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
పరిమితిలోపే ప్రజలకు వైద్యం చేయాలి
ఆర్ఎంపీ, పీఎంపీలకు డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ హెచ్చరిక సిద్దిపేటకమాన్: ఆర్ఎంపీ, పీఎంపీలు పరిమితికి లోబడి చికిత్స అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వన్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, పీసీపీఎన్డీటీ యాక్ట్‌పై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నేటి నుంచి డివిజన్ల వారీగా ప్రైవేటు ఆస్పత్రుల పనితీరుపై అధికారులు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఆరోగ్య సేవలకు సంబంధించిన ధరల పట్టికను తప్పనిసరిగా డిస్ప్లే చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్టేజ్, వైద్యుల పేర్లు, సిబ్బంది ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహకులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిర్వహించాలని, గడువు ముగిసిన ఆస్పత్రులు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. స్కానింగ్ మెషీన్ మార్పిడి, డాక్టర్ పేరు మార్పిడికి వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రిజిస్ట్రేషన్‌లో ఉన్న వైద్యుడికి బదులు మరొక వైద్యుడు వైద్య సేవలందించే వారిపై చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. -
రెండు బైక్‌లు ఢీ : ఒకరికి గాయాలు
నిజాంపేట(మెదక్): రెండు బైక్‌లు ఢీకొని ఒకరికి గాయాలైన ఘటన మండల పరిధిలోని కల్వకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డిపేట్ గ్రామానికి చెందిన చింతకింది భాను స్వగ్రామం నుంచి పులిమామిడికి బైక్‌పై పని నిమిత్తం వెళ్తున్నాడు. కల్వకుంట్ల గ్రామ శివారులోకి రాగానే నార్లాపూర్ గ్రామానికి చెందిన బెజమైన వెంకటేశ్ బైక్‌పై అజాగ్రత్తగా వచ్చి భాను బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భానుకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడి చిన్నాన్న రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పురాణేతిహాసాల్లో ప్రసన్న కథాకలితార్థయుక్తి
అష్టావధాని బ్రహ్మశ్రీ గౌరిభట్ల రుక్మిణీ బాలముకుందశర్మసిద్దిపేట ఎడ్యుకేషన్:పురాణేతిహాసాలలో ప్రసన్న కథాకలితార్థయుక్తి కల్గి ఉందని, అభినవశుక పండిత, సమన్వయ సార్వభౌమ బిరుదాంకితులు, అష్టావధాని బ్రహ్మశ్రీ గౌరీభట్ల రుక్మిణీ బాలముకుందశర్మ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపే టలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రాచీన సాహిత్యం – కవితారీతులు అనే సదస్సులో పురాణేతిహాసాలలో ప్రసన్న కథాకలితార్థయుక్తి అనే అంశంపై బాలముకుందశర్మ ప్రసంగించారు. నన్నయ గారి కవితా లక్షణాల్లో మొదటిదైన ప్రసన్న కథాకలితార్థయుక్తి. ఈ లక్షణం నన్నయకు ముందే పురాణేతిహాసాల్లో కనిపిస్తుందని నిరూపించడం ఈ ఉపన్యాస లక్ష్యం. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, తెలుగు విభాగాధిపతి డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి, తెలుగు విభాగ అధ్యాపకులను అభినందిస్తూ ప్రాచీన సాహిత్యం పైన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో పిట్ల దాసు, వెంకటరమణ, సంపత్, రామస్వామి, నరేశ్, నర్సింలు, శైలజ, రమణ, సాయి సురేశ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి బీటెక్ విద్యార్థి మృతి
నర్సాపూర్ రూరల్: చెరువులో మునిగి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన నర్సాపూర్ రాయరావు చెరువులో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ లింగం కథనం మేరకు.. హైదరాబాద్‌లోని గాజుల రామారానికి చెందిన మనీశ్(19) వీఎన్ఆర్ కళాశాలలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. ముందే స్నేహితులతో వేసుకున్న ప్లాన్ ప్రకారం అతడి మిత్రులు హరి శంకర వర ప్రసాద్, ప్రియాకర్, కౌటిల్య, సంజయ్, సాత్విక్, రాగ, తన్వి మొత్తం 8 మంది కలిసి నర్సాపూర్ రాయరావు చెరువు వద్దకు వచ్చారు. అక్కడ కట్టపై ఉన్న పార్కులో కాలక్షేపం చేసి అనంతరం మధ్యాహ్నం చెరువు తూము వద్ద ఉన్న మెట్లపై నుంచి నీటి అంచుకు చేరుకున్నారు. మెట్లపై నుంచి నీటిలో కాళ్లు పెట్టి సరదాగా ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మనీశ్ నీటిలో పడిపోయి మునిగిపోయాడు. మిత్రుడు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సాయంతో మనీశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. రాయరావు చెరువు వద్దకు వచ్చి కాలక్షేపంతోపాటు విద్యార్థులు మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాలక్షేపం కోసం నర్సాపూర్ వచ్చిన 8 మంది విద్యార్థులు కాళ్లు కడుక్కుంటుండగా నీట మునిగి మృత్యువాత మృతుడిది హైదరాబాద్‌లోని గాజుల రామారం -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
బుధవారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇందులో ఓ వ్యక్తి, వలసకూలీ, విద్యార్థి ఉన్నారు. సోదరి ఇంటికని వెళ్లి వ్యక్తి.. జిన్నారం (పటాన్చెరు): వ్యక్తి అదృశ్యమైన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు.. కానుకుంట గ్రామానికి చెందిన జాంగీర్ (55) 25న తన సోదరి ముంతాజ్ చార్మినార్‌లో ఉంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం జాంగీర్ సోదరుడు మహమ్మద్ గౌస్ ముంతాజ్‌కు ఫోన్ చేసి జాంగిర్ వచ్చిన విషయంపై ఆరా తీయగా రాలేదని చెప్పింది. చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెల్లాపూర్‌లో వలస కూలీ రామచంద్రాపురం(పటాన్చెరు): కూలీ అదృశ్యమైన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం జరిగింది. కొల్లూరు పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిజయ్ రబీ దాస్ జీవనోపాధి కోసం తెల్లాపూర్‌కు రెండు నెలల కిందట వలసొచ్చాడు. తెల్లాపూర్‌లోని చెరువు కట్ట సమీపంలో గుడిసెలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. గత నెల 28న తోటి కూలీలు పనికి రావాలని పిలువగా రానని చెప్పాడు. సాయంత్రం తోటి కూలీలు గుడిసె వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. దీంతో బుధవారం కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. హాస్టల్‌కని వెళ్లి విద్యార్థి చేగుంట (తూప్రాన్): హాస్టల్‌కి వెళ్లి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి కథనం మేరకు.. మాసాయిపేట మండలం రామంతపురం తండాకు చెందిన అంగోత్ సుధాకర్ రామాయంపేట ఎస్టీ బాలుర వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో అస్వస్థతకు గురికాగా తండాకు తీసుకొచ్చారు. జ్వరం తగ్గాక గత నెల 11న హాస్టల్‌కి వెళ్లమని చేగుంటలో తండ్రి శ్రీను రామయంపేట బస్సు ఎక్కించాడు. ఇటీవల ఉగాది పండుగ కోసం సుధాకర్‌ను ఇంటికి తీసుకురావడానికి తండ్రి హాస్టల్‌కు వెళ్లగా సుధాకర్ హాస్టల్‌కు రాలేదని వార్డెన్ తెలిపాడు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మెర్స్‌డెస్ బెంజ్ బీవీజనీర్స్ ఫెలోషిప్‌కు ఎంపిక
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్‌కు చెందిన రవీందర్ బాలమణి దంపతులు కుమారుడు జెర్ర స్వామినాథన్ ప్రతిష్టాత్మకమైన మెర్స్‌డెస్ బెంజ్ బీవీజనీర్స్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక వెయ్యి మంది యువ ఇన్నోవేటర్లను మెర్సిడెస్ బెంజ్ బీవీజనీర్స్ ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా స్వామినాథన్ ఎంపికై తన ప్రతిభను చాటాడు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబాయితోపాటు జర్మనీ వంటి దేశాల్లో జరిగే ప్రపంచ స్థాయి ఇన్నోవేటర్లతో జరిగే సమావేశాల్లో స్వామినాథన్ పాల్గొననున్నాడు. రాష్ట్రం నుంచి స్వామినాథన్ ఎంపిక కావడంపై ఖాజీపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గంజాయి విక్రేత అరెస్ట్ నర్సాపూర్: గంజాయి అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ గోపాల్ తెలిపారు. నర్సాపూర్‌లోని జగన్నాధరావు కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్ ఇంట్లో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందింది. బుధవారం సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయగా ఇంట్లో 310 గ్రాముల గంజాయి దొరికిందని, వెంటనే అరెస్టు చేసి ఎకై ్సజ్ ఇన్చార్జి సీఐ ఖాజా పాషకు అప్పగించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో తనతోపాటు ఎస్ఐ బాలయ్య, ఇతర సిబ్బంది చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, రవి, నవీన్, నరేశ్ పాల్గొన్నారని సీఐ తెలిపారు. అతిగా మద్యం తాగి పర్మిట్ రూమ్‌లోనే మృతి చిలప్‌చెడ్(నర్సాపూర్): అతిగా మద్యం సేవిస్తూ పర్మిట్ రూమ్‌లోనే అపస్మారక స్థితికి చేరుకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిలప్‌చెడ్ మండలం జగ్గంపేట శివారులో చోటు చేసుకుంది. బుధవారం ఎస్ఐ నర్సింహులు కథనం మేరకు.. హత్నూర మండలం సిరిపుర గ్రామానికి చెందిన గంగిరెదుల్ద భాషా (45) వడ్డె మల్లయ్య, గంగిరెద్దుల గోవిందులతో కలిసి జగ్గంపేటలో గల ఎస్వీఆర్ వైన్స్‌లో గల పర్మిట్ రూమ్‌లో అతిగా మద్యం సేవించి కింద పడిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న భాషా కుమారుడు అంబదాసు వచ్చి తండ్రిని లేపగా లేవకపోవడంతో వైద్యుడిని పిలిపించాడు. డాక్టర్ పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కడుపునొప్పి భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య తూప్రాన్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి కథనం మేరకు.. గ్రామానికి చెందిన అరకల శ్రీనివాస్(56) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి తిని పడుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి కొంపల్లిలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో జరిమానా గజ్వేల్‌రూరల్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి కోర్డు జైలు శిక్ష విధించినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళీ పేర్కొన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో 12 మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వీరిని బుధవారం గజ్వేల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక ఎదుట హాజరు పర్చగా విచారణ అనంతరం 12 మందికి రూ. 8,700 జరిమానాతో పాటు ఓ వ్యక్తికి రెండ్రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
పెద్దల గెట్టు తాకని భూసేకరణ
పెద్దల జోలికి వెళ్లని అధికారులు ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించే భూములు పెద్ద గెట్టు తాకకుండా పేదల భూములనే సేకరించడం విశేషం. తోటపల్లి శివారులో రోడ్డుకు రెండు వైపుల భూములు ఉన్నప్పటికీ పెద్దలవి వదిలేసి పేదల వ్యవసాయ భూములు, రోడ్డు పక్కనే 11 మంది నివాస స్థలాలు 22 గుంటలను కూడా సేకరణలో నమో దు చేశారు. ఒక్కొక్క ప్లాటుకు రూ.7 లక్షలకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల సాకుతో పేదల భూములకు ఎసరు ● వైఎస్సార్ రుణమాఫీతో పేదలకు భూమి హక్కులు ● బోర్లు వేసుకొని పంటలు సాగు ● ఇండస్ట్రియల్ పార్కుతో పేదల ఆందోళన ● వదిలేయాలని బాధితుల డిమాండ్ హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ డివిజన్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి, టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడానికి భూమి కావాలని రెవెన్యూ అధికారులను కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు కనీసం 105 ఎకరాల వరకు అవసరం ఉంటుందని చెప్పారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో 312 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి 83.36 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు సూచించారు. ఇదే మండలం జనగామ శివారులో 15.20 ఎకరాలను సేకరణకు రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అలాగే, హుస్నాబాద్ మండలం తోటపల్లి శివారులో 25.20 ఎకరాల భూమిని సేకరించడానికి అధికారులు సర్వే చేశారు. మొత్తం 124 ఎకరాల 36 గుంటలకు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి 15 రోజుల కిందట మొదటి దఫా గ్రామ సభ చౌటపల్లిలో ఏర్పాటు చేశారు. రైతులు మా భూములు ఇయ్యమని వ్యతిరేకించడంతో మరోసారి గ్రామ సభ ఏర్పాటు చేయొచ్చని అధికారులు వెళ్లిపోయారు. పరిశ్రమల సాకుతో పేదల భూమికి ఎసరు.. చౌటపల్లి సర్వే నంబరు 312లో 83.36 ఎకరాల అసైన్డ్ భూముల సమస్యల రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. పట్టాలు ఒకరికి ఉంటే మోకాపై మరొకరు ఉండటంతో రికార్డుల ప్రక్షాళన సమస్య జటిలంగా మారింది. ఈ భూములను ప్రభుత్వం తిరిగి తీసుకొంటే సమస్యకు ముగింపు పలుకొచ్చని అధికారుల ఆలోచనకు కొందరు గ్రామస్తులు మద్దతు ఇవ్వడంతో భూసేకరణ జరుగుతుంది. 1995లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదలకు భూ కొనుగోలుకు రుణాలు ఇవ్వడంతో తోటపల్లి శివారులోని 12 మందికి 24 ఎకరాల భూమిని కొని ఇచ్చారు. పంటలు సాగు చేసుకుంటూ రుణాలను చెల్లిస్తూ వచ్చిన పేదలకు 2005లో వైఎస్సార్ సీఎం అయిన తర్వాత రుణమాఫీ చేయడంతో పేదలకు రుణ విముక్తి కలిగి భూముల పై హక్కుల వచ్చాయి. భూములు మావే అనే భరోసాతో బతుకుతున్న దళితులకు చెందిన 14 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకుంటున్నామని అధికారులు చెప్పగానే దళిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. ఈ ఫొటోలో కనిపించే రైతు పేరు వైనాల రాకేశ్. ఇతడి తండ్రి అశోక్‌కి 1995లో దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలుకు రుణం ఇచ్చింది. అశోక్‌కు 2 ఎకరాల భూమి ఇయ్యడంతో అందులో బోరు వేసుకొని పంటలు సాగు చేసి జీవిస్తున్నాడు. 15 ఏళ్ల కిందటనే అశోక్ మరణించడంతో ఈ భూమిలోనే వ్యవసాయం చేసుకొని తల్లి, కొడుకు బతుకుతున్నారు. ప్రభుత్వం ఇండస్ట్రియల్‌కు వారి భూమి తీసుకుంటుందని తెలువడంతో పేద కుటుంబం ఆందోళన చెందుతుంది. తోటపల్లి శివారులోని మా భూమి వదిలేయాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. గ్రామం ఎకరాలు రైతులు చౌటపల్లి 83.36 120 జనగామ 15.20 08 తోటపల్లి 25.20 31 మొత్తం 124.36 159 -
షార్ట్ సర్క్యూట్‌తో వాహనాలు దగ్ధం
సిద్దిపేటఅర్బన్: ఓ ఇంటిలో జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో ఓ కారు సహా మూడు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని మారుతీనగర్‌లో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ విద్యాసాగర్ తెలిపిన కథనం మేరకు.. సిద్దిపేట పట్ణంలోని మారుతీనగర్‌లో బెల్లంకొండ వెంకటేశ్వర్రావు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ మీటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి అర్థరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. కాసేపటికి మంటలను గుర్తించిన సురేశ్ అనే వ్యక్తి ఇంట్లోకి మంటలు వ్యాపిస్తున్నాయ నే ఆందోళనతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం చుట్టుపక్కల వారి సాయంతో ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పివేయగా అప్పటికే వరండాలో పార్కింగ్ చేసిన కారు సహా మూడు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. వీటితో పాటు కింది పోర్షన్ డోర్లు, మూడు విద్యుత్ మీటర్లు, వైర్లు, బోర్ స్టార్టర్, డ్రైనేజీ పైపులు బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటేశ్వర్రావు వాపోయారు. కాగా విద్యుత్ మీటర్లలో తలెత్తిన సమస్య వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ నర్సింహులు పేర్కొన్నారు. బాధితుడు వెంకటేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. షార్ట్‌సర్క్యూట్‌కు గల కారణాలపై సీఐ విద్యాసాగర్ ఆరా తీశారు. కారు, మూడు ద్విచక్రవాహనాలు కాలి బూడిద రూ.15 లక్షల ఆస్తి నష్టం -
బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు వట్పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని కిచ్చన్నపల్లి గ్రామానికి చెందిన మద్దూరి అనిల్ కుమార్ (25)కుమ్మరి అనిల్ కుమార్ (26) బైక్‌పై కిచ్చనపల్లి గ్రామానికి వెళ్తున్నారు. అన్నాసాగర్ చెరువుకట్ట వద్దకు రాగానే నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మద్దూరి అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా , మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జోగిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
పునః ప్రతిష్ఠ చేపట్టడం శుభ సూచకం
●మాధవానంద సరస్వతీ స్వామిజీభూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 105 ఎకరాల భూమి కావాలే అని అడి గారు. మూడు చోట్ల కలిసి మొత్తం 124 ఎకరాలను భూ సేకరణకు గుర్తించాం. ఇందులో 14 ఎకరాల వరకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి పొందిన భూములు ఉన్నవి మిగితా పట్టా భూములను కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. పరిహారం ప్రభుత్వ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. – రాంమూర్తి, ఆర్డీవో, హుస్నాబాద్ దుబ్బాక: నరుడు నారాయణుడై ధర్మరక్షణ చేస్తే ఈ మానవజన్మకు సార్ధకత లభిస్తుందని మాధవానంద సరస్వతీ స్వామిజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన వరద పోచమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి విగ్రహానికి మాధవానంద సరస్వతీ స్వామిజీ యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. ఆలయాలు నిర్మించి విగ్రహాలు ప్రతిష్టిస్తే సరిపోదని నిరంతరం ధూప, దీప నైవేద్యాలతో వెలుగొందేలా చూసినప్పుడే భగవంతుడు మనను చల్లగా చూస్తాడన్నారు. ఎన్నో వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయం శిథిలం కాగా భక్తులు ముందుకొచ్చి నూతనంగా ఆలయంతోపాటు అమ్మవారిని పునః ప్రతిష్ఠ చేసుకోవడం శుభ సూచకమన్నారు. అంతకు ముందు ఆలయంలో వేదపండితులు వేలేటి జయరామశర్మ, రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో అవాహిత దేవతా పూజ, హోమములు, ఆదివాసములు, ఆదివాస హోమం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అంగన్వాడీ నిర్వహణ భేష్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నందికంది అంగన్వాడీ కేంద్రం నిర్వహణ బాగుందని శిశు, సంక్షేమ శాఖ రీజినల్ డైరెక్టర్ మోతీ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని నందికంది అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ పీడీ లలిత కుమారితో కలిసి ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారుల ప్రతిభను ఆమె పరీక్షించి వారితో కాసేపు ముచ్చటించారు. బాలల వికాసానికి అంకితభావంతో పని చేస్తున్న టీచర్ విజయలక్ష్మిని ఈ సందర్భంగా అభినందించారు. ప్రధానంగా శిశు మరణాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలకు మెడిటేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో చంద్రకళ, అంగన్వాడీ టీచర్లు గీత, శ్రీలత, సునీత తదితరులు పాల్గొన్నారు.శిశు, సంక్షేమ శాఖ రీజినల్ డైరెక్టర్ మోతీ -
ఈద్ మిలాప్‌లో దామోదర
మునిపల్లి(అందోల్): పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. బుధవారం మండలంలోని కంకోల్లో ఈ కార్యక్రమం జరిగింది. ముస్లిం సోదరులకు మంత్రి దామోదర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మంత్రికి మాజీ జడ్పీటీసీ అసద్‌పటేల్ తదితరులు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు రసూల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతం రూ.18 వేలకు పెంచాలి నారాయణఖేడ్: పంచాయతీ కార్మికులు, ఆశ కార్మికుల కనీసవేతనాలను రూ.18 వేలకు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. బుధవారం ఖేడ్‌లో పంచాయతీ కార్మికులు, ఆశ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు వేతనాలను రూ.18 వేలకు పెంచుతామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు. హామీలు నెరవేర్చకుంటే రాబోవు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం డివిజన్ కార్యదర్శి రమేష్, నాయకులు సతీష్, ఎల్లయ్య, బాలప్ప, జనాబాయి, కృష్ణవేణి, పుణ్యమ్మ, విజయలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు. మంత్రిని కలిసిన ఎస్పీసంగారెడ్డి జోన్: జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. బుధవారం సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో పుష్పగుచ్చం అందించి, మర్యాదపూర్వకంగా కలిశారు. 4, 5 తేదీల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు నారాయణఖేడ్: అందోల్ డివిజన్ పరిధిలోని జోగిపేటలో ఈనెల 4, 5 తేదీల్లో ఎస్ఎఫ్ఏఐ జిల్లా 7వ మహాసభలను నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.సతీష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న తీరును చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయురాలు సస్పెన్షన్ రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణం మయూరినగర్ కాలనీలోని ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయురాలు బి.సుజాత పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. అలాగే.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా గతేడాది డిసెంబర్ నుంచి ప్రైవేట్ ఉపాధ్యాయుని నియమించిన విషయం డీఈవో దృష్టికి వచ్చింది. దాంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభియోగంపై ఉపాధ్యాయురాలు బి.సుజాతను సస్పెండ్ చేశారు. కొండాపూర్ ఆర్ఐపై వేటుకొండాపూర్(సంగారెడ్డి): వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవతవకలకు పాల్పడిన కొండాపూర్ ఆర్ఐ మహదేవ్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ క్రాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. తహసీల్దార్ అనితను నారాయణఖేడ్ ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేట్ అధికారిగా బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. వారసత్వ ధ్రువపత్రం విషయంలో ఆర్ఐగా మహదేవ్ తప్పుడు పంచనామా నివేదిక ఇవ్వగా, దాని ప్రకారం తహసీల్దార్ సైతం ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన
సంగారెడ్డి జోన్: ఆన్లైన్ బెట్టింగ్స్, యాప్స్, మోసాలు, డ్రగ్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించారు. అత్యాచార, పొక్సో కేసులలో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఎస్పీ పరితోష్ పంకజ్ -
బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలే
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు: నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని, ఈ బియ్యం పక్కదారి పడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని నాయికోటిబస్తీ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల సంక్షేమానికి కృషి ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పేదల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని 3వ వార్డు, నాగల్గిద్ద మండలం ఎనక్పల్లిలో, మనూరులోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పథకాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఖేడ్ పట్టణంలోని భూమయ్యకాలనీలో రూ.40 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంత కష్టమైనా పేదల కోసం ఒక్కోదాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో సీసీరోడ్లు, మురుగుకాల్వల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్ నారాయణఖేడ్: హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. ఖేడ్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసహరించుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేతకీలో కర్ణాటక ఎమ్మెల్సీలు పూజలు ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్, భీమ్రావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. -
హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు కృషి
రామచంద్రాపురం(పటాన్చెరు): హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి తెలిపారు. హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళుతున్న ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిలను రామచంద్రాపురంలోని వారి నివాసంలో మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను అమ్మడం సరికాదన్నారు. ఆ భూములలో ఎంతో వన సంపదతోపాటు అనేక జీవరాశులు జీవిస్తున్నాయని వివరించారు. ఆ భూములను విక్రయించే బదులు మరింత పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీ పూర్వవిద్యార్థులైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్‌సీయూ భూముల పరిక్షణకు ఉద్యమిస్తున్న విద్యార్థులకు అండగా నిలిచి పోరాటం చేస్తామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం.. సంబురం
చరిత్రాత్మకం: మంత్రి పొన్నంలబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు ● మొదటిరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో 801 టన్నుల బియ్యం పంపిణీ ● 38వేలకుపైగా కార్డుదారులకు అందజేత ● రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు బారులు సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాప్‌ల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8,83,883 రేషన్ కార్డులుండగా మొదటి రోజు మంగళవారం 694 రేషన్ షాపులలో 38,526 కార్డుదారులకు 801.134 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లో సన్నబియ్యం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో.. సంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు అత్యధికంగా రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్నారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో పంపిణీ చేశారు. నార్సింగ్, టెక్మాల్, పాపన్నపేట మండలాల్లో రెండు రేషన్‌షాపుల చొప్పున 6 రేషన్ షాపులలో మాత్రమే బియ్యం పంపిణీ చేయడం గమనార్హం. మరి కొన్ని రేషన్ షాపులలో బియ్యం చేరుకోవాల్సి ఉంది. అలాగే కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తామని పంపిణీని వాయిదా వేశారు. కార్డుదారుల్లో సంతోషం.. కొన్నేళ్లుగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసింది. దీంతో కార్డుదారులు అంతంత మాత్రంగా తీసుకునేందుకు మొగ్గుచూపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని అందజేస్తోంది. కార్డుదారులు సంతోషంగా సన్న బియ్యం తీసుకున్నారు. సన్న బియ్యం ఇస్తుండటంతో బయట కొనడం ఇక తప్పిందని.. అలాగే డబ్బులు కూడా మిగులుతాయని కార్డు దారులు ఆనందం వ్యక్తం చేశారు. హుస్నాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో తెల్లరేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2.91 లక్షల రేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకు అమ్మడం, రేషన్ దుకాణాలకు వాపస్ ఇవ్వడం జరిగేదన్నారు. ఇక నుంచి సన్న బియ్యం అందరూ తీసుకుంటారన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సన్న బియ్యం పఽథకం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి రోజు పంపిణీ వివరాలు జిల్లా మండలాలు రేషన్ కార్డులు కిలోలు షాపులు మెదక్ 3 06 86 1,960 సిద్దిపేట 25 365 17,933 3,62,138 సంగారెడ్డి 27 323 20,502 4,37,036 -
మహిళా సంఘాలకు గ్రేడింగ్
సంగారెడ్డిటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తోంది. మహిళలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా...స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. సంఘాల్లో సభ్యులు అనుభవమున్న రంగంలో రాణించేలా ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తున్నారు. అందుకే మహిళా సంఘాలలో మరింతమంది సభ్యులుగా చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుతోపాటు శ్రీనిధి రుణాలు సైతం అందుతుండటంతో ఆర్థిక సమస్యలను అధిగమించే దిశగా మహిళా సంఘాల సభ్యులు ముందుకు సాగుతున్నారు. ఈ సంఘాలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రేడింగ్ విధానాన్ని సైతం అమలు చేస్తోంది. మహిళలకు గ్రేడింగ్ పెరిగేకొద్దీ రుణాలను ఎక్కువగా ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. మహిళా సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఫొటోలను జతచేయాల్సి ఉంటుంది. ఏ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ వరకు పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాలో మొత్తం 1,95,235 మంది సభ్యులు ఉండగా, మహిళా సంఘాలు 18,208 అందులో 25 మండలాల్లోని 695 గ్రామాలలో గ్రామ సంఘాలలోని మహిళలున్నారు. వారికి గ్రేడ్ల ఆధారంగా రుణాలను అందిస్తున్నారు. మహిళా సంఘాలకు ఒక్కో యూనిట్ విలువను రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిర్ణయించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంశాలవారీగా కేటాయింపు మహిళా సంఘాలకు 12 అంశాల ఆధారంగా ఏ,బీ,సీ,డీ,ఈలతో గ్రేడింగ్ ఇస్తారు. ఒక్కో మహిళా సంఘం 75 శాతానికి పైగా గ్రేడింగ్‌ను సాధిస్తే ఎక్కువ సంఖ్యలో రుణాలిస్తారు. ఇలా తక్కువ వడ్డీకి ఇచ్చిన రుణాలను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 75 శాతానికి పైగా లక్ష్యాలను సాధిస్తే ఏ గ్రేడ్, 70% నుంచి 74% బీ గ్రేడ్, 60 లోపు సాధిస్తే సీ గ్రేడ్, 50% కంటే తక్కువ ఉంటే డీ గ్రేట్, అంతకంటే తక్కువగా ఉంటే ఈ గ్రేడింగ్ ఇస్తారు. ఏ,బీ,సీ గ్రేడింగ్ సంఘాలకు శ్రీనిధి రుణాలను కేటాయిస్తారు. గ్రామైక్య సంఘాలకు మాత్రమే ఈ గ్రేడింగ్ విధానం అమలులో ఉంది. క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాలకూ ఇదే నిబంధన వర్తించనుంది.గ్రేడింగ్ విధానంతో రుణాలు పెరిగిన పర్యవేక్షణ రగ్రేడ్ పాయింట్ల ఆధార ంగా ప్రాధాన్యంకేటాయించే పద్ధతులు... ప్రతీ నెల రెండు సమావేశాలు ఉంటాయి సమావేశానికి అందరూ హాజరు కావాలి సక్రమంగా శ్రీనిధి రుణ వాయిదాల చెల్లింపుల పద్ధతిలో చేయాలి ప్రతీనెల పొదుపు చెల్లింపులు ఉండాలి గ్రామ సంఘానికి చెల్లించిన రుణ వాయిదాలు, బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపులు సక్రమంగా ఉండాలి వీటన్నింటికీ తగిన మార్కులను కలిపి గ్రేడింగ్ నిర్ణయిస్తారు ఇందిరా మహిళా శక్తి శ్రీనిధి అమలు చేసిన కార్యక్రమాలలో 100% టార్గెట్‌ను గుమ్మడిదల సమైక్య సంఘం పూర్తి చేసింది మిగతా మండలాలలో కూడా లక్ష్యాలను పూర్తిచేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మహిళా సంఘాల పర్యవేక్షణ పెరిగింది మహిళా సంఘాలలో గ్రేడింగ్ విధానం అమలు చేయడంతో పొదుపు సంఘాలపై పర్యవేక్షణ పెరిగింది. సమావేశాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లైవ్ఫొటోలను అప్లోడ్ తప్పనిసరిగా చేయాలి. ఎప్పటికప్పుడు అధికారులు సంఘాల వారీగా నివేదికలను తీసుకుని సమీక్ష చేస్తున్నారు. – జంగారెడ్డి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి. -
ఇందిరమ్మ డిజైన్లపై నిరుత్సాహం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఇళ్లను మంజూరు చేసిన రెండు నెలలు దగ్గర పడుతున్నా జిల్లాలో కనీసం 30 శాతం మంది లబ్ధిదారులు కూడా ముగ్గు పోసుకోలేదు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు రాగా, ఇందులో 1.36 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. సొంతంగా ఇంటి స్థలం ఆధారంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాలుగా రూపొందించిన విషయం విదితమే. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి అర్హతలున్న వారికి ఈ ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఒక్కో మండలానికి ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేసి..ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఇలా జిల్లాలో మొదటి విడతలో 1,200 మంది లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఈ ఇళ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఇందులో కేవలం 275 మంది లబ్ధిదారులే ముగ్గు పోసుకున్నారు. బేస్మెంట్ వరకు కట్టుకున్న లబ్ధిదారులు 21 మంది మాత్రమే కావడం గమనార్హం. -
అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
జహీరాబాద్ టౌన్: అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర సరిహద్దులో గట్టి నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. సరిహద్దు, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లను మంగళవారం పరితోష్ పంకజ్ సందర్శించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన జహీరాబాద్‌కు వచ్చారు. జహీరాబాద్‌టౌన్ పోలీసు స్టేషన్ సందర్శించిన అనంతరం జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత కోహీర్ పీఎస్‌కు వెళ్లారు. అక్కడ పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయా లన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి, జహీరాబాద్ టౌన్ సీఐ తదితరులు ఉన్నారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ -
8న పుస్తకావిష్కరణ
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో 8న నందిని సిధారెడ్డి కథా సంపుటి బందారం కథలు పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని మంజీరా రచయితల సంఘం ప్రతినిధులు తెలిపారు. సభకు సంబంధించిన కరపత్రాన్ని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ.. సిధారెడ్డి కవిగా సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడని అన్నారు. ఆయన స్వగ్రామమైన బందారంలో తన జీవిత అనుభవ సారాన్ని కథలుగా రూపొందించి బందారం కథలు పేరిట వెలువరించారని తెలిపారు. సభకు కవులు, రచయితలు, సాహిత్య కారులు, గాయకులు, కళాకారులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాదగిరి, రాజిరెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం పని చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దమ్మక్కపల్లి, కొండపాక గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధనికులతోపాటు పేదలు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతినెలా పేదలకు రేషన్ దుకాణాల్లోంచి సన్న బియ్యం పంపిణీ జరిగేలా రెవెన్యూ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు దిలీప్ నాయక్, సుజాత, ఆర్ఐలు బాలకిషన్, సత్యనారాయణ, ఎంపీడీఓలు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇసుక డంప్ సీజ్ బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్ల శివారులో డంప్ చేసిన ఇసుకను జేసీబీతో టిప్పర్‌లో లోడ్ చేస్తుండగా మంగళవారం టాస్క్‌ఫోర్స్, బెజ్జంకి పోలీసులు పట్టుకున్నట్లు ఏఎస్ఐ శంకర్రావు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేయగా ఇసుకతోపాటు జేసబీ, టిప్పర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళ అదృశ్యం గజ్వేల్‌రూరల్: మహిళ అదృశ్యమైన ఘటన గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వర్గల్ మండలం నాచారం గ్రామానికి చెందిన శీల సత్యనారాయణ, జ్యోతి(35) దంపతులకు 15 ఏళ్ల కిందట వివాహం జరుగగా వీరికి ముగ్గురు సంతానం. జ్యోతి సోమవారం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతుకగా ఆచూకీ లభించలేదు. మంగళవారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి మెదక్ మున్సిపాలిటీ : స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ నాగరాజు కథనం మేరకు.. హైదరాబాద్‌లోని రామంతాపూర్ చెందిన ఎండీ హఫీజ్(20) రంజాన్ పండుగ కోసం మెదక్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువులతో కలిసి స్థానిక గాంధీ నగర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. అతడితోపాటు వెళ్లిన వారు నీటిలో స్నానం చేస్తుండగా గట్టుపై చూస్తున్నాడు. ఈ క్రమంలో హఫీజ్ ఈత కొట్టేందుకు ఒక్కసారిగా పూల్‌లోకి దూకాడు. ఈత రాకపోవడంతో పూల్ లోతు ఉండి నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
మనోహరాబాద్(తూప్రాన్): విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి చెందిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బేలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ (21) మనోహరాబాద్ మండలం కొండాపూర్ శివారులోని శ్రీయాన్ పాలిమర్స్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు. మంగళవారం పరిశ్రమలో కూలర్‌ను సరిచేస్తున్న క్రమంలో ఇనుప స్టాండ్ వేసుకొని ఇంజక్షన్ మోల్డ్ మిషన్‌ను పరిశీలిస్తున్నాడు. స్టాండ్‌కు విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో పడిపోయాడు. ఇది గమనించిన తోటి కార్మికులు మేడ్చల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరిశ్రమలో సరైన వసతులు లేకనే మృతి చెందాడని తోటి కార్మికులు పరిశ్రమ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి వచ్చి కార్మికులతో మాట్లాడి సముదాయించాడు. మృతుడి అన్న దినేశ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రైతుల కన్నీటి కష్టాలు
మిరుదొడ్డి(దుబ్బాక): మునుపెన్నడూ లేని విధంగా మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. చెరువుల్లో చుక్క నీరు కానరావడం లేదు. వ్యవసాయ బావుల్లో నీటి తడులు అసలే లేవు. బోరు బావులు సైతం వట్టిపోతున్నాయి. ఆశ చావని రైతులు మరిన్ని అప్పులు చేసి బోరు బావులు తవ్వినా చుక్క నీరు రాక పోవడంతో మరింత నిరాశా నిస్ప ృహలకు లోనవుతున్నారు. కళ్ల ముందే పంటలు ఎండు ముఖం పడుతుంటే ఏం చేయాలో తోచక రైతులు చేతులెత్తేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో నీటి తడులులేక పొట్ట దశలో వరి సాగు, ఆరుతడి పంటలు ఎండిపోయి నష్టాలను చవి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మిరుదొడ్డి మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో అడుగు పెడితే చాలు సాగు నీటి కష్టాలు కళ్ల ముందు దర్శనమిస్తుంటాయి. ఏం చేయాలో పాలుపోక బొట్టు బొట్టునూ ఒడిసి పడుతూ పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సాగు నీరు లేక కొందరు రైతులు పంటలను వదిలేయగా, కాస్త నీటితోనైనా పంటలకు దక్కించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ట్యాంకర్లతో వరికి నీరు పొట్ట దశలో వరి వాడుముఖం పడుతుండటంతో కొందరు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వరి సాగుకు నీటిని అందిస్తున్నారు. ఎంతో కొంత పోస్తున్న బోరు బావుల యజమానులతో మాట్లాడి ట్యాంకర్లో నీటిని నింపుకోవడానికి బేరాలు ఆడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇంజన్‌తోపాటు నీటి ట్యాంకర్‌కు రూ.1,500 చెల్లిస్తున్నారు. అయినా మండుటెండల్లో పొలం తడపడానికి ట్యాంకర్ నీరు ఏ మూలకు సరి సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకంటే ట్యాంకర్ ద్వారా నీటిని అందించడమే మరింత ఆర్థిక భారంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇంత చేస్తే పెట్టిన పెట్టుబడులు వస్తాయోరావోనని ఆందోళన చెందుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు ఎండుతున్న పంటలు ఫాం పాండ్స్ ఏర్పాటు చేసుకొని నీటిని ఒడిసిపడుతున్న రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు మిరుదొడ్డిలో అన్నదాతల అవస్థలు బొట్టు బొట్టును ఒడిసి పట్టి బోరు బావులు వట్టి పోవడంతో బీర, మిరప, తమాట, మిర్చి వంటి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వచ్చీరాని నీటిని ఒడిసి పట్టాలన్న ఆలోచనతో కొందరు రైతులు గుంతలు తవ్వి నీటిని నింపడానికి శ్రీకారం చుట్టారు. 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 5 మీటర్ల లోతుతో (ఫాం పాండ్స్) నీటి గుంతలను తవ్వుకుంటున్నారు. నీటి గుంతల అడుగుతోపాటు, చుట్టూ గోడల నుంచి నీరు ఇంకి పోకుండా ఉండేందుకు పాలిథిన్ కవర్లను అమర్చుతున్నారు. ఒక్కో నీటి గుంతకు రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నారు. వచ్చే కొంచెం నీటిని గుంతల్లో నింపుతున్నారు. ఆ నీటిని ఆరుతడి సాగు చేస్తున్న బీర, కాకర, మిర్చి, తమాట వంటి పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తూ గట్టెక్కుతున్నారు. -
కారం పొడి చల్లి.. బంగారు గొలుసు చోరీ
బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో దారి దోపిడీ రామచంద్రాపురం(పటాన్చెరు): స్కూటీపై వెళ్తున్న వారిపై గుర్తు తెలియని దుండగులు కారంపొడి చల్లి బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో మంగళవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సాఆర్ జిల్లాకు చెందిన ఆరోగ్యమ్మ జీవనోపాధికై 20 ఏళ్ల కిందట రామచంద్రాపురానికి కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చారు. భర్త 5 ఏళ్ల కిందట మృతి చెందాడు. దీంతో వంట పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. పెన్షన్ తెచ్చుకునేందుకు సోమవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరింది. బస్సు ఎక్కడం కోసం అల్లుడు సూర్యతేజ స్కూటీపై ఇంటి నుంచి లింగంపల్లికి వెళ్తుంది. బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లోని యూనియన్ కార్యాలయం వద్ద రాగానే బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. కింద పడిపోయిన ఆరోగ్యమ్మ, సూర్యతేజ కళ్లల్లో దుండగులు కారంపోడి చల్లి మహిళ మెడలో నుంచి రెండున్నర తూలాల బంగారు గొలుసును లాక్కొని పరా రయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పెపల్లిలో విషాదం ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలంలోని ఇప్పెపల్లి గ్రామంలో ఒకే రోజు ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్(28) మన్నాపూర్ గ్రామంలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. దుకాణంలో పనులు చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే, అదే గ్రామానికి చెందిన నాగప్ప(26)కు వడ దెబ్బతగిలి రెండు రోజుల నుంచి విరేచనాలు అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకుంది. -
ఆలయ భూములు కాపాడుకోవాలి
సీసీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట) : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో అన్యాక్రాంతం అవుతున్న స్వామి వారి భూములను కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సీపీఎం పార్టీతో కలిసి రావాలని సీసీఎం కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొమురవెల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 201, 208, 230లో 5 ఎకరాల 19 గుంటల భూమిని మహదేవుని మల్లయ్య, మహదేవుని సాంబయ్య 1983లో, సర్వే నంబర్ 218, 219లో 5 ఎకరాల 20 గుంటల భూమిని 1992లో మహదేవుని నాగమల్లయ్యతోపాటు మరో ఆరుగురు ఆలయానికి భూమిని విక్రయించారని తెలిపారు. ఆలయ భూములను కాపాడటంలో గతంలో ఆలయ ఈవోగా పని చేసిన బాలాజీ శర్మ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆలయ భూములను కాపాడేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసినట్లు తెలిపారు. ఆలయ అధికారులు కోర్టుకు హజరు కాకుండా భూములు కొల్లగొట్టేందకు యత్నిస్తున్న వక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఆలయ భూములు కోల్పోయే విధంగా దేవాదాయ శాఖ అధికారులు కేసుకు హాజరు కాకుండా, వాదనలు వినిపించకుండా సదరు వ్యక్తులు కట్టడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్, జిల్లాకమిటీ సభ్యులు బద్దిపడిగే కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, బక్కెల్లి బాల కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
నాన్న కల నెరవేర్చాను
చేగుంట(తూప్రాన్): గ్రూప్1లో స్టేట్ ర్యాంకు సాధించి తన తండ్రి కల నెరవేర్చినట్లు ఏరెడ్ల నిఖిత పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు మల్టీజోన్‌లో 2వ ర్యాంకు సాధించిన ఉమ్మడి మెదక్ జిల్లా హత్నూర మండలం కొడిప్యాకకు చెందిన ఏరెడ్ల నిఖిత మంగళవారం సాక్షితో మాట్లాడారు. గతంలోనే ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడలిస్టుగా మంచి ప్లేస్మెంట్ వచ్చినా వెళ్లలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తన తండ్రి సుధాకర్‌రెడ్డి కల మేరకు సివిల్స్‌పై ఆసక్తి పెంచుకొని ఇంటర్వ్యూలో పాల్గొన్నానని, మరోసారి ప్రయత్నం చేసి సివిల్స్ సాధిస్తానని పేర్కొన్నారు. ఇటీవల గ్రూప్ 2లో 144, గ్రూప్ 3లో 372వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఏడాదిన్నర చదివిన చదువుకు తగిన ఫలితం రావడం ఆనందంగా ఉందన్నారు. పట్టుదలతో చదువుకుంటే ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా గ్రూప్స్‌తో పాటు అన్ని పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునన్నారు. సాక్షితో గ్రూప్1 ర్యాంకర్ నిఖిత -
ట్రైన్లో వస్తాడు.. దోచుకొని వెళ్తాడు
సిద్దిపేటఅర్బన్: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట దొంగను సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కథనం మేరకు.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన గుర్రం అఖిల్ అలియాస్ తాడిశెట్టి మణికంఠ (32) 11 ఏళ్ల వయస్సు నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గత నెల 29న సిద్దిపేటలోని పొన్నాల వై జంక్షన్ వద్ద గల వైన్స్ పైకప్పు రేకులను తొలగించి రూ.30 వేల నగదు, రెండు మద్యం సీసాలను దొంగిలించాడు. చోరీ ఘటనపై వైన్స్ యజమానులు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది యాదగిరి, ప్రవీణ్, శివ, నగేశ్ ప్రత్యేక బృందంగా ఏర్పడి వెతుకుతున్నారు. సోమవారం సాయంత్రం పొన్నాల వై జంక్షన్ వద్ద హైదరాబాద్ బస్సు కోసం వేచి ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారిచంగా వైన్స్‌లో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. సికింద్రాబాద్‌కు ట్రైన్లో వచ్చి దొంగతనాలు ఇదిలా ఉండగా నిందితుడు 2012లో ఏపీలోని హుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో పట్టుబడి బాల నేరస్తుడిగా శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై 2021లో తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాడు. మళ్లీ జైలు నుంచి విడుదలై 2025 జనవరిలో సికింద్రాబాద్‌కు ట్రైన్లో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెయింట్ షాపులో ల్యాప్‌టాప్, మొబైల్, కొంత నగదు దొంగతనం చేసి, ఆ వస్తువులను అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ డబ్బులు అయిపోగానే సికింద్రాబాద్‌కు ట్రైన్లో వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్డ్‌వేర్ షాపులో ట్యాబ్, కౌంటర్లోని నగదు, మొబైల్ దొంగిలించి విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. డబ్బులు అయిపోగా మళ్లీ గత నెల 29న సికింద్రాబాద్‌కు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి సిద్దిపేటకు వచ్చి వైన్‌షాపులో దొంగతనం చేశాడు. జల్సాలకు డబ్బులు లేని సమయంలో ఇలా ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చి పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. వివరాలు వెల్లడిస్తున్న త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ సిద్దిపేట వైన్స్‌లో రూ.30 వేలు,మద్యం సీసాలు దొంగతనం జల్సాలకు అలవాటు పడి నిత్యం చోరీలు పోలీసుల అదుపులో అంతర్రాష్ట దొంగ -
పచ్చి వడ్లు అమ్మి మోసపోకండి
హుస్నాబాద్‌రూరల్: రైతులు పచ్చి వడ్లు అమ్మి ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం పోతారం(ఎస్)లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభమవుతున్నాయన్నారు. జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రం హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించామని రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులను అధికారులు సమకూర్చుతారని చెప్పారు. జిల్లాలో 419 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా అందులో 212 ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సోలార్ ప్లాట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు నిర్వహణ మహిళ సంఘాలకే ఇస్తే ఆర్థిక ప్రగతి సాధిస్తారన్నారు. ధాన్యం రవాణకు ఇబ్బందులు లేకుండా గుత్తేదారులతో మాట్లాడి లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని, తూకంలో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రాంమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన పోతారం(ఎస్)లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం -
వరిపై తెగుళ్ల దాడి
ఏం తోస్తలేదు నాలుగు ఎకరాల వరి పంట వేసిన.. చేను మొత్తం ఈనుతుంది. ఈనినా గొలుసు పాలు పోసుకోకుండా గింజ గట్టి పడకుండా తెల్లగా నిలబడిపోతుంది. చేను గిట్లయితుందని మందు తెచ్చి కొట్టినా ఏం లాభం లేదు. వ్యవసాయాధికారి వచ్చి చూశారు. చేతికొస్తుందనుకున్న చేను గిట్లకావట్టే.. ఏం తోస్తలేదు. గత వానాకాలంలో కూడా గిట్లనే అయ్యి చాలా నష్టమైంది. – పాతూరి లక్ష్మణ్, రైతు దుబ్బాక పంటలను పరిశీలిస్తాం జిల్లాలో ఈ యాసంగిలో పెద్ద ఎత్తున వరి పంటల విస్తీర్ణం పెరగడంతో రకరకాల తెగుళ్లు వస్తున్నా యి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరి పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి వ్యవసాయాధికారులం పరిశీలించి ఎందుకు ఇలా జరుగుతుందో పూర్తిగా అధ్యయనం చేస్తాం. రైతులు తమ పంటలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్య మొదట్లోనే పరిష్కరిస్తే ఎక్కువ నష్టం కలుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. – రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి చేతికొచ్చే దశలో దెబ్బతింటున్న చేను ● గింజలు గట్టి పడకుండా తాలుపోతున్న గొలుసులు ● ఎన్ని మందులు కొట్టినా దక్కని ఫలితం ● మెడ విరుపు, మొగి పురుగు, అగ్గితెగులు అంటున్న వ్యవసాయాధికారులు ● ఆందోళనలో జిల్లా రైతాంగం ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కొండె ఎల్లారెడ్డి. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ గ్రామం. ఈ యాసంగిలో తనకున్న 10 ఎకరాల్లో వరి పంట వేశాడు. పంట ఈని గొలుసులు బయటకు వచ్చాక గింజ గట్టి పడకుండా తాలుపోయి(పొల్లు) తెల్లగా నిలబడిపోతుంది. ఎంతో ఖర్చు పెట్టి రకరకాల మందులు స్ప్రే చేసినా ఫలితం లేదు. ఇప్పటికే వేల రూపాయల మందులు తెచ్చి కొట్టినా మట్టిలో పోసినట్లే అయ్యింది. అప్పు తెచ్చి రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిండు. పంటకు వచ్చి తెలుగు చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఇది ఈ ఒక్క రైతు పరిస్థితే కాదు జిల్లాలోని రైతుల అందరి పంటలు ఇలాగే ఉన్నాయి. దుబ్బాక: వరి పంటలకు మాయదారి రోగం ఏదో సోకడంతో రైతులు పరేషాన్లో పడ్డారు. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని.. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా తీరా పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే వానాకాలంలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు రాక రైతులకు పెట్టుబడులు మీదపడ్డాయి. ఈ యాసంగిలోనైనా పంటలు బాగా వస్తుందని గంపెడాశతో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. తీరా చేను పొట్టదశకు వచ్చి ఈనుతున్న తరుణంలో బయటకు వచ్చిన గొలుసులకు గింజలు గట్టిపడకుండా తెల్లగా తాలు పోయి అలాగే నిలబడిపోతుండటంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. 3.53 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలో చెరువులు..కుంటల్లో సమృద్ధిగా నీరుండడంతో ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయ్యింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ముందుగా వేసిన వరి పంటలు ఈని గింజలు ఎర్రబడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో ఈనిన వరి చేలు ఈనినట్లుగానే గొలుసులకు గింజలు పాలుపోసుకోకుండా అలాగే తెల్లబడి నిలబడిపోతున్నాయి. దుబ్బాక మండలంలోనే కాదు జిల్లాలోని చాలా గ్రామాల్లో వరి పంటల పరిస్థితి ఇలాగే తయారైంది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న రైతులకు ఈ మాయదారి రోగం ఆందోళన కలిగిస్తుంది. ఇష్ట మొచ్చిన మందులు వరి చేనుపై రైతులు ఇష్టమొచ్చిన మందులు పిచి కారీ చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి కనబడుతుంది. నాట్లు వేసినప్పుడు వాతావరణ పరిస్థితులతో ఎదగకుండా ఎర్రగా ఉండటంతో అప్పటి నుంచి ఇప్పుడు ఈని గొలుసు తాలుబోతుండటంతో రకరకాల మందులను వేల రూపాయలు పెట్టి తెచ్చి స్ప్రే చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది. మెడ విరుపు, మొగి పురుగు, అగ్గి తెగుళ్లే.. వరి చేను ఈని గింజలు గట్టి పడకుండా తాలుపోవడం వంటిది మొగి పురుగు, అగ్గి తెగుళ్ల లక్షణాలుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇది వరకు అగ్గి తెగులు సోకిన భూముల్లో ఈ మెడవిరుపు తెగులు లక్షణాలు కనబడుతున్నాయని చెబుతున్నారు. వానాకాలంలో సైతం ఇలాగే వరి పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వరి పంటలపై మెడ విరుపు లక్షణాలు కనిపిస్తే ట్రై సైక్లోజన్ లేదా గెలిలియో సెన్స్ మందులు స్ప్రే చేయాలంటూ వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. -
టోల్ రేట్లు పెంపు
సంగారెడ్డి: మరోసారి టోల్గేట్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ఎచ్ఏఐ) వర్గాలు వెల్లడించాయి. అకోలా–నాందేడ్ హైవేపై చౌటకూర్ మండలం తడ్డాన్పల్లి టోల్ ప్లాజా వద్ద కొత్త రేట్లతో కూడిన బోర్డులను అక్కడి యాజమాన్యం ప్రదర్శించింది. లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ కారు, జీపు, వ్యాన్ తదితర వాహనాలకు రూ.5 చొప్పున పెంచగా...నెలవారీ పాస్ రూ.150కు పెరిగింది. వాణిజ్య వాహనాలకు రూ.5 చొప్పున, నెలవారీ పాస్‌కు రూ.240 పెంచారు. మూడు చక్రాల వాణిజ్య వాహనాలకు రూ.15 చొప్పున వీటికి మంత్లీ పాస్ రూ.550 చొప్పున పెరిగాయి. భారీ వాహనాలైన బస్సు, ట్రక్కులకు రూ.15 చొప్పున, మంత్లీ పాస్ రూ.505 చొప్పున పెరిగాయి. ఇక ఓవర్ సైజ్ వెహికల్‌కు రూ.25, మంత్లీ పాస్ రూ.965కు పెరిగింది. ఈ పెరిగిన రేట్లన్నీ ఈనెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. గుమ్మడిదల టోల్‌ప్లాజాలోనూ...జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండల కేంద్ర సమీపంలోని టోల్గేట్లో ఈనెల 1 నుంచి కొత్త టోల్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. కారు జీపు లైట్ వెయిట్ మోటార్ వెహికల్ పై రూ.5 రూపాయలు పెరిగాయని, బస్సులు, భారీ వాహ నాలపై రూ.10 రూపాయల చొప్పున చార్జీలు పెంచినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరిగిన చార్జీలు సోమ వారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. చార్జీల పెంపుపై వాహనదారులు టోల్‌ప్లాజా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నేటి నుంచి అమలు -
ఈద్గాలను సందర్శించిన ఎస్పీ
సంగారెడ్డి జోన్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి హాస్టల్ ఈద్గాను సోమవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈద్గా వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీతో పాటు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు (ఏప్రిల్ 1 నుంచి 30 వరకు) జిల్లావ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అనుమతి లేకుండా చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇక సన్న బువ్వ
నేటి నుంచి బియ్యం పంపిణీ ● సర్వం సిద్ధం చేసిన అధికారులు ● ఉమ్మడి జిల్లాలో28లక్షల మందికిపైగా లబ్ధిప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలుసన్న బియ్యం వచ్చేశాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు చేరుకున్నాయి. మంగళవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హుస్నాబాద్‌లో 8వ రేషన్ షాపులో పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించనున్నారు. సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,83,883 రేషన్ కార్డులున్నాయి. ఇందుకు నెలకు 18,205.019 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. 28,50,964 మందికి లబ్ధిచేకూరనుంది. ఇందులో 8,25,324 ఆహార భద్రత కార్డులకు 26,93,609 సభ్యులకు ఒక్కరికి 6కిలోలు, 58,311 అంత్యోదయ కార్డులకు గాను ఒక్కో కార్డుకు 35 కిలోలు, 248 అన్నపూర్ణ కార్డులకు ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యంను పంపిణీ చేస్తారు. ఇక అక్రమాలకు చెక్ బయటి మార్కెట్లో సన్న బియ్యం ధరలు ఆకాశానంటుతున్నాయి. మధ్య తరగతి, సామాన్యులు కొనలేని పరిస్థితి. ఇది వరకు రేషన్ షాప్‌ల్లో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని 80శాతం మంది లబ్ధిదారులు అమ్మి సన్న బియ్యం కొనుగోలు చేసే వారు. దీంతో రేషన్ బియ్యం పక్క దారి పట్టేది. తాము అధికారంలోకి వస్తే సన్న బి య్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కొలువుదీరిన ఏడాదిన్నరకు సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది.జిల్లాలోని ఉపాధి హామీ వివరాలు గ్రామ పంచాయతీలు 619 జాబ్ కార్డులు 2.19లక్షలు ఉపాధి కూలీలు 4.3లక్షలు యాక్టిబ్ జాబ్ కార్డులు 1.32లక్షలురోజూ హాజరవుతున్న కూలీలు (సుమారుగా)35,000జిలా అంత్యోదయ ఆహార భద్రత అన్నపూర్ణ మొత్తం బియ్యం(టన్నులు) సిద్దిపేట 18,336 2,72,909 82 2,91,327 5,775.742 మెదక్ 13,860 1,99,902 66 2,13,828 4,430.496 సంగారెడ్డి 26,115 3,52,513 100 3,78,728 7,998.781అన్ని ఏర్పాట్లు చేశాం రేషన్ షాపుల ద్వారా కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే దాదాపు అన్ని రేషన్ షాపులకు బియ్యం చేరుకున్నాయి. ప్రతి నెలా 1 నుంచి 18వ తేదీ వరకు పంపిణీ జరగనుంది. లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – తనూజ, డీఎస్ఓ, సిద్దిపేట -
ముస్లింలకు రంజాన్ పవిత్రమైన పండుగ
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పటాన్చెరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ముస్లిం సోదరుల గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ముస్లింల సంక్షేమానికి కృషిఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూర మండలం దౌల్తాబాద్ ఈద్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మైనార్టీ అభివృద్ధి కోసం తాను ఎప్పుడు సహకరిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవులరాజురెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ దౌల్తాబాద్‌లో ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హత్నూర మండలంలో రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన హత్నూర, దౌల్తాబాద్, కాసాల, చింతలచెరువు,బోరపట్ల, సిరిపురంతోపాటు పలు గ్రామాలలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిందూ ముస్లింలు తేడా లేకుండా స్నేహపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాలి నారాయణఖేడ్: బసవేశ్వరుడు చూపిన మార్గంలోని నడుచుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. నాగల్గిద్ద మండలం మావినెళ్లి గ్రామంలో జరుగుతున్న చెన్న బసవేశ్వర జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...మానవా ళికి బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో బాల్కి పీఠాధిపతి బసవలింగ పట్టదేవర, జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షట్కార్, టీపీసీసీ సభ్యుడు శంకరయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు సాగర్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతర ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించి గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు. ‘యువ వికాసం’ను సద్వినియోగం చేసుకోవాలికలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...జిల్లాలో అత్యధిక సంఖ్యలో నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న వారికి 100% రాయితీ, రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారికి 90%రాయితీ, రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 80% రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 70% రాయితీ లభిస్తుందని ఈ విషయంపై దరఖాస్తుదారులకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. -
మొక్కలపై అవిశ్రాంత ప్రేమ
ప్రకృతిని సృష్టించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ● ఉద్యోగ రీత్యా ఊరు విడిచి వెళ్లినా మళ్లీ సొంత గ్రామానికి ● ఎకరంలో 600 మొక్కలు నాటి ఉద్యానవనం ● సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందజేత ● విశ్రాంత జీవనంలో మొక్కల సంరక్షణకు సమయం హుస్నాబాద్‌రూరల్: నేలల స్వభావంతోనే రైతులు పంటలు సాగు చేస్తారు. తరి నేల వరి సాగుకు యోగ్యమైన భూమి. ఇందులో వరి తప్ప మరో పంట వేయడానికి రైతులు ఆసక్తి చూపరు. అలాంటిది తరి నేలలో ఎకరంలో 600 మొక్కలు నాటి ప్రకృతిని సృష్టించాడు ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగి బొంపెల్లి రామారావు. వరి పంట వద్దు ప్రకృతి పర్యావరణం ముద్దు అన్నట్లు రకరకాల మొక్కలు సేకరించి నాటి నిత్యం చెట్ల సంరక్షణతోనే రైతు కాలం సాగిపోతుంది. చెట్లు పెంచితే పక్షులు చేరి కిచకిచరాగలు తీస్తే పల్లె ప్రకృతి మురిసి పోవాలని, పర్యావరణంకు హాని కలుగకూడదని రైతు ఆకాంక్షిస్తున్నాడు. 2017లో ఉద్యోగ విరమణ చేశాక.. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన బొంపెల్లి రామారావు 10వ తరగతి పూర్తి చేసి 1980లో ఆర్టీసీలో మెకానికల్ ఉద్యోగంలో చేరి 2017లో ఉద్యోగ విరమణ చేశాడు. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో పంటలు అంటే ప్రాణం, చిన్నప్పటి వ్యవసాయ బావి పరిసరాలు తాటి వనాలు, ఎల్లమ్మ చెరువు నీటి జలాశయంతో తన పంట చేళ్లకు ప్రకృతికి కొత్త అందాలను తెచ్చేవి. ఉద్యోగ రీత్యా ఊరు విడిచి కరీంనగర్‌లోనే స్థిరపడ్డ రామారావు ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. కుమారుడు ఆమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగంతో స్థిరపడగా కూతురు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అమ్మానాన్నలు పుట్టిన ఊరిలో ఉండగా ఉద్యోగ విరమణ చేసిన రామారావు ఏడాదిపాటు కరీంనగర్ నుంచి తోటపల్లికి వచ్చి పోయేవాడు. పండ్ల తోటలతో వ్యాపారం చేయాలనే ఆలోచన రైతుకు లేదు పంటల సాగుకు కొత్త పద్ధతులను గ్రామీణ రైతులకు పరిచయం చేయాలనే తపన రామారావుది. ఎకరంలో 600 మొక్కలు 2019లోనే ఊరికి వచ్చి తన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరంలో 600 మొక్కలు నాటి ఉద్యానవనం చేశాడు. శ్రీగంధము 300, జామ 200, దానిమ్మ, పనస, మామిడి, వాటర్ ఆఫిల్, ఉసిరి, బొప్పాయి 100 రకరకాల చెట్లను నాటించాడు. మరో 3 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటించి ప్రకృతిని సృష్టించాడు. అమ్మానాన్నలు 60 ఏళ్లు వరి పంట సాగు చేస్తే రామారావు పంటను మార్చి మొక్కలను పెంచుతున్నాడు. మరో రెండు ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వరి సాగు సన్న రకం సాగు చేస్తున్నాడు. మొక్కలకు డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసి నీరు అందించడంతో పాటు సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందిస్తూ మొక్కలను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాడు. పండ్ల మొక్కల పెంపకం తన తోటలో వాటర్ ఆఫిల్ , మామిడి, జామ పండ్లు పెద్ద పరిమాణంలో ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉంది. పండ్లు కరీంనగర్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తాడు. పంటల పై ఎంత ఆదాయం వచ్చినా వాటిని మొక్కల సంరక్షణకే ఉపయోగిస్తాడు. వాటర్ ఆఫిల్ జామ, మామిడి పండ్లను తోట వద్దకు ఎవరు వచ్చినా లేదనకుండా తెచ్చి ఇస్తాడు. పల్లె రైతులకు నూతన పంటల సాగు పై అవగాహన కల్పిస్తూ వరికి బదులు వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచిస్తాడు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు అవగాహన కల్పిస్తే కొత్త రకం పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని భావిస్తున్నాడు. -
పట్టుబట్టి.. కొలువులు కొట్టి
పట్టణానికి చెందిన వెంకటేశ్‌కు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు దుబ్బాక: కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవా చేయాలన్నదే తన లక్ష్యమని దుబ్బాక పట్టణానికి చెందిన గ్రూపు 1 ర్యాంకర్ బైండ్ల వెంకటేష్ సోమవారం తెలిపారు. దుబ్బాకకు చెందిన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బైండ్ల నారాయణ కుమారుడు వెంకటేశ్ గ్రూప్ 1 జనరల్ కేటగిరీలో 543 ర్యాంక్, ఎస్సీ కేటగిరీలో 31వ ర్యాంక్ సాధించాడు. ఇది వరకే గ్రూప్ 4లో ర్యాంక్ కొట్టి సంగారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా గ్రూప్ 1 ఫలితాల్లో ర్యాంక్ సాధించడం విశేషం. తనకు ఆర్డీవో లేదా డీఎస్పీ ఉద్యోగం రావొచ్చని వెంకటేశ్ తెలిపారు. తన విజయంలో తల్లిదండ్రుల పాత్రనే కీలకమని, కలెక్టర్ కావడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు. -
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్మకు పాల్పడిన ఘటన దుద్దెడ గ్రామంలో చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు.. పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుద్దెడకు చెందిన రొడ్డ మల్లేశం (31)టాటా ఏస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతనెల 30న వాహనం పంక్చరైందని ఇంట్లో చెప్పి వెళ్లి రాత్రి వరకు రాలేదు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. కుటుంబీకులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో చిన్నాన్న వ్యవసాయ బావి వద్ద మల్లేశం చెట్టుకు ఉరేసుకున్నాడని విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటినా వెళ్లారు. వాహనం సరిగా నడవక కుటుంబ పోషణ కోసం సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడని, అవి తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నానమ్మ మందలించిందని యువకుడు నిజాంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన కమ్మరి కమలమ్మ మనువడు కమ్మరి నర్సింలు(20) తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో నానమ్మ వద్దే ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆమెకి వయస్సు మీద పడటంతో తాను పని చేయలేక పోతున్నానని, నిన్ను పెంచడం నాతో కాదని, నీవు ఏదైనా పని చేసుకొని బతకాలని మందలించింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు చనిపోయే ముందు ఇన్‌స్టా గ్రామ్‌లో ‘నేను చనిపోయాక అయినా నా విలువ తెలుస్తుందో ఏమో’ అని రీల్ పెట్టి బలవన్మరణానికి పాల్పడాడు. మృతుడి నానమ్మ కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీఆర్ఎస్ గిరిజన నాయకుడి హత్య
కల్హేర్(నారాయణఖేడ్): మద్యం తాగిన మత్తులో జరిగిన గొడవలో బీఆర్ఎస్ గిరిజన నాయకుడిని హత్య చేశారు. ఈ ఘటన కల్హేర్ శివారులో నీలం వాగు వంతెన వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కల్హేర్ కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్(56) స్థానిక మండల పరిషత్‌లో ఉపాధి హామీ పథకం కింద చెట్లకు నీరు పోసే పనులు చేస్తున్నాడు. ఇతడు చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అతడి భార్య పిప్లిబాయి ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆదివారం ఉదయం 8 గంటలకు తండా నుంచి కల్హేర్ వచ్చారు. రాత్రి హరిసింగ్ ఇంటికి వెళ్తున్న క్రమంలో పోమ్యానాయక్ తండాకు చెందిన గణపతి, సీతారాం అడ్డుకొని తనను చంపుతామని బెదిరిస్తున్నారని భార్య పిప్లిబాయికి ఫోన్ చేసి చెప్పాడు. మార్గమధ్యలో హరిసింగ్, సీతారాం, గణపతి ముగ్గురూ కలిసి మద్యం తాగారు. తాగిన మత్తులో గొడవ జరుగగా ఇద్దరూ కలిసి హరిసింగ్ మెడకు తువ్వాల చుట్టి హత్య చేశారు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకు కల్వర్టులో చొరగొట్టే యత్నం చేశారు. రోడ్డుపై నుంచి ఎవరో వస్తున్నారనే భయంతో మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు వెంకటేశం, వెంకట్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తామే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. మృతుడు హరిసింగ్ భర్యా పిప్లిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశం తెలిపారు. మద్యం తాగిన మైకంలో గొడవ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు కల్హేర్ శివారులో ఘటన -
మహిళపై అడవి పంది దాడి
చిన్నశంకరంపేట(మెదక్): అడవిలోకి వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గవ్వలపల్లి తండాకు చెందిన దేవసుత్ లక్ష్మీ సోమవారం మోదుకు ఆకులను తెంపేందుకు అడవిలోకి వెళ్లింది. కొండాపూర్ రాజుల గుట్ట వద్ద ఆకులు తెంపుతున్న క్రమంలో మహిళపై అడవి పంది దాడి చేసి గాయపర్చింది. అప్రమత్తమైన మహిళ తప్పించుకొని రోడ్డుపైకి చేరింది. విషయం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, మహిళను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. టైరు పగిలి కారు బోల్తా ఇద్దరికి స్వల్ప గాయాలు చిన్నకోడూరు(సిద్దిపేట): కారు బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని మల్లారం శివారులో రాజీవ్ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన ఎడపల్లి సాగర్ రెడ్డి, తన సోదరుడి కుమారుడు కారులో హైదరాబాద్‌లో వెళ్తున్నారు. మల్లారం శివారులో కారు టైర్ పగిలి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు వట్పల్లి(అందోల్): టీవీఎస్ ఎక్సెల్, బైక్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం అందోలు మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామ సమీపంలో నాందేడ్– అకోలా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. అందోలు మండల పరిధిలోని రాంసాన్పల్లి గ్రామానికి చెందిన మన్నె గోపాల్ తన బావ నగేశ్‌తో కలిసి బైక్‌పై ఆయన స్వగ్రామమైన గడిపెద్దాపూర్ గ్రామానికి వెళ్తున్నారు. కన్సాన్పల్లి గ్రామ సమీపంలో రహదారి విశ్రాంతి భవనం వద్దకు చేరుకోగానే టేక్మాల్ మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన దిగాల అంజయ్య టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై జోగిపేటకు వస్తున్న క్రమంలో రెండు బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నగేశ్ కాలు విరుగగా, గోపాల్, అంజయ్యకు తీవ్ర గాయాలు అయ్యా యి. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో నగేశ్, గోపాల్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్కు చెందిన సిరిగోరి రాజు(24) చందానగర్‌లోని పికిల్ సెంటర్లో పని చేస్తున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం ఏడుపాయలకు వచ్చాడు. మధ్యాహ్నం మంజీరా నదిలోని రెండో బ్రిడ్జి సమీపంలో ఇద్దరు వంట చేస్తుండగా, మరో ఇద్దరు స్నానం కోసం మంజీరా పాయల్లోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి రాజు మృతి చెందాడు. వీరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. తోటి స్నేహితులు స్థానికులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్ల సహాయంతో రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లయిన రెండు నెలలకే..
భార్య అంటే ఇష్టం లేదని భర్త ఆత్మహత్య వట్పల్లి(అందోల్): భార్య అంటే ఇష్టం లేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అందోలు మండల పరిధిలోని తాడ్మన్నూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. జోగిపేట ఎస్ఐ పాండు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్(24)కు సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన సంజీవులు కుమార్తె మాధవితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య అంటే ఇష్టం లేని ప్రవీణ్ తరచు ఆమెతో గొడవపడేవాడు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆనందయ్య మఠంలో చోరీ
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేటలో గల అనందయ్య మఠంలోని సౌండ్ సిస్టానికి చెందిన ఆంప్లీపయర్ను శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రోజులానే ఆలయం తాళం చెవిని ప్రాంగణంలో పెట్టి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున వెళ్లేసరికి ఆంప్లీపయర్ కనబడలేదు. సుమారు 18 వేల విలువ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. బెజ్జంకి పోలీసులకు సమాచారమివ్వగా విచారణ చేశారు. అలాగే ఆటో బ్యాటరీ సైతం చోరీకి గురైందని స్థానికులు తెలిపారు. తాళం చెవి తీసుకుని చోరికి పాల్పడ్డారంటే తెలిసిన వ్యక్తులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ గజ్వేల్‌రూరల్: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని అక్కారం శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, గజ్వే ల్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 4 సెల్ఫోన్లతో పాటు రూ. 5,990 నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. భక్తుల సెల్‌ఫోన్ అపహరించిన మహిళ దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగింత కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల సెల్ఫోన్లు అపహరించిన మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఓ మహిళ ఓ భక్తుడి సెల్‌ఫోన్‌ను అపహరించేందుకు యత్నించగా అతడు అప్రమత్తమయ్యాడు. ఆమెను పట్టుకొని విచారించగా రెండు సెల్ఫోన్లు లభించాయి. దీంతో భక్తులు ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి మందలించి వదిలిపెట్టినట్లు సమాచారం. తండ్రిని చంపిన కొడుకు గజ్వేల్‌రూరల్: తండ్రి, కొడుకు మధ్య నెలకొన్న వాగ్వాదంలో తండ్రిని కొడుకు చంపిన ఘటన గజ్వేల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని పటేల్బజార్కు చెందిన ఎండీ షాబొద్దీన్(47), రజియాబేగంలకు కొడుకు షాకేర్, కూతురు ఉన్నారు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న షాబొద్దీన్కు, కొడుకు షాకేర్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వంటింట్లోకి వెళ్లిన షాబొద్దీన్ కిందపడటంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే భార్య అక్కడకు చేరుకొని అతడిని పక్కకు తీసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో షాబొద్దీన్ నిద్రిస్తుండగా కొడుకు అతని మెడకు తాడును బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. గమనించిన రజియాబేగం అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో షాబొద్దీన్ వద్దకు వెళ్లిచూడగా అతడు మృతి చెందినట్లు గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి మహిళ దారుణ హత్య జహీరాబాద్ టౌన్: ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్‌లో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... ఝరాసంగం మండలం చిలేమామిడి గ్రామానికి చెందిన లక్ష్మి(35)కి భర్త లేడు. ఆమె కొడుకు ఉండగా హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఉపాధి కోసం వచ్చిన ఆమె పస్తాపూర్‌లో అద్దె ఇంట్లో ఉంటుంది. ఆదివారం ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోపలికి చొరబడి ఆమెను చితకబాదారు. గ్యాస్ సిలిండర్‌తో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకుని పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి, సీఐ.శివలింగం ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుల కోసం డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతురాలి చెల్లెలు జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నప్పటి నుంచే లక్ష్యం..
న్యాల్కల్(జహీరాబాద్): చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. మొదటి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అంతటితో ఆగకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఎక్కెల్లి అఽఖిలజారెడ్డి గ్రూప్–1లో ప్రతిభ కన బర్చింది. మండల పరిధిలోని మిర్జాపూర్(బి) గ్రామానికి చెందిన ఎక్కెల్లి నిర్మల, జగనాథ్‌రెడ్డి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కూతురు అఖిలజారెడ్డి 10వ తరగతి వరకు పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివింది. తరువాత హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. 2019లో మొదటి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేస్తూ గ్రూప్స్‌కు ప్రిపేర్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష రాసి 483.5 మార్కులతో రాష్ట్రంలో 125 ర్యాంక్, మల్టీ జోన్లో 50వ ర్యాంక్ సాధించింది. ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని అఖిలజారెడ్డి పేర్కొంది. తన లక్ష్యం ఐఏఎస్ అని, ప్రజలకు సేవ చేయాలని ఆమె పేర్కొంది. ఉద్యోగానికి ఎంపిక కావడం పై ఆమె తల్లిండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో స్వీట్లు పంచి పెట్టారు. -
పట్టుదలతో చదివి..
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండలం ముసాపేట గ్రామానికి చెందిన ఎరగారి ప్రభాత్‌రెడ్డి గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన ఎరగారి శశింధర్రెడ్డి , పావనీలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభాత్‌రెడ్డి గత రెండు నెలల క్రితం వెల్లడైన గ్రూప్–4 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ సాధించి ప్రస్తుతం జిల్లాలోని కొల్చారం మండలం రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన విద్యాభ్యాసం మెదక్‌లోని సిద్ధార్థ మోడల్స్కూల్లో 10 వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని శ్రీనిఽధి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. మూడేళ్లుగా అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉండి చదువుకున్నారు. దీంతో పాటు గ్రూప్–3లో కూడా 800 వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అతడిని గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు. -
మామిడి పూతలా కొత్త ఆశలు..
మామిడి తోరణాలు తెలుగు లోగిళ్లు శ్రీ విశ్వావసుకు స్వాగతం పలుకుతున్నాయి మామిడి పూతలా కొత్త ఆశలు చిగురిస్తూ కొత్త కుండలో షడ్రుచులు కలగలసిన తీరుగా నూతన సంవత్సరాది ప్రతి ఒక్కరిలో ’విశ్వ’మంతటి వెలుగులు నింపాలని తెలుగు మదినిండా ఈ విశ్వ’నామం ఆశలు నింపాలని, చెడును పారద్రోలి ఆశలు ఆశయాలను వెంట తీసుకురావాలని శ్రీ విశ్వావసుని కోరుతూ..స్వాగతం పలుకుదాం – అనంతవరం సిద్ధిరామప్ప, గుండారెడ్డిపల్లి -
సకల శుభములు కలగాలి..
కొత్త మావిచిగురు కోకిల పాటలు, ఆనందనందనం అవనితెలుగు ఉర్వినుగాదియె ఉత్తమపండుగ, కొంగొత్త యాశలు కోర్కులమరువ షడ్రుచుల్, భక్ష్యాలు చవులూరు తెలుగింట, పంచాంగ శ్రవణమౌ పర్వదినము కవి కోకిలలు పాడు కమ్మని పద్యాలు, తెలుగు భాష ఘనత తేజరిల్ల సకల జనులంత జగతిలో చల్లగాను, శాంతి సౌభాగ్య ఆరోగ్య సంపదలను కలిగి వర్ధిల్లవలెగాక చెలువ మీర, సకల శుభములు కలుగాలి సత్వరమున – తాడూరి అరుణాదేవి, హుస్నాబాద్ -
స్నానానికి వెళ్లి కాలువలో పడి..
దౌల్తాబాద్ ( దుబ్బాక ) : స్నానానికి వెళ్లి ప్రమాదశాత్తు కెనాల్ కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్‌దీప్ కథనం ప్రకారం... మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మచ్చనూరు గ్రామానికి చెందిన ఇర్బ ఎడకే (45) తన భార్య పిల్లలతో రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది కనకరాజు ఇటుక బట్టీలో కూలీ పని కోసం రెండు నెలల క్రితం వచ్చాడు. ఆదివారం ఉదయం రామాయంపేట కెనాల్ కాలువలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదశాత్తు అందులో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితాల్లో వెలుగులు నింపాలి
పటాన్చెరు/పటాన్చెరు టౌన్: శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆదివారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాశి ఫలాలను వివరించారు. అంతకుముందు రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్‌గడ్డ సిద్ధి వినాయక దేవాలయం, పటాన్చెరు పట్టణ పరిధిలోని చైతన్యనగర్ హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే గూడెం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాగా, ఉగాదిని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, రామచంద్ర రెడ్డి,నర్ర బిక్షపతి, శంకర్, వెంకట్ రావు కలసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని తన నివాసంలో కలసి శుభాకాంక్షలు అందజేశారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ వక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పోతాన్‌శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బండారి వేణుగోపాల్(31) తన అవసరాల నిమిత్తం భార్య దీపిక పుస్తెలతాడును కుదువపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. నెల రోజుల క్రితం దీపికతో పుస్తెలతాడు విషయంలో గొడవ జరగగా దీపిక పుట్టింటికీ వెళ్లిపోయింది. దీంతో శనివారం రాత్రి తన గదిలో వేణుగోపాల్ ఉరివేసుకున్నాడు. ఆదివారం అతడిని నిద్రలేపేందుకు తల్లి వెళ్లి తలుపు తట్టగా తెరవలేదు. దీంతో స్థానికుల సాయంతో గదితలుపులు తెరవగా ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. -
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
సందేహాలకు, సంతాపాలకు, నిరసనలకు, అవగాహనలకు ఒక్కో సందర్భానికి ఒక్కో రిబ్బను వాడుతుంటాం. జేబుకు ధరించి నిరసన తెలుపుతాం. కొన్ని రకాల వ్యాధులు, వాటి పేరుకంటే కూడా రిబ్బన్ సింబల్‌తోనే పాపులర్ అయ్యాయి. ఆ సింబల్ చూడగానే వ్యాధిపై అవగాహనకు వచ్చేస్తాం. రిబ్బన్లతో రకరకాల రంగులు నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఏ రంగు రిబ్బను దేన్ని సూచిస్తుందో.. మీ కోసం సాక్షి ప్రత్యేక కథనం. వెల్దుర్తి(తూప్రాన్): అవగాహన కార్యక్రమాలకు ప్రత్యేకం ● కొన్ని వ్యాధులు రిబ్బన్ సింబల్తోనేపాపులర్ ● ఒక్కో రంగు ఒక్కో అంశం నలుపు రంగు..తమ డిమాండ్లను తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేసినప్పుడు నలుపు రంగు రిబ్బన్ ధరిస్తారు. అలాగే మృతిచెందిన వారికి సంతాప సూచకంగా నివాళి అర్పించే సమయంలోనూ వీటిని ధరిస్తారు. ఎరుపు.. ఎయిడ్స్, రక్త క్యాన్సర్, గుండె జబ్బులు, వ్యసనం, విపత్తు, ఉపశమనం తదితర వాటిపై నిర్వహించే సమావేశాల్లో ఎరుపు రంగు రిబ్బన్‌ను ధరిస్తారు. అలాగే అత్యవసర పరిస్థితులకు దీన్ని ఉపయోగిస్తారు. నీలి.. ఈ రిబ్బన్‌ను సుమారు 100కి పైగా సందర్భాల్లో ఉపయోగిస్తారు. మానవ అక్రమ రవాణా, బెదిరింపులకు వ్యతిరేకంగా వీటిని ఉపయోగిస్తారు. జల సంరక్షణపై అవగాహన కల్పించే సమయంలోనూ వీటిని ఇస్తారు. ఆకుపచ్చ.. మూత్రపిండాలు, కాలేయం, అవయవదానం, సురక్షిత వాహన చోదకం తదితర వాటికి ఆకుపచ్చ రిబ్బన్‌ను ఉపయోగిస్తారు. గ్లోబల్ వార్మింగ్‌ను తెలిపే సందర్భంలోనూ దీనిని ఉపయోగిస్తారు. పసుపు.. యుద్ధ ఖైదీలు, తప్పిపోయిన వారి కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పసుపురంగు రిబ్బన్‌ను ధరిస్తారు. ఆత్మహత్యల నివారణకు, ఎముకల క్యాన్సర్ తదితర వాటి గురించి నిర్వహించే అవగాహన సదస్సులో వీటిని ఉపయోగిస్తారు. తెలుపు.. గర్భిణులు, మహిళలపై దాడులు జరిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో తెలుపురంగు రిబ్బన్ ధరిస్తారు. సురక్షిత మాతృత్వం, శాంతి, అహింసలను తెలుపుతూ జరిగే కార్యక్రమాల్లో వీటిని ఉపయోగిస్తారు. 18 రకాల రంగులు... మానవ శరీరంలో వివిధ అవయవాలకు సోకిన క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు వైద్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు 18 రకాల రిబ్బన్లను ఉపయోగిస్తారు. క్యాన్సర్ వ్యాధి సోకడానికి కారణాలు, వాటి లక్షణాలు, ట్రీట్మెంట్ విధానం ముందస్తుగా తీసుకోవల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు వీటిని ధరిస్తారు. గులాబీ..గులాబీ రంగు రిబ్బన్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు దీనిని అంతర్జాతీయ గుర్తుగా ఉపయోగిస్తారు. -
సత్తా చాటిన ఆణిముత్యాలు
టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ –1 ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ప్రతిభ కనబర్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం పెట్టుకొని పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు అభ్యర్థులను అభినందించారు.టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో హవా ● ఉమ్మడి జిల్లాలో ఆరుగురు ఎంపిక ● 26వ ర్యాంకు సాధించిన పూజ ● 41వ ర్యాంక్ సాధించిన శైలేష్ ● ముసాపేటకు చెందినప్రభాత్రెడ్డికి 73వ ర్యాంక్ ● 75వ ర్యాంకు సాధించిన సిద్దిపేట వాసి నర్ర అఖిల్ ● మిర్జాపూర్(బి)కు చెందినఅఖిలజారెడ్డికి 125 ర్యాంక్కోచింగ్ తీసుకోకుండానే.. మెదక్‌జోన్ : టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన పూన శైలేష్ 41వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 503.500 మార్కులు వచ్చాయి. 1 నుంచి 7వ తరగతి వరకు మెదక్‌లోని శివ సాయి, 8 నుంచి 10 తరగతి వరకు అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ తూప్రాన్, ఇంటర్మీడియట్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో చదివాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఈ ర్యాంకు సాధించడం విశేషం. తండ్రి పూన రవి పట్టణంలో బంగారం నగల దుకాణం నడిపిస్తాడు. ఈ సందర్భంగా శైలేష్‌ను పలువురు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన నర్ర అఖిల్ 75వ ర్యాంక్ సాధించాడు. పట్టణానికి చెందిన నర్ర భగవాన్‌రెడ్డి, వజ్రమ్మల మొదటి కుమారుడు అఖిల్. రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారిగా నీటిపారుదల శాఖ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఏఈఈగా నియామకమయ్యారు. తాజాగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో అఖిల్ 75వ ర్యాంక్ సాధించాడు. కష్టపడి చదివితే ఏదైనా సాంధించవచ్చని అఖిల్ పేర్కొన్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదివానని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. -
ఉద్యోగం చేస్తూనే ఆన్లైన్ కోచింగ్..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఉన్నత విద్యా కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది కప్పే పూజ యాదవ్. ఫలితాల్లో 509.5 మార్కులు సాధించింది. జహీరాబాద్ మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన దండు అలియాస్ కప్పే అంజయ్య (రిటైర్డ్ ఎంఈఓ), జయశ్రీ (ఎంఏ బీఎడ్)ల పెద్ద కూతురే పూజ యాదవ్. వీరు ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంలోని ఆదర్శ్ జిమాక్స్ కాలనీలో నివసిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన పూజ ఇప్పటికే గ్రూప్ –4 సాధించి గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. కాగా గ్రూప్స్‌కు ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని ప్రతిభ కనబర్చింది. సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు. -
రంజాన్ వేడుకలకు సిద్ధం
సంగారెడ్డి జోన్/జహీరాబాద్ టౌన్: జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలు జరుపుకునేందుకు సర్వం సిద్ధం అయింది. మండల కేంద్రాలతోపాటు వివిధ గ్రామాల్లో నేడు రంజాన్ పండుగ సంబరాలు జరుపుకోనున్నారు. పండుగను పురస్కరించుకుని గ్రామాల్లోని మసీదులు విద్యుద్దీపాల కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఉదయం 9 గంటల సమయంలో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. జహీరాబాద్ ఈద్గా ముస్తాబు... జిల్లాలో అతి పెద్దదైన జహీరాబాద్ ఈద్గా ప్రార్థనలకు ముస్తాబైంది. ఇక్కడ ఒకేసారి సుమారు 25 వేలమంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుంది. ఇప్పటికే ప్రార్థనల కోసం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రంజాన్ పండుగ షాపింగ్ కోసం ప్రజలు మార్కెట్‌కు రావడంతో ఆదివారం పట్టణంలో సందడి కనిపించింది. ఘనంగా ఉగాది వేడుకలుఝరాసంగం(జహీరాబాద్)/సంగారెడ్డి /రామచంద్రాపురం (పటాన్చెరు): తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు వివిధ గ్రామాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇండ్లల్లో ప్రత్యేక పూజలు పచ్చడి తయారు చేశారు. సాయంత్రం సమయాల్లో శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంతోపాటు దత్తగిరి ఆశ్రమంలో పంచాగ పఠనం చేశారు. సంగారెడ్డిలో...జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కన్నుల పండువగా జరిగింది. జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ఉన్న రామాలయంలో రాత్రి నిర్వహించిన మొరుండల కార్యక్రమం అందరినీ ఉత్సాహపరిచింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి రామాలయంపై నుంచి ప్యాలాలతో చేసిన మొరుండలను ప్రజల్లోకి విసరగా వాటిని అందుకోవడానికి జనం పోటీపడ్డారు. రామచంద్రాపురంలో...రామచంద్రాపురం,భారతీనగర్ డివిజన్, బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప లు ఆలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో శ్రీలత, స్వరూప ఆధ్వర్యంలో చేపట్టిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు రెడ్డి పాల్గొన్నారు.హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటితో ముగియనున్న ఓటీఎస్ పథకంజిన్నారం (పటాన్చెరు): ఈ నెల 31 తో ఒన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ముగియనుందని బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సైతం అధికారులు అందుబాటులో ఉండి పన్నులు వసూలు చేశారు. పారిశ్రామికవేత్తలు, గృహ యజమానులు ముందుకు వచ్చి 90% వడ్డీ రాయితీతో పనులు చెల్లించారు. మెడ్రిచ్ లిమిటెడ్ పరిశ్రమ రూ.5,93,280 , ఎస్డీ స్టీల్ ఇండస్ట్రీస్ రూ.1,82,002, విజేత ఎంటర్ర్పైజెస్ రూ.3,01,898 ఆస్తి పన్ను బకాయిలను చెక్కు రూపంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ...ఇప్పటివరకు 13.75 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేశామన్నారు. -
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. ప్ర జాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరిగేలా భగవంతుడి ఆశీర్వాదం అందాలని కోరా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మున్సిపల్ అభివృద్ధికి రూ.10 కోట్లు మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరైనట్లు సీడీఎంఏ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. చైతన్య పాఠశాల నుంచి పెట్రోల్ బంక్ వరకు సెంట్రల్ లైటింగ్ ప్లాంటేషన్ కోసం రూ.కోటి, మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజురయ్యాయి. అలాగే కొత్త చెరువు సుందరీకరణకు రూ.2కోట్లు, హుస్నాబాద్ మున్సిపల్ స్వాగత తోరణాల ఏర్పాటుకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. నూతన జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.80 లక్షలు మంజూరయ్యాయి. ప్లాస్టిక్‌ను నివారిద్దాం.. ప్లాస్టిక్‌ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్‌కు వంద గ్లాస్‌ల చొప్పున పంపిణీ చేశామన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్స్ చొప్పున స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు -
పరిష్కరించడంలో విఫలం
పట్టణంలో పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల నిర్మాణాలు, వీధి దీపాలు, ఇతర సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కాలనీల్లో చెత్త కుప్పలు, ఇండ్ల మధ్య మురుగునీరు, కచ్చా రోడ్లు, కచ్చా డ్రైనేజీల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పరిష్కరించాలి. –నల్ల జయరాములుగౌడ్, మాజీ కౌన్సిలర్, సదాశివపేట చెత్తబండి రావడం లేదు రాఘవేంద్రనగర్ కాలనీలో ఇంటింటికీ చెత్తసేకరించే బండిరావడం లేదు. ఇంట్లోనే చెత్తను సంచుల్లో నిల్వచేస్తుండటంతో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తే అందులో వేస్తాం. నిత్యం చెత్త సేకరణ వాహనం వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి. –శశిమోహన్గౌడ్, రాఘవేంద్రనగర్, సదాశివపేట ఎవరూ పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం కాలనీలో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం కాలనీకి వెళ్లే మార్గంలో మురుగునీటి నిల్వతో దుర్గంధం ఏర్పడింది. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. తరచూ నీటి సరఫరా పైప్‌లైన్ లీకేజీల కారణంగా నీటి సరఫరా నిలిచిపోతోంది. –ప్రభాకర్, డబుల్ బెడ్రూం కాలనీ, సదాశివపేట పరిష్కరిస్తాం పట్టణ పరిధిలోని కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య సమస్యలు, వీధి దీపాల సమస్యలతోపాటు ఇతర ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటా. ఫిర్యాదులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. – ఉమ, కమిషనర్ సదాశివపేట -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
సిద్దిపేటకమాన్: ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సౌకర్యాలు అందిస్తామని సిద్దిపేట డిపో మేనేజర్ టీ.రఘు తెలిపారు. సిద్దిపేట డిపో నూతన మేనేజర్‌గా బదిలీపై వచ్చి ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 30 ఏళ్లుగా ఆర్టీసీలో పని చేసిన అనుభవం ఉందని, భూపాలపల్లి, యాదగిరిగుట్ట, హయత్‌నగర్, కాచిగూడ డిపోల్లో మేనేజర్‌గా పని చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. సిద్దిపేట, దుబ్బాక డిపోల్లో సుమారు 500 మంది సిబ్బంది, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారం, సమిష్టి కృష్టితో రెండు డిపోలను లాభాల బాటలో తీసుకెళ్తానన్నారు. రూ.151 కే భద్రాద్రి తలంబ్రాలు ఇంటికి శ్రీరామ నవమి సందర్భంగా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకు పంపించడం జరుగుతుందని డీఎం తెలిపారు. రూ.151 డబ్బులు చెల్లిస్తే కార్గో ద్వారా ఇంటి వద్దకే తమ సిబ్బంది స్వామి వారి తలంబ్రాలు పంపిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను డిపో సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది మౌలానా, తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ టీ.రఘు -
విద్యుదాఘాతంతో రైతు మృతి
తొగుట(దుబ్బాక): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేటలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మన్నె లోకేంధర్ (39) తనకున్న ఎకరం పొలంతోపాటు సిద్దిపేట పట్టణ వ్యాపారవేత్తకు చెందిన నాలుగు ఎకరాల భూమిని నాలుగేళ్లుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. రోజూ మాదిరిగా గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పొలం గట్లపై ఏపుగా పెరిగిన గడ్డిని కోస్తున్నాడు. ఈ క్రమంలో బోరుమోటార్‌కు సమీపంలోకి వెళ్లి గడ్డి కోస్తుండగా కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. అక్కడే చుట్టుపక్క ఉన్న అన్న పోచయ్య, సమీప రైతులు వచ్చిచూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య శైలజ, కుమారులు ఆదికై లాష్ (5), వాసుదేవ్ (3), వృద్దురాలైన తల్లి ఉన్నారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనిల్ తెలిపారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇంటి పనులు చేస్తుండగా పొలం వద్దకు వెళ్లొస్తానంటూ చెప్పి తిరిగిరాని లోకాలకు పోయావా అంటూ లోకేందర్ భార్య శైలజ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరనీ కంటతడి పెట్టించింది. చెన్నాపూర్ గ్రామంలో వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధి చెన్నాపూర్ గ్రామంలో గురువారం సాయత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి సుధాకర్‌రెడ్డి(45) గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. శివారు పనులు చేసేందుకుగాను తడకలు సరిచేస్తుండగా ఇంటికి దగ్గరగా ఉన్న విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. మృతదేహంతో రాస్తారోకో : విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని మృతదేహంతో గోమారం– చిన్నగొట్టిముక్ల ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మధుకర్‌రెడ్డి విద్యుత్ సిబ్బందితో ఫోన్ మా ట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామ ని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి ములుగు(గజ్వేల్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండలం కొక్కొండ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు..గ్రామానికి చెందిన ఆశెల్లి అనిల్‌గౌడ్(30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. 26న సొంత ఆటో నడుపుతూ మండలంలోని బస్వాపూర్ నుంచి కొత్తూర్ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో నోవా కంపెనీ సమీంపలోకి రాగానే ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. పక్కనే ఉన్న కాల్వలో పడటంతో అనిల్‌గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి చిన్ననాన్న నాగులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ టేక్మాల్(మెదక్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన టేక్మాల్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ కథనం మేరకు.. టేక్మాల్ గ్రామానికి చెందిన చింత పోచమ్మ(40) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. నిత్యం మాదిరిగానే 26న సాయంత్రం కల్లు తాగేందుకు ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. గ్రామానికి చెందిన తిమ్మిగారి మధుసూదన్ పోచమ్మ కట్టెల మిషన్ వైపు వెళ్లినట్లు చెప్పడంతో అటువైపు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మృతురాలి కూతురు జ్యోతిక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. పొలం వద్ద గడ్డి కోస్తుండగా ప్రమాదం తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో ఘటన -
రైతులకు ‘గుర్తింపు’
ప్రతీ పౌరుడికి ఆధార్ గుర్తింపు కార్డు మాదిరిగానే, ప్రతీ రైతుకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీఫార్మర్ రిజిస్ట్రీశ్రీ పేరుతో ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇందు కోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేయగా, సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన మొగుడంపల్లి రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు వీలుగా ఇటీవల ఏడీఏ భిక్షపతి వ్యవసాయ శాఖ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ మొదటి వారంలో నమోదు ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది. – జహీరాబాద్ రైతులకు గుర్తింపు కార్డును ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ద్వారా పేర్లు నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆధార్ కార్డు మాదిరిగా రైతులకు ప్రత్యేక కోడ్ ఉండాలనే ఉద్దేశ్యంతో సాగుదారుల సంఖ్యను ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పీఎం కిసాన్, క్రాప్ లోన్, పంటల బీమా, యాంత్రీకరణ పరికరాలతోపాటు తదితర పథకాలను సాగుదారుల సంఖ్య ఆధారంగా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు అందే రైతుల పథకాలు అమలు చేసేందుకు గాను ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకులకు రుణాల కోసం వెళ్తే పట్టాదార్ పాసుపుస్తకం అవసరం లేకుండానే సాగుదారుల సంఖ్య కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. కార్డు ద్వారా భూమికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. ధాన్యం కొనుగోళ్లకు సైతం ఇదే కార్డును వర్తింపజేయనున్నారు. రెవెన్యూ గ్రామం పరిధిలో 9 తండాలు మొగుడంపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో గ్రామంతోపాటు మరో తొమ్మిది తండాలు ఉన్నాయి. గ్రామంతోపాటు ఆయా తండాలకు సంబంధించిన రైతులు 4,123 మంది ఉన్నారు. గ్రామం పరిధిలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. మొగుడంపల్లి రెవెన్యూ గ్రామం కిందకు పరిసరాల్లో ఉన్న పడియాల్తండా, విఠునాయక్‌తండా, మిర్జంపల్లితండా, లేతమామిడి తండా, మందగుబ్బడి తండా, నందునాయక్ తండా, హరిచంద్నాయక్తండా, చున్నంబట్టితండా, జాంగార్‌బౌలి తండాల రైతాంగానికి ఆధార్‌కార్డు తరహాలో పైలెట్ ప్రాజెక్టు కింద 11 అంకెల సాగుదారుల సంఖ్య పొందుపర్చిన కార్డులను ఇవ్వనున్నారు. తగిన సమాచారంతో నమోదుకు వెళ్లాలి రైతులకు అందించనున్న సాగుదారుల సంఖ్య కార్డు నమోదు కోసం తగిన సమాచారంతో వెళ్లాలి. మొగుడంపల్లి రైతు వేదికలో ప్రత్యేక యాప్‌ద్వారా నమోదు చేస్తారు. ఆధార్‌కార్డు లింకు ఉన్న సెల్‌ఫోన్ నంబరు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లాలి. వ్యవసాయ సిబ్బంది ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తారు. అనంతరం రైతు సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నంబర్‌ను సిబ్బందికి చెబితే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్యను కేటాయిస్తారు. అందుబాటులో లేని రైతులు ఫోన్లో అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు చెబితే ప్రత్యేక నంబరును కేటాయిస్తారు. ప్రత్యేక కార్టుల జారీకి ప్రభుత్వం చర్యలు ఆధార్ తరహాలో 11 అంకెల సాగుదారుల సంఖ్య రైతులకు సంబంధించి ప్రతీ పనికి ఈ కార్డు ఉపయోగం మొగుడంపల్లి రెవెన్యూ గ్రామంపైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక ఏప్రిల్ మొదటి వారం నుంచి శ్రీకారం నమోదు ప్రక్రియకు ప్రత్యేక యాప్ ప్రభుత్వ పథకాలకు దోహదం ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సాగుదారుల సంఖ్య ఎంతగానో ఉపయోగపడుతుంది. పట్టాదారు పాసుపుస్తకం లేకున్నా ప్రతీ పనికి తాము జారీ చేసే కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయనున్నాం. వివరాల నమోదు కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. యాప్ రాగానే నమోదు ప్రక్రియను మొదలుపెడతాం. మొగుడంపల్లి నుంచి ప్రారంభించి పరిసరాల్లో ఉన్న తండాల్లో కొనసాగిస్తాం. జిల్లాలోనే మొగుడంపల్లిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. –భిక్షపతి,జహీరాబాద్ ఏడీఏ